For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మడమ నొప్పిని తగ్గించే 10 న్యాచురల్ హోం రెమెడీస్

By Mallikarjuna
|

హీల్ పెయిన్ (మడమల నొప్పి లేదా మడమ నొప్పి) ఎందుకు వస్తుంది? మన రోజూ నార్మల్ గా చేసే పనుల వల్లే మడమల నొప్పులు వస్తుంటాయి. ముఖ్యంగా వయస్సైన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. మడమల నొప్పికి మరో కారణం హీల్ బోన్ (మడమ వద్ద ఉండే ఎముక)అరగడం, గాయపడటం వల్ల కూడా మడమ నొప్పులు వస్తుంటాయి. మడమ నొప్పి వచ్చినప్పుడు అది పాదం వెనుక దిగువ భాగంలో లేదా మడమకు వెనుక బాగంలో నొప్పి వారవచ్చు.

హీల్ పెయిన్ కు ముఖ్యమైన కారణం గాయాలవ్వడం, స్ప్రెయిన్స్, ఫ్రాక్చర్స్, ఓవర్ వెయిట్, సరైన షూష్ ధరించకపోవడం వల్ల హీల్ పెయిన్ వస్తుంది. నొప్పి మాత్రమే కాదు, వాపు, చీకాకు, ఆర్చ్ బోన్ బలహీనంగా మారడం వంటి లక్షణాలు కనబడుతాయి.

అప్పుడప్పుడు కొన్ని మెడికల్ కండీషన్ వల్ల , మడమలు సలపడం, ఆర్థ్రైటిస్ వల్ల కూడా ఈ మడమల నొప్పులు వస్తుంటాయి. ఈ నొప్పి మరింత బాధాకరమైనది. మడమ నొప్పితో బాధపడే వారి కోసం 10 న్యాచురల్ హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి.ఇవి నొప్పిని తగ్గించి, ఇన్ స్టాంట్ గా ఉపశమనం కలిగిస్తాయి.

1. ఎప్సమ్ సాల్ట్

1. ఎప్సమ్ సాల్ట్

ఎప్సమ్సాల్ట్ మడమల నొప్పులను నుండి తక్షణం ఉపశమనం కలిగిస్తుంది. ఎప్సమ్ సాల్ట్ లో ఉండే మెగ్నీషియం సల్ఫేట్ నొప్పి, వాపు మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది.

మూడు టేబుల్ స్పూన్ల ఎప్సమ్ సాల్ట్ ను అరబకెట్ నీటిలో వేసి కాళ్ళను అందులో డిప్ చేయాలి. 20 నిముషాల పాటు అలాగే ఉంచడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది. పాదాలు డ్రైగా మారుతాయి కాబట్టి, వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.

2. పసుపు

2. పసుపు

పసుపు ఒక అద్భుతమైన హోం రెమెడీ, ఇది నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. పసుపులో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల నొప్పిని న్యాచురల్ గా తగ్గిస్తాయి.

ఒక కప్పు పాలను వేడి చేసి, అందులో ఒక టీస్పూన్ పసుపు కలపాలి. తర్వాత అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి రోజులో రెండు మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

3. స్ట్రెచ్చింగ్ వ్యాయామం

3. స్ట్రెచ్చింగ్ వ్యాయామం

స్ట్రెచ్చింగ్ ఎక్సర్ సైజ్ వల్ల నొప్పి వెంటనే తగ్గుతుంది. ఇది మజిల్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది, కండరాల సలుపు తగ్గిస్తుంది. తర్వాత నొప్పి కూడా తగ్గిస్తుంది.

వట్టి కాళ్ళతో నిలబడాలి మరియు గోడకు కొంచెం దూరం నుండి నిల్చోవాలి

రెండు చేతులను గోడకు వ్యతిరేఖంగా పెట్టి నెట్టాలి.

గోడను నెట్టేటప్పుడు ఒక అడుగు ముదుకు, ఒక అడుగు వెనకకు మార్చుకోవాలి. అలా మార్చుకునేటప్పుడు హీల్ స్ట్రెచ్ చేయాలి. ఇలా 30 సెకండ్లు చేస్తే మడమల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

4. మసాజ్

4. మసాజ్

మడమలకు మసాజ్ చేయడం మరో చికిత్స, నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఇది మజిల్స్ ను రిలాక్స్ చేస్తుంది. ప్రెజర్ తగ్గిస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది.

నొప్పి ఉన్న చోట ఆవనూనెను అప్లై చేసి సున్నితంగా మాసాజ్ చేయాలి. 10 నిముషాలు రెగ్యులర్ మసాజ్ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

5. అల్లం

5. అల్లం

మజిల్ స్ట్రెయిన్ వల్ల మడమల నొప్పి కనుక ఉంటే , అల్లం, తీసుకోవాలి. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, పెయిన్ రిలీవింగ్ లక్షణాలున్నాయి. ఇది నొప్పిని, మరియు ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.

రోజుకు మూడు సార్లు అల్లం టీ తాగడం వల్ల మరియు వంటల్లో అల్లం చేర్చుకోవడం వల్ల మడమల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

6. యాపిల్ సైడర్ వెనిగర్

6. యాపిల్ సైడర్ వెనిగర్

హీల్ పెయిన్ తగ్గించడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ గ్రేట్ రెమెడీ. ఇందులో యాంటీయాక్సిడెంట్స్, యాంటీఇన్ఫ్లమేటీర గుణాలు ఎక్కువ, ఇది పెయిన్ తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఒక కప్పు నీళ్ళ పాన్ లో పోసి, అందులోనే 1/4 యాపిల్ సైడర్ వెనిగర్ ను కలపాలి.

వేడి చేసి, అందులో ఒక కాటన్ క్లాత్ ను డిప్ చేయాలి.

ఎక్సెస్ వాటర్ పిండేసి, నొప్పి ఉన్న చోట బట్టతో కాపడం పెట్టాలి. 20నిముషాలు కాపడం పెడితే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

7. కేయాన్ పెప్పర్

7. కేయాన్ పెప్పర్

కేయాన్ పెప్పర్ లో స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇందులో ఉండే స్ట్రాంగ్ క్యాప్ససిన్ కాంపౌండ్ న్యాచురల్ పెయిన్ రిలీఫ్ గా పనిచేస్తుంది. 15 నిముషాలు అలాగే ఉంచి , తర్వాత వార్మ్ వాటర్ తో కడగాలి.

8. ఫ్లాక్ సీడ్ ఆయిల్ :

8. ఫ్లాక్ సీడ్ ఆయిల్ :

ఫ్లాక్ సీడ్ ఆయిల్లో ఆల్ఫాలినోలిక్ యాసిడ్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల ఇన్ఫ్లమేషన్ మీద పోరాడుతుంది. హీల్ పెయిన్ తగ్గించడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

వేడి నీటిలో కొన్ని చుక్కల ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ కలపాలి, తర్వాత అందులో ఒక క్లాత్ డిప్ చేయాలి. ఈ క్లాత్ ను మడమ చుట్టు కాస్త టైట్ గా చుట్టాలి. ఒక గంట సేపు అలాగే ఉంచాలి.

9. బేకింగ్ సోడ

9. బేకింగ్ సోడ

బేకింగ్ సోడాలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది కాలి మడమల వద్ద క్యాల్షియం విచ్చిన్నం కాకుండా నేరుగా హీల్ బోన్ మీద పనిచేస్తుంది. ఇది నేరుగా నొప్పిని లేదా వాపును తగ్గిస్తుంది.

అరటీస్పూన్ బేకింగ్ సోడాను వాటర్లో మిక్స్ చేసి మడమల మీద అప్లై చేసినా ఉపశమనం కలుగుతుంది.

10. ఎసెన్షియల్ ఆయిల్స్

10. ఎసెన్షియల్ ఆయిల్స్

రోజ్మెర్రీ, ల్యావెండర్ వంటి ఎసెన్సియల్ ఆయిల్స్ లో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు అధికం. ఇవి న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ లా పనిచేసి, నొప్పిని తగ్గిస్తాయి.కొన్ని చుక్కల ఎసెన్సియల్ ఆయిల్స్ ను వేడి చేసి మడమ మీద అప్లై చేసిసున్నితమైన మసాజ్ చేస్తే నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

English summary

10 Natural Home Remedies For Heel Pain

Often, heel pain also arises due to certain medical conditions including gout, heel spurs, arthritis, etc., which is more painful. People who suffer from heel pain are aware of the intensity of pain and discomfort that they go through. So, here are 10 natural home remedies for heel pain to ease your pain and bring an instant relief.
Desktop Bottom Promotion