For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మానసిక ఒత్తిడిని తగ్గించే 7 విటమిన్లు లభించే ఆహార పదార్థాలు మీకోసం..

By M Krishna Adithya
|

మనం ఏంటి అనేది మన ఆహారాన్ని బట్టి చెప్పవచ్చు అనేది ఒక సామెత. అవును మన వ్యక్తిత్వం, నడత, జీవన విధానాన్ని మన ఆహరమే డిసైడ్ చేస్తుంది. ఆరోగ్య కరమైన జీవితానికి లైఫ్ స్టైల్ తో పాటు డైట్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. పలు పరిశోధనలు తేల్చిన విషయాన్ని గమనిస్తే ఈ విషయం మనకు బోధపడుతుంది. మన జీవితంలో ఎలాంటి ఆహారపు అలవాట్లను కలిగి ఉంటామో అవే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి.

ముఖ్యంగా ఆరోగ్యానికి అంతగా శ్రేయస్కరం కాని ఆహారాలైన ఫాస్ట్ ఫుడ్, అలాగే వేపుళ్లు, స్వీట్లు మొదలగునవి.. వరుసగా కొన్ని రోజుల పాటు రెగ్యులర్ గా భుజిస్తే మీరు అనారోగ్యం బారిన పడటం ఖాయమనే చెప్పవచ్చు. అలాగే సమతుల ఆహారం కోసం మాత్రం మనం తీసుకునే ఆహారంలో ఏఏ పోషకాలు ఉన్నాయో గుర్తించి స్వీకరిస్తే మాత్రం వెంటనే మనలో శక్తి వస్తుంది. అలాగే జీవితంలో కూడా ఒక పాజిటివ్ ధోరణి వెలువడుతుంది.

7 Vitamins Which Can Reduce Depression Symptoms Naturally

ముందుగా మనలో కలిగే మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు కొన్ని ప్రత్యేక పోషకాలు అవసరం. డిప్రెషన్ అనేది మనస్సుకు సంబంధించినది. ముఖ్యంగా మెదడులోని కొన్ని రసాయనాల అసమతుల్యం వల్ల ఇది సంభవిస్తుంది. దీన్నుంచి బయట పడేందుకు చాలా కష్టం. అధికంగా ఒత్తిళ్ల కారణంగా ఇది సంభవిస్తుంది. ఫలితంగా తీవ్రమైన మనోవేదన, యాంగ్జైటీ, ఆత్మహత్య చేసుకునేలా ప్రోద్బలంతో పాటు అజీర్తి, నీరసం వంటివి కూడా తలెత్తుతాయి.

అయితే మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు కేవలం మందులు తీసుకుంటే సరిపోదు. అందుకు కావాల్సిన కొన్ని విటమిన్లు కూడా అవసరం. మనం రోజువారి తీసుకునే ఆహారంలోనే ఈ విటమిన్లు లభిస్తాయి. ప్రధానమైన విటమిన్లను ఇప్పుడు చూద్దాం.

1. విటమిన్ డి

1. విటమిన్ డి

విటమిన్ డి కు ప్రధాన వనరు సూర్యరశ్మి అనే చెప్పవచ్చు. డిప్రెషన్ లో కూరుకుపోయిన మనిషికి విటమిన్ డి వల్ల స్వాంతన చేకూరుతుంది. అలాగే విటమిన్ డి వల్ల మెదడుకు చెందిన రిసెప్టర్స్ ను బలోపేతం చేస్తుంది. తద్వారా సెరోటోనిన్ హార్మోన్ స్థాయిని పెరిగేలా చేస్తుంది. సెరిటోనిన్ హార్మోన్ సరిపడా శరీరంలో ఉంటే మెదడును సమతుల స్థాయిలో ఉంచి డిప్రెషన్ తగ్గేలా చేయవచ్చు. ఇక విటమిన్ డి లభించే ఆహార పదార్థాలు గుడ్డు సొన, చీజ్, బీఫ్, నారింజ పళ్లు, చేప, సోయా పాలు మొదలగునవి.

2. విటమిన్ బి 6

2. విటమిన్ బి 6

విటమిన్ బి6 కూడా డిప్రెషన్ ను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. తద్వారా డిప్రెషన్ తగ్గిపోతుంది. ముఖ్యంగా మెదడులో నాడీ మండల వ్యవస్థను సమతులం చేసే హార్మోన్ ల స్థాయిని స్థిరీకరించేందుకు దోహదపడుతుంది. దీని కోసం తీసుకోవాల్సిన ఆహారం పోర్క్, చికెన్, ఫిష్, గోధుమ బ్రెడ్, బీన్స్, కోడి గుడ్లు, కూరగాయలు మొదలగునవి.

3. విటమిన్ బి 3

3. విటమిన్ బి 3

సెరటోనిన్ హార్మోన్ విడుదల చేసేందుకు ఈ విటమిన్ దోహదపడుతుంది. ముఖ్యంగా ఈ హార్మోన్ మానసిక ఒత్తిళ్ల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. బి3 విటమిన్ పుష్కలంగా లభించే ఆహారాల విషయానికి వస్తే.. పుట్టగొడుగులు, వేరుశనగ, పచ్చి బఠాణీలు, చేప, టర్కీ కోడి మాంసం, బీఫ్ మొదలగునవి.

4. విటమిన్ బి12

4. విటమిన్ బి12

బి 12 పుష్కలంగా లభించే ఆహారాన్ని తీసుకోవడం వల్ల మానసికంగా శక్తివంతులు అవుతారని పరిశోధకులు తేల్చుతున్నారు. తద్వారా మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవడం తో పాటు, మెదడు ఆరోగ్యానికి ఎంతో దోహదపడే న్యూరో ట్రాన్స్ మీటర్లను సమతులం చేస్తుంది. బి12 పుష్కలంగా లభించే ఆహారపదార్థాలు.. మాంసం, లివర్, కిడ్నీ, చేప, పాలు, పాల సంబంధిత పదార్థాలు, బీఫ్ లో విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది.

5. విటమిన్ సి

5. విటమిన్ సి

శరీరానికి విటమిన్ సి ఎంతో ఆవశ్యకమైనది. ముఖ్యంగా మెదడుకు చెందిన ఆరోగ్యానికి ఎంతో కీలకమైనది. విటమిన్ సి వల్ల ఆలోచనల్లో మార్పు వస్తుంది. డిప్రెషన్ వంటి సూచనలు మాయం అవుతాయి. అలాగే విటమిన్ సి ద్వారా మెదడులోని కణాలు యాక్టివేట్ అవుతాయి. విటమిన్ సి పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు. నారింజ పళ్లు, బెర్రీస్, కాలిఫ్లవర్, బ్రకోలి, టొమాటో, పాలకూర, కాప్సికమ్, ఆకుకూరలు మొదలగునవి.

6. విటమిన్ ఇ

6. విటమిన్ ఇ

ఆస్ట్రేలియాకు చెందిన వాలన్‌గాంగ్ యునివర్సిటీ చేపట్టిన ఒక పరిశోధనలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా విటమిన్ ఇ ద్వారా డిప్రెషన్ దూరమైన మానసిక ప్రశాంతత లభిస్తుందని వెలువడింది. అంతేకాదు శరీరంలో న్యూరో ట్రాన్స్ మీటర్లను సమతుల్యం చేయడంలో విటమిన్ ఇ ఎంతో దోహదపడుతుంది. విటమిన్ ఇ పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు.. వేరుశెనగ, హాజెల్ గింజలు, చేపలు, చేప నూనె, సన్ ఫ్లవర్ గింజలు, ఆకు కూరలు, బాదం, కొబ్బరి నూనె మొదలగునవి.

7. విటమిన్ బి9

7. విటమిన్ బి9

విటమిన్ బి9 ను ఫోలిక్ యాసిడ్ అంటారు. దీని ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఫోలిక్ ఆసిడ్ వల్ల కూడా డిప్రెషన్‌ను తగ్గించే అత్యంత కీలక విటమిన్‌గా చెప్పవచ్చు. ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు. చిరు ధాన్యాలు, బీన్స్, బఠాణీలు, అవకాడోలు, ఆకు కూరలు, పాలకూర, బెండకాయ, నిమ్మ జాతి ఫలాలు మొదలగునవి.

English summary

7 Vitamins Which Can Reduce Depression Symptoms Naturally

Depression is a serious mental ailment which is caused by a number of factors. If left untreated, depression could lead to major complications. But there are certain vitamins which can help treat depression symptoms naturally. Consuming vitamins such as vitamin D, vitamin B, vitamin B3, etc. can help you overcome depression.
Story first published: Monday, August 27, 2018, 11:15 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more