For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెల్లుల్లి నిజంగానే బరువు తగ్గించడంలో సహాయం చేస్తుందా? మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఇవే.

వెల్లుల్లి నిజంగానే బరువు తగ్గించడంలో సహాయం చేస్తుందా? మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఇవే.

|

సాధారణంగా వెల్లుల్లిని ఆహారంలో ఒక సుగంధ ద్రవ్యం వలె వినియోగిస్తారు, ఈ వెల్లుల్లి ఆహారానికి రుచిని మాత్రమే కాకుండా సువాసనని కూడా ఇవ్వగలదు. అంతేకాకుండా ఆహార ప్రణాళికలో వెల్లుల్లిని కలిగి ఉండటం కారణంగా, అనేక ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చునని మనం ఇదివరకే అనేక వ్యాసాలలో తెలుసుకున్నాము.

ఈ వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, రోగ నిరోధక శక్తి, అకాల వృద్ధాప్య నివారణా తత్వాలతో పాటు, రక్తనాళాల నష్టం వంటి సమస్యల నుండి కాపాడగలిగే పోషక తత్వాలు కూడా ఇందులో ఉన్నాయి. గుండె జబ్బు, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషించగలదు. అంతేకాకుండా ఊబకాయం తొలగించడంలో లేదా బరువును కోల్పోవడంలో కూడా సహాయపడుతుందని మీకు తెలుసా?

వెల్లుల్లి నిజంగానే బరువు తగ్గించడంలో సహాయం చేస్తుందా ? మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఇవే.

Can Garlic Help In Losing Weight?

వెల్లుల్లి యొక్క పోషకవిలువలు :

వెల్లుల్లి, విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్, సెలీనియం, పాస్ఫరస్, క్యాల్షియం, ఐరన్, మరియు రాగి వంటి ఇతర ఖనిజాలకు ప్రధాన మూలముగా ఉంటుంది. అందుచేతనే రోజువారీ ఆహార ప్రణాళికలో భాగంగా కనీసం నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవలసినదిగా పెద్దలు సూచిస్తుంటారు. జీర్ణ మరియు జీవ క్రియలు చక్కగా కొనసాగుటకు, కొందరు పరగడుపునే వెల్లుల్లిని తీసుకొనుటకు సుముఖత చూపుతుంటారు.

బరువు నష్టములో వెల్లుల్లి సహాయం :

బరువు నష్టములో వెల్లుల్లి సహాయం :

ఒక కొరియన్ అధ్యయన పరిశోధనల ఫలితాల ప్రకారం ఇచ్చిన నివేదికలో, బరువు నష్టంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషించగలదని తేలింది. అలిసిన్ సమ్మేళనాల ఉనికి కారణముగా ఇది సాధ్యమవుతుందని చెప్పబడినది.

2011లో జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించబడిన అధ్యయనంలో శరీరంలోని కొవ్వుతో వెల్లుల్లికి గల సంబంధాన్ని గురించిన వివరములను తెలుపబడినది.

ముఖ్యముగా వ్యాయామంతో కూడిన ప్రణాళికలో భాగంగా వెల్లుల్లిని కూడా తీసుకోవడం మూలంగా ఉత్తమ ప్రయోజనాలను పొందినట్లుగా తెలుపబడింది. అంతేకాకుండా రుతువిరతి తరువాత కూడా మహిళలు హృదయ సంబంధ వ్యాధులకు గురికాకుండా కాపాడగలదని తేలింది.

వంటకు ఉపక్రమించే ముందు తాజా వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేసి తరువాత వినియోగించడం మూలముగా బరువు తగ్గడంలో ఉత్తమ ప్రయోజనాలను పొందగలరు. అంతేకాకుండా వంటకు కనీసం పది నిమిషాల ముందు వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేసి వంటకు వినియోగించడం ద్వారా పొందే ప్రయోజనాలు, అప్పటికప్పుడు క్రష్ చేసి వేయడం కన్నా ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

వెల్లుల్లిని క్రష్ చేసినప్పుడు, దాని నుండి ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసే సమ్మేళనాలు ఎక్కువ విడుదలవుతాయి. క్రమంగా వాటి యొక్క పూర్తి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

వెల్లుల్లి యొక్క ఇతర ఆరోగ్య ప్రయోజనాలు :

వెల్లుల్లి యొక్క ఇతర ఆరోగ్య ప్రయోజనాలు :

వెల్లుల్లిలో అలిసిన్ అనే ఒక చురుకైన సమ్మేళనం ఉంటుంది. వెల్లుల్లి నుండి వచ్చే ఘాటైన వాసనకు ఇదే కారణం. వెల్లుల్లి యొక్క ఇతర ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలుసుకోవడానికి క్రింది విభాగాన్ని తనిఖీ చేయండి.

 1. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది :

1. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది :

వెల్లుల్లిలో ఉండే సహజ సిద్ధమైన సమ్మేళనాలు రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరించగలవు. ముఖ్యముగా ముడి వెల్లుల్లి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని, క్రమముగా ఎథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని 2006వ సంవత్సరములో ఒక అధ్యయనం కనుగొన్నది.

ముడి వెల్లుల్లి తినడం కారణముగా గుండె జబ్బు యొక్క ప్రమాదం తగ్గుతుంది, దీనికి కారణం గుండెజబ్బులు 80% వరకు మధుమేహం చేత ప్రభావితమవ్వడమే. మధుమేహ సమస్యలు ఉన్నవారికి జీవక్రియల సమస్యలు సర్వసాధారణంగా ఉంటుంది. తగ్గించే క్రమంలో ఆరోగ్యం మీద పూర్తి దృష్టిసారించవలసి ఉంటుంది.

2. విషతుల్య భారలోహాల తీవ్రతను తగ్గించడం :

2. విషతుల్య భారలోహాల తీవ్రతను తగ్గించడం :

శరీరంలోని భార లోహాల నిర్విషీకరణకు వెల్లుల్లి సహకారం అందిస్తుంది. వెల్లుల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు భార లోహాల విషతుల్య రసాయనాల కారణంగా జరిగే అవయవ నష్టం నుండి రక్షించడానికి సహాయపడుతాయి.

3. రక్తపోటును తగ్గిస్తుంది :

3. రక్తపోటును తగ్గిస్తుంది :

అధిక రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులు ముడి వెల్లుల్లిని తరచుగా పరిమితి మించకుండా తీసుకోవడం మూలముగా, రక్తపోటు తగ్గుముఖం పట్టడమే కాకుండా రక్తపోటుకు అనుసంధానంగా ఉండే హృదయ సంబంధ వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి. అనగా గుండె పోటు, స్ట్రోకు మొదలైనవి.

4. చెడు కొలస్ట్రాల్ తగ్గిస్తుంది :

4. చెడు కొలస్ట్రాల్ తగ్గిస్తుంది :

వెల్లుల్లి, శరీరంలోని (ఎల్.డి.ఎల్) చెడు కొలెస్ట్రాల్ స్థాయిలలను‌ 10 నుండి 15 శాతం వరకు తగ్గించగల శక్తివంతమైన సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. శరీరంలో చెడు కొలస్ట్రాల్ పెరుగుతున్న యెడల హృదయ సంబంధ వ్యాధుల తీవ్రత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా రక్త నాళాలలో కొవ్వు పేరుకుపోవడం మూలంగా రక్తప్రవాహానికి అవరోధంగా మారి స్ట్రోక్ లేదా గుండె పోటుకు దారితీస్తుంది.

మీ ఆహార ప్రణాళికలో వెల్లుల్లి చేర్చుకునే విధానం :

మీ ఆహార ప్రణాళికలో వెల్లుల్లి చేర్చుకునే విధానం :

1. అల్పాహారంలో ఆమ్లెట్ రూపంలో, ముక్కలు చేసిన వెల్లుల్లిని జతచేయడం ద్వారా తీసుకోవచ్చు.

2. మధ్యాహ్న భోజనంలో ఏదైనా కూరగాయలను వండుతున్నప్పుడు తురిమిన వెల్లుల్లిని జత చేయవచ్చు.

3. డిన్నర్ : మష్రూమ్స్ ఫ్రై చేయునప్పుడు తరిగిన వెల్లుల్లిని జత చేయడం మంచిది.

చిట్కా :

చిట్కా :

పరగడుపునే ఖాళీ కడుపుతో తురిమిన వెల్లుల్లి రెబ్బలను తేనెతో కలిపి తీసుకోవడం మూలముగా ఉత్తమ ప్రయోజనాలను పొందగలరు. ఈ చిట్కా రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, బరువు తగ్గడంలో, మరియు శరీరాన్ని బలంగా ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడగలదు. ఆయుర్వేదంలో వెల్లుల్లికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది కూడా.

ముఖ్యంగా బరువు తగ్గాలని సంకల్పించుకున్నవారికి ప్రధాన ఆరోగ్య సూత్రం వలె ముడి వెల్లుల్లిని సూచించవచ్చు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Can Garlic Help In Losing Weight?

Garlic is an excellent source of vitamin B6, vitamin C, manganese, and selenium. It is also a good source of other minerals like phosphorus, potassium, calcium, iron and copper. Aged garlic extract is known for aiding in weight loss when combined with exercise. Garlic can also help in fat burning, reducing blood pressure and detoxification.
Story first published:Monday, August 13, 2018, 16:38 [IST]
Desktop Bottom Promotion