బ్యాక్టీరియాను చంపే మౌత్ వాష్ ను తయారు చేసుకోవటం ఎలా ?

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మీ నోరు సుమారుగా 500 రకాల సూక్ష్మజీవులను కలిగి ఉన్న ఒక నివాసంగా ఉంది. కాబట్టి ఈ హానికరమైన బాక్టీరియా యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉన్నప్పుడు దంత సమస్యలు, గింగ్విటీస్ మరియు ఫలకము (పళ్ళపై సూక్ష్మజీవులు విస్తరించడం) వంటివి సంభవించవచ్చు.

ప్రతిరోజూ బ్రష్ చేయటం మరియు ఫ్లోస్సింగ్ (పళ్ళ మధ్యలో ఉన్న ఆహారాన్ని దారంతో శుభ్రం) చేయడం వంటివి పళ్లను పరిశుభ్రంగా ఉంచే ప్రాథమిక అంశాలుగా చెప్పవచ్చు. కానీ మీ నోటిని మరియు పళ్లను శుభ్రంగా ఉంచడానికి ఇంక వేరే ఏదో అవసరమవుతుంది. దాని కోసం మౌత్ వాష్ అనేది సహాయపడుతుంది. కానీ మార్కెట్లో దొరికే మౌత్ వాష్ ప్రొడక్ట్ లో చాలా ఖరీదైనవి మరియు హానికరమైన రసాయనాలను కలిగి ఉంటాయి.

Natural Mouthwash To Kill Bacteria

యాంటీ బ్యాక్టీరియలాగ పనికివచ్చే ఏదైనా సహజసిద్ధమైన పద్ధతి ఉందా ? కావిటీస్ను మరియు చెడు శ్వాసను నివారించడంలో సహాయపడే ఒక పద్ధతి ఇక్కడ ఉంది.

అందుకు కావలసినవి :

అందుకు కావలసినవి :

బేకింగ్ సోడా, ఉప్పు, హైడ్రోజన్ పెరాక్సైడ్, టూత్పిక్ మరియు టూత్ బ్రష్ అవసరం.

స్టెప్ 1 :

స్టెప్ 1 :

ఒక చిన్న పాత్రలో టీస్పూన్లో సగం ఉప్పును తీసుకొని, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాతో కలపాలి.

స్టెప్ 2 :

స్టెప్ 2 :

ఒక కప్పు వేడి నీటిని తీసుకొని, అందులో మీ టూత్ బ్రష్ను ముంచు అలా 3 నిమిషాల పాటు వదిలివేయండి.

స్టెప్ 3 :

స్టెప్ 3 :

మీ దంతాల మీద ఉప్పు మరియు బేకింగ్ సోడాలతో కలసి ఉన్న మిశ్రమాన్ని ఉంచి, మీ టూత్ బ్రష్ను ఉపయోగించి బ్రషింగ్ చేయండి.

స్టెప్ 4 :

స్టెప్ 4 :

ఒక కప్పు వేడి నీటిలో కొన్ని చుక్కల హైడ్రోజన్ పెరాక్సైడ్ను కలపండి మరియు ఆ పానీయాన్ని నోట్లో వేసి 1 నిముషం పాటు బాగా పుక్కిలించి, ఉసేయండి.

స్టెప్ 5 :

స్టెప్ 5 :

దంతాల చుట్టూ పేరుకుపోయిన పాచిని నిదానంగా తొలగించడానికి టూత్పిక్ను ఉపయోగించండి. ఆ తర్వాత చల్లటి నీటితో మీ నోరును కడగడం.

చిట్కాలు :

చిట్కాలు :

పైన వివరించిన చిట్కాను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయటం వలన, ఇది మీ దంతాలను పాడవనివ్వకుండా ఉండే ఒక నివారణ చర్యలా సహాయపడుతుంది. రోజుకు రెండుసార్లు మీ దంతాలను బ్రష్ చేయండి. పైన వివరించినట్లుగా అనుసరించడం వల్ల మీ దంతాలను పరిశుభ్రంగా, తెల్లగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

English summary

Natural Mouthwash To Kill Bacteria

Natural Mouthwash To Kill Bacteria,Is there a natural mouthwash to kill bacteria? Yes, you can prepare your own natural mouthwash to prevent cavities. Read this!