For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డేంజరస్ డెంగ్యూ జ్వరంను నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్

|

విపరీతమైన ఎండల తర్వాత వచ్చే వర్షాకాలం శరీరానికీ, మనసుకీ ఎంతో హాయిగా ఉంటుంది. తొలకరి జల్లు చిందికే మట్టివాసన అనిర్వచనీయమైన ఆనందాన్ని కలుగజేస్తుంది. ఈ ఆనందాన్ని పూర్తిగా పొందాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఎంతో అవసరం. వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం ఇలా సీజన్‌ ఏదైనా ప్రజల్ని పలు రకాల వ్యాధులు చుట్టుముడుతూనే ఉంటాయి.

సహజంగానే సీజన్‌ మారినప్పుడు జలుబు, దగ్గు, తుమ్ములు, వాంతులు, నీళ్ల విరేచనాలు, టైఫాయిడ్‌, మలేరియా, డెంగ్యు, మెదడువాపు లాంటి వ్యాధులు సంభవిస్తాయి. ఇవన్నీ కూడా నీరు కలుషితం కావడం కారణంగానే సంభవిస్తాయన్నది యదార్థం. నిల్వ ఉన్న నీటిలో బ్యాక్టీరియా, ఫంగస్‌ వ్యాప్తి చెందుతాయి. అందుకని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

డేంజరస్ డెంగ్యూ జ్వరంను నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్

ఈగలు వాలిన ఆహార పదార్థాలను, శీతల పానీయాలను తీసుకోకూదని వైద్యులు చెప్తున్నారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం చాలా మందిచింది. దోమకాటు వల్ల డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, మెదడువాపు వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలి.

ప్రతి ఏడాది వర్షాకాలంలో.. డెంగ్యూ ఫీవర్ చాలా వేగంగా, ఎక్కువగా వ్యాపిస్తుంది. డెంగ్యూ అన్ని వయసుల వాళ్లపై దుష్ర్పభావం చూపుతుంది. తక్కువ ఇమ్యునిటీ లెవెల్ ఉన్నవాళ్లలో.. ఇది మరింత ఎక్కువ దుష్ర్పభావం చూపుతుంది. వర్షపు నీళ్ల వల్ల దోమలు, క్రిములు, కీటకాలు ఎక్కువగా వస్తాయి. ఈడిస్ ఈజిప్టై దోమ వల్ల ఇన్ఫెక్షన్ ఒకరి ద్వారా మరొకరికి వ్యాపిస్తుంది.

డేంగ్యూ నుండి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా..?

అయితే.. ఈ డెంగ్యూ వ్యాధి లక్షణాలను గుర్తించిన వెంటనే అలర్ట్ అవ్వాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అయితే.. మొదటి దశలో ఉన్నప్పుడు కొన్ని హోం రెమిడీస్ ని ఫాలో అవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. డెంగ్యూని ఎఫెక్టివ్ గా తరిమికొట్టవచ్చు.

వేపాకు

వేపాకు

కొన్ని వేపాకులు తీసుకుని వాటిని ఉడికించాలి. అవి చల్లారిన తర్వాత.. రోజంతా ఆ నీటిని తాగుతూ ఉండాలి. ఇది.. ఇమ్యునిటీ లెవెల్ ని మెరుగు పరిచి.. బ్లడ్ ప్లేట్ లెట్ లెవెల్స్ ని పెంచుతుంది.

బొప్పాయి ఆకులు

బొప్పాయి ఆకులు

పచ్చి బొప్పాయి ఆకులు తీసుకుని గ్రైండ్ చేయాలి. రసం వడకట్టి.. ప్రతి రోజూ ఒక టీ స్పూన్ తీసుకోవాలి. ఇది.. బ్లడ్ ప్లేట్ లెట్స్ ని ఊహించని రీతిలో పెంచుతుంది.

డెంగ్యు జ్వరంతో బాధపడుతున్నారా?ఐతే ఇవి తినండి!

దానిమ్మ జ్యూస్

దానిమ్మ జ్యూస్

దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే .. బ్లడ్ ప్లేట్లెట్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి రోజుకి రెండుసార్లు దాన్నిమ్మ జ్యూస్ తాగడం వల్ల డెంగ్యూ నివారించవచ్చు.

 బొప్పాయి జ్యూస్

బొప్పాయి జ్యూస్

రోజుకి ఒక గ్లాస్ బొప్పాయి జ్యూస్ తాగడం వల్ల డెంగ్యూ జ్వరాన్ని తరిమికొట్టవచ్చు. ఎక్కువ మోతాదులో విటమిన్ సీ ఉండటం వల్ల ఇమ్యూన్ ని మెరుగుపరుస్తుంది.

ఆరంజ్ జ్యూస్

ఆరంజ్ జ్యూస్

డెంగ్యూ ఫీవర్ తో పోరాడటానికి ఆరంజ్ జ్యూస్ తాగితే మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఆరంజ్ జ్యూస్ లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి డెంగ్యూ వైరస్ ని నివారించడానికి రోజూ ఆరంజ్ జ్యూస్ తాగాలి.

ఉసిరి

ఉసిరి

ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. జ్యూస్ రూపంలో లేదా ఫ్రూట్ రూపంలో తీసుకోవడం వల్ల ఇమ్యునిటీ లెవెల్ పెరుగుతుంది. వేగంగా.. డెంగ్యూ ఫీవర్ తగ్గుతుంది. పసుపు

అలోవెరా జ్యూస్

అలోవెరా జ్యూస్

అలోవెరా ఎమినో యాసిడ్స్ పెంచి, బ్లడ్ ప్లేట్లెట్ లెవెల్స్ ని పెంచుతుంది. డెంగ్యూ ఫీవర్ బారిన పడినవాళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ముందు బ్లడ్ ప్లెట్లెట్స్, ఎమినో యాసిడ్స్ పెంచుకునే ప్రయత్నం చేయాలి.

తులసి

తులసి

కొన్ని తులసి ఆకులు తీసుకుని నములుతూ ఉండాలి. ఇది ఇమ్యునిటీని పెంచి.. వైరల్ ఇన్ఫెక్షన్స్ ని నివారిస్తాయి.

డెంగ్యూ మహమ్మారిని గుర్తించే 10 లక్షణాలు

పసుపు

పసుపు

పసుపు న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్. అర టీస్పూన్ పసుపును గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తీసుకోవడం వల్ల.. ఇమ్యునిటీ లెవెల్ పెరగడంతో పాటు.. శరీరంలో మలినాలను తొలగిస్తుంది.

మెంతులు

మెంతులు

మెంతుల పొడిని నీళ్లలో కలుపుకుని తాగితే.. జర్వం తేలికగా తగ్గుతుంది. మంచి నిద్రపట్టడానికి సహాయపడుతుంది.

English summary

Top 10 Home Remedies for Dengue Treatment Should Not Miss

Dengue Fever: Quick Home Remedies That Actually Work! You can witness a series of patients coming in with complaints of dengue fever or dengue fever like symptoms.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more