For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాల్మొనెల్లా బాక్టీరియా ఎగ్స్ లోకి ఎలా ప్రవేశిస్తుంది?

సాల్మొనెల్లా బాక్టీరియా ఎగ్స్ లోకి ఎలా ప్రవేశిస్తుంది?

|

తాజాగా, శుభ్రంగా, క్రాక్ అవని ఎగ్స్ లో కూడా సాల్మొనెల్లా బాక్టీరియా ఉంటుందని ఇటీవలి అధ్యయనం స్పష్టం చేస్తోంది. వీటిని తీసుకుంటే అనారోగ్యం కలిగే ప్రమాదం ఉంది. యూ.ఎస్. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ( FDA) ప్రకారం 79,000 ఫుడ్ బర్న్ ఇల్ నెస్ కేసులతో పాటు 30 మరణాలు సాల్మొనెల్లా బాక్టీరియా వలన సంభవించాయని తెలుస్తోంది. ఇది, నిజంగా షాక్ కు గురిచేసే విషయం.

సాల్మొనెల్లా బాక్టీరియా అంటే ఏంటి?

ఒక బాక్టీరియా సమూహానికి సాల్మొనెల్లా అని పేరుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ ను కలిగించే బాక్టీరియా. సాల్మొనెల్లా బాక్టీరియాతో ఇన్ఫెక్ట్ అయిన వారిలో డయేరియా, అబ్డోమినల్ క్రామ్ప్స్, ఫీవర్ మరియు వామిటింగ్ లు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఇన్ఫెక్షన్ కి గురయిన 12 నుంచి 72 గంటల లోపు కనిపిస్తాయి.

How Does Salmonella Bacteria Get Into Eggs

ఈ ఇన్ఫెక్షన్ కి చెందిన లక్షణాలు 4 నుంచి 7 రోజుల వరకూ ఉంటాయి. చాలామందికి చికిత్స లేకుండానే ఈ సమస్య తగ్గిపోతుంది. కానీ, కొన్ని సార్లు ఇన్ఫెక్షన్ తీవ్రతరం అయినప్పుడు హాస్పటలైజ్ అవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ ఇంటస్టైన్ నుంచి బ్లడ్ స్ట్రీమ్ కు విస్తరించి అలా ఇతర శరీర అవయవాలకు కూడా చేరుతుంది. అలా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది.

పిల్లలు, గర్భిణీలు, వృద్ధులతో పాటు ఇమ్యూన్ సిస్టం బలహీనంగా ఉన్నవారిలో ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారితీసే ప్రమాదం ఉంది.

క్రాక్ అవని, హోల్ ఎగ్ లో ఈ బాక్టీరియా ఉండే అవకాశం లేకపోలేదు. మరి సాల్మొనెలా కంటామినేషన్ ఎలా జరుగుతుంది. చికెన్ లోనే ఈ కంటామినేషన్ ఏర్పడుతుంది. చికెన్ ఓవరీస్ ను సాల్మొనెల్లా బాక్టీరియా కొలొనైజ్ చేసి ఎగ్ ఫార్మేషన్ దశలో ఎగ్ లోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే, సాధారణంగా కనిపించే గుడ్డులో సాల్మొనెల్లా బాక్టీరియా నక్కి ఉందని అర్థం.

How Does Salmonella Bacteria Get Into Eggs

చికెన్ గుడ్డు పెట్టిన తరువాత కూడా బాక్టీరియా కంటామినేషన్ జరిగే అవకాశం కలదు. చికెన్ తన ఇంటస్టైన్ లో బాక్టీరియాను క్యారీ చేస్తున్న సమయంలో బాక్టీరియాను తన పూప్ ద్వారా బయటకు విసర్జించే అవకాశం ఉంది. ఆ విధంగా నెస్టింగ్ సమయంలో ఎగ్ షెల్స్ పై ఈ బాక్టీరియా చేరుతుంది.

20,000 గుడ్లలో 1 ఎగ్ అనేది ఈ సాల్మొనెల్లా బాక్టీరియాతో కంటామినేట్ అయి ఉంటుందని అంచనా. లేదా 10,000 గుడ్లలో 1 ఎగ్ అయినా కంటామినేట్ అయి ఉంటుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది?

పచ్చి గుడ్లతో తయారైన ఆహారపదార్థాలకి దూరంగా ఉండాలి. పచ్చి గుడ్లతో తయారైన మిల్క్ షేక్స్, సీజర్ సలాడ్, హోంమేడ్ మయోన్నైజ్ సాస్, ఐస్ క్రీమ్ లేదా ఎగ్ నాగ్ లను అవాయిడ్ చేస్తే మంచిది. వీటిలో, ఎగ్ కి సంబంధించిన పోషకాలనేవి కుక్ చేయబడవు. దాంతో, వీటిని తీసుకున్న పిల్లలు, వృద్ధులు అలాగే గర్భిణీలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.

షెల్ ఎగ్స్ ని స్టోర్ చేయడం ఎలా?

40 డిగ్రీల ఫారెన్ హీట్ లో ఎగ్స్ ని రెఫ్రిజిరేట్ చేయాలి. లేదా ఒక కార్టన్ లో ఎగ్స్ ను ఉంచి దానిని రెఫ్రిజిరేట్ చేయాలి. ఎగ్స్ ని భద్రపరిచేటప్పుడు వాష్ చేస్తే దానిపైనున్న ప్రొటెక్టివ్ మినరల్ ఆయిల్ కోటింగ్ ను తొలగిపోతుంది. తద్వారా, ఎగ్స్ లోకి బాక్టీరియా ప్రవేశించే ప్రమాదం ఎక్కువవుతుంది.

రిఫ్రిజిరేటర్ లో భద్రపరిచిన సమయం నుంచి కనీసం నాలుగు లేదా అయిదు వారాలలో ఈ ఎగ్స్ ను వినియోగించడం సురక్షితం.

How Does Salmonella Bacteria Get Into Eggs

సాల్మొనెల్లా నుంచి ఎగ్స్ ను సంరక్షించడం ఎలా?

బాగా కుక్ చేసిన ఎగ్స్ ను తీసుకోవడం మంచిది. చక్కగా బాయిల్ చేయబడిన ఎగ్స్ ను తీసుకుంటే సురక్షితం. తాజాగా, శుభ్రంగా ఉన్న ఎగ్స్ లో కూడా సాల్మొనెల్లా బాక్టీరియా ప్రవేశించే ప్రమాదం ఉందని తెలుసుకున్నాం. కాబట్టి, ఎగ్స్ ను చక్కగా రెఫ్రిజిరేట్ చేసి కుక్ చేసుకుని తింటే ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని అరికట్టవచ్చు.

అలాగే, పాశ్చరైజ్డ్ ఎగ్స్ ని కొని వాడటం మంచిది. ఇవి విస్తృతంగా లభ్యమవుతాయి. క్రాక్డ్ ఎగ్స్ ని డిస్కార్డ్ చేయడం మంచిది.

ఎగ్స్ ని సేఫ్ గా ఎలా కుక్ చేస్తారు?

బాయిల్డ్ ఎగ్స్ ని తీసుకోవడం ప్రతి ఒక్కరికీ మంచిది. ఎగ్ యోల్క్ తో పాటు వైట్ బలంగా ఉన్నప్పుడే స్క్రాంబ్లింగ్, పోచింగ్ లేదా ఫ్రైయింగ్ కు ఎగ్ ను పరిగణించాలని అమెరికన్ ఎగ్ బోర్డు స్పష్టం చేస్తోంది.

సాల్మొనెల్లా బాక్టీరియాను నశింపచేసే కుకింగ్ టిప్స్ ఇవి:

ఫ్రైడ్ ఎగ్స్ ని 2 నుంచి మూడు నిమిషాల పాటు రెండు వైపులా కుక్ చేయాలి. ఆ తరువాత 4 నిముషాలు ఫ్యాన్ ను కవర్ చేసి కుక్ చేయాలి.

స్క్రామ్బిల్డ్ ఎగ్స్ ను గట్టిగా అయ్యే వరకు కుక్ చేయాలి.

సాఫ్ట్ కుక్డ్ ఎగ్స్ ను 7 నిమిషాల పాటు మరిగే నీటిలో షెల్ లో కుక్ చేయాలి.

పోచ్డ్ ఎగ్స్ ను 5 నిమిషాలపాటు మరిగే నీటిలో కుక్ చేయాలి.

కాస్సెరోల్స్ తో పాటు మరికొన్ని ఎగ్ డిషెస్ ని 160 డిగ్రీల ఫారెన్హీట్ లో కుక్ చేయాలి.

డాక్టర్ ని ఎప్పుడు సంప్రదించాలి?

సాల్మొనెల్లా బాక్టీరియా వలన మీరు ఇన్ఫెక్షన్ కి గురయితే, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. ఈ కింది లక్షణాలను మీరు గమనించాలి.

1. 101.5 డిగ్రీల ఫారెన్హీట్ లో హై ఫీవర్.

2. మూడు రోజులైనా డయేరియా తగ్గకపోవడం.

3. సుదీర్ఘమైన వాంతులు, మీ ఒంట్లో లిక్విడ్స్ తగ్గిపోవడం.

4. స్టూల్స్ లో రక్తం

5. యూరిన్ తక్కువగా రావడం, నించున్నప్పుడు డిజ్జీనెస్, డ్రై మౌత్ అలాగే త్రోట్.

English summary

How Does Salmonella Bacteria Get Into Eggs

A new study has come into light, which states that fresh eggs, even those with clean, uncracked shells, may contain Salmonella bacteria that can cause food-borne illnesses. According to the U.S. Food and Drug Administration (FDA), 79,000 cases of food-borne illnesses and 30 deaths were reported to be caused by eating eggs which are contaminated with the salmonella bacteria. This might have come as a shock to you, isn't it?
Story first published:Saturday, April 21, 2018, 7:51 [IST]
Desktop Bottom Promotion