గ్యాస్ ని కలిగించే ఫుడ్ కాంబినేషన్స్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

మీ డైట్ లో సరైన ఫుడ్ కాంబినేషన్స్ ను వాడుతున్నారా? సరైన ఫుడ్ కాంబినేషన్స్ ని పాటించడం అనేది ఆరోగ్యమైన డైట్ కి అవసరమైన ముఖ్యాంశం. తప్పుడు ఫుడ్ కాంబినేషన్స్ ని వాడటం ద్వారా ఆరోగ్యంపై అనేక విధాలా ప్రతికూల ఫలితాలుంటాయి.

చాలా మంది ఫుడ్ కాంబినేషన్స్ ని సరిగ్గా పాటించకపోవడం వలనే తీవ్రమైన అనారోగ్యానికి గురవుతుండడం జరుగుతుంది. ఈ విషయంపై అవగాహన లేకుండా అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. వారి అనారోగ్యానికి రాంగ్ ఫుడ్ కాంబినేషన్స్ కారణమన్న విషయాన్ని లేటుగా తెలుసుకుంటారు.

రాంగ్ ఫుడ్ కాంబినేషన్స్ ని తీసుకోవడం ద్వారా గ్యాస్ సమస్య బారిన పడే ప్రమాదముంది. అయితే, రాంగ్ ఫుడ్ కాంబినేషన్స్ వలనే గ్యాస్ ప్రాబ్లెమ్ తలెత్తిందన్న విషయం తెలుసుకోలేకపోవటం దురదృష్టకరం.

అందుకే, మనం తీసుకునే ఆహారాల గురించి శ్రద్ధ వహించాలి. మీ డైట్ నుంచి రాంగ్ ఫుడ్ కాంబినేషన్స్ ని ఎలిమినేట్ చేయాలి.

మీరు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ కాంబినేషన్స్ గురించి ఇక్కడ వివరించాము.

భోజనం తరువాత ఫ్రూట్స్:

భోజనం తరువాత ఫ్రూట్స్:

ఫ్రూట్స్ ని మన డైట్ లో భాగంగా చేసుకోవడం తప్పనిసరి. అయితే, మిగతా ఫుడ్స్ తో ఫ్రూట్స్ ని కంబైన్ చేసినప్పుడు మాత్రం జాగ్రత్తపడాలి. భోజనం తరువాత వెంటనే ఫ్రూట్స్ ను తీసుకోకూడదు. భోజనం చేసిన వెంటనే ఫ్రూట్స్ ను తీసుకోవడం వలన డైజేషన్ ప్రాసెస్ కి అంతరాయం ఏర్పడుతుంది. అందువలన, బ్లోటింగ్ తో పాటు గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి.

డైరీ మరియు స్టార్చ్:

డైరీ మరియు స్టార్చ్:

డైరీ ప్రోడక్ట్స్ అనేవి అరగటానికి చాలా సమయం తీసుకుంటాయి. స్టార్చ్ తో కంబైన్ చేస్తే డైజెషన్ ప్రాసెస్ మరింత ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందువలన, గ్యాస్ తో పాటు బ్లోటింగ్ సమస్య తలెత్తుతుంది. డైరీ ప్రోడక్ట్స్ తో బ్రేడ్ ను తీసుకోవడం రాంగ్ ఫుడ్ కాంబినేషన్ కిందకే వస్తుంది.

ఎసిడిక్ ఫ్రూట్స్ మరియు స్టార్చ్

ఎసిడిక్ ఫ్రూట్స్ మరియు స్టార్చ్

స్టార్చ్ మరియు ఎసిడిక్ ఫ్రూట్స్ ని తీసుకోవడం వలన అనారోగ్యం తలెత్తుతుంది. ఇది డైజెషన్ ప్రాసెస్ ని నిదానపరుస్తుంది. దాంతో, గ్యాస్ మరియు ఇండైజెషన్ సమస్యలు తలెత్తుతాయి.

స్టార్చ్ మరియు షుగర్:

స్టార్చ్ మరియు షుగర్:

ఈ రెండూ పాపులర్ బ్రేక్ ఫాస్ట్ కాంబినేషన్. అయితే బ్రెడ్ తో జామ్స్ మరియు జెల్లీస్ అనేవి సరిపడవు. స్టార్చ్ ని షుగర్ తో కంబైన్ చేస్తే ఫెర్మెంటేషన్ ఏర్పడి గ్యాస్ తో పాటు బ్లోటింగ్ సమస్య ఎదురవుతుంది.

బీన్స్ మరియు ఛీజ్:

బీన్స్ మరియు ఛీజ్:

ఈ కాంబినేషన్ టెస్ట్ బడ్స్ ని ఉత్సాహపరచవచ్చు. అయితే, బీన్స్ తో డైరీ ప్రోడక్ట్స్ ని కలపకూడదు. ఇది గ్యాస్, బ్లోటింగ్ అలాగే ఇండైజేషన్ సమస్యకు దారితీస్తుంది. అందువలన, బీన్స్ ని మరియు ఛీజ్ ని కలిపి వాడటం మానుకుంటే మంచిది.

ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్:

ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్:

ఫ్రూట్స్ ని వెజిటబుల్స్ ని డైట్ లో ఇంక్లూడ్ చేయడం తప్పనిసరి. అయితే ఈ రెండిటినీ కలిపి వాడటం మాత్రం సరైన పద్దతి కాదు. గ్యాస్ మరియు బ్లోటింగ్ కు ఈ పద్దతి దారితీయవచ్చు.

మీట్ మరియు పొటాటోస్:

మీట్ మరియు పొటాటోస్:

ఈ కాంబినేషన్ పొట్టకు సరిపడదు. ప్రోటీన్ ను కార్బోహైడ్రేట్స్ తో కలిపి తీసుకోవడం వలన గ్యాస్ ప్రాబ్లెమ్స్ తలెత్తి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.

భోజనం తరువాత ద్రవపదార్థాలు

భోజనం తరువాత ద్రవపదార్థాలు

నీళ్లు లేదా బెవెరేజెస్ ను భోజనం చేసిన తరువాత వెంటనే తీసుకోవడం వలన డైజెషన్ ప్రక్రియ అనేది స్లో అవుతుంది. అందువలన, మీల్స్ కి లిక్విడ్స్ కి తగిన గ్యాప్ ను అందివ్వాలి.

బ్లోటెడ్ స్టమక్ సమస్య నుంచి ఉపశమనం కోసం సరిపడని ఆహారపదార్థాలను అవాయిడ్ చేయడం మంచిది. అందువలన, అనవసరంగా రోగాలను కొనితెచ్చుకునే సమస్య తగ్గుతుంది.

కాబట్టి, మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి రాంగ్ ఫుడ్ కాంబినేషన్స్ కి దూరంగా ఉండండి.

English summary

Food Combinations That Cause Gas

Choosing the right combination of food is as much important as choosing a right diet. Often, people wake up with a bloated tummy because of food combinations that cause gas. So, this list will help you steer clear of that.An important part of a diet is to have a combination of the right foods that go well with the body.