కొలోన్ క్యాన్సర్ ని అరికట్టే 6 కామన్ ఫుడ్స్

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

కొన్ని పరిస్థితులు మనుషులను విపరీతంగా భయపెడతాయి. అటువంటి వాటిలో క్యాన్సర్ అలాగే ఎయిడ్స్ వంటివి ముందుంటాయి. అవునా?

అవును, క్యాన్సర్ అనేది జీవితాలతో ఆడుకునే ప్రాణాంతక వ్యాధి. క్యాన్సర్ బారిన పడే పేషంట్స్ మానసికంగా కూడా బలహీనపడతారు. అలాగే, వారి చుట్టూ ఉన్నవారు కూడా కృంగిపోతారు.

నిజానికి, క్యాన్సర్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాలను హరిస్తోంది. అన్నివయసుల వారు క్యాన్సర్ బారిన పడటం దురదృష్టకరం.

కొన్ని వ్యాధులు కొన్ని వయసులవారిపై మాత్రమే దాడి చేస్తాయి. అయితే, క్యాన్సర్ అనేది వయసుతో సంబంధం లేకుండా అందరిపై తన ప్రభావం చూపిస్తుంది. ప్రాణాపాయంగా కూడా మారుతుంది.

శరీరంలోని క్యాన్సర్ కారక కణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నప్పుడు క్యాన్సర్ ముప్పు ఏర్పడుతుంది.

కొలోన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ వంటివి అటువంటి కొన్ని సాధారణ క్యాన్సర్ రకాలు.

ప్రత్యేకమైన ఆహారనియమాలను పాటిస్తూ కొన్ని జీవనశైలి అలవాట్లను పాటిస్తే కొన్ని రకాల క్యాన్సర్ల నుండి రక్షణ పొందవచ్చని రీసెర్చ్ స్టడీస్ చెప్తున్నాయి.

1. జీలకర్ర:

1. జీలకర్ర:

జీలకర్రని వంటలలో వాడతారు. వంటకాలకు ఫ్లేవర్ ని యాడ్ చేసేందుకు జీలకర్రను ముఖ్యంగా ఉపయోగిస్తారు. అలాగే, జీలకర్రను ఉపయోగించి అనేక ఔషధాలను తయారుచేస్తారు. జీలకర్రలోనున్న ఔషధ గుణాలకు అనేక వ్యాధులను అరికట్టే సామర్థ్యం ఎక్కువ. క్యుమినాల్డిహైడ్ అనే పదార్థం జీలకర్రలో లభ్యమవుతుంది. ఇది ఇంటస్టైన్ లోని క్యాన్సర్ కారక కణాల వృద్ధిని అరికట్టి కొలోన్ కాన్సర్ ని అరికడుతుంది.

2. జామపండు:

2. జామపండు:

జామపండులో అనేక పోషకవిలువలు లభిస్తాయి. జామపండులో ఔషధ గుణాలు కూడా అధికమే. విటమిన్ సీ తో పాటు ఇందులో అనేక పోషకాలు లభిస్తాయి. జామపండుని తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. తద్వారా మీ మెటబాలిక్ రేట్ ను పెంపొందించుకుని రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకోవచ్చు. ఆ విధంగా ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందవచ్చు కూడా. అలాగే, జామపండులో లభించే విటమిన్ సి అనేది ఇంటస్టైన్ లోని సెల్స్ కి క్యాన్సర్ కారక కణాలతో పోరాడే శక్తిని అందిస్తుంది. ఆ విధంగా కొలోన్ క్యాన్సర్ ని అరికడుతుంది.

3. ఆకుకూరలు:

3. ఆకుకూరలు:

చిన్నప్పుడు కచ్చితంగా ఆకుకూరలని తినమని పెద్దవాళ్లు మనకు తరచూ చెప్తూ ఉండేవారు కదూ! స్పినాచ్, మింట్ లీవ్స్, కాలే వంటి ఆకుకూరలలో యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్, మినరల్స్ అలాగే విటమిన్స్ వంటి శక్తివంతమైన పోషకాలు కలవు. ఆకుకూరలతో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ లో ఇంటస్టైన్ లోని క్యాన్సరస్ సెల్స్ వ్యాప్తిని అరికట్టే సామర్థ్యం కలదు. తద్వారా, కొలోన్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం తగ్గుతుంది.

4. అరటిపండు:

4. అరటిపండు:

ప్రపంచవ్యాప్తంగా, అరటిపండును దాదాపు ఎక్కువమంది ఇష్టపడతారు. రుచిగా ఉండడంతో పాటు అనేక ఆరోగ్యప్రయోజనాలను కలిగిస్తుంది. పొటాషియం కంటెంట్ ఇందులో అధికంగా లభిస్తుంది. ఇది మెటబాలిక్ ఫంక్షన్స్ ని మెరుగుపరుస్తుంది. శక్తిని పెంపొందించి డిప్రెషన్ వంటి కొన్ని అనారోగ్య సమస్యలతో పోరాడుతుంది. రీసెర్చ్ స్టడీస్ ప్రకారం తరచూ అరటిపండును తీసుకోవడం ద్వారా కొలోన్ ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. తద్వారా, స్టమక్ అల్సర్ తో పాటు కొలోన్ క్యాన్సర్ ని అరికట్టవచ్చు.

5. బెండకాయ:

5. బెండకాయ:

ఇండియా వంటి ట్రాపికల్ కంట్రీస్ లో బెండకాయతో చేసే వంటకాలు సర్వసాధారణం. ఇది ఎంతో ప్రాముఖ్యం చెందిన కూరగాయ. దీనితో చేసే వంటకాలను ఇష్టంగా తింటారు. గాస్త్రైటిస్, ఎసిడిటీ మరియు కాన్స్టిపేషన్ వంటి ఉదరానికి సంబంధించిన సమస్యలను అరికట్టడానికి బెండకాయ అమితంగా ఉపయోగపడుతుంది. బెండకాయలో లభించే ఎంజైమ్స్ అనేవి కొలోన్ కాన్సర్ ని అరికట్టేందుకు ఉపయోగపడతాయి. అలాగే, ఇంటస్టైన్ లోని సెల్స్ ని బలపరిచి వాటికి క్యాన్సరస్ సెల్స్ తో పోరాడే శక్తిని అందిస్తాయి.

6. ఫిష్:

6. ఫిష్:

ఫిష్ అనేది అత్యంత ఆరోగ్యకరమైన ఆహారం. దీనిని, రెగ్యులర్ డైట్ లో భాగంగా చేసుకోవడం ద్వారా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు విటమిన్ ఈ వంటి శక్తివంతమైన పోషకాలను పొందవచ్చు. ఇవి అధిక బరువు సమస్యను తగ్గిస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి అలాగే మెటబాలిజం రేట్ ను మెరుగుపరుస్తాయి. సాల్మన్ వంటి ఫిష్ లో లభించే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ పదార్థానికి బ్రెస్ట్ లోని క్యాన్సర్ సెల్స్ ని అరికట్టే సామర్థ్యం కలదు. అలాగే కొలోన్ క్యాన్సర్ పాటు కొన్ని ఇతర క్యాన్సర్లను కూడా అరికడుతుంది.

English summary

6 Common Foods To Prevent Colon Cancer

Colon cancer is the cancer that affects the colon or rectum, the lower end of the digestive tract, which could prove to be fatal. Changing certain things in your daily diet can help prevent colon cancer. Here are a few common foods that can help to prevent colon cancer.
Story first published: Wednesday, February 7, 2018, 12:30 [IST]
Subscribe Newsletter