For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎక్కడంటే అక్కడ దురద పెడుతుందా.. ఈ ఆహారాలు తీసుకుంటే చాలు

స్వల్పంగా దురదగా ఉంటూ చర్మం మీద దద్దుర్లు కూడా వస్తే, అది థైరాయిడ్‌ సమస్య వల్ల, లేదా ఐరన్‌ లోపంతో వచ్చే రక్తహీనత వల్ల కూడా కావచ్చు. కొందరిలో ఈ సమస్య కిడ్నీ, కాలేయ వ్యాధుల వల్ల వస్తుంది.చర్మం, దురద.

|

ఏదో కాసేపు వచ్చీపోయే దురద గురించి ఎవరూ పెద్ద కలవరపడరు. కాలుష్యాల మధ్యే కదా ఉంటున్నాం... అదేదో అయి ఉంటుందిలే అని సరిపెట్టుకుంటారు. అది సరే కానీ, రోజులూ వారాలూ గడుస్తున్నా ఆ దురద తగ్గకపోతే ఏమనుకోవాలి? వాస్తవానికి దురద అనేది అన్నిసార్లూ దుమ్మూ ధూళి వల్ల వచ్చే చర్మ సమస్యే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దురద ఒక లక్షణంగా ఉండే వాటిల్లో చర్మానికి సంబంధంలేని వ్యాధులెన్నో ఉన్నాయి.

మందుల దుష్ప్రభావాల వల్ల..

మందుల దుష్ప్రభావాల వల్ల..

దీర్ఘకాలికంగా వాడుతున్న కొన్ని రకాల మందుల దుష్ప్రభావాల వల్ల కూడా దురద సమస్య రావచ్చు. ఒకే రకమైన మందుల్ని ఎక్కువ కాలంగా వాడటం వల్ల కావచ్చు లేదా ఏకకాలంలో రెండు మూడురకాల మందులు వాడటం వల్లనైనా ఈ సమస్య రావచ్చు. ముఖ్యంగా ఆస్పిరిన్‌, ఏసీఇ ఇన్హిబిటార్స్‌తో పాటు, అధికరక్తపోటు వైద్యంలో తీసుకునే మాత్రలు, యాంటీబయాటిక్స్‌ వల్ల కూడా దురద వచ్చే అవకాశం ఉంది.

ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌

ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌

కొన్నిసార్లు ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ చికిత్సలో తీసుకునే యాంటీబయాటిక్స్‌, చర్మంలోని మంచి బ్యాక్టీరియాను చంపేస్తాయి. దీని వల్ల కొందరు దురద బారిన పడుతుంటారు. శరీరానికి పడని కొన్ని రకాల మందుల వల్ల కూడా కొందరిలో ఈ సమస్య రావచ్చు. శరీరంలోని కీలక అవయవాలు వ్యాధిగ్రస్తమైనప్పుడు కూడా కొందరు దురద బారిన పడుతుంటారు.

చర్మం మీద దద్దుర్లు

చర్మం మీద దద్దుర్లు

స్వల్పంగా దురదగా ఉంటూ చర్మం మీద దద్దుర్లు కూడా వస్తే, అది థైరాయిడ్‌ సమస్య వల్ల, లేదా ఐరన్‌ లోపంతో వచ్చే రక్తహీనత వల్ల కూడా కావచ్చు. కొందరిలో ఈ సమస్య కిడ్నీ, కాలేయ వ్యాధులు, లోలోపల ఉండే కొన్నిరకాల కణుతుల వల్ల లేదా నరాల సంబంధితమైన న్యూరోపతి వల్ల కూడా రావచ్చు. కొందరిలో చర్మం బాగా పొడిబారినప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది.

మానసిక రుగ్మతలవల్ల కూడా

మానసిక రుగ్మతలవల్ల కూడా

అరుదుగా కొన్నిసార్లు మానసిక రుగ్మతలవల్ల కూడా దురద రావచ్చు. కొందరిలో పక్షవాతానికి గురైన తర్వాత లేదా మధుమేహం వల్ల కూడా దురద సమస్య మొదలవుతుంది. దురదతో పాటు దద్దుర్లు కూడా రావడం అలర్జీల కారణంగా కావచ్చు. లేదా సొరియాసిన్‌ వంటి తీవ్రమైన చర్మవ్యాధుల వల్ల జరగవచ్చు. అయితే, దురదకు గురయ్యే ప్రత్యేక ప్రదేశం అంటూ ఏదీ లేదు.

మందులు వాడడం

మందులు వాడడం

శరీరంలోని ఏ భాగంలోనైనా అది రావచ్చు. జిరోసిన్‌ అంటే పొడి చర్మం కారణంగా వయో వృద్ధులో దురద సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వృద్ధాప్యంలో ఎక్కువ మందిలో సహజంగా ఉండే పలురకాల వ్యాధుల వల్ల ఏకకాలంలో ఎక్కువ మందులు వాడుతూ ఉంటారు. ఇది కూడా దురదకు కారణమవుతుంది.

రక్తహీనత వల్ల

రక్తహీనత వల్ల

అయితే వృద్ధాప్యం కాకపోయినా, కొందరిలో రక్తహీనత వల్ల కూడా ఈ దురద సమస్య రావచ్చు. ఏమైనా, ఏదో నాలుగు రోజులు వచ్చి దానికదే తగ్గిపోయే దురదను అంతపెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినా, రోజులూ, వారాల పర్యంతం దురద అలాగే కొనసాగుతున్నప్పుడు, రోజురోజుకూ అది పెరుగుతూ పోతున్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఆ సమస్య వచ్చీరాగానే ముందు జనరల్‌ ఫిజిషియన్‌ను, ఆయన సూచిస్తే మరే ఇతర నిపుణుడ్ని సంప్రదించడం తప్పనిసరి.

దురద నుంచి విముక్తికి

దురద నుంచి విముక్తికి

ఈ సమస్య ఎక్కువగా వేధిస్తున్న వారు, ఎక్కువ మసాలాలు వేసిన వంటకాలు, రసాలు ఇవేవీ తరుచూ తీసుకోకూడదు.అదేపనిగా యాంటీబయాటిక్‌ సోప్స్‌ వాడకుండా సాదా సీదా సబ్బులతోనే స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి.ఉన్ని లేదా శరీరంలో వేడి పుట్టించే దుస్తులేవీ ధరించకూడదు. పగలంతా ధరించే దుస్తులు, రాత్రివేళ ధరించే డ్రస్‌లు, బెడ్‌షీట్‌లు, బ్లాంకెట్స్‌ ఎప్పుడూ ఉతికినవి, పూర్తిగా పొడిగా ఉన్నవేవాడాలి.

స్టెరాయిడ్స్‌ వాడకూడదు

స్టెరాయిడ్స్‌ వాడకూడదు

దురద నుంచి ఉపశమనానికి, అనెస్థిటిక్స్‌ గానీ, కార్టికోస్టెరాయిడ్‌ స్టెరాయిడ్స్‌ గానీ ఎప్పుడూ వాడకూడదు. దురద మరీ ఎక్కువగా ఉంటే, రసాయనాల్లేని సహజ సిద్ధమైన లోషన్‌లు వాడవచ్చు. వీటితో పాటు చర్మం పొడిబారకుండా, ఎండలో ఎక్కువగా తిరగడం తగ్గించాలి. ఎప్పుడైనా తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే స్వల్పంగా సన్ స్రీన్స్ వాడడం మంచిది.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె

అయితే ఎలాంటి చ‌ర్మ స‌మ‌స్య అయినా కింద సూచించిన ప‌లు చిట్కాల‌ను పాటిస్తే సుల‌భంగా త‌గ్గిపోతుంది.సూక్ష్మ జీవులను చంపే సహజ సిద్ధ‌మైన గుణాలను కలిగే ఉండే కొబ్బరి నూనె చాలా రకాల చర్మ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఒకవేళ మీకు దురదలు వ‌స్తుంటే ప్రభావిత ప్రాంతంలో కొద్దిగా కొబ్బరి నూనెను రాసి మర్ద‌నా చేస్తే ఆ దుర‌ద‌ల బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

చ‌ర్మాన్ని సంర‌క్షించే ఎన్నో గుణాలు ఆలివ్ ఆయిల్‌లో ఉంటాయి. ఆలివ్ ఆయిల్‌ను స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంపై రాసి ఆ భాగానికి వేడి గుట్ట చుట్టాలి. అలా కొంత సేపు ఉంచాలి. అవ‌స‌రం అనుకుంటే ఆలివ్ ఆయిల్‌, కొబ్బ‌రినూనెల‌ను క‌లిపి కూడా ఇలా చేయ‌వ‌చ్చు. దీంతో చ‌ర్మ స‌మ‌స్య‌ల నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు.

వేప

వేప

వేప చెట్టు ఆకుల‌ను కొన్నింటిని తీసుకుని బాగా నూరి మిశ్ర‌మంగా చేయాలి. ఆ మిశ్ర‌మాన్ని చ‌ర్మంపై స‌మ‌స్య ఉన్న ప్రాంతంలో రాయాలి. కొంత సేప‌టి త‌రువాత క‌డిగేయాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల వేప ఆకుల్లో స‌హ‌జ‌సిద్ధంగా ఉండే యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. చ‌ర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా మారుస్తాయి.

తేనె, దాల్చిన చెక్క‌

తేనె, దాల్చిన చెక్క‌

ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిల‌ను తీసుకుని వాటిని క‌లిపి పేస్ట్‌లా చేసి చ‌ర్మంపై రాయాలి. వీటిల్లో ఉండే యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను పోగొడ‌తాయి. చ‌ర్మానికి మృదుత్వాన్ని తెస్తాయి.

నిమ్మ‌కాయ

నిమ్మ‌కాయ

నిమ్మ‌కాయ‌ల్లో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. ఇది చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను పోగొడుతుంది. చ‌ర్మంపై నిమ్మ‌కాయ ముక్క‌ను రుద్ది కొంత‌సేపు ఆగాక క‌డిగేస్తే చ‌ర్మం కాంతివంతమ‌వుతుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు పోతాయి.

కలబంద

కలబంద

చ‌ర్మంపై ద‌ద్దుర్లు, దుర‌ద వ‌చ్చే వారు, మొటిమ‌లు, మ‌చ్చ‌లు ఉన్న‌వారు వాటిపై రోజూ క‌ల‌బంద గుజ్జును రాస్తూ ఉంటే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

బొప్పాయి

బొప్పాయి

చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో బొప్పాయి పండు గుజ్జు కూడా బాగానే ప‌నిచేస్తుంది. దీన్ని చ‌ర్మంపై స‌మ‌స్య ఉన్న ప్రాంతంలో రోజూ రాస్తూ ఉంటే బాధ నుంచి విముక్తి చెంద‌వ‌చ్చు.

English summary

effective home remedies to treat skin allergies

effective home remedies to treat skin allergies
Story first published:Wednesday, May 9, 2018, 12:16 [IST]
Desktop Bottom Promotion