For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోట్లో 30 నిమిషాలు వెల్లుల్లిని ఉంచుకుంటే ఏమవుతుంది?

|

మన అందరికీ వెల్లుల్లి లాభాలు చాలామటుకు తెలుసు, కానీ దానితో సంబంధించిన చాలా చిట్కాలు వెల్లుల్లిని పచ్చిగా తినేవిగా ఉంటాయి. అది మనలో చాలామందికి నచ్చదు. పైగా ఆహారనాళంలో, పొట్టలోకి వెళ్ళిన వెల్లుల్లి కొంతమందికి మంట కలిగిస్తుంది.

వెల్లుల్లిలో శక్తివంతమైన ఆరోగ్య పదార్థం అల్లిసిన్ ఉంటుంది. వెల్లుల్లి రెబ్బను తింటే వచ్చే లాభాలను పచ్చిగా కాకుండా మరే విధంగా అయినా పొందవచ్చా అని తెలుసుకుందాం...

అవును మా దగ్గర ఇతర అన్ని వెల్లుల్లి చిట్కాలకన్నా వేరే విధమైన చిట్కా ఉంది. దీన్ని 10-15 రోజులపాటు ప్రయత్నించండి మీకు కూడా వెల్లుల్లి లాభాలన్నీ అందుతాయి.

ఈ చిట్కా ఎలా ప్రయత్నించాలి

ఈ చిట్కా ఎలా ప్రయత్నించాలి

ఒక వెల్లుల్లి రెబ్బను నోటిలో పెట్టుకోండి. లాలాజలం వచ్చేవరకు ఆగండి. నోరంతా దాన్ని తిప్పుతూ మరింత లాలాజలం వచ్చేట్లా చేయండి.

ఎప్పుడు ప్రయత్నించాలి?

ఎప్పుడు ప్రయత్నించాలి?

దీన్ని ప్రతిరోజు పొద్దున పరగడుపున 30 నిమిషాల పాటు చేయండి. వెల్లుల్లిని మీ నోటిలో 30 నిమిషాల పాటు ఉండనివ్వండి.

అలా చేస్తే ఏమవుతుంది?

అలా చేస్తే ఏమవుతుంది?

వెల్లుల్లి లాభదాయకమైన లక్షణాలు మీ లాలాజలంతో కలిసి మీ శరీరంలోకి వెళ్తుంది.

వెల్లుల్లి ఆరోగ్యదాయక గుణాలు మీ రక్తవ్యవస్థలోకి ప్రవేశించాక, మీ లింఫ్ వ్యవస్థ మరియు చిన్న రక్తనాళాలు కూడా శుభ్రపడతాయి. ఇంకా వెల్లుల్లి దుర్వాసనని ఇచ్చినా కూడా నోటి ఆరోగ్యానికి చాలా మంచిది.

30 నిమిషాల తర్వాత ఏం చేయాలి?

30 నిమిషాల తర్వాత ఏం చేయాలి?

మిగిలున్న లాలాజలాన్ని ఉమ్మేయండి. మీ పళ్ళు తోముకుని, కొన్ని పుదీనా ఆకులను నమిలి నోటిలో వెల్లుల్లి వాసనను పోగొట్టుకోండి.

ఈ అలవాటు లాభాన్నిస్తుందా?

ఈ అలవాటు లాభాన్నిస్తుందా?

అవును, ఇది మీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది, మీ ఆకలిని పెంచుతుంది. ఫ్లూ, రక్తహీనత, శ్వాస సమస్యలను తొలగిస్తుంది. బ్రాంఖైటిస్ కి, మూత్రాశయం మరియు కిడ్నీల సమస్యలకి బాగా పనిచేస్తుంది.

ఇంకా ఏం చేస్తుంది?

ఇంకా ఏం చేస్తుంది?

వెల్లుల్లి దీర్ఘకాలికంగా ఉన్న దగ్గును తగ్గిస్తుంది మరియు కిడ్నీలో రాళ్ళను రాకుండా నివారిస్తుంది.

వెల్లుల్లి రసం చెవి ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది.

హెచ్చరిక

హెచ్చరిక

మీకు వెల్లుల్లి అలర్జీ అయితే, దీన్ని ఎప్పుడూ ప్రయత్నించకండి. ఇంకా, మీకు నోటి దుర్వాసన సమస్య ఉంటే వెల్లుల్లి మరింత సమస్య పెంచవచ్చు. అందుకని, మీ వైద్యుని సంప్రదించి ఈ చిట్కాను ప్రయత్నించండి.

English summary

What Happens If You Put A Garlic In Your Mouth For 30 Minutes

All of us know almost every beneficial effect of garlic. But most of the remedies involve eating a raw garlic which most of us may not really like to do. Also, the garlic that enters the food pipe and the stomach may create burning sensation in some. Garlic contains a powerful medicinal ingredient known as allicin. Is there any other way to derive all those benefits without actually eating the garlic clove?
Story first published:Wednesday, November 22, 2017, 12:34 [IST]
Desktop Bottom Promotion