బరువు తగ్గించడంలో దాల్చిన చెక్క చేసే జిమ్మిక్కులు

Posted By: Lekhaka
Subscribe to Boldsky

దాల్చినచెక్క ప్రపంచంలో అత్యంత ఖరీదైన మసాలా దినుసులలో ఒకటి. దాల్చినచెక్కలో ఉన్న వాసన మరియు రుచి ఆహార ప్రేమికులకు మంచి వంటకాలను అందిస్తుంది. కానీ ఈ మసాలా బరువును తగ్గించటంలో ఎలా సహాయపడుతుందో తెలుసా?

దాల్చినచెక్క బరువు తగ్గించడం మరియు జీవక్రియ వ్యాధులను తగ్గించటానికి సిఫార్స్ చేయబడింది. ఆరోగ్య దృక్పథం కాకుండా బరువును తగ్గించి మీకు మంచి రూపాన్ని ఇచ్చే ముఖ్యమైన కారకం అని చెప్పవచ్చు.

ప్రజలు మంచి ఆకారం కోసం ఏమి చేయటానికి అయినా సిద్ధంగా ఉన్నారు. అయితే పనిచేయని చిట్కాలను ఎంచుకుంటే ఎటువంటి ఫలితం ఉండదు.

మీరు బరువు తగ్గడానికి సహజమైన మరియు సురక్షితమైన మార్గాల కోసం వెతుకుతుంటే, దాల్చినచెక్కను ప్రయత్నించండి. దాల్చినచెక్క స్టిక్, నూనె మరియు పౌడర్ రూపంలో అందుబాటులో ఉంది.

How To Use Cinnamon For Weight Loss

దాల్చినచెక్క జీవక్రియ సమస్యలు మరియు అజీర్ణం తగ్గించటానికి సహాయపడుతుంది. దాల్చినచెక్కలో గ్లూకోజ్ ను ఉపయోగించటానికి ఇన్సులిన్ ను నియంత్రించే పాలీఫెనోల్స్ సమృద్ధిగా ఉంటుంది. ఇది గ్లూకోజ్ కొవ్వుగా మారకుండా చూస్తుంది. తద్వారా బరువు తగ్గుతాం.

దాల్చినచెక్కలో కాల్షియం, ఇనుము, భాస్వరం మరియు మాంగనీస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. దాల్చినచెక్క ఆకలిని తగ్గించటమే కాకూండా ఆకలి భావన లేకుండా చేస్తుంది.

ఈ రోజుల్లో,బరువు నష్టం కోసం దాల్చినచెక్క మాత్రలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.అదే ప్రభావం పొందడానికి,మీ రోజువారీ ఆహారంలో ఒక స్పూన్ దాల్చిన చెక్కను చేర్చండి. దాల్చినచెక్కను ఏ విధంగా తీసుకోవచ్చో తెలుసుకుందాం.

నీటితో దాల్చినచెక్క

నీటితో దాల్చినచెక్క

ప్రతి రోజు దాల్చినచెక్క పానీయాన్ని త్రాగితే మీ శరీర బరువులో తేడాను గమనించవచ్చు. నీటిలో దాల్చినచెక్కను మరిగించాలి. ఈ నీటిని త్రాగి కావాల్సినంత భోజనం చేయండి. మీకు సాధ్యం కాకపోతే దాల్చినచెక్క నీటిని ఉదయం,సాయంత్రం త్రాగవచ్చు. దాల్చినచెక్క నీటితో దాల్చినచెక్క టీని కూడా తయారుచేసుకోవచ్చు.

ఆహారంపై జల్లుకొని

ఆహారంపై జల్లుకొని

మీరు వంటకాలు తయారుచేసేటప్పుడు దాల్చినచెక్క అగ్ర భాగంలోనే ఉంటుంది. రుచితో పాటు అదనంగా బరువు నష్ట ప్రయోజనం కూడా పొందుతారు. మీరు బరువు నష్టం కొరకు దాల్చినచెక్కను ఎలా ఉపయోగించుకోవచ్చనే అనే దానిలో ఇది ఒకటి. ప్రతి మసాలా వంటకంలో దాల్చినచెక్క బాగానే ఉంటుంది.

జ్యుస్ లో కలపటం

జ్యుస్ లో కలపటం

బరువు నష్టం కోసం ఆహారనిపుణులు సూచించిన అనేక ఆరోగ్యకరమైన జ్యుస్ లు ఉన్నాయి.మీరు ఆ జ్యుస్ ల ముడి రుచి కారణంగా ఇష్టపడకపోతే, దానిలో దాల్చినచెక్క పొడి కలిపి త్రాగవచ్చు. దాల్చినచెక్క పొడి కలపటం వలన బరువు నష్ట పానీయంగా మారుతుంది. దీని ద్వారా, బరువు నష్టం కోసం దాల్చిన విటమిన్లను ఉపయోగించుకోవచ్చు.

తేనె తో దాల్చిన చెక్క

తేనె తో దాల్చిన చెక్క

దాల్చినచెక్క మరియు తేనె కలయిక బరువు తగ్గడానికి ఉత్తమమైన మార్గం. రెండు కప్పుల నీటిలో దాల్చినచెక్కను వేసి మరిగించాలి. ఆ నీటిని వడకట్టి కొంచెం వేడిగా ఉన్న సమయంలోనే ఒక స్పూన్ తేనే కలపాలి. దీనిని వేడిగా ఉన్నప్పుడే త్రాగాలి.

పాలతో దాల్చినచెక్క

పాలతో దాల్చినచెక్క

దాల్చినచెక్క మరియు పాలు ఒక శక్తివంతమైన కలయికను ఇస్తాయి. ఇవి బరువు తగ్గడానికి దాల్చిన సప్లిమెంట్ల ఇచ్చే ప్రభావాన్నే ఇస్తాయి. దాల్చినచెక్కను పాలలో మరిగించి తీసుకోవచ్చు. లేదా పాలలో దాల్చినచెక్క పొడిని కలుపుకొని కూడా త్రాగవచ్చు.

వోట్స్ తో దాల్చినచెక్క

వోట్స్ తో దాల్చినచెక్క

వోట్స్ అనేది ఫిట్నెస్ మరియు బరువు నష్టం మీద లక్ష్యంగా ఉన్న అందరికి ఇష్టమైనది.దానికి దాల్చినచెక్క పొడిని జోడించడం ద్వారా మీ వోట్స్ వంటకానికి కొంచెం రుచిని కలిగించవచ్చు. మీరు ఓట్స్ ఉడికించి సమయంలో దాల్చినచెక్కను వేయాలి. అప్పుడు బరువు తగ్గటానికి సహాయాపడుతుంది.

 ముందు జాగ్రత్త:

ముందు జాగ్రత్త:

మీరు బరువు నష్ట ఆహారంలో దాల్చినచెక్కను వేసే ముందు ఒక్కసారి డాక్టర్ ని సంప్రదించాలి. మీరు బరువు నష్టం కోసం దాల్చినచెక్క మాత్రలను తీసుకోవాలని ప్రణాళిక ఉంటే మాత్రం ఈ జాగ్రత్త తీసుకోండి. అధిక మోతాదులో దాల్చినచెక్క కామేర్ వ్యాధి మరియు మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్నవారికి ప్రమాదకరమైనది.

English summary

How To Use Cinnamon For Weight Loss

How To Use Cinnamon For Weight Loss,If you are still in a dilemma as to how cinnamon can be used for losing weight then you need to check this out.
Subscribe Newsletter