Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
అలసటను అధిగమించటానికి అందుబాటులో ఉన్న 11 రకాల ఉత్తమమైన ఆహార పదార్థాలు
మన పూర్వీకులు ఆ రోజుల్లో ప్రతినిత్యం ఎక్కువగా కష్టించి సుదీర్ఘంగా పనిచేయడంతో వలన బాగా నీరసించిపోయి అలసిపోయినట్లుగా కనబడేవారు. అలసట అనే భావనకు దోహదపడే పలు అంశాలు చాలానే ఉన్నాయి. అందులో మీరు అలసటగా ఉండ
మన పూర్వీకులు ఆ రోజుల్లో ప్రతినిత్యం ఎక్కువగా కష్టించి సుదీర్ఘంగా పనిచేయడంతో వలన బాగా నీరసించిపోయి అలసిపోయినట్లుగా కనబడేవారు. అలసట అనే భావనకు దోహదపడే పలు అంశాలు చాలానే ఉన్నాయి. అందులో మీరు అలసటగా ఉండుట, బలహీనంగా ఉండుట మరియు శక్తి లేకపోవడం వంటి సాధారణ భావాలను కూడా కలిగి ఉంటుంది.
మీరు ఏదైనా కష్టమైన పనిని గానీ చేస్తే, మీ శరీరం అలసిపోతుంది, ఎందుకంటే దానికి విశ్రాంతి అనేది చాలా అవసరం మరియు దానికదే మరామత్తులను కూడా చేసుకుంటుంది. అసలు ఈ ఆయాసానికి మరియు అలసిపోవటానికి మధ్య తేడా ఏమిటంటే, ఆయాసం ఎక్కువ సేపు ఉండదు (లేదా) మీకు తిరిగి శక్తి కూడా త్వరగా లభిస్తుంది; మీరు అలసిపోయినప్పుడు మాత్రమే విశ్రాంతిని తీసుకుంటారు.
ముఖ్యంగా చెప్పాలంటే, మన జీవనశైలిని ప్రభావితం చేసే కారకాలు, మానసిక సమస్యలు మరియు వైద్య పరిస్థితులు వంటి ఇతర అంశాలన్ని కూడా అలసటకు దారితీస్తుంది.
మీ శరీరం ఒక రోజు మొత్తంలో ఎదురయ్యే అలసటతో పోరాడటానికి, మరియు మీ శరీరానికి అవసరమైన ఇంధనమును భర్తీ చేయడానికి ఈ క్రింద చెప్పబడిన 11 రకాల ఆహారపదార్థాలు అవసరమవుతాయి, అవేమిటో మీరు కూడా చూడండి.

1. చియా విత్తనాలు :
చియా విత్తనాలు మన శారీరక పనితీరును మరియు ఓర్పును మెరుగుపరుస్తాయి. ఇది 2.5 గ్రాముల ప్రోటీన్ను మరియు 5 గ్రాముల ఫైబర్ను కలిగి ఉండి, అలసటతో పోరాడో ముఖ్యమైన ఆహారమని చెప్పవచ్చు. చియా గింజలలో "ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను" కలిగి ఉంటాయి, ఇవి తాపజనక కారకాలతో పోరాడి, మీ కండరాలు నూతనమైన తేజస్సును మరియు బలిష్టంగాను ఉన్నట్లుగా మీకు అనుభూతిని కలిగిస్తాయి.

2. గుడ్లు :
ప్రతిరోజూ తీసుకునే అల్పాహారంలో గుడ్లు అనేవి బాగా ప్రాచుర్యం పొందాయి, ఎందుకంటే అవి శరీరానికి మంచి శక్తిని అందించే వనరుగా ఉన్నది. గుడ్లు, మానవ శరీర కండరాలను నిర్మించటానికి సహాయపడే మాంసకృత్తులను, ఐరన్ మరియు జింక్ లతో నింపబడి, మీకు పూర్తిస్థాయిలో నిరంతరంగా శక్తిని సరఫరా చేసేదిగా ఉంటుంది. ఇందులో అధిక మోతాదులో ఉన్న B-విటమిన్లు మన శరీరానికి కావలసిన శక్తిని ఉత్పత్తి చెయ్యడానికి అవసరమైన సహాయమును చేస్తుంది.

3. అరటి :
అరటిలో ఎక్కవ శాతం పొటాషియంతో నిండినది, దానిని మీ శరీరము శక్తిగా మార్చబడి, కొంచెం-కొంచెంగా మీ శరీరానికి ఉపయోగిస్తుంది. ఈ పండులో గ్లూకోజ్, ఫ్రూక్టోజ్ మరియు సుక్రోజ్ వంటి సహజమైన చక్కెర పదార్థాలు కూడా ఉన్నాయి.

4. చిలగడదుంపలు :
ఈ చిలగడదుంపలలో అధికమైన భాగంగా ఉన్న టన్నుల టన్నుల శక్తి - కార్బొహైడ్రేట్తో స్థిరీకరించే విధంగా ఉండి, మీ శరీరానికి రోజువారీగా అవసరమయ్యే శక్తిలో 25 శాతం వరకూ సమకూరుస్తుంది. ఈ చిలగడదుంపలు పొటాషియంను కలిగి ఉంటాయి, అందువల్ల ఇవి మరింత ఒత్తిడిని తగ్గించి - మీలో ఉన్న శక్తిని పెంచుతాయి. ఇది నిజంగా శక్తిని అందించే గొప్ప ఆహారపు వనరుగా ఉన్నది!

5. గ్రీన్-టీ :
ఒక ప్రత్యేకమైన పనికి సంబంధించిన ఒత్తిడి కారణంగా అలసటతో పోరాడేందుకు, మీకు గ్రీన్-టీ అనేది చాలా సహాయపడుతుంది. ఇందులో ఉన్న "పాలీఫెనోల్స్" మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించి, మానసిక దృష్టిని మెరుగుపరుస్తాయి, అలా మీలో ఉన్న శక్తి స్థాయిలను పెంచుతుంది. ఇది జీవక్రియను పెంపొందించడంలో ప్రసిద్ధి చెందినది గానూ మరియు అలసటకు చెందిన చాలా రకాల సమస్యల నుండి మిమ్మల్ని కాపాడుతుంది.

6. పాలకూర :
అలసటతో పోరాడుతున్నప్పుడు పాలకూర (బచ్చలికూర) ఒక అద్భుతమైన ఆహారమని తెలుసుకోవటంలో మీరు ఆశ్చర్యపోవచ్చు. బచ్చలికూర ఐరన్ తో ఉంటుంది, ఇది శరీరంలో ఉన్న కణాలకు ఎక్కువ ప్రాణవాయువును అందిస్తుంది. ఇది పొటాషియం, మెగ్నీషియం, విటమిన్స్ B మరియు C లతో పూర్తిగా కలిసి ఉన్నందున, ఇది ఒక అద్భుతమైన శక్తిని కలిగి ఉన్న ప్యాక్ రూపంలో ఉంటుంది.

7. గుమ్మడికాయ విత్తనాలు :
మీరు మీ శక్తి యొక్క స్థాయిలను పెంచాలనుకుంటే, గుమ్మడికాయ గింజలను తినవచ్చు. గుమ్మడికాయ గింజలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, జింక్, ఇనుము మరియు ఇతర విటమిన్లు మరియు ఖనిజాలతో పూర్తిగా నిండి, అలసటతో పోరాటానికి సహాయపడతాయి. ఈ విత్తనాలు మీకు ఆరోగ్యకరమైన నిద్రను ప్రోత్సహిస్తాయి మరియు వాటిలో అధిక స్థాయిలో ఉన్న 'ట్రిప్టోఫాన్' అనే మూల పదార్థం కారణంగా, మీరు ఎక్కువగా ప్రభావితం కాబడిన - భావోద్వేగాల అలసటతో పోరాటం చేస్తాయి.

8. ఓట్స్ అనే బియ్యపు పిండి :
ఓట్మీల్ అనేది అలసటను పోగొట్టుకునే విషయంలో చాలా చక్కని ఆహారం. ఇది కార్బోహైడ్రేట్లను కలిగి ఉండటం వల్ల మీ శరీరంలో ఉన్న కండరాలకు మరియు మెదడుకు కావలసిన శక్తిని అందించేందుకు మీ శరీరంలోనే నిల్వ కాబడి ఉంటాయి. ఈ ఆహార పదార్థంలో చాలా రకాల విటమిన్లు మరియు ఖనిజాలు ఉండటంచేత, ఉదయాన్నే తీసుకొనే అల్పాహారం గా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. మీ శరీరానికి రోజువారీ కావలసిన శక్తిని అందించేందుకు ఈ ఓట్-మీల్స్ లో కొన్ని నట్స్ ను అదనంగా జత చేయండి.

9. పెరుగు :
పెరుగులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ మరియు ప్రోబయోటిక్స్ను కలిగి ఉండటం చేత, ఇది అలసటతో చాలా దీర్ఘకాలం పోరాడుతుంది. ప్రోబయోటిక్స్ అని పిలువబడే చురుకైన సమ్మేళనాలను ఇది కలిగి ఉంది, ఇవి దీర్ఘకాల అలసటకు కారణమైన సిండ్రోమ్ యొక్క లక్షణాలను త్వరగా శాంత పరచగలవు. గరిష్ట లాభాలను పొందడానికి గ్రీక్ పెరుగును వినియోగించండి.

10. క్వినోయా :
క్వినోయా (quinoa) లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ వంటి అన్ని రకాల పోషక పదార్ధాలను కలిగి ఉండటం వల్ల మీరు అలసటగా వున్నప్పుడు మిమ్మల్ని మీరే శక్తివంతులుగా చేసుకోగలరు. ఇందులో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను తక్కువ మొత్తంలో కలిగి ఉండి మరియు మోనోసంత్సాటితడ్ కొవ్వులను ఎక్కువ మోతాదులో కలిగి ఉంటుంది. మీ శరీరానికి అవసరమైన తొమ్మిది రకాల మంచి అమైనో ఆమ్లాలను ఈ క్వినోయాలో కలిగి ఉన్నాయి.

11. నట్స్ :
అలసటతోనూ మరియు ఆకలితోనూ పోరాడటానికి నట్స్ అనేవి చాలా ఉత్తమమైన ఆహారాలలో ఒకటి. మీ ఆహారంలో వివిధ రకాల గింజలను చేర్చడం వల్ల ఆరోగ్యకరమైన పోషకాలు మీకు తగిన శక్తిని అందిస్తుంది. మెరుగైన ఫలితాల కోసం బ్రెజిల్ నట్స్, ఆల్మండ్, వాల్నట్, కాష్యూస్ (జీడిపప్పు) మరియు హాజెల్ నట్స్ వంటి వాటిని మీరు కూడా ప్రయత్నించండి.



Click it and Unblock the Notifications