For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీలో పేరుకుపోయిన ఒత్తిడి మరియు ఆందోళనలను పటాపంచలు చేసే జపనీస్ షియత్సు స్వీయ మర్దన పద్దతులు

మీలో పేరుకుపోయిన ఒత్తిడి మరియు ఆందోళనలను పటాపంచలు చేసే జపనీస్ షియత్సు స్వీయ మర్దన పద్దతులు

|

మీ జీవితంలో ఒత్తిడి ఎక్కువై ఆందోళన కలుగుతుందా? దీనివలన మీరు శక్తిని కోల్పోతున్నారా? మీరు నొప్పి నుండి ఉపశమనం మరియు విశ్రాంతి కొరకు జపనీస్ వారి షియత్సు స్వీయ మర్దన పద్ధతులను ప్రయత్నించండి. ఈ పద్ధతుల ద్వారా శరీరం ఉపశమనం లభించి, నొప్పులు తగ్గుతాయి.

అసలు, షియత్సు అంటే ఏమిటి?

ఇది ఒకరకమైన జపనీస్ శరీర ఉపశమన పద్ధతి. శరీరంలోని కొన్ని నిర్దిష్ట ప్రాంతాల వద్ద వేళ్లతో సాగదీయడం, తట్టడం మరియు నొక్కటం ద్వారా ఒత్తిడి కలిగిస్తారు. దీనివలన మన శరీరానికి సౌకర్యంగా, హాయిగా ఉంటుంది.

Japanese Shiatsu Self Massage Techniques For Pain Relief & Relaxation

నొప్పి నుండి ఉపశమనం మరియు విశ్రాంతి కొరకు జపనీస్ షియత్సు స్వీయ మర్దన పద్ధతులు .

వేళ్ల ద్వారా కలుగజేసే ఒత్తిడి, మీ చర్మం క్రింద ఉండే బంధన కణజాలంపై చాలా బలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ కణజాలం, ప్రతి కీలు, రక్తనాళం, కండరాలు, ఎముకలు, వెన్నెముక మరియు మెదడుతో సహా అన్ని నరములు మీద రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. రక్త ప్రసరణ నెమ్మదించిన కారణంగా, బంధన కణజాలంకు అవిశ్రాంతంగా తయారవుతుంది. అటువంటప్పుడు,మీరు షియత్సు స్వీయ మర్దన మెళుకువలను అవలంబించడం వలన, మీరు తక్షణమే పునరుత్తేజం మరియు విశ్రాంతిని అనుభూతి చెందుతారు.


ఇతర శరీరఉపశమన పద్ధతుల వలె కాకుండా, షియత్సు సులభంగా మనకు మనమే చేసుకుని, సమర్థవంతమైన ఫలితాలు పొందవచ్చు. కొత్తగా దీనిని అవలంబించడానికి సిద్ధపడిన వారి కొరకు అవసరమైన సమాచారం ఇప్పుడు మేము అందించబోతున్నాం.

రిలాక్సేషన్ టెక్నిక్ 1 -

రిలాక్సేషన్ టెక్నిక్ 1 -

మీ కుడి పాదంను రెండు అరచేతులతో పట్టుకుని, మడమ వద్ద మీ రెండు బ్రొటనవేళ్లను ఉపయోగించి ఒత్తిడి తీసుకురండి.

రిలాక్సేషన్ టెక్నిక్ 2 -

రిలాక్సేషన్ టెక్నిక్ 2 -

నేల మీద మీ మోకాళ్ళ పై కూర్చోండి. మీ అడుగుల మీ పిరుదులు క్రింద మీ పాదాలు వచ్చేవిధంగా కూర్చోండి. మీ చేతులను మీ పాదాలపై ఉంచి, బొటనవేలితో పాదం అడుగువైపున మధ్యభాగంలో ఉంచండి.

ఇవి ఎలా పని చేస్తాయి:

ఇవి ఎలా పని చేస్తాయి:

ఈ రెండు పద్ధతులు, పాదాలలో ఉండే నరములను విశ్రాంతి పరచి, మీ పాదాల మధ్య సంతులనంను మెరుగుపరుస్తుంది మరియు పెట్టేసిన కీళ్ళను తేలిక పరుస్తుంది. ఈ రెండు వ్యాయామాలు రోజుకు రెండుసార్లు చేయగలరు.

ఎనర్జీ ఫ్లో టెక్నిక్ 1 -

ఎనర్జీ ఫ్లో టెక్నిక్ 1 -

రెండు అరచేతులలో మీ కుడి పాదము వేళ్ళ వద్ద పట్టుకొని, బొటనవేలు మరియు చూపుడు వేలును ఉపయోగించి ప్రతి వేళ్ళను విడదీస్తూ వెళ్ళండి. ఊత కోసం, రెండు చేతి వేళ్ళను కాలి దిగువన ఉంచి, మొదటి వేలును చేతి యొక్క రెండు బొటనవేళ్లతో, కింది నుండి పై దిశగా మర్దన చేయండి.

ఈ పద్దతిలో రెండు వేళ్ళని 5-10 సార్లు మర్దన చేయండి.

ఎనర్జీ ఫ్లో టెక్నిక్ 2 -

ఎనర్జీ ఫ్లో టెక్నిక్ 2 -

మీ ఛాతీ మీద దృఢంగా మీ చేతులు ఉంచండి. 10 నిమిషాల పాటు, మీ చేతి వేళ్లను పైకి మరియు క్రిందికి కదిలిస్తూ, ఒత్తిడిని కలిగించి మర్దన చేయండి.

ఇది ఎలా పని చేస్తుంది: ఈ రకమైన చికిత్స వంటి వ్యాయామం వలన ఛాతీ నుండి మిగిలిన శరీరానికి కింది దిశలో శక్తి యొక్క ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. మీరు ఈ వ్యాయామాన్ని రోజుకు రెండుసార్లు చేయవచ్చు.

ఆందోళన తగ్గించే టెక్నిక్ 1 -

ఆందోళన తగ్గించే టెక్నిక్ 1 -

మీ ఎడమ చేతి మధ్యలో కుడి బొటనవేలు ఉపయోగించి 30 నుండి 60 సెకన్ల పాటు ఒత్తిడి కలిగించండి .

మీ ఎడమ చేతి వేళ్ళనన్నిటిని, మీ కుడి చేతి సహాయంతో లాగడం ద్వారా సాగదీయండి. 5 సెకన్ల తరువాత విడిచిపెట్టండి.

మీ ఎడమ అరచేతి లోపలి భాగాన్ని మీ కుడి బొటనవేలితో తీవ్రంగా 30 నుండి 60 సెకన్ల వరకు నొక్కండి.

చివరగా,

చివరగా,

చివరగా, మీ చేతిని తిప్పి, మీ మణికట్టు పైన ఒక వృత్తాకార కదలికలతో 30 నుండి 60 సెకన్ల పాటు మర్దన చేయండి.

మీ చేతులు మారండి మరియు అదే వ్యాయామం పునరావృతం చేయండి.

మీ చేతులను మార్చి ఇదే వ్యాయామంను పునరావృతం చేయండి.

ఇది ఎలా పని చేస్తుంది:

ఇది ఎలా పని చేస్తుంది:

ఈ వ్యాయామం చేస్తే ఆందోళన తగ్గిస్తుంది. రోజుకు ఇలా రెండుసార్లు చేయండి.

ఒత్తిడిని తొలగించే టెక్నీక్:

ఒత్తిడిని తొలగించే టెక్నీక్:

మీ రెండు చేతులను తలపై పెట్టండి. బొటనవేళ్ళను కణతలపై, మిగిలిన వేళ్ళను మాడుపై పెట్టండి.

మీ కణతలపై మృదువుగా ఒత్తిడిని పెట్టి, దీర్ఘశ్వాస తీసుకుంటూ, బ్రొటనవేళ్లను వలయాకారంలో కదలిస్తూ, 5 నుండి 10 నిమిషాల పాటు మర్దన చేయండి.

ఇది ఎలా పని చేస్తుంది: ఈ వ్యాయామం ద్వారా ఒత్తిడి వలన కలిగే తలనొప్పి మరియు పార్శ్వపు నొప్పి నుండి మీరు ఉపశమనం పొందవచ్చు. రోజుకు ఇలా రెండుసార్లు చేయండి.

వీడియోలో స్వీయ మర్దన పద్ధతులతో పాటు, మీరు అనుసరించదగిన ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి.

నడుము నొప్పిని తగ్గిచేందుకు షియత్సు:

నడుము నొప్పిని తగ్గిచేందుకు షియత్సు:

వీపుభాగంలో నొప్పిని తగ్గించే టెక్నిక్ - మీ వీపు మీదుగా పడుకుని, మీ అరికాళ్ళు నేలను తాకేట్టుగా మీ కాళ్ళను వంచండి. మీ కళ్ళు మూసివేసి 4 నిముషాలపాటు ఊపిరి పీల్చుకోండి.

మీ కళ్ళు మూసుకుని, 4 నిముషాలపాటు దీర్ఘశ్వాస తీసుకోండి.

నెమ్మదిగా, మీ కుడి మోకాలిని పైకి తీసుకుని వచ్చి, రెండు చేతులతో పట్టుకొని, మీ ఛాతీకి దగ్గరగా తీసుకురండి.మీ కాళ్ళను మార్చి, ఈ వ్యాయామాన్ని పునరావృతం చేయండి.

ఈ వ్యాయామం నడుము నొప్పిని తగ్గిస్తుంది. రోజుకు రెండుసార్లు ఇలా చేస్తే, మీరు ఉత్తమ ఫలితాలను పొందుతారు.

సైనస్ తలనొప్పి టెక్నిక్ - మీ చూపుడు వేళ్లను చెక్కిళ్ళ మీద ఉంచి ఒత్తిడికి గురిచేస్తూ 5 నుండి 10 నిమిషాల పాటు వలయాకారంలో మీ వేళ్ళను కదిలించండి.

అదేవిధంగా, వేలిముద్రలో మీ చూపుడు వేళ్లను నుదుటిపైన, మీ కనుబొమ్మలు మొదలయ్యే చోట ఉంచి మరియు 5 నుండి 10 నిముషాల వరకు వలయాకారంలో మీ వేళ్లను కదిలించండి.

ఈ వ్యాయామం రోజుకు రెండు సార్లు చేయండి.

ఇది ఎలా పని చేస్తుంది: సాధారణంగా సైనస్ దాడి చేసినప్పుడు, మీ చెక్కిళ్ళ చుట్టూ మరియు నుదుటి భాగంలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది.

ఈ షియత్సు మసాజ్ టెక్నిక్ కఫముతో నిండిన సైనస్లను ఉత్తేజపరిచి ఉపశమనం కలిగిస్తుంది.

English summary

Japanese Shiatsu Self Massage Techniques For Pain Relief & Relaxation

Shiatsu is a kind of Japanese bodywork that entails the application of comfortable pressure with fingers to stretch, tap, knead and press specific body points. The connective tissues under your skin can get congested due to poor blood circulation and the Shiatsu self-massage techniques can instantly relax you.
Story first published:Friday, August 3, 2018, 17:05 [IST]
Desktop Bottom Promotion