For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫైనాన్సియల్ స్ట్రెస్(ఆర్థికపరమైన ఒత్తిడి) హార్ట్ హెల్త్ ను రిస్క్ లో పడేయవచ్చు..!

|

ఆర్థిక ఒత్తిడితో బాధపడుతున్న ప్రజలకు వచ్చే గుండెపోటు ముప్పు 13 రెట్లు ఎక్కువగా ఉందని ఒక కొత్త అధ్యయనం పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రజలు, వారి జీవనశైలిలో దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కొంటున్నారు.

మీరు డబ్బు సమస్యలు గురించి చాలా చింతిస్తున్నారా ? అయితే, మీరు మీ హృదయాన్ని ప్రమాదంలో ఉంచుతున్నారనే జాగ్రత్తలతో వ్యవహరించండి.

<strong>ఒత్తిడిని జయించడానికి 15 సూపర్ ఫుడ్స్</strong>ఒత్తిడిని జయించడానికి 15 సూపర్ ఫుడ్స్

ఆర్థిక ఒత్తిడితో బాధ పడుతున్న ప్రజలు, 13 రెట్లు ఎక్కువ గుండెపోటు ప్రమాదంతో బాధపడుతున్నారని ఒక కొత్త అధ్యయనం తెలిపింది.

Financial stress can put your heart at risk

అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రధానంగా, ప్రజలు వారి జీవనశైలిలో మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ (హృదయ కండరాలకు రక్త ప్రవాహాన్ని అడ్డుకునేటటువంటి) వంటి దీర్ఘకాలిక వ్యాధులను కలిగి ఉన్న ఒక వైద్య పరిస్థితితో ప్రజల అధికమవుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు.

అందువల్ల, శరీరం యొక్క మానసిక పరమైన అంశాలు, ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలతో ఉన్న ఒత్తిడులు పెరుగుతున్న గుండె వ్యాధుల ముక్కుకు కారణం కాగా వాటిని నివారించడానికి మరింత శ్రద్ధను చూపించాల్సిన అవసరం ఉంది.

Financial stress can put your heart at risk

మా అధ్యయనం ప్రకారం, తీవ్రమైన మానసిక అంశాలు ముఖ్యమైన ప్రమాద కారకాలుగా మారి "మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్" కు కారణం కాగలదని సూచించాయి. గుండెపోటు వచ్చిన తర్వాత బాధితులకు ఒత్తిడి గురించి సలహాలను ఇస్తారు కానీ అంతకన్నా ముందే దాని గురించి మరింత శ్రద్ధ వహించాలని - (అసోసియేట్ ప్రొఫెసర్, విత్వతెరారండ్ యూనివర్సిటీ, జోహన్నేస్బుర్గ్, సౌత్ ఆఫ్రికా) "దినేషన్ గోవిందర్" గారు తెలిపారు.

Financial stress can put your heart at risk

"కొందరు డాక్టర్లు, శారీరకంగా ఉండే ఒత్తిడి, నిరాశ, ఆందోళన గురించి అడుగుతారు, అలాగే ధూమపానం గురించి అడగటం వంటివి చాలా సాధారణమైన పద్దతులుగా ఉన్నాయి. రోగులకు ధూమపానాన్ని మానివేసే సలహాని మేము ఇస్తే, ఒత్తిడి ని ఎలా ఎదుర్కోవాలన్న సమాచారము రోగులకు కావాలి" - దినేషన్ గోవిందర్ గారు తెలిపారు.

Financial stress can put your heart at risk

తీవ్రమైన మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్తో బాధపడుతున్నా 106 మంది రోగులను మాత్రమే

పరిశోధకులు అధ్యయనం చేశారు. (కానీ గుండె వ్యాధుల వంటి లక్షణాలను కలిగిన వారిని కాదు)

<strong>స్ట్రెస్ తగ్గించుకోవడానికి మీరు చేసే ఈ పనుల వల్ల ప్రాణానికే ప్రమాదం!</strong>స్ట్రెస్ తగ్గించుకోవడానికి మీరు చేసే ఈ పనుల వల్ల ప్రాణానికే ప్రమాదం!

డిప్రెషన్, ఆందోళన, శారీరక ఒత్తిడి, పని ఒత్తిడి మరియు ఆర్థిక ఒత్తిడి వంటి అంశాలను గూర్చి ఒక ప్రశ్నాపత్రము రాసి ఇచ్చారు. సాంఘిక పరిస్థితులపై ఆధారపడి నా మానసిక ఒత్తిడి స్థాయిలను పోల్చగా, వాటి కారణంగానే గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని గుర్తించారు.

Financial stress can put your heart at risk

యాన్యువల్ సౌత్-ఆఫ్రికా హార్ట్ కాంగ్రెస్ 2017లో ఈ పత్రాన్ని సమర్పించారు, పరిశోధనలో పాల్గొన్నా వారందరిలో స్వయం-నివేదిత ఒత్తిడి స్థాయిలు అనేవి వారిలో సాధారణంగా ఉందని పేర్కొన్నారు.

ఏ స్థాయిలో డిప్రెషన్ను కలిగి ఉన్న రోగులను - లేనివారితో పోలిస్తే, డిప్రెషన్ ఉన్న వారిలో మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ వచ్చే ముప్పు మూడురెట్లు అధికంగా ఉందని బట్టబయలయింది.

English summary

Financial stress can put your heart at risk

Financial stress can put your heart at risk. Know to more about it, read on...
Story first published:Tuesday, November 14, 2017, 17:45 [IST]
Desktop Bottom Promotion