యోగ డే: ఏడాది పొడుగునా యోగా చేస్తే ఏం జరుగుతుంది?

Posted By: Deepti
Subscribe to Boldsky

యోగా అంటే కేవలం బరువు తగ్గటానికో, పొట్ట తగ్గించుకోడానికో చేసేది కాదు. దానికి ఇతర సంపూర్ణ లాభాలు కూడా ఉన్నాయి. ఎంతో ప్రాచీన కాలం నుంచి యోగా వాడుకలో ఉంది. పూర్వం మునులు, మహర్షులు తమ ఏకాగ్రతను పెంచుకోడానికి, మనఃశ్శాంతికి ధ్యానాన్ని ఎక్కువగా చేసేవారు.

ఈనాడు యోగాను ప్రపంచవ్యాప్తంగా అభ్యసిస్తున్నారు. ఎంతోమంది తారలు తమ ఆరోగ్యరహస్యం యోగా అని కూడా చెప్తూ వస్తున్నారు. యోగా ప్రాక్టీసు వల్ల కండరాల ఎదుగుదల, కూర్చునే విధానం సరి అవటం, మనసు ఉల్లాసంగా మారటం జరుగుతాయి. ఇంకా ఏకాగ్రత, జ్ఞాపకశక్తికి కూడా పదును పెడుతుంది. ఒకవిధంగా శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా జీవితం మొత్తంలో మార్పు వస్తుంది.

మొదట్లో మీకు కష్టమనిపించవచ్చు. ఒళ్ళునెప్పులు ఉన్నా మెల్లిగా అది మీ దినచర్యలో భాగమై మీరు ఆనందించటం మొదలుపెడతారు.

యోగా మీ శరీరాన్ని, మనసును ఉల్లాసంగా మార్చటమే కాక అనేక వ్యాధులను, ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. యోగా నేర్చుకోడానికి సరైన వయస్సు ఏంటని ఆలోచిస్తున్నారా? ఇదిగో ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ ఏడాదిపాటు యోగా క్రమం తప్పకుండా చేస్తే కలిగే మార్పులను పొందుపరిచాం. చూడండి.

ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తి మెరుగుదల

ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తి మెరుగుదల

ప్రాచీన యోగులు ఏకాగ్రత కోసం యోగాను అభ్యసించేవారని వినేవుంటారు. వారు మాత్రమే కాదు, వివిధ పరిశోధనల ప్రకారం కూడా యోగా వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగవుతాయని తేలింది.

నడుంనొప్పిని తగ్గించే మంత్రం

నడుంనొప్పిని తగ్గించే మంత్రం

మీ పని వత్తిళ్ళ వల్ల ఎక్కడికీ కదలలేక ఒకేచోట పనిచేసారనుకోండి, మీ శరీరం, ఎముకలు బిగుసుకుపోతాయి. యోగాను తరచుగా చేస్తుండటం వల్ల మీ కండరాలను వదులు చేసి, నడుంనొప్పి, మెడ మరియు చేతుల బిగువును కూడా తగ్గించి ఉపశమనం దొరికేట్లా చేస్తుంది.

సరియైన ఆహారం

సరియైన ఆహారం

యోగా మీకు రోజూ అలవాటయిపోతే, సహజంగానే మీరు ఏం తింటున్నారని మీకు అవగాహన వచ్చేస్తుంది. మీ మనసు దానంతట అదే చిరుతిళ్ళు వంటివి మానేసి, ఆరోగ్యకర జీవనం వైపు అడుగులేస్తుంది.

మానసిక వత్తిడికి మందు

మానసిక వత్తిడికి మందు

యోగా వలన మనసు శాంతంగా మారి, మానసిక ఒత్తిడిని దరిచేరనివ్వదు. పనివత్తిళ్ళు కానీ, మరేదైనా కూడా మీ వత్తిడిని పెంచే హార్మోన్లు పెరిగినప్పుడు తలనొప్పి వస్తుంది. అలాంటి సమయంలో యోగా క్రమం తప్పక చేయడం ఎంతో ఉపయోగం.

రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది

రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది

దీర్ఘశ్వాసతో కూడిన యోగా రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణ బాగున్నప్పుడు, శ్వాస సంబంధ సమస్యలు కూడా రాకుండా, రక్తపోటు సరిగా కూడా మారిపోతుంది.

అయితే ఇక ఎందుకు ఆలస్యం? రోజువారీ ఏ సులభ ఆసనాలు చేస్తే మంచిదో తెలుసుకోండి. ధ్యానం కాకుండా, రోజువారి చేయగలిగిన ప్రాథమిక ఆసనాలు ఇవిగో ;

సూర్యనమస్కారాలు ; సూర్యునికి చేతుల నమస్కారంతో మొదలుపెట్టి మెల్లిగా శరీరాన్ని అన్నిరకాలుగా వంచటం సూర్యనమస్కారాలు. దీనివల్ల శరీరం, మనస్సు విశ్రాంతి పొందుతాయి.

ప్రాణాయామం ; అనేకరకాల ప్రాణాయామాలున్నాయి- కపాలభాతి, శీతలి, భ్రామరి వంటివి. ఇవి ముఖ్యంగా శ్వాస తీసుకునే పద్ధతులు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    What Happens When You Practice Yoga Continuously For A Year?

    Listed here are a few of the changes that you can notice when you practice yoga continuously for one year. Take a look.
    Story first published: Wednesday, June 21, 2017, 9:59 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more