మగవారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే హానికరమైన కెమికల్స్

Subscribe to Boldsky

ఏ రసాయనాలు అత్యంత ప్రమాదకరమైనవి? సమాధానం చెప్పటానికి ఇది సులభమైన ప్రశ్న కాదు. ఇవి వేర్వేరు జీవులకు - వేర్వేరు మార్గాల్లో హాని కలిగించవచ్చు.

ఇది మగవారి విషయానికి వచ్చినప్పుడు, కొన్ని రసాయనాలు వారి శరీరంలో నిజంగా కొన్ని ప్రతికూల ప్రభావాలు సృష్టించవచ్చు. కొన్ని విషపూరిత రసాయనాలు ఆహారం ద్వారా శరీరంలోకి కదులుతాయి.

చర్మసంరక్షణ ఉత్పత్తులలో ప్రమాదకరమైన రసాయనాలు

మనము తినే కొన్ని రసాయనాలు మనం తినే ఆహారం కంటే ఎక్కువ హాని కలిగించవచ్చు. పురుషులు విషయంలో, ఈ రసాయనాలు శరీరంలో టెస్టోస్టెరోన్ యొక్క ఆరోగ్యకరమైన ఉత్పత్తిని నిలిపివేయవచ్చు.

chemicals that can harm you

ఇది సాధారణంగా ఎండోక్రైన్ (వినాళికా గ్రంథి) వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, రసాయనాలకు మరియు తక్కువ-సంతానోత్పత్తి రేటుకు మధ్య సంబంధాన్ని సూచించాయి.

మీ కుటుంబాన్ని ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం నుండి, సహజమైన మరియు సేంద్రీయ ఆహారంకు మారడం అనేది అవసరం. ప్రాసెస్ చేసిన ఆహారంలో కనిపించే కొన్ని రసాయనాలు సంతానోత్పత్తికి ఆటంకం కలిగించడానికి ముడిపడివున్నాయి మరియు ఆరోగ్యకరమైన వీర్యకణాల గణనను ప్రభావితం చేయవచ్చు.

ఇది పురుషులలో ఇతర ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది. పురుషులకు హానికరం కలిగించే రసాయనాల గురించి మరింత తెలుసుకోండి.

అలర్ట్ : మగవారి అందానికి వాడే కాస్మోటిక్స్ (ఉత్పత్తుల) లో రసాయనాలు ఉంటాయి

1. ఫ్తాలేట్ (Phthalate) :

1. ఫ్తాలేట్ (Phthalate) :

ఫ్తాలేట్ (PHTHALATE) స్పందన కారణంగా, వృషణ సంతతిలో అసంపూర్ణమైన పిండాల ఉత్పత్తికి దారి తేసేదిగా చెయ్యగలదు. ఈ రసాయనాలు: వినైల్ ఫ్లోరింగ్, డిటర్జెంట్స్, ఆటోమోటివ్ ప్లాస్టిక్స్, సబ్బు, షాంపూ, డియోడోర్ట్స్, హెయిర్ స్ప్రే, ఫుడ్ ప్యాకేజింగ్ వంటి వాటిలో కనుగొనబడ్డాయి.

2. బిస్ ఫినాల్ ఏ (Bisphenol A) :

2. బిస్ ఫినాల్ ఏ (Bisphenol A) :

పునర్వినియోగ నీటి సీసాలు, ఆహార డబ్బాల మీద పూతగా ఉండే రెసిన్లు మొదలగు అనేక ప్లాస్టిక్ పదార్థంలో ఉండే ఒక సామాన్య అంశంగా దీనిని చెప్పవచ్చు. ఇవి మహిళల విషయంలో పిండం అభివృద్ధిలో మార్పులు చోటు చేసుకోగలవు.

3. పెర్ఫ్లోరోఆక్టానోనిక్ యాసిడ్ (PFOA):

3. పెర్ఫ్లోరోఆక్టానోనిక్ యాసిడ్ (PFOA):

ఇది టెఫ్లాన్ మరియు గోరే-టెక్స్ వంటి గ్రీజు మరియు నీటి నిరోధక పూతల్లో కనిపిస్తుంది. ఇది క్యాన్సర్ కారకంగా చెప్పబడుతుంది.

4. మెతోక్సిక్లర్ మరియు విన్క్లోజిన్ (Methoxychlor And Vinclozin) :

4. మెతోక్సిక్లర్ మరియు విన్క్లోజిన్ (Methoxychlor And Vinclozin) :

ఇవి కీటకాలు మరియు శిలీంద్రాల సంహారిణులు. ఈ రసాయనాలు ప్రాథమిక పరిశోధనలో "తర్వాత నాలుగు తదుపరి 4 తరాల కోసం జన్మించిన మగ ఎలుకలలో మార్పులకు కారణమవుతుందని" బహిర్గతంగా తేలింది.

5. నానిల్ఫెనాల్ ఎతోక్సిలేట్స్ (Nonylphenol Ethoxylates) :

5. నానిల్ఫెనాల్ ఎతోక్సిలేట్స్ (Nonylphenol Ethoxylates) :

ఇవి జన్యు వ్యక్తీకరణను ప్రభావితం చేయగల శక్తివంతమైన ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అని పిలుస్తారు, ఇవి కొన్ని జన్యువులను ఉత్పత్తిని తెరవడం లేదా మూసి వేయ్యడం ద్వారా మరియు మీ గ్రంథుల వ్యవస్థ పనిచేసే తీరులో జోక్యం చేసుకుంటాయి.

6. బొవి గ్రోత్ హార్మోన్లు (Bovine Growth Hormones) :

6. బొవి గ్రోత్ హార్మోన్లు (Bovine Growth Hormones) :

ఇవి పాల వంటి వాణిజ్య ఉత్పత్తులలో కలిసి ఉన్న కారణంగా, కౌమారదశకు ముందుగానే పాల ఉత్పత్తిని కలిగి ఉంటాయి. ఈ పదార్ధాలను కలిగి ఉన్న ఆహారాన్ని నివారించడానికి ఇది సిఫార్సు చేయబడింది, ఎందుకంటే అవి పురుషుల సంతానోత్పత్తిపై ప్రతికూలంగా ప్రభావితమవుతాయి.

7. ఆస్బెస్టాస్ (Asbestos) :

7. ఆస్బెస్టాస్ (Asbestos) :

ఇది భవనాలలో విద్యుత్తును నిరోధించడానికి ఉపయోగించే ఒక రసాయనం. ఈ రసాయన సమక్షంలో పనిచేసేవారు మరియు చుట్టుపక్కల ఉన్న పురుషులు "మెసోథియోమా" కారణంగా ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న పొరపై క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇది హాని కలిగించే రసాయనాలలో ఒకటి.

8. ఫ్లోరైడ్ (Fluoride) :

8. ఫ్లోరైడ్ (Fluoride) :

ఈ రసాయనం తక్కువ సంతానోత్పత్తి రేట్లను, హార్మోన్ల అంతరాయం మరియు తక్కువ వీర్యకణాల గణనలకు లింక్ చేయబడింది. ఇది మగవారిలో సంతానోత్పత్తి పై తీవ్రంగా ప్రభావితం చూపుతోంది.

9. సోయా ఉత్పత్తులు:

9. సోయా ఉత్పత్తులు:

ఈ ఆహార పదార్థాలు, హార్మోన్ల వంటి పదార్ధాలను కలిగి ఉన్నందున సోయా ఉత్పత్తులను అధిక సంఖ్యలో తీసుకోవడం వల్ల మగవారిలో సంతానోత్పత్తిని ప్రభావితం చేయవచ్చు. అందువల్ల, పురుషులు సోయా ఉత్పత్తులను మనివేయటం (లేదా) వాటిని పరిమితం చేయాలని సిఫార్సు చెయ్యబడింది.

10. ఎంఎస్జీ (MSG) :

10. ఎంఎస్జీ (MSG) :

ఇది ప్రొసెస్ చేసిన ఆహారాలలో మరియు కృత్రిమ ఆహారాలలో ఎక్కువగా కనిపించే "ఆహార సంకలితం". వీటిని తీసుకోవడం వలన మగవారిలో సంతానోత్పత్తిని ప్రభావితం చేయవచ్చు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Harmful Chemicals That Can Affect Men's Health

    These harmful chemicals can affect men's health adversely. Hence, it is advised that they stop consuming foods replete with these chemicals.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more