Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మహిళలూ జాగ్రత్త..గ్రీన్ టీ ఎక్కువ తాగితే పిల్లలు పుట్టరు
మహిళలూ జాగ్రత్త..గ్రీన్ టీ ఎక్కువ తాగితే పిల్లలు పుట్టరు
ఇప్పుడు చాలామంది ఉదయం నిద్రలేవగాని గోరువెచ్చని గ్రీన్ టీ తీసుకుంటారు. గ్రీన్ టీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ.. కొన్ని దుష్ప్రభావాలు కూడా లేకపోలేదు.
గ్రీన్ టీ తీసుకోవడం వలన పలు ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చన్నది చాలా మంది అభిప్రాయం. అయితే ఇందులో కొంతవరకూ మాత్రమే నిజం ఉంది అంటున్నారు పరిశోధకులు. గ్రీన్ టీని ప్రతిరోజూ ఎక్కువ మోతాదులో తీసుకుంటే స్త్రీలలో సంతానోత్పత్తి తగ్గే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

ఎలుకల మీద నిర్వహించిన పరిశోధనలో ఈ విషయాన్ని వారు గమనించారు. అయితే గ్రీన్ టీలో ఏ పదార్థం సంతోనోత్పత్తిని అడ్డుకుంటుందన్న విషయాన్ని మాత్రం వీరు స్పష్టం చేయలేకపోతున్నారు. రోజు మొత్తంలో ఒకటి లేదా రెండు కప్పులు మాత్రమే తాగాలని వారు సూచిస్తున్నారు. మరి వీటితో పాటు మరికొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి..అవేంటో తెలుసుకుందాం..

గ్రీన్ టీలో ఎలాంటి క్యాలరీలుండవు
గ్రీన్ టీలో ఎలాంటి క్యాలరీలుండవు. అందుకే బరువు తగ్గాలంటే ఈ టీ తాగాల్సిందే! కానీ ఇందులో చక్కెర వేయడం వల్ల బరువు తగ్గడానికి బదులు మరింత బరువు పెరుగుతారు. కాబట్టి చక్కెరకు బదులు తేనెని కలిపి తాగితే మంచిది!

లివర్‌ని ప్రమాదంలోకి నెట్టినట్లే!
శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల యాంటీబయాటిక్స్ సరిగా పనిచేయవు. ఇతర మందులు ఉపయోగించేటప్పుడు గ్రీన్ టీ తీసుకోవడం వల్ల లివర్‌ని ప్రమాదంలోకి నెట్టినట్లే!

ఏదైనా మితంగా తీసుకుంటే పరవాలేదు.
ఏదైనా మితంగా తీసుకుంటే పరవాలేదు. అదే మోతాదు మించితే.. మనసు మీద దుష్ప్రభావం చూపుతుంది. కాబట్టి రోజుకు ఒకటి, రెండు కప్పులకంటే ఎక్కువగా తాగకూడదు.

గ్రీన్ టీలో కెఫిన్ అధికంగా ఉంటుంది.
కెఫిన్ ఎక్కువైతే శరీరంలో నార్మల్ బాడీ ఫంక్షన్స్ పనిచేయడం కష్టం అవుతుంది. గ్రీన్ టీలో కెఫిన్ అధికంగా ఉంటుంది.

జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది.
గ్రీన్ టీలో టానిన్ పొట్టలో ఎక్కువ యాసిడ్స్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అది జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది.

ఎవరైతే ఎక్కువగా గ్రీన్ టీ తీసుకుంటే
ఎవరైతే ఎక్కువగా గ్రీన్ టీ తీసుకుంటే వారి ఐరన్ రక్తంలో పోషణ చెందదు. ఇందులో ఉండే టానిన్ రక్తంలో ఉన్న న్యూట్రిషియన్స్ సామర్థ్యంను తగ్గిస్తుంది.

గర్భవతులు కెఫిన్ పానీయాలకు దూరంగా ఉండాలి
గర్భవతులు కెఫిన్ పానీయాలకు దూరంగా ఉండాలని డాక్టర్లు చెబుతారు. గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల పొట్టలో పెరిగే శిశువు మెదడు మీద ప్రభావం చూపుతుంది.



Click it and Unblock the Notifications