రోజూ గుడ్డు తినాలి అనడానికి కొన్ని ఫర్ఫెక్ట్ రీజన్స్ ..!

Posted By:
Subscribe to Boldsky

గుడ్డు గురించి చాలా మందిలో చాలా అపోహలున్నాయి. రోజూ గుడ్డు తినాలని కొంత మంది చెబితే, మరికొందరు రోజు గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని సూచిస్తున్నారు. మరో గ్రూప్ వారు మాత్రం ఎగ్ వైట్ మాత్రమే ఆరోగ్యం అంటే మరికొందరేమో, ఎగ్ యోక్(గుడ్డు పచ్చసొన)లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి, ఎగ్ యోక్ మంచిదని సూచిస్తుంటారు.

ప్రస్తుతం ప్లాస్టిక్ ఎగ్స్ అనే న్యూస్ ప్రపంచ మొత్తంగా చక్కర్లు కొడుతోంది. అంటే గుడ్డు ఎంత ఆరోగ్యకరమైనదో ఇట్టే తెలిసిపోతున్నది కదా..! గుడ్డు తినడానికి చాలా మంది ఇష్టపడుతారు. అయితే గుడ్డు ఆరోగ్యానికి మంచి చేస్తుందా లేదా చెడుచేస్తుందా అనే అందోళన ఇప్పటికీ ఉన్నవారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాల్సిందే. ఈ ఆర్టికల్లో గుడ్డులోని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలపడం జరిగింది. గుడ్లను డైలీ డైట్ లో చేర్చుకోవడానికి కొన్ని ఖచ్చితమైన కారణాలను తెలపడం జరిగింది.

Know The Reasons Why Eggs Should Be A Must-Have In Your Daily Diet

మ్యాక్సిమమ్ న్యూట్రీషియన్స్ పొందాలంటే, ఒక గుడ్డును పూర్తిగా తినాలి. గుడ్డులో ప్రోటీన్స్, ఐరన్, అమినోయాసిడ్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.

ప్రోటీన్స్ అధికంగా ఉండటం వల్ల గుడ్డు తింటే ఓవర్ వెయిట్ లేదా ఫ్యాట్ చేరుతుందని చాలా మంది నమ్మకం. అయితే ఇది కేవలం అపోహ మాత్రమే. మీరు బరువు తగ్గాలనుకుంటే గుడ్డు తప్పనిసరిగా మీ డైలీ డైట్ లో చేరాల్సిందే..గుడ్డు పచ్చసొనలో ముఖ్యమైన న్యూట్రీషియన్స్, కోలిన్ అనే కంటెంట్ ఫ్యాట్ తో పోరాడుతుంది. రెగ్యులర్ గా గుడ్డు ఎందుకు తినాలి అనడానికి కొన్ని ఖచ్చితమైన రీజన్స్ ఈ క్రింది విధంగా..

వ్యాధినిరోధకతను పెంచుతుంది:

వ్యాధినిరోధకతను పెంచుతుంది:

గుడ్డులో ఒక ముఖ్యమైన సెలీనియం అనే పదార్థం ఉంటుంది. ఇది వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. ప్రతి రోజూ గుడ్డు తినడం వల్ల వైరస్ మరియు ఇన్ఫెక్షన్స్ తో పోరాడటానికి సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది:

కొలెస్ట్రాల్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది:

గుడ్డులో మంచి ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. అంతే కాదు, చెడు కొలెస్ట్రాల్ తగ్గడంతో హార్ట్ హెల్తీగా ఉంటుంది. కాబట్టి, ఖచ్చితంగా రోజుకు ఒక గుడ్డు తినడానికి ప్రయత్నించండి.

 దంతాలు స్ట్రాంగ్ గా మార్చుతుంది:

దంతాలు స్ట్రాంగ్ గా మార్చుతుంది:

గుడ్డులో విటమిన్ డి అధికంగా ఉంటుంది. గుడ్డు దంతాలను స్ట్రాంగ్ గా మార్చుతుంది. దంతాలను స్ట్రాంగ్ గా మార్చుకోవాలన్నా, దంత ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్నా గుడ్డు తినాల్సిందే .

ఎముకలను స్ట్రాంగ్ గా మార్చుతుంది:

ఎముకలను స్ట్రాంగ్ గా మార్చుతుంది:

గుడ్డులో విటమిన్ డి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో క్యాల్షియంను గ్రహించడానికి సహాయపడుతుంది. దాంతో శరీరంలోపల ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటూ శరీరానికి సపోర్టివ్ గా ఉంటాయి.

ఎనర్జీని అందిస్తాయి:

ఎనర్జీని అందిస్తాయి:

గుడ్డులో విటమిన్ బి లు అధికంగా ఉన్నాయి. ఇవి ఎనర్జీ లెవల్స్ ను పెంచుతాయి. కాబట్టి, రోజుకు ఒక గుడ్డును తప్పనిసరిగా తినడం చాలా అవసరం.

కంటి చూపును మెరుగుపరుస్తుంది:

కంటి చూపును మెరుగుపరుస్తుంది:

గుడ్డు పచ్చసొనలో ఉండే రెండు ముఖ్యమైన కాంపోనెంట్స్ లూటిన్ మరియు జియాక్సిథిన్ అనేవి, కంటి చూపును మెరుగుపరుస్తుంది. ద్రుష్టిలోపాలను నివారిస్తుంది.

బ్రెయిన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది:

బ్రెయిన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది:

గుడ్డులో కోలిన్ అనే కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది బ్రెయిన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. శరీరంలో కోలిన్ లోపించడం వల్ల నరాల సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

 స్ట్రెస్ తగ్గిస్తుంది:

స్ట్రెస్ తగ్గిస్తుంది:

గుడ్డులో అమినో యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల , బ్రెయిన్ లో సెరోటినిన్ లెవల్స్ ను పెంచడానికి సహాయపడుతుంది. దాంతో స్ట్రెస్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు.

English summary

Know The Reasons Why Eggs Should Be A Must-Have In Your Daily Diet

In order to get the maximum nutrients, eggs should be consumed whole. Eggs are filled with major nutrients like protein, iron, amino acids and are also a rich source of antioxidants.
Story first published: Monday, April 10, 2017, 15:34 [IST]
Subscribe Newsletter