For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్లాక్-టీ తాగడం వల్ల మీరు ఊహించని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు !

ప్రపంచవ్యాప్తంగా అత్యధికమందిచే సేవింపబడే పానీయము 'టీ' మరియు చాలామంది ప్రజలు ఒక కప్పు టీని తాగడం ద్వారా వారి రోజును ప్రారంభిస్తారు. ఇది మీలో ఉన్న భావాలను మేల్కొనేలా చేసి మీ మానసిక పరిస్థితిని రిఫ్రెష్

|

ప్రపంచవ్యాప్తంగా అత్యధికమందిచే సేవింపబడే పానీయము 'టీ' మరియు చాలామంది ప్రజలు ఒక కప్పు టీని తాగడం ద్వారా వారి రోజును ప్రారంభిస్తారు. ఇది మీలో ఉన్న భావాలను మేల్కొనేలా చేసి మీ మానసిక పరిస్థితిని రిఫ్రెష్ చేస్తుంది. టీకి బాగా అలవాటు పడిన వ్యక్తులు ఒక కప్పు టీని తాగకుండా ఉదయాన్నే తమ పనులను ఏమీ మొదలు పెట్టలేరు.

మార్కెట్లో చాలా రకాల టీలు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని రకాలు అస్సాం-టీ, డార్జిలింగ్-టీ, నీలగిరి-టీ మరియు కేరళ-టీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది వ్యక్తులు గ్రీన్-టీ, వైట్-టీ, ఓలాంగ్-టీ మరియు బ్లాక్-టీ వంటి వివిధ రకాల టీలను తాగడం ద్వారా ఆనందాన్ని పొందుతారు.

బ్లాక్-టీ అనేది ఎక్కువమంది ప్రజలచే ఆదరణ పొందిన అత్యంత సాధారణమైన పానీయం. ఎందుకంటే బ్లాక్-టీలో "పాలిఫినోల్స్" అని పిలవబడే యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉన్నాయి, ఇవి వివిధ రకాలైన క్యాన్సర్ కారణాల నుండి మనుషులను రక్షిస్తాయి.

బ్లాక్-టీ అనేది పులియబడి మరియు ఆక్సిడైజ్ చెయ్యబడినందువల్ల ఇది ఒకే రంగును, రుచిని మరియు ఆరోగ్య ప్రయోజనాలను మనకు కలుగజేస్తుంది. బ్లాక్-టీలో గల చాలా రకాలు అత్యంత ప్రజాదరణ పొందినవే, ఎందుకంటే అవి అసంఖ్యాకమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అందులో కొన్నింటిని ఈ దిగువున చూపబడ్డాయి.

1. అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది :

1. అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది :

బ్లాక్-టీ కొన్ని రకాల క్యాన్సర్ కారకాలతో, ముఖ్యంగా అండాశయ క్యాన్సర్తో పోరాడే సామర్ధ్యమును కలిగి ఉంది. బ్లాక్-టీలో ఉండే థెఫ్లవిన్స్ అనే యాంటీఆక్సిడెంట్ పాలిఫేనోల్స్ అండాశయ క్యాన్సర్ కణాల విస్తరణను నిరోధించగలవు. అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడే బ్లాక్-టీను త్రాగటం ప్రారంభించండి.

2. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది :

2. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది :

బ్లాక్-టీలో ఫ్లేవోన్స్, థెఫ్లవిన్స్ మరియు గాలిక్ ఆమ్లాలు ఉంటాయి, ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. ఇది LDL (చెడు) కొలెస్ట్రాల్ను తగ్గించి మరియు HDL (మంచి) కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. రోజుకు 3 కప్పుల బ్లాక్-టీని త్రాగటం వల్ల, ధమనుల్లో రక్తప్రవాహానికి అడ్డుపడే ఆటంకాలను (కరోనరీ హార్ట్ డిసీజ్) ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెప్పబడింది.

3. డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది :

3. డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది :

డయాబెటిస్ అనేది ఒక తీవ్రమైన జీవక్రియ రుగ్మత కాబట్టి దానికి ప్రారంభదశల్లోనే చికిత్సను చేయాలి. బ్లాక్-టీను త్రాగటం వల్ల, 2- రకం డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎందుకంటే ఇందులో కాటెచిన్స్ మరియు థెఫ్లేవిన్లు మానవ శరీరాన్ని మరింత ఇన్సులిన్ సెన్సిటివ్గా చెయ్యడంలో సహాయపడతాయి మరియు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే "బీటా-సెల్స్ను" బాగా పనిచేసేలా చేస్తాయి.

4. రోగనిరోధక శక్తిని పెంచుతుంది :

4. రోగనిరోధక శక్తిని పెంచుతుంది :

శరీర వ్యవస్థలో దెబ్బతీసే ఆక్సిజన్-రాడికల్స్ను బయటకు పారద్రోలే శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్లను బ్లాక్-టీ కలిగి ఉంది. ఈ ఆక్సిజన్ రాడికల్స్ DNA యొక్క ఉత్పరివర్తనకు మరియు దాని సాధారణ పనితీరును అడ్డుకుంటాయి. బ్లాక్-టీ అనేది ఈ ఆక్సిజన్-రాడికల్స్ను బయటకు పంపివేస్తుంది, తద్వారా శరీర సాధారణ కణాల పనితీరును పునరుద్ధరించడానికి సహాయపడుతుంది అలా మన శరీరంలో రోగనిరోధకతను పెంచుతుంది.

5. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

5. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

వయసు పెరిగేకొద్దీ ఎముకలలో ఉండే బలం క్రమంగా క్షీణించడం మొదలవుతుంది. బ్లాక్-టీను ప్రతిరోజు త్రాగటం వల్ల ఎముకల యొక్క సాంద్రతను గణనీయంగా పునరుద్ధరించవచ్చు, ఎందుకంటే బ్లాక్-టీ అనేది కాల్షియంకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇది ఫ్రాక్చర్స్ ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు బోలు ఎముకల వ్యాధిని కూడా నిరోధిస్తుంది.

6. నరాల-వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది :

6. నరాల-వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది :

ఈ వ్యాధి ఎక్కువగా వృద్ధులను ప్రభావితం చేస్తుంది, అయితే ఈ రోజుల్లో అధిక స్థాయి ఒత్తిడి కారణంగా యువకులు కూడా దీని బారిన పడుతున్నారు. ఒక పరిశోధనలో భాగంగా, బ్లాక్-టీ అనేది మెదడుపై న్యూరోప్రొటెక్టివ్ ప్రభావాన్ని కలిగి ఉన్న పాలీఫెనోల్స్ను కలిగి ఉంది, అందువలన ఇది నరాల (పార్కిన్సన్స్) వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

7. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ :

7. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ :

ఒక ఆరోగ్యకరమైన గౌట్, వివిధ వ్యాధులు మరియు రుగ్మతల నుండి మిమ్మల్ని రక్షించగలదు. మీరు తరచుగా బ్లాక్-టీ త్రాగటం వల్ల, గౌట్లో ఉండే వివిధ రకాల సూక్ష్మజీవుల స్థాయిని పెంచి, వాటి పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. బ్లాక్-టీలో ఉండే పాలీఫెనోల్స్ గౌట్లో ఉండే హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడం వల్ల, మీ కడుపులో అల్సర్ను రానివ్వకుండా చేస్తుంది.

8. బరువును తగ్గించడంలో సహాయపడుతుంది :

8. బరువును తగ్గించడంలో సహాయపడుతుంది :

ఊబకాయం అనేది వివిధ రకలా ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమవుతుంది, అందువల్ల ఊబకాయాన్ని నిరోధించడానికి, మీరు బ్లాక్-టీను త్రాగటం చాలా అవసరం. బ్లాక్-టీ అనేది శోథమును ప్రేరేపించే జన్యువులను తగ్గించడం ద్వారా విసెరల్ అనే కొవ్వును తగ్గిస్తుంది. మీరు బరువు కోల్పోవాలన్న ఆలోచన కలిగి ఉన్నట్లైతే బ్లాక్-టీను త్రాగండి.

9. ఆస్తమాను తగ్గిస్తుంది :

9. ఆస్తమాను తగ్గిస్తుంది :

మీరు ఆస్తమా మరియు ఇతర శ్వాస సంబంధితమైన సమస్యలతో బాధపడుతున్నట్లయితే, బ్లాక్-టీను త్రాగడం వల్ల మీరు చాలా మంచి పరిష్కారాన్ని పొందుతారు. కొన్ని పరిశోధనా అధ్యయనాలలో, బ్లాక్-టీని త్రాగటం వల్ల అందులో ఉండే ఫ్లవనాయిడ్స్ ఆస్తమా నుంచి ఉపశమనమును కలిగిస్తాయి.

10. ఒత్తిడి తగ్గిస్తుంది :

10. ఒత్తిడి తగ్గిస్తుంది :

నేటి జీవన విధానంలో, మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే "ఒత్తిడి" అనేది మన రోజువారీ జీవితంలో ఒక భాగంగా మారింది. కాబట్టి, ఒత్తిడి మరియు ఆందోళన నుండి ఉపశమనమును పొందటానికి బ్లాక్-టీను త్రాగండి, ఇది శరీరంలో ఒత్తిడికి సంబంధించిన హార్మోన్ల పనితీరును మందగించేలా చేసి మీ నరాలకు విశ్రాంతిని కలుగజేస్తుంది.

11. మీ దంతాల ఆరోగ్యానికి చాలా మంచిది :

11. మీ దంతాల ఆరోగ్యానికి చాలా మంచిది :

మీ దంతాలపై దాడి చేసే కావిటీస్ను నివారించడానికి బ్లాక్-టీ ఎంతో ప్రముఖమైన పాత్రను పోషిస్తుంది. బ్లాక్-టీలో ఉండే యాంటీబ్యాక్టీరియ మరియు యాంటీ ఆక్సిడెంట్ల వంటి లక్షణాలు మీ దంతాలను కావిటీస్, దంత ఫలకము మరియు దంతక్షయం నుండి కాపాడుతుంది.

English summary

11 Impressive Health Benefits Of Black Tea You Haven't Heard Of

People all over the world enjoy drinking different kinds of tea like green tea, white tea, oolong tea and black tea. Black tea is rich in antioxidants called polyphenols that protect the human cells from different types of cancers. Black tea is fermented and oxidized which gives it an unique colour, flavour and health benefits..
Story first published:Tuesday, March 6, 2018, 18:21 [IST]
Desktop Bottom Promotion