For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మట్టి కుండలో నీళ్లు తాగితే ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు..!

కుండలో పోసిన నీళ్లు వంద శాతం ప్యూరిఫైడ్‌ చేసిన నీటితో సమానం అని నిపుణులు స్వయంగా పరిశోధన చేసి నిరూపించారు. ప్యూరిఫైడ్‌ నీటిని తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. కుండలో ఉన్న లక్షణాల కారణంగా

|

పూర్వకాలం నీళ్ళు కుండలో నిలువ ఉంచుకుని తాగేవారు. అలా రాను రాను, స్టీల్ బిందెలు, ఫిల్టర్ లు, ఫ్రిడ్జ్ లలో నిలువ ఉంచుకుని తాగే పరిస్థితి వచ్చింది.

అప్పట్లో ఎండా కాలం వచ్చింది అంటే ఊర్లలో మరియు సిటీలలో కూడా మట్టి కుండలకు బాగా గిరాకీ ఉండేది. ఎండాకాలం రాగానే కొత్త కుండ కొనేందుకు అంతా ఆసక్తి చూపించే వారు. కొత్త కుండలో నీరు ఎంత చల్లగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి చాలా మంచివి. దాంతో ప్రతి సంవత్సరం కూడా కొత్త కుండలు కొనేవారు. కాని ఇప్పుడు ఎండాకాలం వస్తుందంటే ఫ్రిడ్జ్‌కు ఫుల్‌ డిమాండ్‌ ఉంటుంది. ఎండాకాలంలో ప్రస్తుతం కుండ నీరు తాగే వారు చాలా తక్కువ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా ఫ్రిడ్జ్‌ నీరుకే అలవాటు పడ్డారు.

కుండలో నీళ్లు తాగటం వలన మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. మన పూర్వీకులు ఏం చెప్పినా, ఆచరించినా కూడా దానిలో ఆరోగ్య సూత్రాలు దాగి ఉంటాయి. మట్టి కుండలో నీళ్ళు ఫిల్టర్ వాటర్ తో సమానం అంట. మట్టి కుండ లో ఫిల్టర్ ఉండదు కదా, ఫిల్టర్ ఎలా అవుతాయని అనుకుంటున్నారా?

 Health benefits of drinking water from a matka (clay pot)

కుండలో పోసిన నీళ్లు వంద శాతం ప్యూరిఫైడ్‌ చేసిన నీటితో సమానం అని నిపుణులు స్వయంగా పరిశోధన చేసి నిరూపించారు. ప్యూరిఫైడ్‌ నీటిని తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. కుండలో ఉన్న లక్షణాల కారణంగా నీటిలో ఉన్న మళినాలు కుండ పీల్చుకుంటుంది. నీటిని పూర్తి స్వచ్చంగా చేస్తుంది. కుండ నీటితో పాటు రాగి చెంబులోని నీరు కూడా చాలా మంచిదని ఆరోగ్యంకు మంచి చేస్తుందని నిరూపితం అయ్యింది. అందుకే కుండలో నీరు చాలా మంచిది.

మట్టి కుండలో అంతటి మహిమ ఉంది కనుకనే మన పూర్వీకులు రహదారుల్లో కూడా మట్టి కుండలో నీళ్ళు ఉంచి అందరికి ఉచితంగా నీరు, మజ్జిగ ఇచ్చేవారు. అసలు మట్టి కుండలో ఉన మహత్తు ఏమిటో తెలుకున్న తరువాత మీరు తప్పకుండా కుండలో నీళ్ళు తాగుతారు...

నేచురల్ గా కూల్ అవుతాయి:

నేచురల్ గా కూల్ అవుతాయి:

కుండలో నీళ్లు నేచురల్ గా కూల్ గా మారుతాయి. వేసవి సీజన్లో వేడిని నుండి ఉపశమనం పొందడానికి కుండనీళ్లు ఎంతగానో సహాయపడుతాయి. ముఖ్యంగా వేసవిలో కరెంట్ కోత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఫ్రిడ్జ్ వాటర్ కంటే కుండలోని నీరు తాగడం మంచిది. ఇది కాస్ట్ ఎఫెక్టివ్ మరియు ఎకో ఫ్రెండ్లీ కాబట్టి, వేసవిలో కుండలోని వాటర్ తాగడం మంచిది.

ఇమ్యూనిటి గుణాలు అధికంగా ఉంటాయి:

ఇమ్యూనిటి గుణాలు అధికంగా ఉంటాయి:

మంటి కుండలో నీళ్లు పోసి తాగడం వల్ల నీళ్లలోని సహాజ మినిరల్స్, ఎలక్ట్రోలైట్స్ కోల్పోకుండా శరీరానికి అందించి ఎనర్జీని అందిస్తాయి. కుండలో నీరు నిల్వ చేసినప్పుడు నయం చేసే ఇమ్యూనిటి గుణాలను అధికంగా పెంచుతుంది. ఈ వాటర్ తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు అందుతాయి.

ఆల్కలైన్ నేచర్ :

ఆల్కలైన్ నేచర్ :

ఈ అసిడిక్ వాతావరణంలో వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి, ఆల్కలైన్ కంటే మరింత ఎక్కువగా శరీరం ఎసిడిక్ కు గురి అవుతుంది. దాంతో ఆరోగ్యం ప్రమాదకర స్థితి చేరుకుంటుంది. మట్టితో తయారుచేసిన కుండలోని నీరు తాగడం వల్ల నేచురల్ గా ఆల్కలైన్ పొందుతారు. మంట్టి కుండలో నీరు నిల్వ చేయడం వల్ల , ఇది ఆరోగ్యానికి సహాయపడే మంచి ఆల్కలైన్ వాటర్ గా రూపాంతరం చెందుతుంది.

హానికర కెమికల్స్ ఉండవు:

హానికర కెమికల్స్ ఉండవు:

చాలా వరకూ ప్లాస్టిక్ బాటిల్స్ ను టాక్సిక్ కెమికల్స్ తో తయారుచేయడం వల్ల ఎండోక్రైన్ డిస్ట్రర్బ్ అవుతుంది. అదే మట్టి కుండలో నీరు నిల్వ చేసి తాగడం వల్ల వాటర్ ప్యూరిఫై అవ్వడం మాత్రమే కాదు, శరీరానికి ఎలాంటి హాని జరగకుండా సహాయపడుతాయి.

మెటబాలిజం పెంచుతుంది:

మెటబాలిజం పెంచుతుంది:

మంటి కుండలో నీరు నిల్వ చేసి తాగడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది.

సన్ స్ట్రోక్ నివారిస్తుంది:

సన్ స్ట్రోక్ నివారిస్తుంది:

మట్టితో తయారుచేసిన కుండలో నీళ్లు నిల్వ చేసి తాగడం వల్ల వేసవిలో వడదెబ్బ నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే మట్టి కుండలోని నీటితో ముఖం కడిగితే వేసవిలో ఎండ నుండి మంచి ఆహ్లాదాన్ని ఇస్తుంది.

గొంతుకు మంచిది:

గొంతుకు మంచిది:

జలుబు, దగ్గు, ఆస్త్మాతో బాధపడే వారు ఫ్రిడ్జ్ లోని వాటర్ కంటే కుండ వాటర్ ను ఎంపిక చేసుకోవడచం మంచిది. ఈ వాటర్ వల్ల ఎలాటి సైడ్ ఎఫెక్ట్స్ , గొంతు నొప్పి ఉండదు.

English summary

Health benefits of drinking water from a matka (clay pot)

Have you ever wondered why your grandma used clay pots for cooking and storing water? Well, Here are the health benefits of using clay pots...
Story first published: Wednesday, May 10, 2017, 18:26 [IST]
Desktop Bottom Promotion