For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు తాగే కాఫీ గుండెకు మంచిదేనా ? దాని గూర్చి పరిశోధకులు తెలియజేసిన వాస్తవాలను తెలుసుకోండి !

|

కాఫీలో ఉండే కెఫిన్ మీ గుండెను మరింత దృఢంగా చేసి, దెబ్బతిన్న హృదయ కండరాలను తనంతట తానే సరిదిద్దుకునేలా చేయటంలో సహాయపడుతుందని, ఇటీవల జరిపిన జర్మన్ అధ్యయనం సూచించింది. హృదయ కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రభావాన్ని కెఫిన్ కలిగి ఉన్నట్లుగా పలు అధ్యయనాలు వెల్లడించాయి, వయోజనులు రోజుకు నాలుగు కప్పుల కాఫీ టీ త్రాగటం వల్ల వారి హృదయ కండరాల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కాకుండా, దెబ్బతిన్న కండరాల మరమ్మత్తు కూడా చేయవచ్చని ఈ అధ్యయనం తెలిపింది.

4 కాఫీ కప్పులకు సమానమైన కెఫిన్ స్థాయిలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్న రక్తనాళాలను కాపాడటమే కాక, గుండెపోటు తరువాత గుండె పనితీరును సరిచేయుటలో సహాయపడుతుంది. ఎందుకంటే కెఫీన్ 'p27' అని పిలువబడే ప్రోటీన్ను ప్రేరేపిస్తుంది, ఇది గుండె కణాల పునరుత్పత్తికి సహాయపడుతుంది, అలానే గుండె కణాలు దెబ్బతినకుండా సంరక్షించడంలో ఇది సహాయపడుతుంది.

Is Coffee Good For Heart Health? Heres What Researchers Found

కెఫిన్, గుండెకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేలా - గుండె యొక్క ధమని & సిరల ఆరోగ్యాన్ని మరింతగా పటిష్టం చేయడంలో సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

ఈ అధ్యయనం ద్వారా వృద్ధులు మాత్రమే ప్రత్యేకంగా కెఫిన్ నుంచి అధిక ప్రయోజనాలను పొందగలరని సూచిస్తుంది, ఎందుకంటే వారి గుండె బలహీనంగా ఉంటాయి కాబట్టి ఎక్కువ ప్రమాదాలకు గురవుతాయి. ఈ కెఫిన్ మైటోకాన్డ్రియను బలపరుస్తుంది, అలాగే ఇది గుండె కణాలకు శక్తిని కలిపించే బాధ్యతను కలిగి ఉండి వాటి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ, రక్షణగా ఉంటుంది.

కెఫిన్ డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది :-

కెఫిన్ డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది :-

కెఫిన్, టైప్ 2 డయాబెటిస్ను & స్ట్రోక్ వంటి వ్యాధులకు మీ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కొవ్వును కలిగి బాగా లావుగా ఉన్న ఎలుకలపై చేసిన డయాబెటిక్ పరిశోధనలో, గుండె కణాలు బలహీనంగా ఉండే వృద్ధులలో ఎదురయ్యే ప్రమాదాల అవకాశాలను ఎక్కువగా కలిగి ఉన్న వారికి లాభాలను చేకూరుస్తుంది.

స్విస్ శాస్త్రవేత్తల మరొక అధ్యయనం ప్రకారం, డయాబెటిస్తో బాధపడేవారి మూత్రపిండ కణాలు కెఫిన్కు ప్రతిస్పందించేలా చేయటంలో కాఫీ సహాయపడగలదని తెలియజేశారు. ఇది ప్యాంక్రియాస్లో సరైన స్థాయిలో ఇన్సులిన్ ఉత్పత్తి కాలేని వారిలో, ఇన్సులిన్ ఉత్పాదకత పెరుగుదలను నిర్ధారించడంలో మూత్రపిండాలు సహకరిస్తాయి, ఈ ప్రక్రియ మొత్తాన్ని కెఫిన్ నియంత్రిస్తుంది.

కెఫిన్ను కలిగి ఉన్న టీ (లేదా) కాఫీని తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్కు వ్యతిరేకంగా పోరాడి మనకు రక్షణ కలిగిస్తుందని తెలియజేయడమైనది, అంతేకాకుండా ఇంజక్షన్ అవసరం లేకుండా ఇన్సులిన్ ఉత్పత్తికి కూడా దోహదపడగలదు.

కాఫీ వినియోగమనేది, వృద్ధులకు రక్షణాత్మక ఆహారము వంటిది :-

కాఫీ వినియోగమనేది, వృద్ధులకు రక్షణాత్మక ఆహారము వంటిది :-

మన గుండె కండరాలు దెబ్బతినకుండా రక్షింపబడటంలో ఇతర మంచి వ్యూహాలను పాటించాలని సూచిస్తుంది, అలాగే వృద్దులు కాఫీను తీసుకోవడం వల్ల, వాళ్లకు ఇది అవసరమైన ఆహారంగా కూడా పనిచేస్తుంది. కాఫీని తాగడం వల్ల చాలామంది వారి యొక్క గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకునే మార్గాలను మెరుగుపరుచుకోవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

కెఫిన్ మాత్రమే వృద్ధులకు ఎందుకు ప్రయోజనకారిగా ఉంది ? ఎందుకంటే, వృద్ధుల హృదయ పనితీరును - సాధారణమైన వయోజనుల హృదయ పనితీరుతో పోలిస్తే, వృద్ధుల గుండె తాలూకా మైటోకాన్డ్రియల్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

వృద్ధులలో గుండె పనితీరును మెరుగుపరుచుకోవడం వల్ల వారి జీవితం దీర్ఘకాలం పాటు సాఫీగా సాగేందుకు దోహదపడుతుంది. కాఫీ (లేదా) కెఫిన్ వినియోగమనేది వృద్ధులకు అదనంగా రక్షణాత్మక ఆహారం వంటిదని భావిస్తారు. ఎందుకంటే, విశ్లేషించిన పలు అధ్యయనాలలో ధృవీకరించిన తర్వాత తెలిసిన నిజాలు ఏమిటంటే, ఎవరైతే వృద్ధులు అలవాటుగా కాఫీని తీసుకుంటారో వారిలో గుండెజబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుందని తెలియజేశారు.

ధమనులకు తక్కువ క్యాల్షియంను మాత్రమే కాఫీ అందివ్వగలదు :-

ధమనులకు తక్కువ క్యాల్షియంను మాత్రమే కాఫీ అందివ్వగలదు :-

కాఫీ గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలదనేది మొదటిసారి కాదు. అంతకుముందు, 2015 లో ఆరోగ్యవంతమైన యువతకు సంబంధించి జర్మనీలో చేపట్టిన అధ్యయనంలో, కనీసం మూడు కప్పుల కాఫీని రోజుకు తాగుతూ ఉన్నవారి గుండె ధమనులలోని కాల్షియం స్థాయిలు కాస్తా తక్కువగా ఉంటాయి. కాఫీ తాగని వారిని కాఫీ తాగే వారితో పోలిస్తే వీటిలో 40శాతం క్యాల్షియం స్థాయిలను తక్కువగా కలిగి ఉన్నట్లు గుర్తించబడింది, ఇది గుండెజబ్బులను సూచించే ఒక సూచికగా కూడా ఉంది.

చాలా సంవత్సరాల నుంచి కాఫీకి & గుండె ఆరోగ్యానికి మధ్యగల సంబంధాన్ని పరిశోధకులు అన్వేషించారు. ఎందుకంటే, కాఫీకి అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే కారకాలు ఉన్నాయి. ఇలా జరిపిన జర్మనీ అధ్యయనంలో, వృద్ధుల గుండె ఆరోగ్యంగా ఉండటం కోసం రోజుకి దాదాపు నాలుగు కప్పుల కాఫీ అవసరమవుతుందని తేల్చారు.

కార్డియాలజిస్ట్ ప్రకారం, కొందరు రోగులలో కూడా అరిథ్మియాస్ (క్రమరహిత హృదయ స్పందనలు) తగ్గిపోవచ్చు. అయితే, ఇక్కడ మనకు ఉన్న కీ-పాయింట్ మాత్రం అలా జరగనివ్వదు.

కాఫీ వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు :-

కాఫీ వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు :-

కాఫీలో ఉండే కెఫిన్ మీ గుండెను కాపాడటమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంటుంది, అవి ముఖ్యంగా శరీర బరువును తగ్గించడం, జీవక్రియను వేగవంతం చేయడం. మరిన్ని అధ్యయనాల ప్రకారం, రోజులో 3 - 4 కప్పుల కాఫీని త్రాగటం పార్కిన్సన్స్ ఎదురయ్యే అవకాశాలను తగ్గించడం ద్వారా కాలేయం, నోటి & గొంతు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

కాఫీ మీ శరీరంలో కొవ్వును కరిగించే లక్షణాలను కలిగి ఉంటుంది, అందువల్ల దీనిని ఉదయం పూట తీసుకోవచ్చు. కాఫీలో కొన్ని సహజసిద్ధమైన సమ్మేళనాలను కలిగి ఉండటం వల్ల, అవి కొవ్వును కరిగించేందుకు బాగా దోహదపడతాయి. కెఫిన్ జీవక్రియ రేటును 3% - 11% వరకు పెంచుతుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. ముఖ్యంగా, ఊబకాయం ఉన్న వ్యక్తులలో 10% & బాగా సన్నగా ఉన్న వారిలో 29% వరకూ కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

అల్జీమర్స్ వ్యాధి, వృద్ధులను ప్రభావితం చేసే అతి సాధారణమైన న్యూరోడెజెనరేటివ్ వ్యాధి, ఇతర శారీరక కార్యకలాపాల్లో మునిగిపోవడం & ఆరోగ్యకరమైన ఆహారం తినడం వంటివి అవసరం లేకుండా ఈ వ్యాధిని కాఫీ వినియోగంతో చాలా వరకు నిరోధించవచ్చు. అల్జీమర్స్కు 65% తక్కువ అవకాశాలు ఉన్న కాఫీ డ్రింకర్లు చూపించే అధ్యయనాల్లో సాక్ష్యాలు ఉన్నాయి.

ఇది మీ దుర్భరమైన పరిస్థితులను నివారించకపోయినా, మీ ఆరోగ్యకరమైన జీవనశైలికి 3 కప్పుల కాఫీని రోజుల్లో ప్రధాన భాగంగా చేర్చినప్పుడు, ఇది మీకు వ్యాపించే వ్యాధుల వ్యాప్తిని నిరోధించడంలో మొదటి స్థానంలో ఉండి మీకు సహాయపడవచ్చు.

అయినప్పటికీ, ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం, అవేమిటంటే, క్యాన్సర్తో బాధపడుతున్న రోగులకు కాఫీ తాగడం మంచిది కాదు, కెఫీన్ - రక్తనాళాల పెరుగుదలను ప్రోత్సహిస్తోంది. ఇది కణితులను ఇంధనంగా తయారు చేయగలిగేందుకు కావలసినంత ఆక్సిజన్ను అందిస్తుంది. కానీ, మీ గుండె & రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగ్గా, క్రియాశీలకంగా ఎక్కువకాలం కొనసాగేందుకు రోజుకు మూడు కప్పుల కాఫీని వినియోగించడంలో ఎటువంటి హానీ లేదు.

English summary

Is Coffee Good For Heart Health? Here's What Researchers Found

Caffeine can help the heart grow stronger and repair itself from damage, suggests a recent German study. Pointing out to the health-boosting effects of caffeine on heart cells, the study revealed that the elderly can drink four cups of coffee per day to protect and repair their heart muscle. The caffeine levels, equivalent to four cups of coffee, can protect the healthy blood vessels and help repair the heart after a heart attack. This is because caffeine triggers a protein called 'p27' that helps in regeneration of heart cells and helps in the protection of the cells from damage.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more