రోజుకు ఒకటి రెండు పిస్తా, బాదం, జీడిపప్పు తింటే చాలు మీ జ్ఞాపక శక్తిని పెంచుకోండి

By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

మీ వయసు వల్ల మీరు జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారని, కానీ జ్ఞాపకశక్తి బాగా లేని కొన్ని వయసుల వారు చెప్తున్నారు. సరే, ఇది కొన్ని కారణాల వల్ల కావొచ్చు. కానీ మీ జ్ఞాపకశక్తిని పెంచుకోడానికి ఇక్కడ ఏమైనా మార్గాలు ఉన్నాయా?

మంచిది, అవును. వేరుశెనగ పప్పు, పిస్తాపప్పు వంటి గింజలు రోజువారీ భోజనంలో తీసుకోవడం వల్ల జ్ఞానం, ఉపశమనం, అభ్యాసం, జ్ఞాపకశక్తి ఇతర ముఖ్యమైన మెదడు విధులతో సంబంధం ఉన్న తరంగాలను బలోపేతం చేయగలవని కొత్త అధ్యయనాలు తెలియచేశాయి.

Pistachios, Peanuts Help Boost Memory

గింజల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీ విజ్ఞానాన్ని, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడమే కాకుండా, గింజలు గుండెను సంరక్షించు కోవడానికి, క్యాన్సర్ నుండి పోరాడడానికి, నొప్పులను తగ్గించడం, వృద్ధాప్య ప్రక్రియను తగ్గించడానికి కూడా సహాయపడతాయి.

అధ్యయనం ప్రకారం, కాలిఫోర్నియా లోని లోమా లిండా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆరు రకాల గి౦జలైన బాదం, జీడిపప్పు, పిస్తాపప్పు, వేరుశెనగ, ఆక్రోట్లను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల వాటి ప్రభావం మెదడు పనితీరుపై ఉంటుందని అన్వేషించారు. ఈ గింజలను తినేవారిలో మెదడు తరంగాల సంకేతాలన బలాన్ని అంచనావేసే ఎలక్ట్రో ఎన్సేఫలో గ్రామస్ (EEG) ని నిర్వహిస్తాయి.

Pistachios, Peanuts Help Boost Memory

ఈ అధ్యయనాన్ని అనుసరించి, పిస్తాపప్పులు గామా వేవ్ స్పందనని ఉత్పత్తి చేయడం వల్ల, విజ్ఞాన సంవిధానం, సమాచార నిలుపుదల, అభ్యాసం, అవగాహన, నిద్రించే సమయంలో కంటి కదలికలను మెరుగుపరుచుకోవడం కష్టమవుతుంది.

మరోవైపు వేరుశెనగలు, సాధారణంగా చిక్కుళ్ళు, ఆరోగ్యకరమైన రోగనిరోధక శక్తిని, సహజమైన ఉపశమనాన్ని, గాఢ నిద్రను కలిగి ఉన్న అత్యధిక డెల్టా స్పందనను ఉత్పత్తి చేస్తాయి.

“ఈ అధ్యయన౦ గింజలపై ప్రయోగం చేయడం ద్వారా గుర్తించిన సంకేతం ఏమిటంటే పిస్తాపప్పులు మీ మెదడుకే కాకుండా, మీ మిగిలిన శరీరానికి కూడా ఎంతో మంచిది అని. EEG వేవ్ బ్యాండ్ సూచనలు సెరిబ్రల్ వల్కపు పనితీరుతో సంబంధం ఉన్న చర్మం లోని తొమ్మిది ప్రాంతాల నుండి నమోదు చేయబడ్డాయి. అన్ని గింజలలో ప్రయోజనకరమైన యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా కనిపిస్తాయి, అన్నిటిలోకి అత్యధిక యాంటీ ఆక్సిడెంట్ల సాంద్రతను వాల్ నట్స్ కలిగి ఉంటాయి” అని పరిశోధకులు లీ బెర్క్ విశ్వవిద్యాలయ అసోసియేట్ డీన్ సూచించారు.

ఈ అధ్యయన ఫలితాలు ఈమధ్యనే FASEB జేర్నల్ లో ప్రచురించబడింది. దీనితోపాటు, పిస్తా వల్ల కొన్ని ఇతర ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలను గురించి కూడా తెలుసుకుందాం. ఒక దృష్టి పెట్టండి.

1. గుండెకు మంచిది:

1. గుండెకు మంచిది:

పిస్తాపప్పులు గుండెకు మంచివి. పిస్తాపప్పులు యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోస్టేరోల్స్, అన్-సాచురేటేడ్ ఫాటీ యాసిడ్స్ (పాలీ అన్-సాచురేటేడ్, మోనో అన్-సాచురేటేడ్ రెండూ) ని కలిగి ఉండడం వల్ల, ఇవి చెడు కొవ్వు స్థాయిలను తగ్గించి, గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి.

2.బరువును నిర్వహించడం:

2.బరువును నిర్వహించడం:

చాలామంది పిస్తాలను తినాలని అనుకోరు. కానీ పిస్తాలో క్యాలరీలు తక్కువ, ప్రోటీన్ లు అధికంగా ఉంటాయి, సాచురేటేడ్ ఫాట్ తక్కువ, అన్-సాచురేటేడ్ ఫాట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, రోజూ పిస్తాపప్పులు తింటే క్రమంగా బరువును నిర్వహించుకోవడానికి సహాయపడతాయి.

3.మధుమేహాన్ని నియంత్రిస్తుంది:

3.మధుమేహాన్ని నియంత్రిస్తుంది:

పిస్తాపప్పులలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ లు సమృద్ధిగా ఉండడం వల్ల, గ్లైకేషన్ విధానాన్ని తగ్గించడానికి సహాయపడి మధుమేహాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది.

4.మాక్యులర్ డిసీజ్ ని నిరోధించడానికి సహాయపడుతుంది:

4.మాక్యులర్ డిసీజ్ ని నిరోధించడానికి సహాయపడుతుంది:

లుటీన్, జేక్సాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన ఉత్తమ గింజల్లో పిస్తాపప్పులు ఒకటి. రోజువారీ ఆహారంలో పిస్తాపప్పులు తీసుకుంటే వయసుతో పాటు వచ్చే మాక్యులర్ డిసీజ్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ పిస్తాపప్పులను స్నాక్స్ రూపంలో లేదా కూరలలో కలిపి తీసుకోవడం మంచిది.

English summary

Pistachios, Peanuts Help Boost Memory

A new study had found that daily consumption of nuts such as peanuts and pistachios can strengthen cognition,healing,memory and other key brain functions.
Story first published: Saturday, November 25, 2017, 7:00 [IST]
Subscribe Newsletter