Latest Updates
-
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.! -
తెలంగాణలో వైభవోపేతంగా ఆషాఢ బోనాలు.. రంగంలో భవిష్యవాణి చెప్పిన సంగతులివే.! -
హస్తసాముద్రికం: మీ చేతిలో ఈ రేఖ ఉంటే కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ మసాలా దోశ ఇంట్లోనే.. ఈ రెండు సీక్రెట్స్ తెలిస్తే చాలు! -
కొందరు అందంగా లేకపోయినా ఎందుకు అందరినీ ఆకర్షిస్తారో తెలుసా.? -
మందు తాగేటప్పుడు స్టఫ్ గా ఏది తినడం ఆరోగ్యానికి మంచిదో తెలుసా?
నిద్రించడానికి అరగంట ముందు ఇలా చేస్తే ఎఫెక్టివ్ గా బరువు తగ్గుతారు!
ప్రస్తుతం ఈ మోడ్రన్ ప్రపంచంలో బరువు తగ్గించుకోవాలనేది ప్రతి ఒక్కరి ఆశ. అయితే అందరూ ఆ లక్ష్యాన్ని చేరుకోలేరు. బరువు తగ్గించుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించి ఉంటారు. ఎలాంటి ఫలితం చూపకపోవడంతో చివరికి ప్రయత్నించడం మానేస్తుంటారు. అయితే, బెడ్ టైమ్ లో కొన్ని అలవాట్లు మార్చుకోవడం వల్ల బరువు తగ్గిస్తాయన్న విషయం మీకు తెలుసా.?

రాత్రుల్లో నిద్రించడానికి 30 నిముషాల ముందు ఈ అలవాట్లు కనుక చేసుకున్నట్లైతే ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవడం సులభం అవుతుంది. బరువు తగ్గడం మాత్రమే కాదు, ఈ అలవాట్ల వల్ల శరీరం ఫిట్ గా ఉంటుంది. బరువు పెరుగుతామన్న భయం ఉండదు.
20 చెడు అలవాట్లకు ఈ రోజే గుడ్ బై చెప్పండి..!
అందుకు మీరు చేయాల్సిందల్లా మీ దినచర్యలో కొన్ని చిన్నచిన్న మార్పులు చేసుకోవడమే. ఈ మార్పుల వల్ల డైలీ వెయిట్ లాస్ గోల్స్ ను చేరుకుంటారు. కాబట్టి, ఆలస్యం చేయకుండా బరువు తగ్గించుకోవడానికి బెడ్ టైమ్ హ్యాబిట్స్ ఏంటో..ఎలా ఫాలో అవ్వాలో తెలుసుకుందాం...

ఒక రోజుకు మీకు నిద్ర ఎంత అవసరమో తెలుసుకోవాలి:
బరువు తగ్గించుకోవడానికి నిద్ర కూడా సహాయపడుతుంది. రోజుకు సరిపడా 8 గంటలు నిద్రపోవడం వల్ల గ్రెలిన్ తగ్గుతుంది మరియు లెప్టిన్ పెరుగుతుంది. ఇది రోజంతా ఆకలి కాకుండా కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది.

నిద్రించే ముందు ఒక కప్పు టీ తాగాలి:
రాత్రి నిద్రించడానికి అరగంట ముందు ఒక కప్పు గ్రీన్ టీ లేదా రూయ్బోస్ టీ తాగడం వల్ల బరువు తగ్గడం సులభం అవుతుంది. ఈ రకమైన టీలలో ఉండే ఆస్పథలిన్ అనే ఫ్లెవనాయిడ్స్ బెల్లీ ఫ్యాట్ కు చాలా మేలు చేస్తుంది. ఈ కాంపౌండ్స్ స్ట్రెస్ హార్మోన్స్ ను తగ్గిస్తుంది. ఇది ఆకలి కంట్రోల్ చేసి, ఫ్యాట్ నిల్వ చేరకుండా నివారిస్తుంది.

కాటేజ్ చీజ్ :
రాత్రి నిద్రించడానికి ముందు కాటేజ్ చీజ్ తినడం వల్ల అందులో ఉండే అమినో యాసిడ్ ప్రోటీన్, ట్రెప్టోఫోన్ పొట్ట నిండే అనుభూతిని కలిగించి, బరువు తగ్గడానికి సహాయపడుతాయి.

రొటీన్ గా చేసే పనులు :

వంటపనులు త్వరగా పూర్తి చేయాలి:
వంటపనులు తర్వాగా ముగించడం వల్ల రాత్రుల్లో డిన్నర్ త్వరగా తింటారు, త్వరగా నిద్రపోతారు. ఈ సింపుల్ చిట్కా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయం 10 గంటల వరకూ బ్రెక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల శరీరంలో కొవ్వు కరగడానికి ఈ సమయం గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో స్లిమ్ గా మారుతారు.

రెసిస్టెన్స్ ట్రైనింగ్ :
ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు రెసిస్టెన్స్ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల బరువు తగ్గడం సులభం అవుతుంది.

విశ్రాంతి :

ప్రోటీన్ షేక్ తీసుకోవడం :
నిద్రించడానికి ముందు బాడీ మెటబాలిజం రేటు పెంచుకోవాలంటే ప్రోటీన్ షేక్ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ లేదా ఫ్యాట్ ఫుడ్స్ కంటే ప్రోటీన్స్ ఆరోగ్యానికి చాలా సహాయపడుతాయి. శరీరానికి అదనపు క్యాలరీలు చేరకుండా, ఉన్న ఫ్యాట్ ను బర్న్ చేయడానికి సహాపడుతాయి.

లేట్ కార్డియో వర్కౌట్స్ :
రాత్రి డిన్న ర్ చేసిన తర్వాత చిన్న పాటి నడక, మెట్లు ఎక్కిదిగడం వంటివి చేయాలి. నిద్రించడానికి ముందు ఇలాంటి కార్డియో వర్కౌట్స్ చేయడం వల్ల నిద్ర బాగా పడుతుంది. బెల్లీ ఫ్యాట్ పెరగదు.

స్నానం చేయడం :
రాత్రి నిద్రించడానికి ముందు స్నానం చేయడం వల్ల బాగా నిద్రపడుతుంది. బాడీ రిలాక్స్ అవుతుంది. బాడీ మెటబాలిక్ లెవల్స్ పెరగడంతో బరువు తగ్గించే రేటు పెగరుతుంది.



Click it and Unblock the Notifications