For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఆల్కహాల్ ఎలర్జీకి గురయ్యే అవకాశాలు ఉన్నాయా?

|

గ్లాస్ వైన్ లేదా ఏదైనా ఇతర ఆల్కహాల్ సంబంధిత ద్రావకాలను తీసుకున్న వెంటనే వాంతి చేసుకునే అలవాటు ఉందా? లేదా ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ముక్కులో వికారం లేదా మరేదైనా అసౌకర్యానికి గురవుతున్నారా? వీటన్నిటికీ మీ సమాధానం అవును అయితే మీకు ఖచ్చితంగా మద్యపానానికి సంబంధించిన అలర్జీ ఉందని అర్థం‌.

మద్యపానం‌ వలన అసహనం లేదా అసౌకర్యం కలగడానికి కారణం ?

ఆల్కహాల్ అసహనం ఏమిటి?

ఆల్కహాల్ అసహనం అనేది మీ శరీరం మద్యం జీర్ణంచేసుకోలేని ఒక జన్యుపరమైన స్థితి, ఇది మద్యం తీసుకునేటప్పుడు కొన్ని అసాధారణ దుష్ప్రభావాలకు దారితీస్తుంది. చిన్నమొత్తంలో మద్యం సేవించినా కూడా అలెర్జీలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి.

అనేకమంది అలర్జీని కేవలం ఆ క్షణాన అసౌకర్యంగానే భావిస్తారు. కానీ, అనేకమంది వారికే తెలీకుండా గోధుమ, బార్లీ, బియ్యం, హాప్స్ , రై, ద్రాక్ష మరియు ఈస్ట్ వంటి పదార్ధాలు అలర్జీ కారకాలుగా కలిగి ఉన్నారు అన్నది సత్యం.

can-you-be-allergic-to-alcohol

1. తగిన ఎంజైమ్స్ లేకపోవడం - మద్యంలో ఉన్న విషతుల్య రసాయనాలను విచ్చిన్నం చేయడానికి మీ శరీరం తగిన మోతాదులో ఎంజైమ్లను కలిగిలేనప్పుడు లేదా పనిచేయని నిస్తేజమైన ఎంజైములను కలిగి ఉండడం ద్వారా ఈ అసహనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. క్రమంగా మద్యపానం కారణముగా వికారం వంటి అసాధారణ పరిస్థితులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనేకమంది ప్రజలు, ముఖ్యంగా ఆసియా సంతతికి చెందినవారు ఎసిటాల్డిహైడ్ డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ కలిగిలేరు. ఈ ఎంజైమ్ మద్యంలోని విషరసాయనాలను విచ్చిన్నంచేసే శక్తిని కలిగి ఉంటుంది.

ఈ ఎంజైమ్ తగినంతగా లేనప్పుడు, ఆల్కహాల్లోని టాక్సిన్ ఎసిటాల్డిహైడ్, తక్కువ హానికరమైన ఎసిటిక్ యాసిడ్ వలె మారదు. క్రమంగా ఎసిటాల్డిహైడ్ కాలేయంలో చేరుతుంది, కొన్నిసార్లు శరీరంలో క్యాసినోజెనిక్ ప్రభావాలను సైతం కలిగి ఉంటుంది. దీనిని సాధారణంగా “ఏషియన్ ఫ్లష్ రియాక్షన్” వలె సూచిస్తారు.

2. హిస్టామైన్ ఎలర్జీ - హిస్టామైన్లు మన శరీరంలో సహజంగా జనించే రసాయనాలుగా ఉంటాయి, మరియు మద్యపానీయాలలో కూడా వీటి ఉనికి ఉంటుంది. ఈ హిస్టామిన్ సరిగా శరీరం, కడుపులోనికి తీసుకోకపోతే, అది అలెర్జీ రియాక్షన్స్ వలె మారి వికారం, లేదా అసహనానికి కారణమవుతుంది.

3. సల్ఫైట్స్ అలర్జీ - బాక్టీరియా పెరుగుదలను నివారించడానికి ఆహారం మరియు పానీయాల సంరక్షణలో పురాతన కాలం నుంచి సల్ఫైట్లు ఉపయోగించబడ్డాయి. సహజంగా వీటి ఉనికి ఎక్కువగా వైన్లో ఉంటుంది. మద్యపానీయాలలో వాటి ఉనికి కారణంగా, సల్ఫేట్ అలెర్జీకి గురయ్యే వ్యక్తులు మద్యపానం చేయలేరు.

4. కొన్ని మందులు - కొన్ని ఔషధాల వినియోగం, ముఖ్యంగా డిసల్ఫిరామ్, మెట్రోనిడజోల్, లేదా నిల్యూటమైడ్, మద్యంతో పాటు కలిపి తీసుకున్న ఎడల అసహనం కలిగే అవకాశాలు ఉన్నాయి.

మద్యం అలర్జీ మీకు ఉంది అనడానికి సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఆల్కహాల్ అలర్జీ కలిగిన వ్యక్తికి అతి సాధారణంగా ముక్కు అసౌకర్యం మరియు చర్మసంబంధిత సమస్యలు వంటి సంకేతాలు ప్రధానంగా ఉంటాయి.

ఇతర సంకేతాలు మరియు లక్షణాలు:

• వికారం.

• వాంతులు.

• చర్మం, కళ్ళు, నోరు మరియు ముక్కు ప్రాంతాలలో దురద మరియు అసౌకర్యం.

• దద్దుర్లు, తామర మరియు ఇతర చర్మవ్యాధులు .

• శ్వాస సమస్యలు, తీవ్రమైన గురక.

• ఇప్పటికే ఆస్త్మా ఉన్న ఎడల, పరిస్థితులు మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు.

• కడుపునొప్పి, అతిసారం.

• తలనొప్పి, గుండెల్లో మంట లేదా గాస్ సమస్యలు.

• మైగ్రేన్, మైకము, స్పృహ కోల్పోవడం.

• అల్ప రక్తపోటు.

అనేకమంది హాంగోవర్ గురవడం మనం తరచూ చూస్తుంటాము. కానీ అలర్జీ హాంగోవర్ మరియు, మామూలు హాంగోవర్ మద్య ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, మద్యం తీసుకున్న మరుసటిరోజు సంభవించే హ్యాంగోవర్ వలె కాకుండా, తీసుకునే సందర్భంలోనే మీరు అసౌకర్యానికి గురవడం.

సరైన సమయంలో గుర్తించని ఎడల, ఈ పరిస్థితి రానురాను పెరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావొచ్చు. కావున వీటిని విస్మరించడం తగదు.

ఈ రకమైన అసహనం లేదా అలర్జీ ఎంత కాలం ఉంటుందో తెలీదు. కొన్ని మందులతో చికిత్స చేయవచ్చు, కాని మద్యాన్ని పూర్తిగా నివారించడమే ఉత్తమ పరిష్కారం.

మీకు అలర్జీ ఉందని ఎలా నిర్ధారణ చేయబడుతుంది?

1. మీరు ఈ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉన్న ఎడల మీ వైద్యుని సంప్రదించడం ఉత్తమం.

మీ వైద్యుడు, ఈ లక్షణాలకు కారణమయ్యే ఆల్కహాల్ గురించి కొన్ని ప్రశ్నలు అడగవచ్చు. మీ కుటుంబంలో ఈ అలర్జీల సంబంధిత చరిత్రల గురించి, మీరు ఎదుర్కొంటున్న ప్రధాన సంకేతాల గురించి, అలర్జీల తీవ్రతరం, మద్యపానానికి అలర్జీలకు మద్య సమయం, మీ ఇతర ఆరోగ్య పరిస్థితులు మొదలైన వాటి గురించి ఎక్కువగా అడిగే అవకాశాలు ఉన్నాయి.

2. మీ వైద్యుడు, మీకు నిజమైన అలెర్జీని కలిగి ఉన్నట్లుగా అనుమానించినట్లయితే, అలెర్జీ సంబంధిత పరీక్ష జరుగుతుంది. స్కిన్ ప్రిక్ టెస్ట్ అనేది సాధారణంగా చేయు పరీక్షగా ఉంటుంది. ఈ విషయంలో, మీ డాక్టర్ మీ చర్మాన్ని లాన్సెట్ తో స్క్రాచ్ చేయడం లేదా గుచ్చడం జరుగుతుంది. ఒక డ్రాప్ అలెర్జీ కారకాన్ని ఆ ప్రాంతంలో వేయడం ద్వారా ఈ పరీక్ష జరుపబడుతుంది. మీకు అలర్జీలను పక్కాగా నిర్ధారించే పరీక్షగా ఇది ఉంటుంది.

3. ఓరల్ ఛాలెంజ్ టెస్ట్ అని మరో టెస్ట్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ పరీక్షలో, వారు సమస్యాత్మకంగా భావించిన ద్రావణాన్ని కొద్దిగా సేవించవలసినదిగా సిఫార్సు చేస్తారు. క్రమంగా ప్రతిచర్యలు గమనించబడతాయి.

4. మద్యం సంబంధిత అలర్జీలను నిర్ధారించడానికి, రక్త పరీక్షలను కూడా చేసే అవకాశాలు ఉన్నాయి.

మీ డాక్టర్ చెప్పిన సూచనలను పాటిస్తూ, అసలు అలర్జీ కారకాల గురించిన వివరాలు తెలుసుకోవడం ముఖ్యం. మీరు నిజంగా అలర్జీలకు ప్రభావితమయ్యారని, లేదా సల్ఫైట్స్,హిస్టామిన్స్ మొదలైన వాటిలో దేని అలర్జీకు గురయ్యారో తెలుసుకుని, ఆ ప్రకారంగా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఏది ఏమైనా మద్యపానం ఆరోగ్యానికి హానికరం.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి, ఇటువంటి అనేక ఆరోగ్యకర అంశాల కోసం తరచూ బోల్డ్స్కీని సందర్శించండి.

English summary

can-you-be-allergic-to-alcohol

It is said that if you are allergic to components of alcohol such as wheat, barley, rice, hops, eye grapes, etc. you might be allergic to alcohol. This is due to the presence of histamines. When this histamine is not properly ingested by the body, it accumulates causing an onset of allergic reactions and alcohol intolerance.
Story first published: Saturday, August 25, 2018, 12:15 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more