పసుపు & నల్లమిరియాల వల్ల కలిగే 10 ఆరోగ్యమైన ప్రయోజనాలు !

Subscribe to Boldsky

పసుపు అనేది చాలా పురాతనమైన మసాలాదినుసు, అలాగే దీనిని ఆయుర్వేద వైద్యంలో యుగాల కాలం నుంచి ఉపయోగించబడుతుంది. పసుపులో కర్కిమిన్ అనే సమ్మేళనం ఉంది, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.

మరోవైపు నల్లమిరియాలను ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు, ఇది కూడా గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కాబట్టి, పసుపు & నల్లమిరియాలను ఇలా కలిపినప్పుడు, ఇది మనకు చాలా లాభాలను అందజేస్తుంది.

ఈ పసుపులో శోథ నిరోధక, క్రిమినాశక, యాంటీఫంగల్, యాంటీబాక్టీరియల్ వంటి లక్షణాలను కలిగి ఉంది. నల్లమిరియాలు అనేవి నల్లమిరియాల గింజల నుంచి వచ్చాయి, అలా వాటంతట అవే స్వంత ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.

10 Health Benefits Of Turmeric And Black Pepper

నల్లమిరియాలు జీర్ణశక్తిని పెంచుతుంది, క్యాన్సర్తో పోరాడి నరాల సంకేతాలను నియంత్రిస్తూ జీవక్రియను పెంచడానికి దోహదపడతుంది.

కాబట్టి, ఈ పసుపు & నల్లమిరియాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో మనము ఇప్పుడు చూద్దాం.

1. నల్లమిరియాలు, పసుపు గుణాలను మరింతగా పెంచుతుంది :

1. నల్లమిరియాలు, పసుపు గుణాలను మరింతగా పెంచుతుంది :

పసుపు, దాని సహజ ఔషధ గుణాలను చాలా తక్కువ స్థాయిలో కలిగి ఉంటుంది. శరీరానికి పసుపును ఉపయోగించినప్పుడు, శరీరంలోకి శోషించబడటానికి ముందు అది జీవప్రక్రియగా అవుతుంది. నల్లమిరియాల ప్రభావం వల్ల, మీ శరీరం ఈ పసుపును సరైన రీతిలో ఉపయోగించబడటానికి అనుమతిస్తుంది.

2. నొప్పులను తగ్గిస్తుంది :

2. నొప్పులను తగ్గిస్తుంది :

నల్లమిరియాలలో ఉన్న ఒక రసాయనిక సమ్మేళన నిర్మాణం, మీ శరీరంలో TRPV1 (ట్రాన్సియంట్ రిసెప్టర్ పొటెంటియల్ వానిల్లోయిడ్ టైప్ -1) పై ఒక కన్నువేసి ఉండవచ్చు. అలాగే ఇది నొప్పులను కూడా తగ్గిస్తుంది. పసుపు & నల్లమిరియాలను కలిపి వినియోగించినప్పుడు నొప్పులను నయం చేయడంలో సహాయపడుతుంది.

3. క్యాన్సర్ నిరోధిస్తుంది :

3. క్యాన్సర్ నిరోధిస్తుంది :

పైపరిన్, కర్కుమిన్ అనే ఈ రెండూ కూడా రొమ్ము క్యాన్సర్ను నివారించే ప్రభావాన్ని కలిగి ఉన్న పాలీఫెనోల్స్ను కలిగి ఉంది. పసుపు & నల్లమిరియాలు కలిసి ఉండటం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాలను ఏర్పడనివ్వకుండా నిరోధిస్తాయి, అందువల్ల ఇవి రొమ్ము క్యాన్సర్ను సమర్థవంతంగా నివారించడంలో సహాయపడుతుంది.

4. ఊబకాయమును నియంత్రిస్తుంది :

4. ఊబకాయమును నియంత్రిస్తుంది :

పసుపు & నల్లమిరియాలు కలిసి ఉన్నందున అవి అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలోనూ, ఊబకాయం, మధుమేహం వంటి వాటితో పోరాడటానికి సహాయపడుతుంది. వీటి కలయిక మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది.

5. డయాబెటిస్ను నియంత్రిస్తుంది :

5. డయాబెటిస్ను నియంత్రిస్తుంది :

రక్తనాళాలకు నష్టము వాటిల్లడం వంటి ఇతర ఆరోగ్య సమస్యలనేవి డయాబెటిస్ వల్ల కలుగుతాయి. పసుపు & మిరియాల సమ్మేళనము ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయని ఒక రీసెర్చ్లో కనుగొనబడింది. ఆక్సీకరణ ఒత్తిడి వల్ల శరీర రక్తనాళాలు దెబ్బతినడానికి కారణమవుతుంది.

6. వాపులతో పోరాడుతుంది :

6. వాపులతో పోరాడుతుంది :

పసుపు & మిరియాల సమ్మేళనము కీళ్ళనొప్పుల వంటి శోథ రుగ్మతలను చికిత్స చేయవచ్చు ఎందుకంటే ఈ రెండూ కూడా శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉన్నాయి. అలా అవి ఇతర శోథ రుగ్మతలను కూడా చికిత్స చెయ్యగలవు.

7. శరీర బరువును తగ్గిస్తుంది :

7. శరీర బరువును తగ్గిస్తుంది :

శరీర బరువును కోల్పోవడం కోసం ఎదురు చూస్తున్న వారు, మిరియాలతో కూడిన పసుపు ఉపయోగాన్ని కలిగి ఉండాలి. నల్లమిరియాలు శరీరంలో ఉన్న క్యాలరీలను కరిగించి, జీవక్రియను పెంచుతుంది. దానితో ఈ పసుపు కలిపినప్పుడు, అది శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది.

8. కాలేయ రుగ్మతలను నిరోధిస్తుంది :

8. కాలేయ రుగ్మతలను నిరోధిస్తుంది :

పసుపులో కర్కుమిన్ అనే లక్షణం ఉంటుంది, ఇది కాలేయంలో ఉన్న వ్యర్థాన్ని బయటకు పంపే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. రక్తాన్ని వడపోసి, అందులో ఉండే విషాన్ని శరీరం నుంచి బయటకు తొలగిస్తూ బాధ్యత వహించే ఒక ముఖ్యమైన అవయవం "కాలేయం". అలా సేకరించబడిన వ్యర్ధాలు ఇక శరీరంలో లేవని 'పసుపు' నిర్ధారిస్తుంది.

9. అల్జీమర్స్ వ్యాధిని నిరోధిస్తుంది :

9. అల్జీమర్స్ వ్యాధిని నిరోధిస్తుంది :

అల్జీమర్స్ అనేది ఒక బాధాకరమైన వ్యాధి. అల్జీమర్స్ వ్యాధికి గల ప్రధాన కారణాలలో వాపు (ఇన్ఫ్లమేషన్) ఒకటని నమ్ముతారు. పసుపు, శోథ నిరోధక లక్షణాలను సమృద్ధిగా కలిగి ఉన్న కారణంగా శరీరంలో ఏర్పడే ఈ రకమైన మంటలను తగ్గించి, అల్జీమర్స్ వ్యాధిని నిరోధించవచ్చు.

10. గ్యాస్ట్రిక్ అల్సర్ను నిరోధిస్తుంది :

10. గ్యాస్ట్రిక్ అల్సర్ను నిరోధిస్తుంది :

గ్యాస్ట్రిక్ అల్సర్ వల్ల గ్యాస్ట్రిక్తో దెబ్బతిన్న శ్లేష్మపొరకు ఉపశమనమును అందించడంలో పసుపు & నల్లమిరియాల సమ్మేళనం బాగా సహాయపడుతుంది. కడుపులో పుండ్లు ఏర్పడటానికి కారణమయ్యే కొన్ని బ్యాక్టీరియాల వృద్ధిని, పసుపులో ఉండే "కర్కుమిన్" నిరోధిస్తుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    10 Health Benefits Of Turmeric And Black Pepper

    Turmeric contains anti-inflammatory, antiseptic, anti-fungal and antibacterial properties. Black pepper is derived from black peppercorns, which has its own set of health benefits. Black pepper enhances digestion and regulates nerve signals to fight cancer and boost metabolism.
    Story first published: Friday, March 23, 2018, 12:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more