వారానికి కనీసం రెండుసార్లు శృంగారంలో పాల్గొనాలి...ఎందుకంటే ?

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

వారానికి కనీసం రెండు సార్లు అయినా శృంగారంలో పాల్గొనాలని, అలా చేయడం చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. అలా ఎందుకు చేయాలి అనే విషయమై ఒక ముఖ్యమైన కారణాన్ని కూడా చెబుతున్నారు. ఈ కారణాన్ని విన్న తర్వాత మిగతా అన్ని కారణాలు చిన్నబోతాయి అని చెబుతున్నారు. శృంగారం తరచూ చేయడం వల్ల ఆరోగ్యవంతులుగా పురుషులు మారుతారనే విషయాన్ని ఒక అధ్యయనం తెలిపిందని శృంగారానికి సంబంధించిన ఒక పత్రిక వార్తను ప్రచురించింది.

ఈ అధ్యయనంలో భాగంగా దాదాపు రెండు వేలకు పైగా వ్యక్తులను పరిశోధకులు, వివిధ రకాలైన శృంగారానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత రక్త నమూనాలను తీసుకొని పరీక్షలు జరిపారు. ఎవరైతే శృంగారాన్ని తరచుగా చేయడం లేదో, కనీసం నెలకు ఒక్క సారి లేదా అంత కంటే తక్కువగా శృంగారంలో పాల్గొంటున్నారో అటువంటి వ్యక్తులలో హోమో సిస్టైన్ అనే రసాయనం శృంగారంలో తరచూ పాల్గొనేవారు లేదా వారానికి కనీసం రెండుసార్లు పాల్గొనే వారికంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

Reason You Should Have Sex At Least Twice a Week

ఈ 6 లక్షణాలు గనుక ఉంటే మీ వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు లెక్క..

ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే స్త్రీలలో ఇటువంటి హెచ్చు తగ్గులు ఏమి కనపడలేదు. ఎందుకు అనే విషయమై వారి దగ్గర కూడా శాస్త్రీయమైన ఆధారమేమి లేదుగాని, వారు చెబుతున్నది ఏమిటంటే పురుషుల్లో లాగా స్త్రీలకు శృంగార ప్రేరణ అనేది ఆరోగ్యవంతమైన రక్తప్రసరణ పై ఆధారపడి లేదని, అదే పురుషుల్లో అయితే అంగస్తంభనకు రక్తప్రసరణ చాలా ముఖ్యమని చెబుతున్నారు.

Reason You Should Have Sex At Least Twice a Week

ఇది ఒక పరిశీలనాత్మక అధ్యయనం కావడంతో తరచూగా శృంగారంలో పాల్గొనడం వల్లనే హోమో సిస్టైన్ స్థాయిలు ఆయా పురుషుల్లో తక్కువాగా ఉన్నాయనే విషయాన్ని ఖచ్చితంగా నిరూపించడం కష్టం. ఏ ఏ పురుషులకైతే హోమో సిస్టైన్ స్థాయిలు తక్కువగా ఉన్నాయో ఆయా వ్యక్తులకు అంగస్తంభన సరిగ్గా జరగకపోవడం వల్ల శృంగారంలో తక్కువగా పాల్గొని ఉండవచ్చు.

Reason You Should Have Sex At Least Twice a Week

శృంగారానికీ ఓ సమయం..!! సైన్స్ ప్రకారం ఏ టైంలో సెక్స్ మంచిది ??

శాస్త్రవేత్తలు ఇలా జరగడానికి గల కారణం మరియు వాటి యొక్క ప్రభావాన్ని ఇప్పటివరకు నిరూపించలేకపోయారు. అయితే, శృంగారంలో ఎక్కువగా పాల్గొనటం వల్ల ఎటువంటి నష్టం లేదు.

English summary

Reason You Should Have Sex At Least Twice a Week

Here’s One More Reason You Should Have Sex At Least Twice a Week
Story first published: Wednesday, September 6, 2017, 18:30 [IST]
Subscribe Newsletter