For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేడి నీళ్ళలో పసుపు కలిపి తాగడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు..!

ఉదయాన్నే రకరకాల నీళ్లు తాగారు. నిమ్మరసం, వేడినీళ్లు, వెజిటబుల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ ఇలా రకరకాల జ్యూస్ లు తాగి బోర్ కొట్టిందా ? అవన్నీ హెల్తీ హ్యాబిట్స్. అయితే.. ఎప్పుడూ ఒకేరకమైన రెసిపీ ఫాలో అవడం అంటే

|

ఉదయాన్నే రకరకాల నీళ్లు తాగారు. నిమ్మరసం, వేడినీళ్లు, వెజిటబుల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ ఇలా రకరకాల జ్యూస్ లు తాగి బోర్ కొట్టిందా ? అవన్నీ హెల్తీ హ్యాబిట్స్. అయితే.. ఎప్పుడూ ఒకేరకమైన రెసిపీ ఫాలో అవడం అంటే.. కష్టం. కాబట్టి.. ఇప్పుడు పసుపు నీళ్ళు ట్రై చేయండి. పసుపునీళ్ళలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. పసుపులో ఉండే కుర్కుమిన్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. పసుపు ఆర్థ్రైటిస్ లక్షణాలను నివారిస్తుంది.

See What Happens To Your Body If You Drink Turmeric Water Every Day For 12 Months

గోరువెచ్చని పసుపు నీళ్ళు తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల దీన్ని రెగ్యులర్ గా ఉదయాన్నే తాగడం చాలా మంచిది. మరి ఈ పసుపు నీళ్లు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక కప్పు గోరువెచ్చని నీళ్లకు ఒక టీ స్పూన్ పసుపు, అర స్పూన్ పెప్పర్ పౌడర్ కలపాలి. ఈ మూడింటిని బాగా మిక్స్ చేయాలి. దీన్ని ప్రతి రోజూ ఉదయాన్నే తాగాలి. ఇలా 12 నెలల పాటు రెగ్యులర్ గా ఈ నీళ్లు తాగడం వల్ల పొందే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

 హార్ట్ హెల్త్ ను ప్రోత్సహిస్తుంది:

హార్ట్ హెల్త్ ను ప్రోత్సహిస్తుంది:

పసుపులో ఉండే కుర్కుమిన్ అనే కంటెంట్ రక్త నాళాల్లో పాచిని నివారిస్తుంది. దాంతో బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా నివారిస్తుంది. అక్కడితో హార్ట్ సమస్యలుండవు.

బాడీని ఆల్కలైజ్ చేస్తుంది:

బాడీని ఆల్కలైజ్ చేస్తుంది:

పసుపు ఆల్కలైన్ నేచర్ కలిగి ఉండటం వల్ల , శరీరంను ఆల్కలైజ్ చేస్తుంది.

టైప్ 2 డయాబెటిస్ ను నివారిస్తుంది:

టైప్ 2 డయాబెటిస్ ను నివారిస్తుంది:

రీసెంట్ గా జరిపిన పరిశోధనల ప్రకారం పసుపు నీళ్ళు రెగ్యులర్ గా తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ను నివారించుకోవచ్చు.

బ్రెయిన్ కు ప్రొటెక్ట్ చేస్తుంది:

బ్రెయిన్ కు ప్రొటెక్ట్ చేస్తుంది:

పసుపులో ఉండే కుర్కుమిన్ హార్మోన్స్ ను బ్యాలెన్స్ చేసి, మతిమరుపు వంటి లక్షణాలను నివారిస్తుంది. ఏజ్ రిలేటెడ్ బ్రెయిన్ ఫంక్షన్స్ లోపాలను, బ్రెయిన్ డిసీజెస్ ను నివారిస్తుంది.

ఇన్ఫ్లమేషన్ తో పోరాడుతుంది:

ఇన్ఫ్లమేషన్ తో పోరాడుతుంది:

ఇన్ఫ్లమేషన్ తో పోరాడటానికి పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది ఎఫెక్టివ్ గా ఇన్ఫ్లమేషన్ తో పోరాడుతుంది. పసుపు వాటర్ తో ఇది బెస్ట్ హెల్త్ బెనిఫిట్.

యాంటీక్యాన్సర్ లక్షణాలు:

యాంటీక్యాన్సర్ లక్షణాలు:

యాంటీ క్యాన్సర్ లక్షణాలను నివారించడానికి పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. సెల్స్ డ్యామేజ్ కాకుండా, క్యాన్సర్ సెల్స్ ను నివారిస్తుంది.

ఆర్థ్రైటిస్ :

ఆర్థ్రైటిస్ :

స్టడీస్ ప్రకారం. యాంటీఇన్ఫ్లమేటరీ డ్రగ్ తో ఆర్థ్రైటిస్ పెయిన్, వాపును ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు.

జీర్ణ శక్తిని పెంచుతుంది:

జీర్ణ శక్తిని పెంచుతుంది:

పసుపు నీళ్ళు తాగడంవ ల్ల జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. ఎసిడిటి లక్షణాలను నివారిస్తుంది.

కాలేయాన్ని రక్షిస్తుంది:

కాలేయాన్ని రక్షిస్తుంది:

పసుపు కాలేయానికి మంచిది. లివర్ ని డ్యామేజ్ చేసే టాక్సిన్స్ తొలగించడంలో.. పసుపు సహాయపడుతుంది.

ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది

ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది

పసుపు లో ఉండే కుర్కుమిన్ ఫ్రీరాడికల్స్ ను తొలగించి, స్కిన్ ఇన్ఫ్లమేషన్ దూరం చేయడం వల్ల ఏజింగ్ సమస్యలుండవు. ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది.

English summary

See What Happens To Your Body If You Drink Turmeric Water Every Day For 12 Months

The health benefits of turmeric water are explained in this article and all that you need to do is to read this article to find out.
Story first published: Thursday, February 2, 2017, 13:22 [IST]
Desktop Bottom Promotion