For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఎప్పుడూ ఆకలితో ఉండడానికి గల 5 ముఖ్య కారణాలు !

మీరు ఎప్పుడూ ఆకలితో ఉండడానికి గల 5 ముఖ్య కారణాలు !మీరు తిన్న తర్వాత కూడా ఆకలి అనుభూతిని పొందడానికి గల కారణాలు ఎక్కువగా ఉండవచ్చు. థైరాయిడ్ సమస్యలు, నిద్రలేమి కారణంగా ఎదురయ్యే అధిక ఒత్తిడి మీ జీవన శైలిన

|

మీరు 5 నిమిషాల క్రితం గొప్ప పోషక విలువలు కలిగిన విందును ఆరగించిన తర్వాత, టీవీ చూడటానికి వెళ్ళినప్పుడు మళ్లీ మీకు స్వీట్స్ / సాల్టీగా ఉన్న పదార్థాలను తినాలన్న కోరిక కలిగి వుండటమే దీని ప్రధాన లక్షణంగా చెప్పవచ్చు.

ఎందుకు ఇలా జరుగుతోంది ? మన కడుపు పూర్తిగా నిండిన అనుభూతిని కలిగి ఉండేందుకు, మన కోరికను నెరవేర్చుకోవడానికి మరొక అరగంటలో మీ చేతిలో ఉన్న డార్క్ చాక్లెట్ మొత్తం అదృశ్యమవుతుంది. ఇలాంటి పరిస్థితిని మీరు కలిగి ఉన్నట్లయితే మీరు ఒంటరిగా లేరని (ఆకలితో ఉన్నారని) దానర్థం !

5 Reasons Why You Are Always Hungry

మీరు తిన్న తర్వాత కూడా ఆకలి అనుభూతిని పొందడానికి గల కారణాలు ఎక్కువగా ఉండవచ్చు. థైరాయిడ్ సమస్యలు, నిద్రలేమి కారణంగా ఎదురయ్యే అధిక ఒత్తిడి మీ జీవన శైలిని భంగపరచడం వంటి పరిస్థితులు మీ నియంత్రణలో లేని కారణంగా ఈ పరిస్థితికి దారితీయవచ్చు.

మనము సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచగల పరిస్థితులను గుర్తించవలసిన అవసరాన్ని అనివార్యం చేస్తుంది.

కాబట్టి, మీరు నిరంతరం ఆకలితో బాధపడుతున్నారని అర్థం చేసుకుని, అందుకు గల 5 కారణాలను ఈ వ్యాసంలో తెలియజేయడంతో పాటు, వాటి పరిష్కార మార్గాలను కూడా సూచించడం జరిగింది. ఈ మార్గాలని కూడా మీలో ఆకలిని నియంత్రించేందకు గొప్ప వ్యూహాలు పని చేస్తూ, మీ ఆకలి భావనను మందగించేలా చేస్తుంది.

మీతో ఎక్కువగా ఆకలితో బాధపడటం వెనక దాగి ఉన్న కారణాలు :

1. మీ శరీరానికి తగిన ఆహారం అవసరమైనప్పుడు :-

1. మీ శరీరానికి తగిన ఆహారం అవసరమైనప్పుడు :-

కొన్నిసార్లు, మన శరీర రక్తంలో తగ్గుతున్న గ్లూకోజ్ స్థాయిలు ఆకలిని సూచిస్తుంది. ఆ సమయంలో, మీకు నెమ్మది నెమ్మదిగా ఆకలి వేసేలా (ముందు ముందు మీ ఆకలి తీవ్రంగా మారేలా) ఉండే సంకేతాల కోసం ఎదురు చూడండి. మీ కడుపులో ఎదురయ్యే వింత శబ్దాలను విన్నప్పుడు మీరు ఒక పెద్ద గ్లాస్తో నీరు తాగిన తర్వాత కూడా ఆకలిని కలిగి ఉన్నారేమో అని గుర్తించండి.

పరిష్కార మార్గం : నిర్ణీతమైన సమయంలో పోషకాహారాలను & స్నాక్స్ను ఆహారంగా తీసుకోవడానికి ప్రతిరోజు ప్రయత్నించండి, అలా మీరు తీసుకొనే ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండేలా కూడా చూసుకోండి.

2. మీరు తగినంత బ్రేక్-ఫాస్ట్ను తీసుకోకపోవడం :-

2. మీరు తగినంత బ్రేక్-ఫాస్ట్ను తీసుకోకపోవడం :-

బ్రేక్-ఫాస్ట్ అనేది రోజులో అతి ముఖ్యమైన భోజనం. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం వారు చేసిన ఒక అధ్యయనంలో బ్రేక్-ఫాస్ట్ చేయడం ద్వారా 300 క్యాలరీలను పొందే వ్యక్తులు, 500 (లేదా) అంతకంటే ఎక్కువ క్యాలరీలను పొందే వ్యక్తులతో పోలిస్తే 2 రెట్ల అధిక బరువును పొందారని ఈ అధ్యయనం సూచించింది.

దానికి గల కారణం ? మీరు ఉదయాన్నే తీసుకొనే బ్రేక్ఫాస్ట్ వల్ల రక్తంలో చెక్కర & ఇన్సులిన్ పెరుగుదల కారణంగా, ఆ రోజంతా మీకు ఆకస్మిక ఆహార కోరికలను సూచిస్తుంది.

పరిష్కార మార్గం : గుడ్లు కలిగిన సాసేజ్లు వంటి ప్రోటీన్ భోజనమును మీ బ్రేక్ఫాస్ట్లో తీసుకోండి. అంతేకాకుండా, విటమిన్-K ను కలిగిన ఆకుకూరలను అధికంగా తినేవారిలో ఇన్సులిన్ రెగ్యులేటింగ్ చేసే పోషకపదార్థాలు కలిగి ఉండటం వల్ల మీలో ఆకలి మక్కువను తగ్గిస్తుంది.

3. ఎక్కువ ఒత్తిడికి గురవ్వటాన్ని ఆపండి :-

3. ఎక్కువ ఒత్తిడికి గురవ్వటాన్ని ఆపండి :-

ఒత్తిడి & ఆకలి మధ్య గల సంబంధాలు కొంచెం సంక్లిష్టంగా ఉంటాయి; కానీ మీరు ఈ పరిస్థితిని సులభతరం చేయవచ్చు. మన శరీరము ఒత్తిడికి గురయినప్పుడు అడ్రినలిన్ & కర్టిసోల్ వంటి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఎన్నో ఇతర కారణాలు అడ్రినలిన్ ఉత్పాదకతను మరింత తీవ్రంగా పెంచడం వల్ల మన జీవితానికి నిజమైన ముప్పుగా పరిణమించే 6 ఇతర పరిస్థితులకు దారితీయవచ్చు.

విచారకరమైన విషయమేమంటే, మన శరీరం వీటి మధ్య గల వ్యత్యాసాన్ని ఇంకా అర్థం చేసుకోకపోవడం. ఈ కారణం చేత, మానవ శరీరం ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని మరింత అధికం చేసేటప్పుడు, అడ్రినాలిన్ స్రావాలను అధిక స్థాయిలో శరీరంలో విడుదల చేస్తుంది. ఇలా మనకు కావలసిన శక్తికి మించిన ఇంధనాన్ని శరీరం డిమాండ్ చేయడం వల్ల, మనలో ఆకలి సూచనలు పెరుగుతాయి.

పరిష్కార మార్గం : మీరు మొదటగా కెఫిన్ వినియోగాన్ని తగ్గించాలి. లోతైన శ్వాసను తీసుకోవడంపై సాధన చేయాలి. స్థిరమైన శ్వాసపై దృష్టిని సారించేలా అభ్యాసం చేయాలి. మీరు ఉదయం మేల్కొన్న తరువాత మొదటి విషయంగా ధ్యానం, తాయ్ చి, యోగ (లేదా) శ్వాససంబంధమైన అభ్యాసాలను తప్పక సాధన చేయాలి.

4. తగినంతగా నిద్ర లేకపోవడం :-

4. తగినంతగా నిద్ర లేకపోవడం :-

నిద్ర, మీ ఆకలిని భంగపరుస్తుంది. మీరు తగినంత నిద్రను కలిగి లేనప్పుడు, మానవ శరీరంలో ఆకలిని నియంత్రించే 2 ప్రధాన హార్మోన్ల (లెఫ్టిన్ మరియు గ్రెలిన్) ను ప్రభావితం చేస్తుందని సైన్సు నిర్ధారించింది. కాబట్టి, మీరు జీవశాస్త్ర ప్రకారం తగినంత నిద్రను కలిగి లేనప్పుడు - ఎక్కువగా తినడం పైన దృష్టి సారిస్తారు.

పరిష్కార మార్గం : ప్రతిరోజు 8 గంటల నిద్రను పొందేలా ప్లాన్ చేసుకోండి. స్థిరమైన నిద్రవేళ & మేల్కొనే సమయం మీకు బాగా సహాయపడుతుంది.

5. మీరు తగినంత నీరు తాగడం లేదని అర్థం :-

5. మీరు తగినంత నీరు తాగడం లేదని అర్థం :-

డీహైడ్రేషన్ అనేది ఆకలి ఏర్పడటానికి కూడా కారణమవుతుంది. మీరు డీహైడ్రేషన్కు గురైనప్పుడు, మెదడులోని హైపోథాలమస్ అనే విభాగము ఆకలి & దాహం కోసం ఒకేసారి మిశ్రమ సంకేతాలను పంపుతుంది. ఇలాంటప్పుడు మీ శరీరానికి నిజంగా అవసరమైన ఒక గ్లాసు నీరుకి బదులుగా ఇతర ఆహార పదార్థాలను తినాలన్న ఆలోచనను బలపరుస్తుంది.

పరిష్కార మార్గం : మీరు కడుపు నిండా భోజనం చేసిన తర్వాత కూడా ఆకలిని కలిగి ఉన్నట్లయితే ఒక పెద్ద గ్లాస్తో నీరుని తాగడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీకు ఆలు చిప్స్ తినాలన్న ఆలోచన ఏమాత్రం అవసరం లేదని మీరే గుర్తిస్తారు.

English summary

5 Reasons Why You Are Always Hungry

Do you feel hungry even right after you've had a heavy, delicious meal? There can be plenty of reasons behind it. The reasons can be imbalanced hunger hormones, stress, sleep, and inadequate water consumption. Eat nutritious food & have a big-enough breakfast, proper sleep, drink enough water, & avoid stress to solve this issue.
Desktop Bottom Promotion