రోజూ లెమన్ టీ తాగడానికి ఫర్ఫెక్ట్ రీజన్స్ ఇక్కడున్నాయి..

By: Mallikarjuna
Subscribe to Boldsky

టీ అంటేనే ఆరోమాటికి బెవరే. ఈ సువాసన భరితమైన పానీయంను కొంత మంది పాలు, పంచదార మిక్స్ చేయకుండా బ్లాక్ టీని తీసుకుంటుంటారు . ఇటువంటి టీని ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విరివిగా తీసుకుంటుంటారు .

ఈ నార్మల్ టీతో పాటు, వివిధ రకాల టీలు కూడా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి, ఏ హోటల్ లేదా కాఫీడే, లేదా స్ట్రీట్ స్టాల్స్ కు వెళ్ళిన అక్కడ గ్రీన్ టీ, ఊలాంగ్ టీ, రుచికరమైన టీలు మనకు అందుబాటులో ఉన్నాయి. టీ ప్రియులకోసం అని కొన్ని టీలకు కొన్ని ప్రత్యేకమైన ఫ్లేవర్స్ ను జోడించి మరీ అందుబాటులో ఉంచుతున్నారు.

లెమన్ టీ రెడీగా అందుబాటులో ఉంటుంది. నార్మల్ బ్లాక్ టీకి కొన్ని నిమ్మచెక్కలను కూడా జోడించి ఇస్తుంటారు. ఇది మీకు ఆరోమ్యాటిక్ సువాసను అందిస్తుంది . ఈ లెమన్ టీ వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. రెగ్యులర్ గా ప్రతి రోజూ లెమన్ టీ త్రాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలున్నాయి. లెమన్ టీ చాలా సులభంగా చిటికెలో తయారుచేసుకోవచ్చు. అందుకు ముందుగా నీటిని బాగా మరిగించి తర్వాత అందులో టీ పౌడర్ వేసి బాగా ఉడికించాలి. తర్వాత అందులో నిమ్మరసం లేదా నిమ్మతొక్క(లెమన్ స్లైస్ )జోడించాలి. చివరగా పంచదార లేదా తేనె మిక్స్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. లెమన్ టీలో ప్రయోజనాలను తెలుసుకుందాం..

1. మంచి క్లెన్సర్ మరియు డిటాక్సిపైయర్:

1. మంచి క్లెన్సర్ మరియు డిటాక్సిపైయర్:

లెమన్ టీలో బాడీ క్లెన్సింగ్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇది శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది. ఈ టాక్సిన్స్ వివిధ రకాల వ్యాధులను మరియు ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. ఇది అద్భుతమైన డిటాక్సిఫైయర్, లెమన్ టీ రెగ్యులర్ గా తాగడం వల్ల వ్యాధులను , ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

2. జలుబు దగ్గుకు మంచి ట్రీట్మెంట్ :

2. జలుబు దగ్గుకు మంచి ట్రీట్మెంట్ :

జలుబు, దగ్గు లక్షణాలను నివారించడంలో లెమన్ టీ గ్రేట్ రెమెడీ. జలుబు, ఫ్లూ ఉన్నట్లైతే లెమన్ టీకి కొద్దిగా అల్లం చేర్చి రోజూ మూడు, నాలుగు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది గొ్ంతునొప్పిని తగ్గించడం మాత్రమే కాదు, ఇది ఇమ్యూన్ సిస్టమ్ ను పెంచుతుంది . వింటర్లో శరీరంను వెచ్చగా మార్చుతుంది. ఈ టీ గొంతులో మ్యూకస్ ను రిలీవ్ చేస్తుంది. తేనె చేర్చడం వల్ల గొంతు సమస్యలకు ఉపశమనం కలుగుతుంది.

3. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది:

3. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది:

లెమన్ టీ త్రాగడం వల్ల నాడీ వ్యవస్థ చురుగ్గా ఉంటుంది. ఇది నాడీవ్యవస్థను చురుగ్గా ఉంచి, మెదడుకు అవసరం అయ్యే సామర్థ్యం మరియు బలాన్ని చేకూర్చుతుంది అందువల్ల తలనొప్పి మరియు స్ట్రెస్ తగ్గిస్తుంది. ఒత్తిడితో ఉన్నప్పుడు లెమన్ టీని ఒక కప్పు త్రాగడం వల్ల మిమ్మల్ని రిలాక్స్ గా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే మీ బావోద్వేగాలను నివారించడానికి సహాయపడుతుంది. మరింత బెటర్ గా ఫీల్ అయ్యేందుకు సహాయపడుతుంది.

4. కార్డియో వాస్క్యులర్ బెనిఫిట్స్ :

4. కార్డియో వాస్క్యులర్ బెనిఫిట్స్ :

గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుందని అనేక పరిశోధన ద్వారా నిరూపించబడినది. ఇంకా ఈ టీలో పాలను చేర్చడం వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నట్లు నిరూపించబడినది . టీలోని కొన్ని ఫ్లెవనాయిడ్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. మరియు ఆరోగ్యానికి గొప్పప్రయోజనకారిగా ఉంటుంది. అందువల్ల గ్రీన్ టీ కార్డియోవాస్కులార్ (గుండె సంబంధిత)సమస్యలను నివారించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుందని చెప్పగలం.

5. నేచురల్ యాంటీ సెప్టిక్:

5. నేచురల్ యాంటీ సెప్టిక్:

నిమ్మరసం నేచురల్ యాంటీసెప్టిక్, నిమ్మరసంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు, రెగ్యులర్ గా శరీరానికి అందడం వల్ల శరీరానికి వచ్చే ఇన్ఫెక్షన్స్, వ్యాధులను నివారిస్తుంది.

6. జీర్ణశక్తిని పెంచుతుంది:

6. జీర్ణశక్తిని పెంచుతుంది:

లెమన్ టీ శరీరంలోకి ప్రవేశించగానే మేలు చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచి, జీవక్రియలను చురుగ్గాపనిచేయడానికి సహాయపడుతుంది. మొత్తం జీవక్రియలను శుభ్రపరచడానినకి సహాయపడుతుంది. శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు వెళ్ళడానికి సహాయపడుతుంది .

7. ఇన్సులిన్ యాక్టివిటిని మెరుగుపరుస్తుంది:

7. ఇన్సులిన్ యాక్టివిటిని మెరుగుపరుస్తుంది:

శరీరంలో గ్లూకోజ్ నుండి ఎనర్జీ విడుదల అవ్వడానికి ఇన్సులిన్ చాలా అవసరం అవుతుంది. శరీరంలో ఇన్సులిన్ తగ్గడం వల్ల అనేక అనారోగ్య సమస్యలతో అనుసంధానం కలిగి ఉంటుంది. దానికి లెమన్ టీ గొప్పగా సహాయపడుతుంది . లెమన్ టీ ఇన్సులిన్ యాక్టివిటిని ప్రోత్సహిస్తుంది. ఊలాంగ్ టీ, గ్రీన్ టీ మరియు బ్లాక్ టీ లు కూడా శరీరంలో జీవక్రియలు చురుగ్గా పనిచేసేలా చేయడానికి ఉత్తేజపరచడానికి సహాయపడుతుంది . అయితే ఇది డయాబెటిక్ పేషంట్స్ కు పరిష్కారం కాదు, కానీ ఇది వారికి కొంత వరకూ సహాయపడుతుంది.

8. యాంటీ క్యాన్సర్ లక్షణాలు:

8. యాంటీ క్యాన్సర్ లక్షణాలు:

లెమన్ టీలో స్ట్రాంగ్ గా యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలున్నాయి. ఇది ఫాలీఫినాల్స్ ను కలిగి ఉంటుంది. యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి డ్యామేజ్ స్కిన్ టిష్యులను తొలగించి, హెల్తీ స్కిన్ రీజనరేట్ చేస్తుంది. క్యాన్సర్ సెల్స్ ను నివారిస్తుంది. నిమ్మరసంలో ఉండే యాంటీ క్యాన్సర్ లక్షణాలు స్కిన్ క్యాన్సర్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఇవేకాకుండా, నిమ్మరసంలో ఉండే లెమనాయిడ్స్ మౌత్ , లంగ్, బ్రెస్ట్, స్టొమక్, కోలన్ క్యాన్సర్స్ తో పోరాడుతాయి.

English summary

Benefits Of Drinking Lemon Tea Every Day

Read to know the top benefits of drinking lemon tea every day.
Story first published: Thursday, September 21, 2017, 8:00 [IST]
Subscribe Newsletter