మీ హృదయ స్పందన, మీ ఆరోగ్యం గురించి ఏమి చెబుతుంది

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ఈరోజుల్లో, మనలో ఎక్కువమంది హృదయ స్పందనను ప్రదర్శించారు మానిటర్లను రోజంతా ఉపయోగిస్తున్నాం. కానీ మీ హృదయ స్పందన మీకు ఏమి చెబుతుందో మీకు తెలుసా? అలా మానిటర్లలో కనపడే సంఖ్యలు (అంకెలు) మీ ఆరోగ్యం గురించి ఏమైనా చెబుతున్నాయా ?

అవును, మీ హృదయ స్పందన ఎంత వేగంగా లేదా మీ హృదయ స్పందన ఎంత నెమ్మదిగా ఉండటానికి, మీరు ఏం చేస్తున్నారనేది చెప్పగలదు.

మీ హృదయ స్పందన (గుండె రేటు)ను ప్రభావితం చేసే కొన్ని విషయాలున్నాయి.

ఇది గుండెను సురక్షితంగా రక్షించే బీర్ గురూ.!

మీ హృదయ స్పందన నిమిషానికి 60 నుండి 80 మధ్యలో ఉంటే అది సాధారణమైనది. అసలు, ఒక నిమిషానికి 100 స్పందనలను కలిగి ఉంటే అది మామూలుగా ఉన్నట్లుగా భావిస్తారు. కానీ చాలా తక్కువగా లేదా చాలా ఎక్కువ ఉంటే, మీరు డాక్టర్తో సంప్రదించాలి. మీ హృదయ స్పందన గనక విశ్రాంతిని తీసుకున్నట్లయితే అది ఏం చెబుతోందో ఇక్కడ వివరించబడి ఉంది.

శారీరక శ్రమ లేకపోవడం :

శారీరక శ్రమ లేకపోవడం :

ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల నీ గుండె బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఊబకాయం మరియు పనిచేయకపోవటం వంటి ఈ రెండూ హృదయ స్పందన రేటును పెంచుతాయి. మీరు భారీగా ఉన్నప్పుడు, మీ శరీరం యొక్క అన్ని భాగాలకు రక్తం సరఫరా చేయడానికి మీ గుండె కష్టపడాలి. అంతేకాక, మరింత రక్తం పంప్ చేయవలసి వచ్చినప్పుడు గుండె వేగంగా కొడుతుంది.

ఒత్తిడి కారణంగా :

ఒత్తిడి కారణంగా :

మీరు విశ్రాంతి తీసుకునే సమయంలో, మీ హృదయ స్పందన ఎక్కువగా ఉంటే దానికి కారణం అధిక స్థాయిలో ఉన్న ఒత్తిడి కావచ్చు. మీరు దీర్ఘకాలిక ఒత్తిడి ని కలిగి ఉండటం వల్ల మీ గుండెను ఎల్లప్పుడు పరుగులు తీసేది గా చేస్తుంది.

కొన్ని డ్రగ్స్ (ఔషధాల) వాడకం వల్ల :

కొన్ని డ్రగ్స్ (ఔషధాల) వాడకం వల్ల :

కొన్ని ప్రిస్క్రిప్షన్ లోని మందులు కూడా మీ హృదయ స్పందన రేటును మార్చగలవు. కాల్షియం మందులు వాడకం వలన అవి మీ గుండెకు నిరోధకంగా మారి, మీ హృదయాన్ని విశ్రాంతిని కలగచెయ్యవచ్చు మరియు మీ హృదయ పనితీరును నెమ్మది చెయ్యవచ్చు.

థైరాయిడ్ సమస్యలు :

థైరాయిడ్ సమస్యలు :

హైపోథైరాయిడిజం హృదయ స్పందన రేటును తగ్గించగలదు. మరియు హైపర్ థైరాయిడిజం హృదయ స్పందన రేటును పెంచుతుంది. కాబట్టి, థైరాయిడ్ గ్రంధి ఎక్కువ (లేదా) తక్కువ పనితనాన్ని కలిగి ఉన్నప్పుడు, హృదయ స్పందన దాని ప్రకారం ప్రతిబింబిస్తుంది.

విద్యుత్ చర్యలో సమస్యలు :

విద్యుత్ చర్యలో సమస్యలు :

హృదయ స్పందనలో అసహజతకు గుండెలో ఉన్న విద్యుత్ చర్యలో సమస్యలు కూడా ఒక కారణం కావచ్చు. మీ గుండెలో విద్యుత్ చర్య (ఎలక్ట్రికల్ సిస్టమ్) బాగా పనిచేయడం వలన, మీ హృదయం బాగా కొట్టుకోడానికి ఇది సహాయకంగా పనిచేస్తుంది.

శరీరంలో పల్స్ రేటును నిలకడగా ఉంచే ఆహారాలు..!

డీహైడ్రేషన్ :

డీహైడ్రేషన్ :

మీ శరీరంలో ఎలక్ట్రోలైట్ (విద్యుద్వాహక లవణము) సమతుల్యం చెదిరిపోయినప్పుడు మీ గుండె రేటు పెరుగుతుంది. మెగ్నీషియం, కాల్షియం మరియు పొటాషియం వంటి ఖనిజాలు క్షీణించడం వల్ల కూడా మీ హృదయ స్పందన పెరుగుతుంది.

కాఫీ (కాఫిన్) ను ఎక్కువగా తీసుకోవడం వల్ల :

కాఫీ (కాఫిన్) ను ఎక్కువగా తీసుకోవడం వల్ల :

హృదయ స్పందనను వేగవంతం చేయడానికి కాఫిన్ హృదయ స్పందన (గుండె రేటు) ను పెంచుతుంది. ఒక ఎనర్జీ డ్రింకును (లేదా) ఒక కప్పు కాఫీ త్రాగిన తరువాత, మీరు మీ హృదయ స్పందన రేటులో ఆ వైవిధ్యంలో గల మార్పులను అనుభూతి చెందుతారు.

మధుమేహం (డయాబెటిస్) :

మధుమేహం (డయాబెటిస్) :

మీ హృదయ స్పందన రేటు ఎక్కువగా ఉండటం కూడా - మీరు మధుమేహంతో బాధపడుతారన్న సూచిక అవ్వవచ్చు. సాధారణంగా, మధుమేహం హృదయ స్పందన రేటును ప్రభావితం చేస్తుంది మరియు గుండె జబ్బు యొక్క ప్రమాదాన్ని పెంచుతుంది.

English summary

What Your Heart Rate Tells About Your Health

Today, most of us use heart rate monitors which display the readings throughout the day. But what do you know what your heart rate tells you?