For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వంటలో ఉపయోగించే 7 ఉత్తమమైన హెర్బ్స్ (మూలికలు) !

|

ఈ హెర్బ్స్ (మూలికలు) ఏ వంటకానైనా రుచికరమైనదిగా తయారు చేస్తాయి, అవి వంటకంలో ఇతర పదార్థాలు హైలైట్ అయ్యేలా సూక్ష్మ రుచులను ఏర్పరుస్తాయి. ఈ హెర్బ్స్ రుచి సీజన్ - సీజన్కూ విస్తృతంగా మారుతూ ఉంటుంది, ఎలా అంటే, మీరు వాడే హెర్బ్స్ మోతాదును నిర్ణయించుకోవడము బట్టి, మీరు సరికొత్త రుచులను చవి చూస్తారు. కాబట్టి, మీరు ఇక్కడ వంటకాలలో ఎక్కువగా ఉపయోగించే హెర్బ్స్ గూర్చి ఇక్కడ మీరు తెలుసుకుంటారు.

వంటకాలు మంచి రుచిని కలిగి ఉండేలా చెయ్యడం కోసం పార్స్లీ, బాసిల్, చైవ్స్, మెంతులు & కొత్తిమీర వంటి తాజా హెర్బ్స్ను సాధారణంగా కోసి, వీటిని వంట చివరిలో జోడిస్తారు.

7 Best Herbs To Use In Cooking

ఒరేగానో, థైమ్ & రోజ్మేరీ వంటి ఆరోగ్యకరమైన హెర్బ్స్ను వండే వంటకాలలో ముందుగానే జోడిస్తారు, ఈ హెర్బ్స్ వల్ల కలిగే రుచులు పూర్తిగా మీ వంటలను మంచి సువాసనతో నింపుతాయి.

ఉదాహరణకు :- బాసిల్ వంటి బలహీనమైన రుచి నిమ్మకాయ సోర్బెట్ను మరింతగా ప్రకాశవంతం చేస్తుంది, అయితే రోజ్మేరీ మటుకూ కోడి కూరను & చేపల కూరను సువాసనతో పూర్తిగా పూరిస్తుంది.

వంటలో ఉపయోగించడానికి ఉత్తమమైన హెర్బ్స్ గూర్చి మనము ఇప్పుడు తెలుసుకుందాం !

బాసిల్ (తులసి) :

బాసిల్ (తులసి) :

బాసిల్ అనేది ఆహార సంబంధమైన అతి ముఖ్యమైన హెర్బ్స్లలో ఒకటి, దీనిని "పెస్టో" తయారీలో ఉపయోగిస్తారు. బాసిల్ అనేది సాస్, సాండ్విచ్, సలాడ్లు & సూప్లలో వాడబడుతుంది. అలాగే మీరు టమోటా సలాడ్ను తయారుచేసేటప్పుడు అవి బాగా టమోటాలతో జత చేయబడినవి కావచ్చు. బాసిల్ (తులసి మొక్క) ను మోజారెల్లా చీజ్, ఆలివ్ నూనె & ఫెటా ఛీస్ వంటి వాటిలో కూడా చక్కగా ఉపయోగించబడుతుంది. అలాగే దీనిని మాంసము (లేదా) సీ ఫుడ్లో ఉండే అన్ని రకాల వాటి మీద ఉపయోగించబడతాయి. ఆసియాలో దొరికే తులసి మరింత ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది, వీటిని తరచుగా బాగా వేయించే ఫ్రైలలోనూ, ఇగురును కలిగిన కూరలు & సూప్లలో ఉపయోగిస్తారు.

పార్స్లీ :

పార్స్లీ :

దీనిని వంటలో సర్వ సాధారణంగా ఉపయోగిస్తారు, బహుముఖమైన ప్రయోజనాలను కలగజేసే హెర్బ్స్లో "పార్స్లీ" ఒకటి. ఇది ఇతర మసాలా దినుసులతో పోలిస్తే, పెప్పర్ వంటి రుచిని కలిగి ఉంటుంది. పార్స్లీనూ ఎక్కువగా సలాడ్లు, సాస్లలో వాడతారు, భోజనానికి సిద్ధంచేసే వంటకాలలో చివరిలో ఇది జతచేయబడుతుంది. పార్స్లీలో యాంటిఆక్సిడెంట్లతో పాటు విటమిన్ సి, విటమిన్ ఎ వంటివి పుష్కలంగా లభిస్థాయి. విటమిన్-సి అనేది ప్రేగులను ఆరోగ్యవంతంగా ఉంచగలిగే అనుకూలమైన పరిస్థితులను నిర్వహించడంలో సహాయపడుతుంది.

సిలంట్రో (కొత్తిమీర) :

సిలంట్రో (కొత్తిమీర) :

సిలంట్రోను కొత్తిమీరగా కూడా పిలుస్తారు, గొప్ప రుచిని కలిగి ఉన్న దీనిని దాదాపు అన్ని రకాల వంటలలో ఉపయోగిస్తారు. నిజానికి చాలామంది దానిలో గొప్పగా ఉన్న రిఫ్రెష్నేస్ రుచికి అలవాటు పడ్డారు, అలాగే దీనిని లాటిన్ & ఆసియన్ వంటలలో విరివిగా ఉపయోగిస్తారు. కొత్తిమీర తీపి కాండమును (లేదా) ఆకులు సాధారణంగా పచ్చిగా ఉన్న వాటిని తినవచ్చు / వంటలలో ఉపయోగించవచ్చు. ఇవి శరీరంలో ఉండే భారీ మెటల్స్ను బయటకు తొలగించి వేస్తుంది, ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా శరీరాన్ని రక్షిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది, మూత్ర మార్గము ఏర్పడే ఇన్ఫెక్షన్లను నిరోధించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.

మింట్ (పుదీనా) :

మింట్ (పుదీనా) :

మింట్ (పుదీనా) అనేది తీపితో అనుబంధించబడిన మరొక సాధారణమైన హెర్బ్ ఇది, ముఖ్యంగా ఇది శీతలీకరణ లక్షణమును కలిగి ఉండడంచేత వంటకాలకు శీతలీకరణము వంటి రుచిని జోడిస్తుంది. ఫ్రెష్గా ఉండే పుదీనా, ఈ వేసవిలో తయారుచేసుకునే సలాడ్లు కోసం ఖచ్చితంగా ఉపయోగించబడుతుంది, అలాగే దీనిని సాస్ & టీల తయారీలో కలుపుతారు. మింట్ అనేది జీర్ణశక్తిని ప్రోత్సహిస్తుంది, కడుపులో మంట & అజీర్ణం వంటి విషయంలో మీకు ఉపశమనమును కలుగచేస్తుంది. మీరు కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఒక కప్పు పుదీనా టీ ను తాగడం వల్ల మీకు సత్వరమే ఉపశమనాన్ని కలిగిస్తుంది.

రోజ్మేరీ :

రోజ్మేరీ :

రోజ్మేరీ ఒక గాఢమైన రుచిని కలిగి ఉంటుంది, వీటిని వంటలో తాజాగా (లేదా) ఎండిన రూపంలో ఉన్న రోజ్మేరీలను ఉపయోగిస్తారు. ఈ హెర్బ్స్ను చారు (లేదా) సాస్ల వంటి వాటిలో ఉపయోగించబడుతుంది, అలాగే ఇది అత్యంత సువాసన భరితమైన హెర్బ్స్లో ఒకటి. ఈ రోజ్మేరీ జ్ఞాపకశక్తిని పెంచడం, మానసిక స్థితిని కలగజేసి - ఒత్తిడులను తగ్గించడం, రోగనిరోధక శక్తిని పెంచడం, రక్త ప్రవాహాన్ని ప్రేరేపించడం ద్వారా నొప్పులను తొలగించడం వంటి అనేక అదనపు ప్రయోజనాలను ఇవి కలిగి ఉన్నాయి.

థైమ్ :

థైమ్ :

థైమ్ను కూరగాయలు, చేపలు, మాంసం (లేదా) పౌల్ట్రీ వంటి వాటితో జత చేయవచ్చు. థైమ్ వల్ల కలిగే ప్రయోజనాలు అపారమైనవి. ఎందుకంటే వీటి యొక్క పువ్వులు, ఆకులు & నూనెల వంటివి అతిసారం, కడుపు నొప్పి, కీళ్ళనొప్పులు, గొంతు మంటను, దగ్గు, శ్వాస నాళముల వాపును, మూత్రనాళాల చికిత్సల వంటి వాటిలో వీటిని ఉపయోగిస్తారు. థైమ్ విటమిన్ సి, విటమిన్ ఎ వంటి వాటితో పూర్తిగా నిండిపోయింది. ఈ థైమ్ జలుబు, ఫ్లూ జ్వరం వంటి చికిత్సలకు బాగా సహాయపడుతుంది. ఇది కాపర్, ఫైబర్, ఐరన్ & మాంగనీసులను కలిగి ఉన్న గొప్ప మూల పదార్థము.

సేజ్ :

సేజ్ :

పంది మాంసం, బీన్స్, బంగాళాదుంపలు, జున్ను & బ్రౌన్ బట్టర్ సాస్ వంటి వంటలలో సేజ్ను ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. సేజ్ అనేది ఫైబర్, కాల్షియం, ఫోలేట్, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్ & ఫోలిక్ ఆమ్లం, థయామిన్ - రిబోఫ్లావిన్ వంటి B విటమిన్ల వంటి గొప్ప వనరులను కలిగిన అద్భుతమైన మూల పదార్థంగా ఉంది. అంతేకాకుండా, వీటిలో విటమిన్ సి, విటమిన్ E, థియామిన్ & కాపర్ వంటి ఆరోగ్యకరమైన సమ్మేళనాలను అధిక మొత్తంలో కలిగి ఉంది.

English summary

7 Best Herbs To Use In Cooking

Delicate fresh herbs like parsley, basil, chives, dill and coriander are generally chopped or torn and added at the end of cooking. Heartier herbs like oregano, thyme and rosemary can be added earlier in the cooking process. The best herbs to use in cooking are thyme, oregano, rosemary, basil, parsley, coriander, mint, etc.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more