For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎక్సర్ సైజ్ అనంతరం కండరాల నొప్పా ? ఉపశమనం కల్గించే 9 మార్గాలు మీ కోసం...

By M Krishna Adithya
|

మీరు రెగ్యులర్ గా వర్కౌట్‌లు చేస్తారా ? అయితే ఎక్సర్‌సైజ్ అనంతరం మీ కండరాలు పట్టేసినట్లు నొప్పి లేస్తున్నాయా ? అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మజిల్ సోర్‌నెస్ లేదా కండరాల నొప్పి అనేది చాలా సహజమైనదే. ముఖ్యంగా బాగా ఎక్సర్‌సైజులు చేసినప్పుడే ఈ మజిల్ సోర్ నెస్ వస్తుంది. ముఖ్యంగా ఈ నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు. ఎక్సర్‌సైజ్ లో కొన్ని ప్రాథమిక నియమాలు పాటిస్తే కూడా నొప్పి రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. అలాగే డైట్‌లో కూడా కొన్ని మార్పులు కూడా మజిల్ సోర్ నెస్ నుంచి రికవర్ అయ్యే అవకాశం ఉంది.

వర్క్ అవుట్ అనంతరం సోర్ నెస్ తొలగించేందుకు కొన్ని సూచనలు ఇచ్చేందుకు ఎనీటైం ఫిట్‌నెస్ పర్సనల్ ట్రైనర్ బదల్ ఉప్రెతి, అలాగే ఆకాశ్ హెల్త్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఆశిష్ చౌదరి సిద్దంగా ఉన్నారు.

విశ్రాంతి చాలా అవసరం :

విశ్రాంతి చాలా అవసరం :

వర్కౌట్ అనంతరం విశ్రాంతి చాలా అవసరం. చాలా మంది వర్కౌట్ అనంతరం తమ రొటీన్ పనుల్లో బిజీ అయిపోతుంటారు. ఆఫీసులకు, ఇతర పనులకు వెళ్లేందుకు సమాయత్తం అవుతూ ఉరుకులు పరుగుల్లో మునిగి పోతుంటారు. అయితే వర్కౌట్ అనంతరం ఖచ్చితంగా కాసేపు విశ్రాంతి అవసరం. ఈ విశ్రాంతి సమయంలో శరీరంలోని పోషకాలు, శరీర నిర్మాణంలోనూ, కండరాలను స్థిరీకరించడంలోనూ దోహదపడతాయి.

ప్రోటీన్ పదార్థాలను స్వీకరించండి :

ప్రోటీన్ పదార్థాలను స్వీకరించండి :

ప్రోటిన్ షేక్స్, ఇతర ప్రోటీన్ బార్లను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు లభిస్తాయి. అప్పుడు కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే తమ డైట్ లో ఈ క్రింది ఆహార పదార్థాలు భాగంగా తీసుకుంటే కండరాలకు మరింత ప్రోటీన్లు సమకూర్చుకోవచ్చు. వేరుశెనగ, బాదం, పెరుగు, అరటి పళ్లను తీసుకోవాల్సి ఉంటుంది.

నీరు త్రాగండి...

నీరు త్రాగండి...

జిమ్ ఎక్కువగా వర్కౌట్ చేసే సమయంలో, తగినంత నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. మీ శరీర కండరాలు ఆ సమయంలో ఎక్కువగా నీటిని తీసుకుంటాయి. ఎక్సర్ సైజ్ అనంతరం కండరాలు నీటిని కోల్పోయి డీ హైడ్రేషన్ కు గురవుతాయి. అది చాలా ప్రమాదకరం. తప్పనిసరిగా వ్యాయామం చేసేటప్పుడు ప్రతీ గంటకు ఒకసారి నీటిని తీసుకోవాలి. వ్యాయామం చేసిన ఒక గంట సమయం అనంతరం మీ మూత్రం లేత పసుపు రంగులోనూ, లేదా రంగు లేకుండా అయినా రావాల్సి ఉంటుంది. ఒక వేళ మీ మూత్రం ముదురు పసుపు రంగులో ఉన్నట్లయితే మీ శరీరానికి ఇంకొంత నీటి అవసరం ఉంటుంది.

వ్యాయామానికి ముందు వార్మప్స్ మరిచిపోవద్దు...

వ్యాయామానికి ముందు వార్మప్స్ మరిచిపోవద్దు...

చాలా మంది వ్యాయామానికి ముందు వార్మప్స్ చేయడం మరిచి పోతుంటారు. అది చాలా వరకూ ప్రమాదకరం. తాము ఎంత రిస్క్ తీసుకోబోతున్నారో గుర్తించలేరు. మీ వర్కౌట్ కు ముందు చక్కగా వార్మప్ చేయడం అలవాటు చేసుకుంటే ఎలాంటి రిస్క్ ఉండదు. అలాగే మీ కండరాలు బరువైనవి ఎత్తినప్పుడు నొప్పి కలగడం, కండరాలు పట్టేయడం వంటి రిస్కులు తలెత్తే అవకాశం ఉండదు. అలాగే చిన్నపాటి వ్యాయామాలు, అలాగే కొన్ని స్ట్రెచ్ లు చేయడం వల్ల వర్కౌట్ కు అదనపు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.

కండరాల నొప్పి ఉన్నా ఎక్సర్ సైజ్ మరువద్దు..

కండరాల నొప్పి ఉన్నా ఎక్సర్ సైజ్ మరువద్దు..

కండరాల నొప్పి ఉన్నప్పటికీ ఎక్సర్ సైజ్ కొనసాగించాలి. అది బిగుసుకుపోయిన మీ కండరాలను కాస్త వదులు చేసి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే కండరాల్లో నొప్పికి కారణమై పేరుకుపోయిన లాక్టిక్ యాసిడ్ ను తొలగిస్తుంది. అయితే కండరాల నొప్పి ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఎక్సర్ సైజ్ చేయకూడదు. ఒక చిన్నపాటి జాగింగ్ కూడా మజిల్ సోర్‌నెస్ తొలగించేందుకు ఉపయోగపడుతుంది.

మసాజ్ లేదా ఐస్ ప్యాక్ వాడండి..

మసాజ్ లేదా ఐస్ ప్యాక్ వాడండి..

వ్యాయామం అనంతరం, 20 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఫలితంగా బిగుతైన కండరాలు కాస్త వదులై శరీరానికి ఉపశమనం కలుగుతుంది. అలాగే మీ శరీరానికి అవసరమైన ద్రవాలు లభిస్తాయి. మసాజ్ ను మీరు స్వంతంగా చేసుకోవచ్చు. మసాజ్ స్టిక్ లేదా ఫోమ్ రోలర్ ఉపయోగించి చేసుకోచ్చు. నొప్పిమరింత ఎక్కువగా ఉంటే ఐస్ ప్యాక్ వాడాలి. కండరాలునొప్పితో వాచినప్పుడు ఓ పదినిమిషాల పాటు ఐస్‌ప్యాక్ పెట్టడం వల్ల కండరాలకు ఉపశమనం లభిస్తుంది.

చెర్రీస్ తో అదనపు లాభం..

చెర్రీస్ తో అదనపు లాభం..

వ్యాయామం అనంతరం చెర్రీ పళ్లను పుష్కలంగా తీసుకోవాలి. ఫలితంగా కండరాలకు కావాల్సినంత ఆక్సిజన్ సప్లై అవుతుంది. తద్వారా కండరాల వాపు ఉంటే తగ్గిపోతుంది. వర్కౌట్ అనంతరం వచ్చే నొప్పులు తగ్గించేందుకు చెర్రీస్ చాలా ఉపయోగపడతాయి.

నిద్ర కూడా అవసరమే..

నిద్ర కూడా అవసరమే..

మీకు సమయం మిగిలితే ఒక చిన్న కునుకు తీయండి అది ఎంతో అవసరం. కనీసం ఒకటి లేదా రెండు గంటల పాటు నిద్ర పోయినట్లయితే మీ శరీరం విశ్రాంతి లభించి కండరాల నొప్పి తగ్గుతుంది. శరీరం రిపేర్ చేసుకునేందుకు విశ్రాంతి సమయం చక్కగా ఉపయోగపడుతుంది.

షవర్ చేయడం ఎన్నో ఉపయోగాలు..

షవర్ చేయడం ఎన్నో ఉపయోగాలు..

స్నానం అనేది కండరాల ఉపశమనానికి ఎంతో దోహద పడుతుంది. అలాగే శరీరం శుభ్రంగా ఉంచుకునేందుకు షవర్ స్నానం ఎంతో ఉపయోగకరం. వర్కౌట్ చేసిన తర్వాత కండరాల వాపు లేదా నొప్పిని తగ్గించేందుకు షవర్ స్నానం చాలా ఉపయోగపడుతుంది. అలాగే జాయింట్ల నొప్పులు, ఇతర శరీర భాగాల నొప్పులను ఉపశమనం కలిగించేందుకు కూడా షవర్ స్నానం ఉపకరిస్తుంది.

మరింకేందుకు ఆలస్యం ఎంచక్కా.. పైన పేర్కొన్న నియమాలు పాటించి మీ కండరాల నొప్పులను తగ్గించుకోండి.

English summary

9 Easy Ways To Bring Relief To Post-Workout Muscle Soreness

Do you workout regularly? Have you been dealing with muscle soreness after your workouts? Calm down, you are not the only one. Muscle soreness is a common problem faced by many after an intense workout session. Though you can't completely get rid of it but what you can do is to ease the pain with proper care. Other than following a few basic rules while exercising, you also need to tend to your diet and take some time out to relax to help your muscles recover.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more