మీరు అధిక కాలరీలను ఖర్చుచేసి బరువు తగ్గాలన్న యోచనలో ఉన్నారా ? దీనికై కష్టతరం అయిన అధిక వ్యాయామ ప్రక్రియలకు సైతం పూనుకుంటున్నారా? కానీ, ఇలావ్యాయామాలతో కాకుండా ఒక ఆహార ప్రణాళికా ప్రక్రియ తో కాలరీలను తగ్గించవచ్చని మీకు తెలుసా? ఆశ్చర్యంగా ఉంది కదా?
అవును నిజమే, ఇలా కఠినతరమైన వ్యాయామలతో కాకుండా, సమయాన్ని, శక్తిని వృధా చేయకుండానే ఒక ఆహార ప్రణాళికను పాటించడం మూలంగా బరువుని తగ్గించుకోవచ్చని జపాన్లో ప్రాచుర్యంలో ఉన్న ఈ డైట్ విధానం చెబుతుంది. దీనిని “ASA BANANA DIET“ గా వ్యవహరిస్తారు. జపనీస్ భాషలో asa అనగా ఉదయం అని అర్ధం. కొంతకాలం క్రితం 2008 సమయంలో ఇంటర్నెట్ ని కుదిపేసిన ఆహార ప్రణాళిక ఇది. ఈ ఆహార ప్రణాళిక వచ్చిన సమయంలో జపాన్ లోని కొన్ని పండ్ల దుకాణాలలో అరటి పండ్ల కొరత ఏర్పడింది అంటే, ఇది ఎంతగా ప్రభావితం చేసిందో తెలుసుకోవచ్చు. ఆ సమయంలో జపాన్ లో దీని ఖరీదు కూడా తారాస్థాయికి చేరుకుంది.
ఈ మార్నింగ్ బనానా డైట్ ని ఒక ఫార్మాసిస్ట్ మరియు మెడికల్ ఎక్స్పర్ట్ అయిన ఒకాసో కి చెందిన సుమీకో వాటనాబే అనే మహిళ తన భర్త హితోషి వాటనాబే కోసం రూపొందించింది. ఈ విధానం వలన 37 పొండ్లు అనగా 16.8 కేజిల బరువు తగ్గారని ప్రచారం జరిగింది. తద్వారా ఈ ఆహార ప్రణాళిక ప్రజల దృష్టిని ఆకర్షించగలిగింది.
తర్వాత ఈ ఆహార ప్రణాళికను mixi అనే సామాజిక మాద్యమంలో పొందుపరచారు. ఈ mixi జపాన్లో అత్యధిక ప్రాచుర్యం పొందిన సామాజిక మాద్యమం. ఆ తర్వాత ఇది ఎంతటి ప్రాచుర్యం పొందింది అంటే , ఈ ఆహార ప్రణాళిక మీద పుస్తకాలు కూడా ప్రచురించబడ్డాయి. దీని కారణంగా ఈ డైట్ అచిరకాలంలోనే ప్రజాదరణను పొంది , కొంతకాలం కొనసాగించబడినది కూడా.
కానీ అనేకమంది సైంటిస్టుల అభిప్రాయం ప్రకారం దీని సఫలతకు సరైన సాంకేతిక ఆధారాలు లేని ఆహార ప్రణాళిక గా చూపబడినది. కానీ కొందరు ఈ డైట్ ఫాలౌయర్స్ మాత్రం ఈ వాదనని కండిస్తూ వచ్చారు.
ఈ మార్నింగ్ బనానా డైట్ ప్రణాళికను ఆచరించాలంటే కొన్ని నియమాలను కూడా సూచిస్తుంటారు. అరటి పండ్లు తీసుకునే విధానం మీద ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఆహారం తీసుకునే ముందు మానసిక ప్రశాంతత, నిద్రకు సమయానికి ముందే ఉపక్రమించడం వంటి చిన్ని చిన్ని విధానాలే దీనిలో కీలకం.
అసలు ఈ ఆహార ప్రణాళిక నిబంధనలేమిటో చూద్దాం. ఈ నిబంధనల ద్వారా ఈ మార్నింగ్ బనానా డైట్ అనుసరించే విధానం పై ఒక అవగాహన వస్తుంది.
కాలక్రమేణా, ఈ ఆహార ప్రణాళిక లో అనేక మార్పులు వచ్చాయి, కానీ ప్రాథమిక మార్గదర్శకాలు మాత్రం ఒకే విధంగా ఉన్నాయి.
అల్పాహారం :
ముందుగా, ఉదయపు అల్పాహారం అరటి పండుతో ప్రారంభమవుతుంది, అనగా అల్పాహారం కోసం సంతృప్తి స్థాయిని మించకుండా అరటి పండుని తినడం (ఒకటి లేదా అంతకంటే ఎక్కువ). అరటి పండ్లు ఎల్లప్పుడు తాజావే తీసుకోవాలి, నిలువ చేసిన , శీతలీకరించబడిన లేక వండబడిన అరటి పండ్లు ఈ ఆహార ప్రణాళికకు సరిపోదు. మరియు ఒకే జాతికి చెందిన పండ్లనే తీసుకోవాలి, ప్రత్యామ్నాయాల జోలికి వెళ్లరాదు.
మద్యాహ్న భోజనం :
భోజనం కోసం : అరటి పండుకు భోజన సమయంలో ఎటువంటి పరిమితులు లేనప్పటికి సలాడ్ గా తీసుకోవడం ఉత్తమo.
నీళ్ళకీ మార్గదర్శకాలు :
ఈ ఆహార ప్రణాళిక ప్రకారం తాగు నీటికి కూడా కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. నీరు గది వాతావరణం లో ఉండేలాగే తీసుకోవాలి , వేడి మరియు చల్లటి నీళ్ళు పనికి రావు. నీటిని స్వీకరించడంలో ఎటువంటి పరిమితులు లేనప్పటికి , అవసరమైనప్పుడు ఒక సిప్ గా నీటిని తీస్కోవాలి కానీ,అవసరానికి మించి తాగరాదు.
మద్యాహ్నం 3 గంటల తర్వాత :
మద్యాహ్నం 3 గంటల తర్వాత స్వీట్స్ ఇష్టపడే వారికి చాకొలెట్స్ కానీ, కుకీలు కానీ సిఫార్సు చేస్తారు. ఉప్పు పదార్ధాలని ఇష్టపడేవారికి పాప్ కార్న్ సిఫార్సు చేస్తారు. కొవ్వు పదార్ధాలైన ఐస్ – క్రీమ్స్, డోనట్స్ , బంగాళా దుంపల చిప్స్ సిఫార్సు చెయ్యబడవు. సాయంత్రం చిరుతిండికి అవసరమైతే ఒక అరటి తినవచ్చు.
రాత్రి భోజనం :
ఈ మార్నింగ్ బనానా డైట్ ని ఫాలో అయ్యే వారు రాత్రి భోజనానికి 6 నుండి 8 గంటల సమయం మద్యన సిఫార్సు చేయబడుతారు. రాత్రి భోజనానికి ఆహార పరిమితి కానీ స్థాయి పరిమితి కానీ లేదు, శరీరంలోని కొవ్వు శాతాన్ని దృష్టిలో ఉంచుకుని భోజనం స్వీకరించాల్సి వస్తుంది. భోజనం అయ్యాక కూడా ఆకలిగా అనిపిస్తే ఒక పండు ముక్క తీసుకోవడం మంచిది. కానీ ఇదే అలవాటుగా కాకూడదు.
ఆహార ప్రణాళిక ప్రకారం, డెసెర్ట్లు(శీతల పానీయాలు) తీసుకోవడం నిషేధం. అలాగే, టీ, కాఫీ మరియు సోడా వంటి పానీయాలు ఆహారం యొక్క మార్గదర్శకాలలో పూర్తిగా విస్మరించబడతాయి, అయితే నీటి వినియోగం ఎక్కువగా ఉండాలి.
మరి నిద్ర సంగతి ?
రాత్రి భోజనానికి మరియు నిద్రకు మద్య కనీసం 4 గంటలు ఉండేలా చూసుకోవాలి. వీలైతే రాత్రికన్నా మునుపే నిద్రపోవాలి.
ఈ ఆహార ప్రణాళికను ఫాలో అయ్యే వారు, ఒక డైరీని రాయడం అలవాటుగా చేసుకోవాలి. రోజు వారీ ఆహార వినియోగాన్ని, మరియు వారి BMI , weight లెవల్స్ ని పొందిక చేస్కుంటూ ఉండాలి.
ఆహార ప్రణాళికను ఫాలో అయ్యే వారు, మనస్పూర్తిగా ఆహారాన్ని స్వీకరిస్తూ పరిపూర్ణంగా ఆహారాన్ని రుచిని ఆస్వాదిస్తూ నమిలి మింగేలా ఉండాలి.
ఈ ఆహారం ప్రకారం, వ్యాయామం ఐచ్ఛికం(optional); కానీ వీలైతే ప్రతిరోజు నడవడానికి మాత్రం సిఫార్సు చేస్తుంది. వ్యాయామం కోసం మిమ్మల్ని మీరు బలవంతం చేయవలసిన అవసరం లేదు, మీరు నిజంగా చేయాలనుకుంటే తప్ప.
మీరు అధిక బరువుని కలిగి ఉన్నట్లయితే ,పై మార్గదర్శకాల ను కలిగి ఉన్న మార్నింగ్ బనానా డైట్, మీ కాలరీల తగ్గింపు ప్రయోగానికి ఒక మార్గం అవుతుంది.
ఎవరు కోరుకోరు అధిక వ్యాయామాలతో, జిమ్ లతో పని లేకుండా కేవలం ఆహార సరళిలో మార్పు ద్వారా బరువు తగ్గాలని. కానీ ఇది కేవలం ఒక ఎంపిక మాత్రమే, ఒక్కోసారి అనేక మార్గాలు ప్రయత్నించి కూడా విఫలమవుతున్న సందర్భాలు ఉంటాయి. అలాంటి వారు ఒక సారి ఈ డైట్ ఫాలో అయి చూడడం కూడా మంచిదేమో కదా. ఈ డైట్ ఫాలో అవడం కాస్త ఆసక్తికరంగానే ఉంటుంది కాదంటారా ?
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.
Related Articles
స్త్రీలలో ఛాతీ పరిమాణం పెంచేందుకు ఉపయోగపడే సహజమైన గృహవైద్య పదార్థాలు
వేసవిలో త్వరగా మీ శరీర బరువును తగ్గించగలిగే ఇంటి చిట్కాలు !
బరువు పెరగడం ఒత్తిడి వలన జరుగుతుందా? సైంటిస్ట్‌లు ఏమంటున్నారు.
శరీర బరువును పెంచే 10 ఉత్తమమైన ఉత్పత్తులు
బరువు తగ్గడానికి గ్రీన్ టీ ఆహార ప్రణాళికను పాటించడం ఎలా ?
బరువు తగ్గటానికి ఏ సూప్ సాయపడుతుంది
ఈ కింద 9 ఆహారపదార్థాలు రక్తపోటును పెంచుతాయని మీకు తెలుసా?