For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించే 7 అద్భుతమైన మార్గాలు !

శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించే 7 అద్భుతమైన మార్గాలు !

|

శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించడం అనేది అంత తేలికైన విషయం కాదు. మీరు ఇప్పటికే డైట్ ప్లాన్ను అమలు చేస్తున్నట్లయితే, అవాంఛితమైన కొవ్వును కరిగించడానికి నిరంతరంగా ఎంతలా కష్టపడాలో అనే విషయాన్ని గూర్చి మీరు అంగీకరించవచ్చు. అయినప్పటికీ, మనము మన శరీర కొవ్వును తగిన స్థాయిలో కలిగి అందంగా కనపడటానికి, శరీరంలో అధికంగా ఉన్న కేలరీలను తగ్గించే ఇతర మార్గాలను కనిపెట్టి, వాటిని పాటిస్తూ ఉండటం వల్ల మనము ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము.

కానీ, దానిని ఎలా అమలు చెయ్యాలి? మీరు అనుసరిస్తున్న డైట్ ప్లాన్ను పరిగణనలోకి తీసుకుంటే, మంచి ఫలితాలను పొందడానికి మీరు ఎన్నుకున్న మార్గం ఎంత వరకు సమర్థవంతంగా ఉంటుంది? శరీరంలో ఉన్న కొవ్వును వదిలించుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా మంచి ఆలోచన, అందుకోసం మీరు వేసుకున్న అన్ని రకాల ప్లాన్లను అనుసరించండి ఒక పెద్ద పని కావచ్చు.

7 Effective Ways To Reduce Body Fat

అలాగే మనకి అందుబాటులో పెద్ద సంఖ్యలో డైట్ ప్లాన్స్ ఉన్నాయి, కానీ వాటిలో మీకు సరిగ్గా సరిపోయే వాటిని ఎంచుకొని, మీరు కోరుకున్న ఫలితాలను పొందడం అంత సులభం కాదు.

మీ శరీరానికి, మీ జీవనశైలికి తగ్గట్లుగా ఏ ప్లాన్ కరక్టుగా పనిచేస్తుందో అటువంటి దాని ఎంచుకోవడంలో మీరు ఉత్తమమైన వారుగా ఉండాలి, అయితే ఇక్కడ శరీరంలో ఉన్న అదనపు కొవ్వును తగ్గించడంలో చాలా ప్రభావవంతముగా పనిచేసే కొన్ని పద్ధతులను గూర్చి మనము చర్చించుకుందాము.

1. సులభంగా, వాస్తవికంగా ఉండే ప్లానింగ్ :

1. సులభంగా, వాస్తవికంగా ఉండే ప్లానింగ్ :

మీకు మంచి ఫలితాలను అందించే డైట్ ప్లానింగ్ను అనుసరించండి. వాటిని ఆచరించడంలో వాస్తవికంగాను, సులభంగానూ ఉండేలా ఉండాలి. మీరు అనుసరించే డైట్ ప్లానింగ్ ఆచరించడంలో చాలా కష్టతరంగా ఉండటంవల్ల, వాటిని భవిష్యత్తులో కొనసాగించడానికి కూడా చాలా కష్టతరంగా మారడంవల్ల అవి సంతృప్తికరమైన ఫలితాలను అందించలేవు. మీ జీవనశైలి ప్రకారం, మీ అద్భుతంగా కోసం పనిచేసే ఉత్తమమైన డైట్ ప్లానింగ్ను ఎంచుకొని, వ్యూహాత్మకంగా అమలు చేయండి. రాత్రికి రాత్రే మంచి ఫలితాలను పొందేలా కష్టతరమైన ప్లానింగ్ను ఎంచుకోవద్దు. ఆచరించడానికి చాలా సులభంగా ఉండే మంచి ప్లానింగ్నూ ఎంచుకోండి.

2. ప్రోటీన్ ఆధారిత ఆహారం :

2. ప్రోటీన్ ఆధారిత ఆహారం :

ప్రోటీన్ ఆధారిత ఆహారమును ఎల్లప్పుడు తీసుకోండి. శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించటానికి ప్రోటీన్లను కలిగి ఉన్న ఆహారం చాలా ఎక్కువ మోతాదులో అవసరమవుతుంది, మనం తీసుకునే ఆహారంలో ఉన్న ప్రోటీన్లు సహజసిద్ధమైన పద్ధతిలో శరీరంలో ఉన్న కొవ్వును కరిగించి, జీవక్రియను మెరుగుపరుస్తుంది. అధిక ప్రోటీన్లను కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ శరీరంలో ఉన్న అదనపు కొవ్వును కరిగించటంలో ఇది చాలా ప్రభావంతమైన మార్గముగా చెప్పవచ్చు.

3. షుగర్కు 'నో' చెప్పండి :

3. షుగర్కు 'నో' చెప్పండి :

మీరు ఆచరించే ఎలాంటి డైట్ ప్లానింగ్లో అయినా షుగర్ని వినియోగించడం బాగా తగ్గించాలి. మీ నోటిని తీపిగా మార్చేలా, షుగర్ను కలిగి ఉండే ప్రాసెస్ చేయబడిన ఆహారాలను, బేకరీ ఉత్పత్తులను, అలాగే తీపి పానీయాల వినియోగానికి 'నో' అని చెప్పండి.

4. పండ్లు, కూరగాయలను తినండి :

4. పండ్లు, కూరగాయలను తినండి :

మీరు ఆకలిని కలిగివున్న సమయంలో, మీ శరీరానికి అధిక కేలరీలను జోడించని తాజా పండ్లు, కూరగాయలను వినియోగించండి. తాజా పండ్లు, కూరగాయలనేవి ఒక ఆరోగ్యకరమైన ఎంపిక కాబట్టి వాటిని మీ డైట్ ప్లానింగ్లో చేర్చుకోవలసిన అవసరం ఉంది.

5. ఎక్కువగా నీరుని త్రాగుట :

5. ఎక్కువగా నీరుని త్రాగుట :

తాగునీరు, శరీర కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుందని మిమ్మల్ని ఒప్పించే అధ్యయనాలు చాలానే ఉన్నాయి. నీరు మీ దాహాన్ని అణచివెయడమే కాకుండా, మీ శరీర బరువును తగ్గించడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అందువల్ల, నీటితో మీ రోజును ప్రారంభించాలి, మీరు ఆశించిన ఫలితాలకోసం భోజనానికి ముందు నీటిని తాగటం చాలా మంచిది.

6. గ్రీన్-టీ తాగండి :

6. గ్రీన్-టీ తాగండి :

గ్రీన్-టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. గ్రీన్-టీ నెమ్మదిగా తాగటం వల్ల మీలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. మీరు తీసుకునే గ్రీన్-టీ లో చక్కెరను కలపకండి. ఒట్టి గ్రీన్-టీ తాగటం వల్ల శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించడంలో మరింత ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

7. ఆహారాన్ని నెమ్మదిగా తినండి :

7. ఆహారాన్ని నెమ్మదిగా తినండి :

మీ డైట్ ప్లానింగ్కు సరిగా సరిపోయే ఆహారాన్ని మీ ప్లేట్లో కలిగి ఉండటంతో పాటు - ఆహారాన్ని మీరు ఏ విధంగా తీసుకొంటున్నారో అనేది కూడా చాలా ముఖ్యం. ఆహారాన్ని నెమ్మదిగా, జాగ్రత్తగా తినడం అనేది సరైన పద్దతి. ఇలా తక్కువ కేలరీలతో మీ శరీరానికి ఆహారాన్ని అందించడం ఒక ప్రభావవంతమైన మార్గంగా నిరూపించబడింది, దానితో పాటు, మీరు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నారో అనే దానిని కూడా తనిఖీ చేయాలి. మీ శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించేందుకు, పైన తెలియజేసిన పద్దతులను మీరు ఆచరించడంవల్ల సమర్థవంతమైన ఫలితాలను పొందగలరు. ఈ విధంగా మీరు మంచి శరీరాకృతిని పొంది అందంగా, ఆరోగ్యంగా ఉండండి !


English summary

7 Effective Ways To Reduce Body Fat

7 Effective Ways To Reduce Body Fat ,Reducing body fat is not as simple as it seems. If you are already on a diet plan, you would probably agree how persistent one needs to be to cut down on the unwanted flab. Nevertheless, we all want to reduce our body fat to look good and stay healthy with many of the other reasons
Story first published:Saturday, March 24, 2018, 13:16 [IST]
Desktop Bottom Promotion