వంద రకాల వ్యాధులను నివారించే సత్తా ఒక్క టీస్పూన్ వాములో ఉంది!

Posted By:
Subscribe to Boldsky

వాము లేదా ఓమను సంస్కృతంలో దీప్యక అని, హిందీలో అజ్వైన్ అని అంటారు.ఇది సాధారణంగా అన్ని ఇళ్లల్లో కనిపించేదే. వంటింట్లో ఇదో దినుసు. వాము మొక్క మొత్తం సువాసన కలిగి ఉంటుంది. పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఈ పువ్వులనుంచే విత్తులు వస్తాయి. వాము సాధారణంగా అన్ని ఇళ్లల్లో కనిపించేదే. వంటింట్లో ఇదో దినుసు. ఈరోజు అరిగినట్లు లేదే అనగానే, 'కాసింత వాము వేడినీటితో కలిపి నమలవే. సమస్య తగ్గిపోతుంది' అనే అమ్మమ్మల మాటలు గుర్తుండేవుంటాయి.#

వాము

వాము భారతీయులకు తెలిసిన గొప్ప ఓషధి. సాధారణంగా మనం వామును చక్రాలు(జంతికలు, మురుకులు) చేసినపుడు వాడుతుంటాం. పూర్వంనుండీ వాడుతున్నారని వాడటమే తప్ప ఇందులోని సుగుణాలు చాలామందికి తెలీవు. వాము జీర్ణశక్తికి మంచిదని మాత్రం చాలామందికి తెలుసు. వాము జీలకర్రలా అనిపించినా చిన్నగా వుంటుంది. రుచి కొంచెం ఘాటుగా, కారంగా వుంటుంది. రూపంలో చిన్నదైనా చేసే మేలులో పెద్ద స్థానాన్నే ఆక్రమించింది.' మరి వాములో ఉండే ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం..

జలుబు, మైగ్రెయిన్‌ తలనొప్పికి

జలుబు, మైగ్రెయిన్‌ తలనొప్పికి

జలుబు, మైగ్రెయిన్‌ తలనొప్పికి ఇది మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే సమస్య తీరిపోతుంది.

జ్వరం :

జ్వరం :

వాము, ధనియాలు, జీలకర్ర - ఈ మూడింటినీ దోరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.

వాంతులు :

వాంతులు :

వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి.

అజీర్ణం :

అజీర్ణం :

వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని, చూర్ణం చేసి ప్రతిరోజూ భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, ఉదరశూల తగ్గుతాయి.

దంత వ్యాధులు :

దంత వ్యాధులు :

వామును త్రిఫలాలనే కరక్కాయ, ఉసిరికాయ, తానికాయలతో కలిపి ముద్దగా నూరి దంతాల మూలాలలో పెట్టుకుంటే అన్ని రకాలైన దంత వ్యాధులు తగ్గుతాయి.

గొంతులో బాధ :

గొంతులో బాధ :

వామును బుగ్గన పెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి, గొంతులో గురగుర శబ్దాలు తగ్గుతాయి.

మూత్రపిండాలలో, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది.

మూత్రపిండాలలో, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది.

వామును వివిధ రూపాలలో సేవిస్తే మూత్రపిండాలలో, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది.

వాము ఆస్తమా తగ్గిస్తుంది

వాము ఆస్తమా తగ్గిస్తుంది

ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది.

వాము గుండెవ్యాధులు నివారిస్తుంది

వాము గుండెవ్యాధులు నివారిస్తుంది

గుండెవ్యాధులు రాకుండా నివారించడంలో వాము ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

వాము కీళ్ళ నొప్పులను తగ్గించడంలో దానికదే సాటి

వాము కీళ్ళ నొప్పులను తగ్గించడంలో దానికదే సాటి

రెగ్యులర్ డైట్ లో వామును మరియు వామునూనె కీళ్లనొప్పులను తగ్గిస్తుంది.

కడుపులో వచ్చే గడబిడలను

కడుపులో వచ్చే గడబిడలను

ఆల్కహాలు తాగిన తర్వాత కడుపులో వచ్చే గడబిడలను, వికారాన్ని నియంత్రించేందుకు వాము తినవచ్చు. ఆకలి పెంచుతుంది.

 బహిష్టు నొప్పులకు వాము

బహిష్టు నొప్పులకు వాము

బహిష్టు నొప్పులకు వాడితే మంచి ఫలితం వుంటుంది. వేయించిన వామును పాలతో తీసుకోవాలి.

 ఎసిడిటీ తగ్గుతుంది

ఎసిడిటీ తగ్గుతుంది

వేయించిన వాము, జీలకర్ర నీటిలో మరిగించి తాగితే ఎసిడిటీ తగ్గుముఖం పడుతుంది.

చలికాలం జలుబు, దగ్గులు తగ్గుతాయి.

చలికాలం జలుబు, దగ్గులు తగ్గుతాయి.

చలికాలం జలుబు, దగ్గులు తగ్గుతాయి. కొద్దిగా నోటిలో వేసుకొని వేడి నీటితో కలిపి నమలాలి.

గర్భవతులు రెగ్యులర్ గా తింటే

గర్భవతులు రెగ్యులర్ గా తింటే

గర్భవతులు రెగ్యులర్ గా తింటే రక్తాన్ని శుభ్రపరచటమే కాక శరీరంలోని రక్తప్రసరణ సరిగా సాగేలా సహకరిస్తుంది.

ఇవన్నీ వాము తినటం వలన వచ్చే ఆరోగ్య లాభాలు. వీటిని పప్పులు, కూరలు, రొట్టెలు, పరోటాలు లేదా వేయించిన పకోడిలలో కూడా వేసి రుచిని ఆరోగ్యాన్ని కలిగించవచ్చు.

English summary

Health Benefits Of Ajwain/Carom Seeds and uses of Ajwain, Vamu , వాము

Health Benefits Of Ajwain/Carom Seeds and uses of Ajwain, these grayish-green colored carom seeds have a bitter and hot taste. Following are few health benefits of ajwain (carom seeds) Vamu, omu
Subscribe Newsletter