రోజూ ఉల్లిపాయను తినడం వల్ల శరీరంలో జరిగే అద్బుత మార్పులు

Posted By:
Subscribe to Boldsky

ఉల్లిగడ్డ కోసేటప్పుడు కంట నీరుపెట్టిస్తుంది. కానీ... 'ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు'అని సామెత. ఆరోగ్యానికి ఉల్లిగడ్డ ఎంత మంచిదో చెప్పకనే చెబుతుంది ఈ సామెత. ఉల్లిగడ్డలను కోసినప్పుడు వాటిలో ఉండే ఎంజైమ్స్ విడుదలవుతాయి. వాటితోపాటుగా ఘాటై సల్ఫర్‌ గ్యాస్ కూడా బయటికి వస్తుంది. ఇదే కళ్లకు చిరాకు కలిగించి కన్నీరు పెట్టిస్తుంది. కొన్ని శతాబ్దాలుగా ఈ ఉల్లిగడ్డలు మన ఆహారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

కూరగాయల్లో ఉల్లిపాయను రారాజు అని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఉల్లిపాయ లేని వంటకం అంటూ ఉండదు. ప్రతి వంటలోనూ ఉల్లిరుచి, ఘాటు తగిలితేనే.. ఆ వంటకానికి సరైన ఫ్లేవర్..టేస్ట్ వస్తుంది. అందుకే.. ఇండియన్స్ చాలా ఎక్కువగా ఉల్లిపాయలను ఉపయోగిస్తారు.

ఉల్లిపాయలేకుండా ఇండియన్స్ ఉండగలరా ? అంటే సాధ్యం కాదు. ఇందులో విభిన్నమైన రుచే కాదు.. అత్యంత ఎక్కువ పోషకాలు.. అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఉల్లిపాయలో మినిరల్ (క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సెలీనియం మరియు ఫాస్పరస్, మెగ్నీషియం, క్రోమియం), ఫైబర్, విటమిన్ సి, బి6, బయోటిన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధులకు ఉపశమనం కలిగిస్తాయి. అందుకే.. ఉల్లిపాయను పూర్వకాలం నుంచి ఉపయోగిస్తూ వస్తున్నాం.

అయితే.. ప్రస్తుత కాలంలో ఉల్లిపాయ అంటే.. కేవలం రుచి కోసం వంటకాల్లో ఉపయోగిస్తాం అనుకుంటారు. కానీ.. మన పూర్వీకులు ఉల్లిపాయను ఔషధంగా ఉపయోగించేవాళ్లు. ఉల్లిపాయల్లో ప్రాధానంగా క్య్యుర్సిటిన్ అనే యాంటీఆక్సిడెంట్స్ అనేక వ్యాధులను నివారిస్తాయి. బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడంలో ప్రొస్టేట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, చిన్న చిన్న గాయాలు, పుండ్లు, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలను తగ్గించడానికి ఉల్లిపాయనే ఉపయోగించేవాళ్లు. అయితే ఉల్లిపాయలు రోజూ ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది అని నిరూపించే.. బెన్ఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది:

హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది:

ఉల్లిపాయను రోజూ తినడం వల్ల కొలెస్ట్రాల్ మరియు ట్రై గ్లిజరైడ్స్ ను ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ కాంపౌండ్ నేచురల్ బ్లడ్ థిన్నర్ గా సహయాపడుతుంది. ప్లేట్ లెట్ ను తగ్గడాన్ని హార్ట్ టాక్ కు కారణమయ్యే ధమనుల్లో ప్లాక్ ను నివారిస్తుంది.

శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది:

శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది:

ఉల్లిపాయల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శ్వాసనాళాల కండరాలను రిలాక్స్ చేస్తుంది. ఆస్త్మా, బ్రొంకైటిస్ సమస్యలను నివారిస్తుంది. దగ్గు, జలుబు, ఫ్లూ, స్నీజింగ్, రన్నీ నోస్ నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఫుడ్ పాయిజన్ సమస్యలను నివారిస్తుంది:

ఫుడ్ పాయిజన్ సమస్యలను నివారిస్తుంది:

ఉల్లిపాయల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాక్షన్ ఆహారలత వచ్చే అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుంది. మైక్రోబయల్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. ఉల్లిపాయల్లో ఉండే ఫైటో కెమికల్స్ గ్యాస్ట్రిక్ అల్సర్ ను నివారిస్తుంది.

 మలబద్దకం నివారిస్తుంది:

మలబద్దకం నివారిస్తుంది:

ఉల్లిపాయల్లో సోలబుల్ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. రోజూ పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల మలబద్దకం తగ్గుతుంది.

టీబి తగ్గిస్తుంది:

టీబి తగ్గిస్తుంది:

ఉల్లిపాయలో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు , యాంటీ మైక్రోబయల్ లక్షణాలు టీబికి కారణమయ్యే మైకోబ్యాక్టీరియమ్ నాశనం చేస్తుంది. ఉల్లిపాయల్లో యాంటీ ట్యుబర్క్యులర్ ఎఫెక్ట్ కలిగి ఉంటుంది. పచ్చి ఉల్లిపాయలకు కొద్దిగా సాల్ట్ చేర్చి తినడం వల్ల మరిన్ని ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు.

బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ను పెంచుతుంది:

బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ను పెంచుతుంది:

పచ్చి ఉల్లిపాలను తినడం వల్ల బ్రెస్ట్ మిల్క్ ఉత్పత్తి పెరుగుతుంది. పాలిచ్చే తల్లుల్లో పాలు పడనప్పుడు రోజూ పచ్చి ఉల్లిపాయలు తినడం ఉత్తమం. మీల్స్ తో లేదా సలాడ్స్ , సాడ్వించ్ రూపంలో తీసుకోవచ్చు.

బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది:

బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది:

ఉల్లిపాయల్లో క్యాలరీలు..సోడియం..తక్కువగా ఉండటం వల్ల, జీర్ ఫ్యాట్ కారణంగా రక్తనాళాల్లో రక్తస్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది. అంటే రక్తాన్ని పల్చగా రక్తనాళాల్లో ప్రసరించేలా చేస్తుంది. దాంతో హైబ్లడ్ ప్రెజర్ రిస్క్ తగ్గిస్తుంది. పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల ఇది ఒక గ్రేట్ హెల్త్ బెనిఫిట్.

డిటాక్సిఫై చేస్తుంది:

డిటాక్సిఫై చేస్తుంది:

రోజూ పచ్చి ఉల్లిపాయ ముక్కలను తినడం వల్ల శరీరంలో హానికరమైన టాక్సిన్స్ ను బయటకు నెట్టేస్తుంది. ఇది రక్తాన్ని ప్యూరిఫై చేస్తుంది. రక్తం హెల్తీగా మార్చుతుంది.

యాంటీ క్యాన్సర్ లక్షణాలున్నాయి:

యాంటీ క్యాన్సర్ లక్షణాలున్నాయి:

పచ్చి ఉల్లిపాయల్లో ఫైటో కెమికల్స్ , ట్రై సల్ఫైడ్స్, సిపాయినే మరియు క్యుర్సిటిన్ వంటిని రక్తాన్ని పల్చగా మార్చడంలో దాంతో పాటు ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో ఇందులోని యాంటీ క్యాన్సర్ లక్షణాలు గ్రేట్ గా సహాయపడుతాయి.

జీర్ణ సమస్యలను నివారిస్తుంది:

జీర్ణ సమస్యలను నివారిస్తుంది:

పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల జీర్ణ సమస్యలను నివారించుకోవచ్చు. ఆకలి తగ్గడం, డిస్పెప్సియా, స్టొమక్ అప్ సెట్ గాల్ బ్లాడర్ డిజార్డర్స్ వంటివి తగ్గించుకోవచ్చు.

అనీమియా నివారిస్తుంది:

అనీమియా నివారిస్తుంది:

ఉల్లిపాయల్లో ఉండే ఐరన్ కంటెంట్ అనీమియాను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. మీడియం సైజ్డ్ ఆనియన్స్ ను రెగ్యులర్ గా తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. ప్రతి రోజూ పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల మంచి ప్రయోజనం పొందుతారు.

బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది:

బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది:

ఉల్లిపాయలు బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి అవసరమయ్యే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ ను సరైన ట్రాక్ లోనికి తీసుకు రావడానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

English summary

What Happens When You Eat Raw Onions Every Day

Do you know what happens when you eat raw onions every day? If not, then here is something interesting. Check it out.
Story first published: Wednesday, May 24, 2017, 15:24 [IST]
Subscribe Newsletter