For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీ పళ్ళకు ఉన్న పాచిని తొలగించే 7 రకాల సహజసిద్ధమైన మార్గాలు !

  |

  తెల్లని పళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ముత్యము లాంటి ప్రకాశవంతమైన పళ్ళను కలిగి ఉన్న వ్యక్తిని మీరు గుర్తించిన తరువాత, వారి మీదకే మీ చూపు మరల్చబడుతుంది. ఆకర్షణీయంగా ఉన్నారనే భావనను మాత్రమే కలిగి ఉండకుండా, మీ మొత్తం ఆరోగ్యంలో - నోటి పరిశుభ్రత అనేది కూడా చాలా ముఖ్యమైనది. సరైన రీతిలో బ్రష్ చేయటం, మౌత్ వాష్లను ఉపయోగించి మీ నోటి పరిశుభ్రతను నిర్వహించడం అనేది చాలా ముఖ్యం. మీరు ఆ విధంగా పరిశుభ్రతను పాటించడంలో విఫలమైతే, తీసుకునే ఆహారం ఖనిజాలు మరియు బ్యాక్టీరియా వంటివి మీ పళ్ళ మీద చేరి ఉంటాయి. దీర్ఘకాలంలో ఇవే పాచిగా రూపాంతరం చెందుతుంది.

  మీ దంతాలు పసుపురంగులోకి మారడం వల్ల, చూసేందుకు ఆసక్తికరంగా లేకపోవడమే కాకుండా, అది మీ నోటి ఆరోగ్యానికి మంచిది కూడా కాదు. మీరు ఇంట్లోనే మీరు ఇలాంటి పరిస్థితి పై వ్యవహరించేటప్పుడు దంత వైద్యుని దగ్గరికి వెళ్ళటం సరైన పద్ధతి కాదు. మీ పళ్ళకు పట్టిన పాచిని ఎదుర్కోవడానికి ఈ క్రింద తెలియజేసినా చిట్కాలను పాటించండి. ఇప్పుడు ఆ చిట్కాలేంటో మనము చూద్దాం రండి.

  1. బేకింగ్ సోడా :

  1. బేకింగ్ సోడా :

  మీ దంతలపై ఫలక రూపంలో ఉన్న పాచిని తొలగించటంలో బేకింగ్ సోడా బాగా సహాయపడుతుంది. అందుకు మీకు కావలసినవి 1 టీ స్పూను బేకింగ్ సోడా, టూత్ పేస్ట్, ఉప్పు (ఆప్షనల్) మరియు టూత్ బ్రెష్. మీరు బేకింగ్ సోడాతో ఉప్పును కలిపి వాడవచ్చు (లేదా) బేకింగ్ సోడాను మాత్రమే వాడవచ్చు. మీ టూత్ బ్రష్ పై ఈ మిశ్రమాన్ని ఉంచి, మీ దంతాలను శుభ్రంగా కడగండి.

  ఇప్పుడు మీ నోటిని గోరువెచ్చని నీటితో పుక్కిలించి శుభ్రపరచుకోండి. బేకింగ్ సోడాను టూత్ పేస్ట్తో కలిపి కూడా వాడవచ్చు. బేకింగ్ సోడాను వాడిన తర్వాత వచ్చే ఫలితాలను మీరే స్వయంగా చూసుకోండి. మంచి ఫలితాలను పొందడం కోసం వారంలో రెండు సార్లు ఈ పద్ధతిని అనుసరించండి.

  2. జామ ఆకులు :

  2. జామ ఆకులు :

  మీ పళ్ళ పై ఉన్న పాచి-ఫలకమును తొలగించడంలో జామపళ్లు మరియు జామాకులు బాగా ఉపయోగపడతాయి. ఈ రెండూ కూడా నోటికున్న పాచిని సమర్థవంతంగా నిరోధించేందుకు, వ్యతిరేకంగా పోరాడే ఏజెంట్లను కలిగి ఉంది. అది మాత్రమే కాకుండా, ఇది చిగుళ్ళ వాపును కూడా తగ్గిస్తుంది. ఇలాంటి మంచి ఫలితాలను పొందడం కోసం మీరు చేయాల్సిందల్లా, రోజులో కొన్ని జామాకులను బాగా నమిలి, ఊసివెయ్యాలి. ఇలా చేయడంవల్ల దంతాలపై పాచి-ఫలకముల పెరుగుదలను తగ్గిస్తుంది. మీ దంతాలను సంరక్షించడం కోసం పచ్చి జామకాయను తీసుకొని, దానిపై ఉప్పును జల్లుకొని రోజులో రెండు సార్లు నములుతూ తినండి.

  3. తెల్లని వెనిగర్ :

  3. తెల్లని వెనిగర్ :

  ఇందులో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలను కలిగి ఉన్నందున, దంతాలపై ఏర్పడిన పాచిని తొలగించి, మళ్లీ రాకుండా నిరోధించగలదు. తెల్లని వెనిగర్లో ఉన్న ఎసిటిక్ ఆమ్లం, పంటి యొక్క "పైపూతను" దెబ్బ తీయలేని విధంగా ప్రోత్సహిస్తుంది. తెల్లని వెనిగర్ ద్రావణాన్ని సిద్ధం చేసుకొని మౌత్-వాష్గా ఉపయోగించుకోండి. ఒక కప్పులో సగం నీరు తీసుకొని, 2 టీస్పూన్ల తెల్లని వెనిగర్ మరియు అర టీస్పూను ఉప్పును తీసుకొని బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు చొప్పున మీ నోటిని శుభ్రం చేయటానికి ఉపయోగించండి.

  4. నారింజ పండు తొక్క :

  4. నారింజ పండు తొక్క :

  మీ దంతాలను నేరుగా శుభ్రం చేసుకోవడానికి ఈ నారింజ పండు తొక్కను ఉపయోగించవచ్చు. ఈ తొక్క తో మీ దంతాలను 2 నిమిషాలపాటు బాగా రుద్ది శుభ్రం చేసుకోవాలి. దీనిని మీరు ఒక పేస్ట్గా తయారు చేసుకొని మీ దంతాలను శుభ్రంగా తోముకోవచ్చు. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో మీ నోటిని శుభ్రపరుచుకోండి. వారంలో 2 - 3 రోజులు మీ దంతాలను ఇలానే శుభ్రపరుచుకోండి. మీ దంతాలను పట్టిపీడిస్తున్న పాచిని ఈ సులభమైన చిట్కాతో వదిలించుకోండి.

  5. కలబంద ( అలోవెరా) :

  5. కలబంద ( అలోవెరా) :

  ఇది రుచిలో చేదుగా ఉన్నా గానీ, మన దంతాలు ఎదుర్కొంటున్న పాచి సమస్యను తొలగించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి మరి కొన్ని పదార్థాలను జోడించి, మీ పళ్ళను శుభ్రం చేసే పేస్ట్గా తయారు చేసుకోండి. 1 టీస్పూను కలబంద గుజ్జును, 4 టీస్పూన్ల గ్లిజరిన్ను, 5 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా, తగినంత నిమ్మ నూనెను మరియు ఒక కప్పు నీటిని తీసుకోవాలి. ఈ మిశ్రమాలన్నింటినీ బాగా కలిపి, మీ దంతాలకు అప్లై చేయండి. మీ దంతాలకు ఉన్న పాచి సమస్య దూరమయ్యే వరకూ ప్రతిరోజు దీనిని వాడండి. ఆ తరువాత నుండి వారంలో 3 - 4 రోజులు దీనిని వాడండి.

  6. విటమిన్-సి ఉన్న పదార్థాలను వాడండి :

  6. విటమిన్-సి ఉన్న పదార్థాలను వాడండి :

  విటమిన్-సి అధికంగా కలిగివున్న స్ట్రాబెర్రీలు, టమోటాలలో యాంటీ-మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల నోటిలో ఉన్న బ్యాక్టీరియాను సమర్ధవంతంగా తొలగిస్తాయి మరియు దంతాలపై ఉన్న పాచి పెరుగుదలను నిరోధిస్తుంది. టమోటా మరియు స్ట్రాబెరీలు గుజ్జును సిద్ధం చేసుకొని మీ దంతాల మీద అప్లై చేసి, 5 నిమిషాలపాటు అలానే వదిలివేయండి. ఆ తర్వాత నోటిని శుభ్రంగా కడగండి. మీరనుకున్న ఫలితాలను సాధించేవరకూ, ఈ పద్ధతినే రిపీట్ చేయండి.

  7. మసాలా ఆహారాలను తినడం :

  7. మసాలా ఆహారాలను తినడం :

  దంతాలపై ఉన్న పాచిని వదిలించుకోవటానికి అనుసరించదగిన సులభమైన ఇంటి చిట్కా ఇది. కారంగా ఉన్న ఆహార పదార్థాలను తినడం వల్ల, మీ నోటిలో లాలాజలం ఉత్పత్తి బాగా పెరిగి, మీ పళ్ళను మరియు దంతాలను శుభ్రపరుస్తుంది. మీ దంతాలపై పేరుకున్న పాచిని వదిలించుకోవటం కోసం కొన్ని మిరియాలను నమలండి.

  English summary

  7 Home Remedies To Get Rid Of Tartar In Teeth Naturally

  This yellow hard deposit on your teeth is not very attractive to look at and is not good for oral health as well. Now running to a dentist for something like this is not quite practical, especially when you can deal with it at home. Yes, you can get rid of tartar at home with the help of these remedies. Take a look.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more