For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొబ్బరినూనె వాడకం వల్ల, ఆకట్టుకునేలా ఉన్న 15 రకాల ఆరోగ్య ప్రయోజనాలు

By Lekhaka
|

కొబ్బరినూనె అనేది మనము చాలా సాధారణంగా వినియోగించే నూనెలలో ఒకటి, దీనిని అనేక రకాల ప్రయోజనాల కోసం పూర్వపు కాలము నుండి ఉపయోగిస్తున్నారు. కొన్ని ముఖ్యమైన ఆహారపదార్థాలలో ఇది చాలా గొప్ప ఆహార పదార్థంగా వర్గీకరించబడినది.

కొబ్బరినూనెలో కొన్ని రకాల కొవ్వు ఆమ్లాల యొక్క సమ్మేళనమును కలిగి ఉండటం వలన, అది మీ ఆరోగ్యంపై అనుకూల ప్రభావాలను చూపేదిగా ఉంటుంది, అలాంటి వాటిలో శరీరంలో ఉన్న కొవ్వును తోలగించటంలోనూ, మెదడు యొక్క పనితీరును మెరుగుపరచడంలోనూ మరియు ఇతర అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.

కొబ్బరినూనెను, కొబ్బరి యొక్క తెల్లని మాంసము వంటి కొవ్వు పదార్థాన్ని బలంగా పిండటం ద్వారా తయారు చేస్తారు. ఇది శరీరంలో ఉన్న ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ యొక్క స్థాయిని పెంచుతుంది మరియు చెడు కొలెస్ట్రాల్ను - మంచి కొలెస్ట్రాల్గా మార్చడంలోనూ సహాయపడుతుంది.

15 Impressive Health Benefits Of Coconut Oil

తియ్యని సువాసనను కలిగిన కొబ్బరి నూనెను, స్మూతీస్ మరియు ఇతర ఆహార పదార్థాలను వండేటప్పుడు వాడతారు. ఇందులో 84 శాతం వరకూ సంతృప్త కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది, ఇది గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది మరియు గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

కొబ్బరినూనె ఆరోగ్య ప్రయోజనాలను కలుగచేసేదిగా ప్రసిద్ధి చెందిందని మనకు తెలుసు. వాటిలో 15 రకాల ఆరోగ్య ప్రయోజనాలను గూర్చి మనము ఒకసారి చూద్దాం.

కొబ్బరి నూనె యొక్క ఆరోగ్య ప్రయోజనాలు :-

15 Impressive Health Benefits Of Coconut Oil
1. బరువు తగ్గడానికి ఇది చాలా మంచిది :

కొబ్బరినూనెలో ట్రైగ్లిజరైడ్స్ అనే సమ్మేళనం మధ్యస్థ మాధ్యమంగా ఉన్న కారణం చేత మీ శరీరంలో ఉన్న శక్తిని పూర్తిగా వినియోగించటాన్ని పెంచుతుంది, అలా మీ శరీరంలో ఉన్న అదనపు కేలరీలు కరిగించడంలోనూ సహాయపడుతుంది. ఈ నూనెలో ఉన్న కొవ్వు ఆమ్లాలు ఆకలిని తగ్గిస్తుంది, అలా మీ ఆకలిని సంతృప్తిపరచడం ద్వారా, మీరు తక్కువగా తినడానికి మరియు బరువును తగ్గించుకోడానికి బాగా సహాయపడుతుంది.

2. హానికరమైన బాక్టీరియాని చంపుతుంది :

2. హానికరమైన బాక్టీరియాని చంపుతుంది :

కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలలో సగం వరకూ దాదాపు లారిక్ ఆమ్లముతోనే నిండి ఉంటుంది. లారిక్ యాసిడ్ అనేది బాక్టీరియా, వైరస్ మరియు శిలీంధ్రాలను చంపడానికి బాగా సహాయపడుతుంది మరియు దీనిని బాహ్యంగా ఉపయోగించడం వల్ల అంటురోగాలను నిరోధించవచ్చు. అన్ని రకాల అంటువ్యాధులను దూరంగా ఉంచడానికి, మీ వంటలలో కొబ్బరినూనెను ఉపయోగించండి, అలా అని మాత్రం ఎక్కువగా వినియోగించవచ్చు.

3. కండరాల వృద్ధికి సహాయపడుతుంది :

3. కండరాల వృద్ధికి సహాయపడుతుంది :

కొబ్బరినూనెలో మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ (MCT యొక్క) ఉండటం వల్ల మీ శరీరానికి కావలసిన శక్తినివ్వడంలోనూ మరియు శరీరంలో ఉన్న కేలరీలను బాగా కరిగించేందుకు ఇవి చాలా బాగా ఉపయోగపడుతాయి. కొబ్బరినూనెలో ఉన్న MCT మీ శరీర కండరాలను వృద్ధి చెయ్యడంలో ఎంతగానో సహాయపడుతుంది. ప్రతిరోజు ప్రోటీన్ కలిగిన ఆహారంతో, 3 టీ-స్పూన్ల కొబ్బరి నూనెను కలిపి తీసుకోవడం వల్ల మీ శరీర కండరాలను వృద్ధి చెయ్యడానికి బాగా సహాయపడతుంది.

4. అల్జీమర్స్ వ్యాధిని నిరోధిస్తుంది :

4. అల్జీమర్స్ వ్యాధిని నిరోధిస్తుంది :

మన మెదడు, మెదడు కణాలకు శక్తిని చేకూర్చేందుకు అవసరమైనంత గ్లూకోజ్ను ప్రొసెస్ చెయ్యడం కోసం సహాయపడే ఇన్సులిన్ను మన మెదడే స్వతహాగా సృష్టిస్తుందని ఇటీవలి పరిశోధనలో కనుగొనబడింది. కొబ్బరినూనెకు ఒక అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న రోగి యొక్క మెదడు పనితీరును సరిచేయడానికి సహాయపడే ఒక ప్రత్యామ్నాయ శక్తిని సృష్టించగల సామర్థ్యం ఉంది.

5. ఆలోచన శక్తిని పెంచుతుంది :

5. ఆలోచన శక్తిని పెంచుతుంది :

కొబ్బరి నూనెలో కనిపించే మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ (MCTs) జ్ఞాపకశక్తి సమస్యలను తొలగించి, ఆలోచన శక్తిని మెరుగుపరుస్తాయి. కోల్పోయిన జ్ఞాపకాలను తిరిగి గుర్తుచేసుకోవటంలో కొబ్బరినూనె బాగా సహాయపడుతుంది. అలానే ఇది మెదడుతో పరస్పర సంబంధాలను కలిగి ఉండటం వల్ల మెదడు కణాలకు కావలసినంత ఇంధనాన్ని సమకూర్చి - అవి మరింత సమర్థవంతంగా పని చేసేటట్లుగా సహాయపడుతుంది.

6. అవయవాలను మరింత ఆరోగ్యకరంగా ఉంచుతుంది :

6. అవయవాలను మరింత ఆరోగ్యకరంగా ఉంచుతుంది :

కొబ్బరినూనెలో MCT మరియు కొవ్వు ఆమ్లాలు కలిగి ఉండటం వల్ల, కాలేయ-సంబంధ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. ఎందువల్లనంటే, కొబ్బరినూనెలో ఉన్న ఈ రకమైన పదార్థాలు కాలేయానికి చేరుకున్న తర్వాత శక్తిగా మార్చబడతాయి, అందువల్ల కొవ్వు అనేది పెరగదు. అంతే కాకుండా మూత్రపిండాలలో ఉన్న రాళ్లను మరియు పిత్తాశయంలో ఎదురైనా సమస్యలను నివారించడానికి ఎంతగానో సహాయపడుతుంది.

 7. గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది :

7. గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది :

కొబ్బరినూనెలో సహజ "సంతృప్త కొవ్వు ఆమ్లాలు" అనేవి చాలా పుష్కలంగా లభిస్తాయి. ఇది మీ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది మరియు చెడు కొలెస్ట్రాల్ను మంచి కొలెస్ట్రాల్గా మార్చడానికి సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం కొబ్బరినూనె హెపటైటిస్, తట్టు మరియు ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే వైరస్లను చంపుతుందని వెల్లడైంది.

8. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది :

8. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది :

కొవ్వును కరిగించే విటమిన్లను, మెగ్నీషియం మరియు కాల్షియం వంటి అద్భుతమైన సమ్మేళనాలను మన శరీరం చేత సంగ్రహించబడినప్పుడు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థలో ఉన్న చెడు బ్యాక్టీరియాను నాశనం చేయడం ద్వారా ప్రేగు యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ కూడా ఇది సహాయపడుతుంది. కొబ్బరినూనె జీర్ణక్రియను మందగింపచేసేటట్లుగా పనిచేసే - జీర్ణకోశంలో ఉన్న ఆమ్లాన్ని తగ్గిస్తుంది, అలా చెయ్యటం వల్ల మరింత సులభమైన జీర్ణక్రియకు కారణమవుతుంది.

9. దంత సంరక్షణ :

9. దంత సంరక్షణ :

కొబ్బరినూనె మన శరీరం చేత కాల్షియమును సులభంగా సంగ్రహించబడేటట్లుగా చేసి, పళ్ళును మరింత బలమైనవిగా చేసేందుకు సహాయపడుతుంది. కొబ్బరినూనె చిగుళ్ల వ్యాధులకు కారణమైన బ్యాక్టీరియాను తొలగించి, మన దంతాలను ఎలాంటి వ్యాధులు గురి కాకుండా చేస్తుంది. వారంలో మూడుసార్లు కొబ్బరినూనెను తీసుకోవటంవల్ల మీ నోటిని సంరక్షించేందుకు బాగా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

10. హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది :

10. హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది :

కొబ్బరినూనెలో "లారిక్ యాసిడ్ను" కలిగి ఉన్న కారణంగా మహిళల్లో హార్మోన్ల సమతౌల్యాన్ని ఏర్పరిచి, దానిని అదే స్థాయిలో కొనసాగించడానికి సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, కొబ్బరినూనెను మహిళలు రుతువిరతి సమయంలో తీసుకోగలిగే ఒక అద్భుతమైన కొవ్వు పదార్థంగా ఉండటమే కాకుండా, వారి యొక్క ఈస్ట్రోజెన్ స్థాయిలో సానుకూలమైన ప్రభావమును కలిగి ఉండవచ్చని కనుగొన్నారు.

11. క్యాన్సర్ను చికిత్స చేయగలదు :

11. క్యాన్సర్ను చికిత్స చేయగలదు :

కొబ్బరినూనెను వినియోగించడం వల్ల శరీరంలో కీటోన్లను ఉత్పత్తి చేస్తుంది, ఇవి క్యాన్సర్ కణితులను ప్రేరేపించే కణాలను నాశనం చేయగల శక్తిని కలిగి ఉంటాయి. కొబ్బరినూనెను వినియోగించటం వల్ల అందులో ఉండే MCT లు శరీరంలో బాగా జీర్ణం అయినప్పుడు కడుపు క్యాన్సర్ కు కారణమైన ప్రత్యేక బ్యాక్టీరియాలను కూడా చూపుతుంది.

12. మూర్ఛ రోగాన్ని తగ్గిస్తుంది :

12. మూర్ఛ రోగాన్ని తగ్గిస్తుంది :

కొబ్బరినూనెలో ఉన్న కొవ్వు ఆమ్లాలు - కీటోన్లుగా మారతాయి, ఇది మూర్ఛ రోగం యొక్క ప్రభావాలను తగ్గిస్తుంది. పిల్లలలో మూర్ఛ రోగం సంభవించడానికి అనువుగా ఉన్న పరిస్థితులను - నాటకీయంగా తగ్గించడంలో కొబ్బరినూనె ప్రధాన పాత్రను పోషిస్తుంది.

13. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది :

13. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది :

కొబ్బరినూనె లారిక్ యాసిడ్ను, కాప్రికా ఆమ్లమును మరియు యాంటిమైక్రోబియాల్ లిపిడ్లను కలిగి ఉన్న కారణంగా, మనలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది మరియు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. హానికరమైన బ్యాక్టీరియా మరియు వైరస్లతో పోరాటం చెయ్యడానికి సహాయపడే యాంటీ-ఫంగల్, యాంటీ-బాక్టీరియల్ మరియు యాంటి-వైరల్ లక్షణాలను కూడా కొబ్బరినూనె కలిగి ఉన్నాయి.

14. శారీరక శక్తిని బాగా పెంచుతుంది :

14. శారీరక శక్తిని బాగా పెంచుతుంది :

అథ్లెట్లు, బాడీ బిల్డర్స్ మరియు బరువు కోల్పోవాలనుకుంటున్న వారిచే కొబ్బరినూనె బాగా ఉపయోగించబడుతుంది. అందులో గల కొవ్వు పదార్ధమును - సులభంగా 'శక్తిగా' మార్చబడుతుంది (ఎందుకంటే కొబ్బరినూనెను మన శరీరము కొవ్వుగా సేకరించదు). ఇది శారీరక శక్తిగానూ మరియు సహన శక్తిగానూ పెంపొందించడానికి సహాయపడుతుంది, కావున కొబ్బరినూనె అనేది అథ్లెట్ల యొక్క సాధారణ పనితీరును బాగా మెరుగుపరుస్తుంది.

15. ఒత్తిడి నుండి ఉపశమనం :

15. ఒత్తిడి నుండి ఉపశమనం :

కొబ్బరినూనె చాలా మృదువుగా ఉంటూ, ఒత్తిడిని తొలగించడంలో చాలా ప్రభావశాలిగా ఉంటుంది. మీ తలపై కొబ్బరినూనెను రాసి సున్నితంగా మర్దన చేసిన తరువాత, అది మానసిక ఒత్తిడిని తొలగించడానికి సహాయపడుతుంది. ఇది ఒత్తిడి నుండి గొప్ప ఉపశమనమును కలిగించేందుకు లేలేత కొబ్బరితో తయారుచేసిన నూనెను ఉపయోగించాలని సూచించబడినది.

English summary

15 Impressive Health Benefits Of Coconut Oil

Coconut oil is made by pressing the fat from the white flesh of the coconut. It increases the healthy cholesterol, and also helps in converting the bad cholesterol into good cholesterol. It contains about 84 percent of saturated fat, which helps to promote heart health and lower the risk of heart diseases.
Desktop Bottom Promotion