For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెడనొప్పి నివారణ కోసం పాటించవలసిన 10 సాధారణ ఇంటి చిట్కాలు !

|

మీరు ఎక్కువగా మెడనొప్పితో బాధపడుతున్నారా? గాయం వల్ల గానీ, సరైన స్థితిలో మెడను ఉంచకపోవడం వల్ల మీకు మెడ మరియు భుజాలపై తీవ్రమైన నొప్పి ఎదురవుతుంది.

మెడను కూడా ఒక క్లిష్టతరమైన గొంతు సంబంధ వెన్నెముక నిర్మాణంగా సూచిస్తారు. ధమనులు, చర్మం, కండరాలు, థైరాయిడ్ గ్రంధి, శోషగ్రంధులు మరియు సిరల వంటి నిర్మాణాలను మెడ లోపలి భాగంలో కలిగి ఉన్నవి. కాబట్టి, ఈ నిర్మాణాలలో ఏదైనా సమస్యలు గానీ ఉన్నట్లయితే, అది మెడనొప్పికి కారణం కావచ్చు.

మెడ దగ్గర ఒత్తిడి, కంప్యూటర్ ముందు ఎక్కువగా కూర్చుని పనిచేయడం వల్ల, సరైన రీతిలో పడుకోకపోవటం, వ్యాయామ సమయంలో మెడ పట్టేయడం వంటి ఎంత కారణాలవల్ల మెడనొప్పి అనేది కలుగుతుంది. మెడనొప్పికి గల ఇతర కారణాలు పోషకాహార లోపం, గర్భాశయంలో స్పోండిలోసిస్, నరాలపై ఒత్తిడి కలగటం వంటివి మొదలైనవి కావచ్చు.

మీరు తీవ్రమైన మెడనొప్పి గాని ఉంటే, మీరు మీ డాక్టర్ను కలిసి పరీక్ష చేయించుకోండి. అయితే, మీకు మెడ నొప్పి అనేది సరైన స్థితిలో లేకపోవడం వల్ల (లేదా) వ్యాయామాలను చెయ్యడం వల్ల గానీ సంభవించినట్లయితే, మీ మెడనొప్పి కోసం ఈ సాధారణమైన చిట్కాలను ప్రయత్నించవచ్చు.

1. మెడ నొప్పి కోసం వ్యాయామాలు :

1. మెడ నొప్పి కోసం వ్యాయామాలు :

కొన్ని మెడ వ్యాయామాలు మెడనొప్పి నుండి మీకు ఉపశమనమును కలిగిస్తాయి. సౌకర్యవంతమైన వ్యాయామాలను గానీ చేస్తే మీ మెడలో గట్టిదనాన్ని తగ్గిస్తుంది.

మీ తలను నెమ్మదిగా ముందుకు వెనుకకు మరియు ఒక వైపు నుండి మరొక వైపు తిప్పుతూ ఉండాలి.

ఈ వ్యాయామాన్ని ప్రతిరోజూ 15 నిముషాలపాటు ప్రతి కొన్ని గంటల వ్యవధిలో పునరావృతం చేయాలి.

2. ఆపిల్ సైడర్ వెనిగర్ :

2. ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్లో, మెడనొప్పికి ఉపశమనమును కలుగచేసే శక్తివంతమైన శోథ నిరోధక లక్షణాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉన్నాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్లో ఒక టవల్ను నానబెట్టి, మెడ యొక్క ప్రభావిత ప్రాంతంలో ఉంచండి.

కొన్ని గంటల పాటు దానిని అలానే వదిలివేయండి, ఈ విధంగా మీరు ప్రతిరోజూ చేయండి.

3. హైడ్రో థెరపీ :

3. హైడ్రో థెరపీ :

మెడనొప్పిని నివారించడానికి ఇది మరొక సమర్థవంతమైన ఇంటి చిట్కా. మీరు ఒక షవర్ కింద నిలబడి ఉండటం వల్ల, బాగా నొప్పి కలిగి ఉన్న మెడ ప్రాంతం - నీటి పీడనానికి గురవ్వడం వల్ల మీ మెడనొప్పిని బాగా తగ్గిస్తుంది.

షవర్ క్రింద 4 నిమిషాల పాటు గోరు వెచ్చని నీటితో పైన చెప్పిన విధానాన్ని మీరు అనుసరించండి.

ఆ తర్వాత 60 సెకన్లపాటు చల్లటి నీటితో ఇలా చేయడం.

ఇలా 5 సార్లు రిపీట్ చేయండి.

4. విశిష్టమైనవి ఆయిల్స్ (నూనెలు) :

4. విశిష్టమైనవి ఆయిల్స్ (నూనెలు) :

విశిష్టమైనవి ఆయిల్స్ అనగా పెప్పర్మిట్ ఆయిల్, తులసి ఆయిల్ మరియు లావెండర్ ఆయిల్స్ వంటివి మీ మెడనొప్పికి చాలా ఉత్తమంగా పనిచేస్తాయి. ఈ నూనెలు శోథ నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి మరియు కండరాలకు ఉపశమనమును అందించే ప్రభావాన్ని కలిగి ఉంటాయి.

పైన చెప్పిన అన్ని విశిష్టమైనవి నూనెలను కలిపి ఒకే మిశ్రమంగా చేయండి.

ఇందులో కొన్ని చుక్కల గోరు వెచ్చని ఆలివ్-నూనెను కలపాలి.

ఇలా తయారైన ఆయిల్తో మీరు కొన్ని నిమిషాల పాటు మెడ మీద మసాజ్ చేయాలి

5. వేడి నూనెతో మసాజ్ :

5. వేడి నూనెతో మసాజ్ :

మెడనొప్పికి చికిత్స కోసం మరొక సమర్థవంతమైన పరిష్కారం వేడి నూనెతో మసాజ్ చేయడం.

దానితో నెమ్మదిగా మీ మెడ ప్రాంతాన్ని మసాజ్ చేయడం వలన రక్త ప్రవాహమును మెరుగుపరచి, మీ మెడనొప్పిని తగ్గిస్తుంది.

ఒక టేబుల్ స్పూన్ ఆవ-నూనెను (లేదా) కొబ్బరి-నూనె వేడెక్కేలా చేసిన తర్వాత కొద్ది నిమిషాల పాటు మీ మెడను మసాజ్ చేయండి.

6. ఐస్ ప్యాక్ :

6. ఐస్ ప్యాక్ :

చల్లని ఉష్ణోగ్రతలో తయారైన మంచు గడ్డ (ఐస్) అనేది మీ మెడనొప్పిని తగ్గించి, ఆ నొప్పి నుండి మీకు త్వరగా ఉపశమనాన్ని కలిగిస్తుంది, ఎందుకంటే, మెడనొప్పిని పోగొట్టే అతి సులభమైన నివారణలలో మంచు గడ్డ (ఐస్) ఒకటి.

ఒక టవల్లో కొన్ని మంచు గడ్డలను ఉంచండి.

దీనిని నొప్పిని కలిగి ఉన్న ప్రాంతంలో మూసివేసి అలానే ఉంచండి.

అలా దానిని 15 నిముషాల పాటు వదిలివేయండి మరియు దీన్ని ప్రతి 3 గంటల ఒకసారి రిపీట్ చేయండి.

7. పసుపు :

7. పసుపు :

పసుపు, మీ మెడనొప్పికి చికిత్సను అందించే మరొక అద్భుతమైన పదార్ధం. ఇది శోథ-నిరోధక మరియు యాంటీ-బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇవి బాధను పోగొట్టి, వాపును తగ్గిస్తాయి.

ఒక గ్లాసు పాలలో ఒక టీస్పూన్ పసుపు పొడిని కలపండి.

ఈ మిశ్రమాన్ని బాగా వేడి చేసి, చల్లార్చండి.

దానికి అదనంగా కొన్ని చుక్కల తేనెను జోడించండి. ఇలా తయారైన మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు చెప్పున త్రాగాలి.

8. ఎప్సోమ్ ఉప్పు :

8. ఎప్సోమ్ ఉప్పు :

ఎప్సోమ్ ఉప్పులో మెగ్నీషియం ఉంటుంది, ఇది శరీరంలోని పలు ఎంజైమ్లను నియంత్రిస్తుంది. ఇది కూడా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు కండర ఉద్రిక్తతలను మరియు ఒత్తిడులను తగ్గిస్తుంది.

మీ స్నానపు తొట్టిని వెచ్చని నీటితో నింపి, దానికి ఎప్సోమ్ ఉప్పు జతచేయండి.

10-15 నిముషాల పాటు మీలో దానిలో బాగా నానిపోవాలి.

9. కయేన్నె పెప్పర్ (కారపు పొడి) :

9. కయేన్నె పెప్పర్ (కారపు పొడి) :

కయేన్నె పెప్పర్లో, క్యాప్సైసిన్ అని పిలువబడే సమ్మేళనమును కలిగి ఉంది, ఇది మెడనొప్పిని తగ్గించడంలో సహాయపడే శోథ-నిరోధక మరియు అనాల్జేసిక్ లక్షణాలను కలిగి ఉంటుంది.

2 టేబుల్ స్పూన్ల వెచ్చని ఆలివ్ నూనెలో, 1 టీస్పూన్ కారపు పొడిని జతచేయండి.

ఆ తర్వాత వీటన్నింటినీ బాగా కలపండి, అలా తయారైన మిశ్రమాన్ని మీ మెడ భాగంలో పూతగా పూయండి.

 10. అల్లం :

10. అల్లం :

అల్లం, మెడ ప్రాంతంలో రక్త ప్రసరణను పెంచే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది.

అల్లం ముక్కను కట్ చేసి, ఒక కప్పు వేడి నీటిలో కలపండి.

దానికి కాస్తా తేనెను జోడించి, ఆ నీటిని త్రాగండి.

కొన్ని రోజుల వరకూ ఈ అల్లం-టీని ప్రతిరోజూ త్రాగాలి.

English summary

10 Simple Home Remedies For Neck Pain

10 Simple Home Remedies For Neck Pain,Neck pain can be caused by an injury, or a poor posture that results in sharp or dull ache in the neck and shoulder. Read on to know the home remedies for neck pain.
Story first published:Thursday, March 1, 2018, 11:34 [IST]
Desktop Bottom Promotion