For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో రోజుకు ఒక కప్పు పెరుగు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు..

|

పెరుగు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు? ప్రతి ఒక్కరికీ పెరుగు ఇష్టమే? చ‌క్క‌ని రుచి క‌లిగి ఉండే గ‌డ్డ పెరుగు అంటే చాలా మందికి ఇష్ట‌మే. కొంద‌రు భోజ‌నం చివ‌ర్లో పెరుగుతో తినందే అసలు తృప్తి చెంద‌రు. భోజనం అయిపోన‌ట్టుగానే భావిస్తారు. రకరకాల వంటకాలతో విందు భోజనం నోరూరించినా.. ఒక ముద్ద పెరుగన్నం లేకపోతే.. సంతృప్తి ఉండదు. ఏది తినాలనిపించకపోయినా.. కాస్త పెరుగన్నం తినడం వల్ల పొందే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.

కానీ కొంత‌మందికి పెరుగు కాదు క‌దా, పాలు దాని సంబంధ ప‌దార్థాలు అస్స‌లు న‌చ్చ‌వు. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఉప‌యోగాల గురించి తెలిస్తే పెరుగంటే ఇష్టం లేని వారు కూడా దాన్ని వాడేందుకు ఆస‌క్తి చూపుతారు. ఎందుకంటే దాంతో అన్ని ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

శరీరానికి శక్తినిచ్చే ఆహార పదార్థాల్లో పెరుగు ప్రధానమైనది. ఒకపూట భోజనానికి సమానమయ్యే పెరుగన్నం రెండున్నర గంటల వరకు ఆకలిని అదుపులో ఉంచుతుంది. కాబట్టి ప్రతిరోజూ కప్పు పెరుగు తీసుకుని మీ ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోండి.

100 గ్రాముల పెరుగులో శాఖహార భోజనంలో పెరుగు కీలకం. 89 శాతానికి పైగా నీటిని కలిగి ఉండే పెరుగులో నాణ్యమైన ప్రోటీన్లు, దాదాపు అన్ని రకాల ఎమినో యాసిడ్‌లు, కాల్షియం తగినస్థాయిలో లభిస్తాయి. కాబట్టి నిత్యం పెరుగును తీసుకోవడం మానకండి. ముఖ్యంగా వేసవిలో పెరుగు తినడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం..

వ్యాధినిరోధక శక్తి పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది

వ్యాధినిరోధక శక్తి పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది

రోగనిరోధక శక్తి పెరుగులో శ‌రీరానికి మేలుచేసే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అది రోగ నిరోధ‌క‌శ‌క్తిని పెంచుతుంది. శ‌రీరానికి చెడుచేసే బ్యాక్టీరియాను నివారిస్తుంది.పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియ వ్యాధినిరోధక శక్తి పెరగడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బెటర్ హెల్త్ కు సహాయపడుతుంది. పెరుగును రెగ్యులర్ గా తినడం వల్ల వైజినల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. ఇతర ఆరోగ్య సమస్యలను కూడా నివారిస్తుంది.

హెల్తీ హార్ట్

హెల్తీ హార్ట్

గుండె ఆరోగ్యం పెరుగు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎందుకంటే పెరుగుకి ర‌క్త‌పోటుని అదుపులో ఉంచే శ‌క్తి ఉంటుంది. ర‌క్త‌నాళాల్లో, శ‌రీరంలో కొవ్వు చేర‌కుండా నివారించే శక్తి పెరుగుకు ఉంటుంది.

జీర్ణ శక్తిని పెంచడంలో గ్రేట్ రెమెడీ పెరుగు

జీర్ణ శక్తిని పెంచడంలో గ్రేట్ రెమెడీ పెరుగు

జీర్ణశక్తి ఆహారం జీర్ణం కావ‌డానికి పెరుగు తోడ్ప‌డుతుంది. ఇందులో ఉన్న పోష‌కాలు జీర్ణ‌వ్య‌వ‌స్థ పనితీరుకు సహకరిస్తాయి.జీర్ణ శక్తిని పెంచడంలో గ్రేట్ రెమెడీ పెరుగు. స్టొమక్ అప్ సెట్, అజీర్తి , కడుపుబ్బరం వంటి సమస్యలను నివారిస్తుంది. రోజూ తినే ఆహారాల నుండి ప్రోటీన్స్, న్యూట్రీషియన్స్ గ్రహించడంలో పెరుగు గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో జీర్ణశక్తి పెరుగుతుంది. పోషకాల ఆరోగ్యానికి సహాయపడుతాయి.

పెరుగు ఒత్తిడిని మరియు ఆందోళను తగ్గిస్తుంది

పెరుగు ఒత్తిడిని మరియు ఆందోళను తగ్గిస్తుంది

ఒత్తిడి ఆరోగ్యాన్ని వివిధ రకాలుగా పాడుచేస్తుంది . పెరుగు ఒత్తిడిని మరియు ఆందోళను తగ్గిస్తుంది . పెరుగు వల్ల ఇది ఒక గొప్ప ప్రయోజనం . ఇది శరీరంలోపలకూడా చల్లని అనుభూతిని కలిగిస్తుంది. పెరుగు తింటే.. పొట్టలో చల్లగా ఉండటమే కాదు.. మెదుడును ప్రశాంతంగా ఉంచుతుంది. ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది.

పాలను ఇష్టపడని వారికి పెరుగు మంచి ప్రత్యామ్నాయం

పాలను ఇష్టపడని వారికి పెరుగు మంచి ప్రత్యామ్నాయం

కొంత‌మందికి పాలు, పాల వాసన అంటే స‌రిపోవు. ఇలాంటివారికి పాలలో ఉన్న లాక్టోజ్ ప్రొటీన్ అంద‌దు. కాబట్టి పెరుగునైనా తీసుకుంటే లాక్టోజ్‌ని లాక్టిక్ ఆసిడ్ రూపంలో పొంద‌వ‌చ్చు. ఇది ఆరోగ్యానికి చాలా అవసరం. పాలను ఇష్టపడని వారికి పెరుగు మంచి ప్రత్యామ్నాయం, ఇందులో పాలలో ఉన్న దాని కంటే ఎక్కువ క్యాలరీలుంటాయి. డైజెస్టివ్ మిల్క్ కు మంచి ప్రత్యామ్నాయం.

ఎముక‌ల‌ను, ప‌ళ్ల‌ను బ‌లంగా ఉంచుతాయి

ఎముక‌ల‌ను, ప‌ళ్ల‌ను బ‌లంగా ఉంచుతాయి

ఎముకల బలానికి పెరుగులో క్యాల్షియం, విటమిన్ సి, డిలు అధికంగా ఉన్నాయి. ఫాస్ప‌ర‌స్ పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ఎముక‌ల‌ను, ప‌ళ్ల‌ను బ‌లంగా ఉంచుతాయి. కాబట్టి నిత్యం పెరుగు తీసుకుంటే.. ఎముకల ఆరోగ్యానికి మంచిది.పెరుగులో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల , దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇదీ ఎముకలను మరియు దంతాలను బలంగా మార్చుతుంది.

డిసెంటరి(విరేచనాలు):

డిసెంటరి(విరేచనాలు):

మీరు డీసెంట్రీతో బాధపడుతున్నట్లైతే, పెరుగు కొద్దిగా ఉపశమనం కలిగిస్తుంది . విరేచనాలతో బాధపడే వారు మజ్జిగను ఎక్కువగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బరువు తగ్గిస్తుంది

బరువు తగ్గిస్తుంది

బ‌రువు త‌గ్గించ‌డంలో పెరుగు బాగా తోడ్ప‌డుతుంది. పెరుగులో ఉన్న క్యాల్షియం శ‌రీరంలో కార్టిసాల్ అనే స్టిరాయిడ్ హార్మోన్ ఉత్ప‌త్తిని నియంత్ర‌ణ‌లో ఉంచుతుంది. ఈ కార్టిసాల్ ఉత్ప‌త్తి ఎక్కువైనా, స‌మ‌తౌల్యం కోల్పోయినా జీవ‌న‌శైలికి సంబంధించిన వ్యాధులు హైప‌ర్ టెన్ష‌న్‌, ఒబెసిటీ లాంటివి వ‌స్తాయి. అలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే రోజూ డైట్ లో పెరుగు ఉండాల్సిందే.

స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది:

స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది:

వేసవి సీజన్ లో చర్మం త్వరగా డ్రైగా మారుతుంది. దురద కలిగిస్తుంది. పెరుగు చర్మాన్ని స్మూత్ గా మరియు సాప్ట్ గా మార్చుతుంది. పెరుగులో ఉండే విటమిన్ ఇ జింక్, ఫాస్పరస్ లు స్కిన్ కంప్లెక్షన్ ను మెరుగుపరుస్తుంది. అంతే కాదు, పెరుగును తినడం వల్ల వేసవిలో శరీరం చల్లగా ఉంటుంది. లస్సీ, లేదా ఫ్రూట్స్ మిక్స్ కర్డ్ ను ఒక కప్పు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది

English summary

Why Curd (Dahi) Is A Must-Have During Summer

Why Curd (Dahi) Is A Must-Have During Summer,Curd does not just give you that cooling effect but it has several other health benefits that makes it a must-have for summer. Listed here are a few of them.
Story first published: Saturday, May 20, 2017, 16:43 [IST]
Desktop Bottom Promotion