రెగ్యులర్ గా రన్నింగ్ చేసే వాళ్ళు ఎట్టి పరిస్థితిలో చేయకూడని పనులు!

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

రెగ్యులర్ గా చేసే వ్యాయామాలలో పరుగు ఒకటి. ఇది శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు శరీర దృఢత్వానికి , కండరాలు బలంగా మారడడానికి ఒక మంచి వ్యాయామ పద్దతి

ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ద కలిగిన వారు, వారి శరీర ఆకృతి మీద, ఆరోగ్యం మీద ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు, ఎప్పుడు ఆరోగ్యంగా, ఫిట్ గా.. నాజుగ్గా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం ప్రిడామినెంట్ వ్యాయమం చేసి, బాడీ వెయిట్ తగ్గించుకోవడానికి, లెగ్ మజిల్స్ స్ట్రాంగ్ చేసుకోవడానికి, రన్నింగ్ ను ఎంపిక చేసుకుంటారు.

basics of running

ఒక్క పరుగులోనే వివిధ రకాల క్రియలు జోడించి ఉన్నాయి. హైలెవల్ మెటబాలిజం వల్ల శరీరంలో నిల్వ ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ ను కరిగిస్తాయి. శరీరం ఎక్కువ శ్రమపడటం వల్ల చెమటలు ఎక్కువగా పట్ట్టించే బేసిక్ రన్నింగ్ యాక్టివిటిని ఎంపిక చేసుకోవాలి.

రోజు అరగంట పరుగు పెట్టడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, శరీరం ఫిట్ గా యాక్టివ్ గా ఉంటుంది. అయితే ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నప్పడు(ఎలాంటి మెడికిల్ ఎలిమెంట్స్ అయిన కార్డియాక్ అరెటస్ట్, ఆర్థ్ర్రైటిస్, హైపర్ టెన్షన్ మొ లేకుండా) మాత్రమే రన్నింగ్ ఎంపిక చేసుకోవాలి.

ఒక వేళ మీ ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోతే , రన్నింగ్ వల్ల అనారోగ్య పరరిస్థితి మరింత ఎక్కువ అవుతుంది.

ఈ వ్యాయామాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు, ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. గుండెకు రక్తం ఎక్కువగా సరఫరా అవుతుంది. ఇటువంటి పరిస్థితిలో ప్రీ ఎక్సెస్టిక్ కార్డియాక్ పేషంట్స్ లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, రన్నింగ్ ను రెగ్యులర్ వ్యాయామంగా ఎంపిక చేసుకోవడానికి ముందుగా డాక్టర్ ను ఒకసారి కలిసి, మీ ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోండి.

అయితే , మనలో చాలా మంది రెగ్యులర్ గా రన్నింగ్ చేసే వారు కూడా ఉన్నారు. అయితే రన్నింగ్ చేసిన తర్వాత కొన్ని పనులను ఎట్టి పరిస్థితిలో చేయకూడదు అవేంటో ఒకసారి తెలసుకుందాం...

1. ఎక్కువ సమయం కూర్చోకూడదు:

1. ఎక్కువ సమయం కూర్చోకూడదు:

రన్నింగ్ ఒక మంచి ఫిజికల్ యాక్టివిటి.ముఖ్యంగా ఎనర్జీ లెవల్స్ తక్కువ ఉన్నవారికి ఇది మంచిది. కొన్ని పరిస్థితిల్లో ఎక్కువ సమయం కూర్చోవడం శరీరానికి అంత మంచి పద్దతి కాదు. రన్నింగ్ తర్వాత ఎక్కువ సమయం కూర్చోవడానికి బదులుగా ఫ్రీక్యాండ్స్ వ్యాయామం, యోగా లేదా మెడిటేషన్ వంటివి చేయడం ఉత్తమం. కోల్పోయిన్ ఎనర్జీ లెవల్స్ ను తిరిగి పొందడానికి ఈ చిన్నపాటి వ్యాయామాలు సహాయపడుతాయి.

2. రన్నింగ్ తర్వాత మురికి దుస్తులు ధరించడం మంచిది కాదు:

2. రన్నింగ్ తర్వాత మురికి దుస్తులు ధరించడం మంచిది కాదు:

రన్నింగ్ అంటే శారీరక శ్రమ, తప్పకుండా చెమట పడుతుంది. చెమటలో క్రిములు మరియు బ్యాక్టీరియా ఉంటుందన్న విషయం మనకు తెలుసు, మానవ శరీరం ముఖ్యంగా చర్మంలో ఉండే బ్యాక్టీరియా క్రిములు చెమట వల్ల మరింత చీకాకును కలిగిస్తాయి. అంతే కాదు, దగ్గు, జలుబు వంటి అలర్జీలకు కారణం అవుతాయి. అందువల్ల రన్నింగ్ తర్వాత మురికిబట్టల్లో ఉండటం ఆరోగ్యానికి మరింత హాని జరగుతుంది. రన్నింగ్ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయడం శరీరం రిఫ్రెష్ గా ఫీల్ అవుతుంది. ఎలాంటి వైరస్ ఉన్నా తొలగిపోతుంది.

3. ఎక్కువ నీళ్ళు తాగకపోవడం:

3. ఎక్కువ నీళ్ళు తాగకపోవడం:

రన్నింగ్ ముందు, రన్నింగ్ తర్వాత నీళ్ళు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. నీళ్ళు మన శరీరాన్ని పూర్తిగా హైడ్రేషన్ లో ఉంచడానికి సహాయపడుతుంది. అంతే కాదు, శరీరంలో ఉండే ఎలాంటి వ్యర్థాలనైనా యూరిన్ , చెమట రూపంలో బయటకు నెట్టేస్తుంది. అందువల్ల ఇది రన్నర్స్ కు చాలా ముఖ్యమైన విషయం , రన్నింగ్ చేయడాని ముందు, మరియు రన్నింగ్ సమయంలో శరీరంలో హైడ్రేషన్ లో ఉంచుకోవడం చాలా అవసరం. అందువల్ల, రన్నింగ్ తర్వాత శరీరంలో కొ్ంత ఎనర్జీ తక్కువ అవుతుంది, కాబట్టి, శరీరానికి తగిన ఫ్లూయిడ్స్ చాలా అవసరం. ఇది శరీరంలోని ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది.

4. ఎక్కువ పనిచేయకూడదు:

4. ఎక్కువ పనిచేయకూడదు:

రన్నింగ్ చేసిన వెంటనే ఎక్కువ శారీరక శ్రమ కలిగించే పనులు చేయకూడదు, అలాగే శారీరక వ్యాయామలు కూడా చేయకూడదు. ఇలా చేయడం వల్ల కండరాలు కోలుకోని స్థితిలో ఉండటం వల్ల తేలికైన వ్యాయామాలు వాకింగ్, చిన్న చిన్న ఇంటి పనులు చేసుకోవడం మంచిది. శరీరం ఫిట్ గా యాక్టివ్ గా ఉంటుంది. తిరిగి ఎనర్జీని పొందుతుంది. .

5. అనారోగ్యకరమైన ఆహారాలు తినడం:

5. అనారోగ్యకరమైన ఆహారాలు తినడం:

రన్నింగ్ ముగించిన వెంటనే క్యాలరీలు కొంత మేర తగ్గుతాయి. అందుకోసమని అనారోగ్యకరమైన జంక్ ఫుడ్స్ రోజంతా తినకూడదు. రన్నింగ్ తర్వాత ఆకలి కొంత వరకూ తగ్గుతుంది. కాబట్టి, హెల్తీ, న్యూట్రీషియన్ ఫుడ్స్ తీసుకోవడం చాలా అవసరం. హెల్తీ ఫుడ్స్ జీర్ణశక్తిని పెంచి, బరువుతగ్గిస్తుంది. రన్నింగ్ తర్వాత పిజ్జాలు, బర్గర్స్ తినడం వల్ల తిరిగి బరువు పెరుగుతారు, రోజంతా హెవీగా , మత్తుగా అనిపిస్తుంది.

6. బ్రేక్ ఫాస్ట చేయకపోవడం:

6. బ్రేక్ ఫాస్ట చేయకపోవడం:

రోజూ ఉదయం హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉంటారు. రన్నింగ్ తర్వాత బ్రేక్ ఫాస్ట్ ను తినడకపోవడం వల్ల రోజంతా బలహీనంగా, నీరసంగా కనబడుతారు. రన్నింగ్ సమయంలో ఎనర్జీ తగ్గడం వల్ల రోజంతా అలా అనిపించవచ్చు. కాబట్టి, రన్నింగ్ తర్వాత కేవలం హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తోనే తిరిగి ఎనర్జీ లెవల్స్ ను పెంచుకుంటారు

అందువల్ల కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ఎక్కువగా ఉన్న ఆహారాలను మార్నింగ్ డైట్ లో చేర్చుకోవాలి. ఉడికించిన గుడ్లు, పాలు, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ లు , గ్రీన్ లీఫి వెజిటేబుల్స్, ఓట్స్, పెరుగు తీసుకోవడం ఫర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్ అవుతుంది. అలాగే, ఇవి యాంటీ హంగర్ సప్రెసెంట్స్ గా పనిచేసే మిడ్ మార్నింగ్ ఆకలిని తగ్గిస్తుంది.

సో, రన్నర్స్ ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తించుకోవాలి. ఈ సింపుల్ నియమాలను అనుసరించడ వల్ల ఎక్కువ హెల్తీగా, యాక్టివ్ గా ఉంటారు.

English summary

Things You Need To Take Care Of After Running

Running is good for you as it relieves stress and makes your body fit and active. But there are a few mistakes that many of us commit. There are a few things that you need to keep in mind after running. Sitting for long, that too in sweaty clothes or not hydrating yourself properly affects one's health.!.