For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ విషయాలు తెలిశాక బుద్ధి ఉన్న వారు ఎవరూ కూల్ డ్రింక్స్ తాగరు.. మద్యంలోనూ కలుపుకోరు

|

ఎండలు మండిపోతున్నాయి. చాలా మంది కూల్‌డ్రింక్స్‌ను విపరీతంగా తాగుతున్నారు. వేసవిలో చల్ల చల్లని కూల్ డ్రింక్స్ దాహం తీరుస్తాయని, శక్తినిస్తాయని చెప్పి ఎడా పెడా వాటిని తాగుతున్నారు. కానీ వాటి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్‌ను పట్టించుకోవడం లేదు.

ఆసక్తి చూపుతారు

ఆసక్తి చూపుతారు

వేసవిలో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం ఎక్కువమంది శీతల పానీయాలు తాగడానికి ఆసక్తి చూపుతారు. యువకులైతే పార్టీ ఏదైనా బిర్యానీతో పాటు కూల్‌డ్రింక్‌ ఉండా ల్సిందేనంటారు. నలుగురు స్నేహితులు ఒకచోట కలిస్తే కబుర్లలో శీతల పానీయం భాగమైపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కూల్‌డ్రింక్‌ తాగడం ఫ్యాషనైపోయింది.

లీటర్‌కు పైగా తాగే వాళ్లూ

లీటర్‌కు పైగా తాగే వాళ్లూ

రోజూ లీటర్‌కు పైగా తాగే వాళ్లూ ఉన్నారు. శీతల పానీయాలు ఎక్కువగా తాగితే ప్రాణాంతక రోగాలు తప్పవు. ఎందుకంటే వాటి లోనూ కల్తీ జరుగుతోంది. కల్తీరాయుళ్లు బ్రాండెడ్‌ సీసాల్లో రసాయనాలతో తయారు చేసిన పానీ యాలు నింపి అమ్మేస్తున్నారు. ఈ క్రమంలోనే కూల్ డ్రింక్స్‌ను ఎక్కువగా తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కెఫీన్ ఎక్కువగా ఉంటుంది

కెఫీన్ ఎక్కువగా ఉంటుంది

కూల్‌డ్రింక్స్‌లో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనం నిత్యం తీసుకునే మోతాదుకు మించరాదు. మించితే గుండె కొట్టుకునే వేగం అసాధారణ రీతిలో ఉంటుంది. బీపీ పెరుగుతుంది. కాల్షియం తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో గుండె సమస్యలు తలెత్తి హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక కూల్ డ్రింక్స్‌ను మితి మీరి తాగరాదు.

అదనపు క్యాలరీలు.. కిడ్నీలపై ఒత్తిడి

అదనపు క్యాలరీలు.. కిడ్నీలపై ఒత్తిడి

కూల్‌డ్రింక్స్‌ను అధికంగా సేవించడం వల్ల వాటిలో ఉండే చక్కెర శరీరానికి అదనపు క్యాలరీలను ఇస్తుంది. దీంతో బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కూల్‌డ్రింక్స్‌ను తాగడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. అవి కూల్‌డ్రింక్స్‌లో ఉండే పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపేయడానికి నీటిని ఎక్కువగా వాడుకుంటాయి. దీంతో డీహైడ్రేషన్ బారిన పడి, నీరసం చెందుతారు. ఒక్కోసారి మూర్ఛపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

దంతాలకు చేటు

దంతాలకు చేటు

కూల్ డ్రింక్స్‌లో ఉండే యాసిడ్స్, చక్కెర దంతాలకు చేటు చేస్తాయి. దంతాలపై ఉండే ఎనామిల్ పొర కరిగిపోతుంది. దంత క్షయం ఏర్పడుతుంది. దీంతో దంతాలు సెన్సిటివ్‌గా మారి చల్లని, వేడి పదార్థాలు తింటే తట్టుకోలేకపోతారు.

మద్యం తాగే వారు

మద్యం తాగే వారు

చాలా మంది మద్యం సేవించే వారు కూల్ డ్రింక్స్‌ను ఆల్కహాల్‌లో కలుపుకుని సేవిస్తారు. అలా చేస్తే లివర్, కిడ్నీలపై అధికంగా భారం పడుతుంది. దీంతో అవి కాలక్రమేణా పనిచేయకుండా పోతాయి. కూల్ డ్రింక్స్‌ను కాకుండా కొబ్బ‌రి నీళ్లు, స‌హ‌జ‌సిద్ధంగా ఇంట్లో త‌యారు చేసుకునే శీత‌ల పానీయాలు, నిమ్మ ష‌ర్బ‌త్‌, పండ్ల ర‌సాలు తాగితే వేసవి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

ఎముకలు కూడా కూడా గుడ్డులాంటివే

ఎముకలు కూడా కూడా గుడ్డులాంటివే

కూల్‌డింకులో ఒక కోడిగుడ్డు వేయడం.., కొద్దిసేపటికి కోడిగుడ్డుకి రంధ్రాలు పడడం..., వెంటనే లోపలి సొన అంతా బయటికి రావడం... చాలా పాఠశాలల్లో సైన్సు పాఠాల్లో భాగంగా ఈ యాక్టివిటీని చూపిస్తున్నారు. మన ఎముకలు కూడా దాదాపుగా కోడిగుడ్డు షెల్ లాంటివే. అందుకే కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తాగేవాళ్లకు ఆస్టియోపోరొసిస్ అవకాశాలూ ఎక్కువగా ఉంటాయి.

ఎముకల్ని దెబ్బతీస్తాయి

ఎముకల్ని దెబ్బతీస్తాయి

కూల్‌డ్రింకుల్లో ఎముకల్ని దెబ్బతీసే పదార్థాలు కూడా ఉన్నాయని అనేక అధ్యయనాల్లో బయటపడింది. తరచూ ఈ శీతల పానీయాలు తాగేవారిలో ఆస్టియోపోరొసిస్ వ్యాధి తలెత్తే అవకాశం ఉందని పేర్కొంటున్నారు పరిశోధకులు. ఎముకలు, ప్రత్యేకించి తుంటి ఎముకలు త్వరగా విరిగిపోయేందుకు ఈ పానీయాలు కారణమవుతున్నాయని హెచ్చరిస్తున్నారు.

సన్నబడిపోతున్నాయి

సన్నబడిపోతున్నాయి

ఆస్టియోపోరొసిస్ అనేది అంగవైకల్యంతో పాటు ఒక్కోసారి ప్రాణాపాయానికీ దారితీయవచ్చు. అయితే ఈ దుష్ప్రభావానికి గురయ్యే పురుషులతో పోలిస్తే మహిళలు నాలుగు రెట్లు అధికంగా ఈ సమస్యకు లోనవుతున్నారు. రోజూ మూడు కన్నా మించి ఈ కూల్‌డ్రింక్స్ తీసుకునేవారిలో ఎముకల సాంద్రత తగ్గి, సన్నబడిపోతున్నాయి.

ఫాస్ఫారిక్ ఆమ్లం దెబ్బతీస్తుంది

ఫాస్ఫారిక్ ఆమ్లం దెబ్బతీస్తుంది

కాల్షియం, విటమిన్ డి, పండ్లు, కూరగాయలు బాగానే తీసుకున్నప్పటికీ ఈ పానీయాల దుష్ప్రభావం ఎముకల మీద పడుతుందని చెబుతున్నారు బోస్టన్‌లోని టఫ్ట్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు డాక్టర్ టాకర్. ఎముకలను కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంలు గట్టిపరుస్తాయి. కూల్‌డ్రింక్స్‌లో ఉండే ఫాస్ఫారిక్ ఆమ్లం వీటన్నింటినీ దెబ్బతీస్తుందంటున్నారాయన. అందుకే కూల్‌డ్రింక్స్ తాగడాన్ని తగ్గించి రోజూ పాల ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చని సూచిస్తున్నారు.

నకిలీ కూల్‌డ్రింక్‌ తయారీ ఇలా

నకిలీ కూల్‌డ్రింక్‌ తయారీ ఇలా

కంపెనీలు శీతల పానీయాలను కార్చనైజ్డ్‌ వాటర్‌, చక్కెర లేదా తీపినిచ్చే పళ్ల రసాలు కలిపి తయారు చేస్తాయి. నకిలీ పానీయాలను చాక్రీన్‌, రంగులు, రసాయనాలు కలిపి తయారు చేస్తున్నారు. గ్యాస్‌ కోసం బట్టల సోడా కలిపేస్తున్నారు. ఒక్కొక్క సీసా పానీయం తయారీకి రెండు రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మార్కెట్‌లో 10 నుంచి 15 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇటువంటి పానీయాలు తాగితే కిడ్నీలు పాడయ్యే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఆల్కహాల్‌ డోసు పెంచుతూ

ఆల్కహాల్‌ డోసు పెంచుతూ

కంపెనీలు తయారు చేసే కొన్ని కూల్‌డ్రింక్స్‌లో 0.05 శాతం ఆల్కహాల్‌ ఉంటుంది. దీంతో మనిషి శరీరానికి పెద్దగా నష్టం ఉండదు. కానీ నకిలీ బ్రాండ్లలో ఆల్కహాల్‌ను ఎక్కువశాతం వినియోగిస్తు న్నారు. కార్చనేట్‌ నీటిలో ఆల్కహాల్‌ నింపి మార్కెట్‌ లోకి పంపిస్తున్నారు. ఒకసారి వీటిని తాగినవాళ్లు మళ్లీ తాగేందుకు ఇష్టపడేలా చేస్తున్నారు. వాస్త వానికి శీతల పానీయాలు మోతాదు మించి తాగితే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.

మద్యంతో కూడిన డ్రింక్స్

మద్యంతో కూడిన డ్రింక్స్

మద్యంతో కూడిన కూల్‌డ్రింక్స్‌ మరింత ప్రమాదకరం. ఇవి తాగితే 15 రకాల కేన్సర్లు వచ్చే అవకాశం ఉంది. మరికొంత మంది కల్తీరాయుళ్లు శీతల పానీయాల్లో తీపి కోసం పలు రసాయనాలు కలుపుతున్నారు. ఇటువంటి పానీయాలను నెల రోజులు వరుసగా తాగితే టైప్‌ 2 మధుమేహం రావడం ఖాయమని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీ, గ్యాస్ర్టిక్‌ సమస్యలూ వచ్చే అవ కాశం ఉందంటున్నారు. మహిళల్లో అయితే గర్భకోశ సమస్యలు వస్తాయని గైనకాలజిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు.

పాత బాటిళ్లను సేకరించి

పాత బాటిళ్లను సేకరించి

నకిలీ శీతల పానీయాల మాఫియా పలు కంపెనీలకు సంబంధించిన పాత బాటిళ్లలో తాము తయారు చేసిన ద్రవాన్ని నింపి మార్కెట్‌లో ప్రవేశ పెడుతోంది. గతంలో పోలీసులు జరిపిన దాడుల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. స్ర్కాప్‌ వ్యాపా రుల వద్ద నుంచి పాత బాటిళ్లు, పెట్‌ బాటిళ్లను సేకరించి వాటికి కొత్త లేబుల్‌ వేస్తున్నారు. చట్టానికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రముఖ బ్రాండ్లలోని ఒక అక్షరాన్ని తారుమారు చేసేస్తు న్నారు. ఎవరైనా కనిపెడితే అది తమ సొంత బ్రాండ్‌గా నమ్మిస్తున్నారు. ఈ శీతల పానీయాలను కొందరు డిస్ర్టిబ్యూటర్లు నేరుగా దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. అవి నకిలీవని తెలియక ప్రజలు ఇష్టంగా తాగుతున్నారు.

బాదం పాలలోనూ

బాదం పాలలోనూ

మార్కెట్‌లో లభించే బాదంపాలనూ నకిలీ చేసేస్తున్నారు. సాధారణంగా పాలు, బాదంపొడి, చక్కెర కలిపి బాదంపాలను తయారు చేస్తారు. కల్తీరాయుళ్లు తాము తయారు చేసే బాదంపాలకు రుచి, రంగు కోసం ఇథనాల్‌ కలిపి సీసాల్లో నింపి అమ్మేస్తున్నారు. తాగే వారికి అనుమానం రాకుండా చక్కెర శాతం ఎక్కువగా కలిపేస్తున్నారు. ఈ బాదం పాలు తాగడం వల్ల జీర్ణకోశ, మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సోడాతోనూ కష్టమే

సోడాతోనూ కష్టమే

భోజనం పూర్తవగానే చాలామంది అరుగుదల కోసమని సోడా తాగుతుంటారు. సోడాల్లోనూ నకిలీలు వచ్చేశాయి. బట్టల సోడాతో పాటు బిస్‌ఫినోల్‌-ఎ అనే రసాయనంతో సోడా తయారు చేస్తున్నారు. ఇవి తాగడమంటే రోగాలు కొనితెచ్చు కోవడమే. గుండె సంబంధిత వ్యాధులతో పాటు మధుమేహం బారిన పడటం ఖాయమని చెబుతు న్నారు. కలర్‌ సోడాలో మెథిలిమిడాజోల్‌ రసాయనం కలుపుతున్నారు. దీనివల్ల థైరాయిడ్‌ ,కేన్సర్‌ బారినపడే ప్రమాదం ఉంది.

ఊపిరితిత్తుల సమస్యలూ

ఊపిరితిత్తుల సమస్యలూ

ఊపిరితిత్తుల సమస్యలూ వస్తాయి. గతంలో ఈ రసాయనాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఎక్కడా వాడొద్దని ఆదేశాలూ జారీ చేసింది. కొందరు సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. వీటిని పరిమితిస్థాయిలో ఉపయో గించుకోవాలని కోర్టు సూచించింది. ఆ విషయాన్ని పక్కనపెట్టేసి ముంబై, ఒడిశాల నుం చి భారీగా నగరానికి తీసుకొచ్చి కూల్‌డ్రింక్స్‌లో కలుపుతున్నారు.

English summary

15 harmful effects of soft drinks you must remember

15 harmful effects of soft drinks you must remember
Story first published: Tuesday, May 15, 2018, 15:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more