For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెద్దపేగును పూర్తిగా శుభ్రపరిచే 10 గృహ చిట్కాలు

|

కాలేయం, మూత్రపిండాలు మరియు గుండె ఆరోగ్యం మీదనే ఎక్కువ శ్రద్ద చూపే మనం మరొక ముఖ్యమైన అవయవాన్ని తరచుగా మర్చిపోతుంటాము. అదే పెద్దప్రేగు. పెద్దప్రేగు ఆరోగ్యం జీర్ణక్రియకు, కడుపు సంబంధిత అనారోగ్యాలు కలుగకుండా ఉండేందుకు ప్రధానంగా దోహదపడుతుంది. కావున ఎప్పటికప్పుడు శుద్దిగా మరియు ఆరోగ్యంగా ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలి. పెద్దప్రేగు అనారోగ్యానికి గురైనా, ఏ ఇతరత్రా సమస్యల కారణంగా ప్రభావితమైనా, జీర్ణ సంబంధిత సమస్యల నుండి కాన్సర్ సమస్యల వరకు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈ వ్యాసం పూర్తిగా మీ పెద్దప్రేగును శుద్ది చేసే విధానాల గురించిన పూర్తి వివరాలను అందించే ప్రయత్నం చేస్తుంది.

పెద్దప్రేగులో ప్రధానంగా నాలుగు రకాలు ఉన్నాయి, అవి వరుసగా అవరోహణ, ఆరోహణ, విలోమ, మరియు సిగ్మోయిడ్ పెద్దప్రేగుగా ఉన్నాయి. కోలన్ లేదా పెద్ద ప్రేగును శరీరంలోనే ఒక ముఖ్యమైన అంతర్గత అవయముగా పరిగణించబడుతుంది. ఎందుకంటే శరీరం పోషకాలను, విటమిన్లను సంగ్రహించిన తర్వాత చిన్న ప్రేగు గుండా మిగిలిన ఆహారం జీర్ణమై వ్యర్ధాలను పెద్దపేగు గుండా బయటకు పంపివేస్తుంది. పెద్దప్రేగు శరీరం యొక్క pH మరియు ఎలక్ట్రోలైట్లను కూడా సమతుల్యం చేస్తుంది.

10 Home Remedies To Cleanse Your Colon Naturally

సహజసిద్దంగా మీ పెద్దపేగు శుభ్రపర్చడానికి పాటించవలసిన గృహ చిట్కాలు :

పెద్దపేగును శుభ్రపరచడం ద్వారా, మలబద్ధకం లేదా ప్రేగుల క్రమరాహిత్య పనితీరు వంటి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడంలో సహాయపడుతుంది. మరియు పెద్దప్రేగు కాన్సర్ ప్రమాదావకాశాలు కూడా తగ్గుతాయి. కాబట్టి మీ పెద్దప్రేగును ఎల్లప్పుడూ శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచుకోవలసిన అవసరం ఉంటుంది.

10 Home Remedies To Cleanse Your Colon Naturally

మీ ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండే విష పదార్ధాలను విసర్జితం చేయడం ద్వారా పెద్దపేగు పనితీరును పెంచవచ్చు. సహజ సిద్దమైన పద్దతులలో శుభ్రపరచడం ద్వారా ఎటువంటి ప్రతికూల సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవచ్చు.

ఈ సులభమైన గృహ నివారణా చిట్కాలతో సహజసిద్దంగానే మీ పెద్దప్రేగును ఎలా శుభ్రపరచుకోవచ్చో తెలుసుకోండి

1. ఉప్పునీరు లేదా సాదా నీరు

1. ఉప్పునీరు లేదా సాదా నీరు

మీ జీర్ణక్రియను నియంత్రించడంలో నీటి వనరులను పుష్కలంగా త్రాగడమనేది మీరు పాటించవలసిన ముఖ్యమైన చర్యలలో ఒకటి. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. సమర్థవంతంగా విషాన్ని బయటకు విసర్జించే ప్రక్రియలో నీరు, పెద్దప్రేగుకు సహాయపడుతుంది. కావున రోజులో 6 నుండి 8 గ్లాసుల నీటిని తీసుకోవలసినదిగా సూచిస్తుంటారు.

అదేవిధంగా, ఉప్పునీరు మలబద్ధకం మరియు ప్రేగుల అసమతుల్యత సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు గొప్ప ప్రయోజనకారిగా ఉంటుంది. అల్పాహారం తీసుకునే ముందు, సముద్రపు ఉప్పు లేదా హిమాలయన్ ఉప్పు 2 టీస్పూన్లు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిదిగా సూచించబడుతుంది. కానీ రక్తపోటు ఉన్న వ్యక్తులు మాత్రం వైద్యుని సలహామేర నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

2. ఆపిల్ సైడర్ వెనిగర్

2. ఆపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్, అనామ్లజనకాలలో మరియు యాంటీబయాటిక్ లక్షణాలలో ఉత్తమంగా ఉంటుంది. ఇది పెద్దప్రేగులో ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, అంతేకాకుండా పెద్దప్రేగును శుభ్రపరచడంలో ఉత్తమంగా పనిచేస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ అసిటోబాక్టర్ అనే బాక్టీరియంను కలిగి ఉంటుంది. ఇది జీర్ణ క్రియలు సవ్యంగా సాగడంలో మరియు మీ గట్ సరైన రీతిలో పనిచేయడంలో సహాయపడుతుంది.

3. ఫైబర్ అధికంగా గల ఆహారం

3. ఫైబర్ అధికంగా గల ఆహారం

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్ మరియు విత్తనాల వంటి మొక్క ఆధారిత ఆహారాలలో ఫైబర్ అధికంగా కనబడుతుంది. ఈ మొక్క ఆధారిత ఆహారాలు సెల్యులోజ్ మరియు ఫైబర్ నిల్వలను అధికంగా కలిగి ఉంటాయి. ఇవి మీ స్టూల్ పాసింగ్ పెంచుతాయి. అంతేకాకుండా మలబద్ధకం మరియు అతి ప్రేగుకదలికలను సైతం నియంత్రిస్తాయి. హై-ఫైబ్రోస్ మొక్క ఆధారిత ఆహారాలుగానే కాకుండా ప్రీబయోటిక్ వలె కూడా పనిచేస్తాయి. ఇవి పెద్దప్రేగులో ఆరోగ్యకరమైన బాక్టీరియాను పెంచుతాయి. కావున రోజువారీ ఆహారంలో అధిక ఫైబర్ నిక్షేపాలు ఉన్న ఆహారాలను కలిగి ఉండాలని నిర్ధారించుకోండి.

Most Read: చురకైన మెదడుకు మేత ఈ టాప్ 30 ఆహారాలే...

4. లెమన్ డిటాక్స్ జ్యూస్

4. లెమన్ డిటాక్స్ జ్యూస్

నిమ్మకాయలు విటమిన్-సి ని సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇది మీ జీవక్రియను వేగవంతం చేస్తుంది మరియు నిర్విషీకరణలో సహాయపడుతుంది. ఇది జీర్ణ రసాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడే సిట్రిక్ యాసిడ్ను కలిగి ఉంటుంది. క్రమంగా ఇది సరైన జీర్ణక్రియను చేకూర్చడంలో ఉత్తమంగా పనిచేస్తుంది. నిమ్మరసం కోలన్ ప్రక్షాళనకు ఒక డైనమిక్ మూలకాన్ని జతచేస్తుంది క్రమంగా శరీరం నుండి విషాన్ని సమర్థవంతంగా తొలగించగలదు.

5. రెసిస్టెంట్ స్టార్చ్

5. రెసిస్టెంట్ స్టార్చ్

రెసిస్టెంట్ స్టార్చ్ (పిండి పదార్ధాలు), ఒక ఫైబర్ లాగా పనిచేసే కార్బోహైడ్రేట్. ఉదాహరణకు బియ్యం, బంగాళాదుంపలు, చిక్కుళ్ళు, ఆకుపచ్చ అరటిపండ్లు మరియు తృణ ధాన్యాలు. ఇవి గట్ మైక్రోఫ్లోరాను పెంచుతుంది, క్రమంగా ఆరోగ్యవంతమైన పెద్దప్రేగును ప్రోత్సహిస్తుంది. క్యాన్సర్ నివారణా పరిశోధనలలో ఒక అధ్యయనం ప్రకారం, రెసిస్టెంట్ స్టార్చ్, ప్రేగులను ఆరోగ్యకరంగా ఉద్దీపనగావించడం ద్వారా కూడా పెద్దప్రేగు కాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలదు.

6. ముడి కూరగాయల రసాలు మరియు స్మూతీస్

6. ముడి కూరగాయల రసాలు మరియు స్మూతీస్

ముడి కూరగాయల రసాలు, పెద్దప్రేగును ప్రధానంగా ప్రక్షాళన చేయడంలో ఎంతగానో సహాయం చేస్తాయి. కూరగాయల రసాలు మరియు స్మూతీస్ వంటి వాటిలో జీర్ణ ప్రక్రియలో సహాయపడే ఫైబర్ మరియు పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ ముడి కూరగాయల రసం నుండి ఫైబర్ మరియు పోషక పదార్ధాలను సంగ్రహించడానికి, పల్ప్ మరియు తోలు కూడా ఉండేలా చూసుకోవడం మంచిది. ఉదాహరణకు, మీ పెద్దప్రేగును శుభ్రపరచడానికి క్యారట్లు, బీట్రూట్, దోసకాయ, టమాటో లేదా బచ్చలి కూర వంటివి తీసుకోవడం ఉత్తమం.

Most Read: నా పెళ్లాం నగ్నంగా పడుకుంటుందిగానీ సెక్స్ చేయవనివ్వదు, ఫోర్ ప్లే, మందు సర్వ్ చేయాలి #mystory241

7. కలబంద జ్యూస్

7. కలబంద జ్యూస్

కలబంద రసం మందపాటి ఆకృతిని కలిగి ఉంటుంది. ఇది శరీరంలో వ్యర్థ పదార్థాల ప్రభావాలను సమతుల్య పరచడం ద్వారా పెద్దపేగు క్రియలను పెంచుతుంది. క్రమంగా శరీరం నుండి విషాన్ని పూర్తి స్థాయిలో తొలగిస్తుంది. తద్వారా పెద్దపేగును శుభ్రపర్చడంలో సహాయపడుతుంది.

8. ప్రోబయోటిక్స్

8. ప్రోబయోటిక్స్

మీ పెద్దప్రేగును శుభ్రపరచడానికి మరో సహజ సిద్దమైన మార్గం మీ ఆహార ప్రణాళికలో ప్రోబయోటిక్స్ చేర్చడం. పెరుగు, ఊరగాయలు మరియు ఇతర పులియబెట్టిన ఆహారాలు వంటి ప్రోబయోటిక్ ఆహారాలు జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను పునరుద్ధరిస్తాయి. ఇది మీ పెద్దప్రేగును ఆరోగ్యకరమైన స్టేజిలో ఉంచడంలో ఉత్తమంగా సహాయపడుతుంది. మరియు క్రమబద్ధతను ప్రోత్సహించడం, వాపును నిరోధించడం ద్వారా పెద్దప్రేగును శుభ్రపరచగలదు.

9. ఫ్లాక్స్ సీడ్స్ (అవిశ గింజలు)

9. ఫ్లాక్స్ సీడ్స్ (అవిశ గింజలు)

జీర్ణశయాంతర ప్రేగులలో వాపును నివారించడానికి, ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి. ఈ అవిసె గింజలు మీ పెద్దప్రేగును సహజ సిద్దంగా శుభ్రపరచుకోవడంలో సహాయపడే అత్యుత్తమ ప్రభావాలను కలిగి ఉంటాయి. అదనంగా, ఫ్లాక్స్ సీడ్స్ లో ఫైబర్ మరియు అనామ్లజనకాల ఉనికి మీ ప్రేగు కదలికలను పెంచుతాయి. తద్వారా శరీరం నుండి వ్యర్థాలు, విష పదార్ధాలు పూర్తిగా తొలగింపబడుతాయి.

Most Read: ధనవంతులు కావాలంటే.. ఇంట్లో ఈ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లో పెట్టుకోకూడదు..!!

10. హెర్బల్-టీ

10. హెర్బల్-టీ

అల్లం, కాయేన్నె పెప్పర్ మరియు వెల్లుల్లి వంటి మూలికలు అనారోగ్యకరమైన ఫైటో-కెమికల్స్ కలిగిఉంటాయి. ఇవి అనారోగ్యకరమైన బాక్టీరియాను పెద్దప్రేగులో పెరుగకుండా పూర్తిస్థాయిలో అణచివేయగలదు. అల్లం, వెల్లుల్లి లేదా కాయేన్నె పెప్పర్-టీ రోజులో ఒకసారి తీసుకోవడం మీ పెద్దప్రేగును శుభ్రపరచడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. మీరు పెద్దప్రేగు శుభ్రపరిచే సమయంలో, అది శరీరంలో క్రామ్పింగ్ మరియు ఎలెక్ట్రోలైట్ అసమానతలకు దారితీయవచ్చు. అధిక రక్తపోటు సమస్యలతో భాదపడే వ్యక్తులు సోడియం తీసుకోవడం తక్కువగా ఉండాలి, కావున ఉప్పునీటి డిటాక్స్ జోలికి వెళ్ళకండి.

English summary

10 Home Remedies To Cleanse Your Colon Naturally

Cleansing your colon is essential as it helps treat health issues like constipation or irregular bowel movements and also reduce the risk of colon cancer. A natural colon cleanse with remedies like aloe vera juice, raw vegetable juice, probiotics, herbal tea, apple cider vinegar, etc., are effective to detoxify your body naturally.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more