For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెమ్ సీడ్స్ లో 10 సర్ ప్రైజింగ్ హెల్త్ బెనిఫిట్స్

|

మీరు ఎప్పుడైనా జనపనార విత్తనాల గురించి విన్నారా ? జనపనార విత్తనాలు జనపనార మొక్క నుండి వస్తాయి, ఇది కన్నాబిస్ కుటుంబానికి చెందినది. జనపనార విత్తనాలు అత్యంత సమతుల్య పోషక స్వభావాలను కలిగి ఉంటాయి. మరియు ఆస్థమా, క్యాన్సర్ వంటి అనేక ఇతర ఆరోగ్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

జనపనార విత్తనాలలో సహజ సిద్దమైన ఫైబర్ నిక్షేపాలు ఉంటాయి, క్రమంగా ప్రకృతి సిద్దమైన ఫైబర్ నిక్షేపాలను ఆహార ప్రణాళికలలో జోడించుకోవాలని భావిస్తున్న వారికి ప్రత్యామ్నాయాలుగా ఉంటాయి. జనపనార విత్తనాలు అనేక రకాల విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా వీటిలో అధిక స్థాయిలో జింక్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, ఇనుముతో పాటుగా, 21 రకాల అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి.

Hemp Seeds

జనపనార విత్తనాలు సాంప్రదాయక ఔషధాలలో (ఆయుర్వేదం) మరియు వివిధ సంస్కృతుల నేపధ్యంలో ఆహార ప్రణాళికలలో భాగంగా వాడబడుతున్నాయి. జనపనార విత్తనాలు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మరియు కండర ద్రవ్యరాశిని పెంచేందుకు ఉపయోగపడుతాయి. రక్తహీనతకు విరుగుడుగానే కాకుండా, బరువు తగ్గడంలో చికిత్సగా కూడా అత్యుత్తమ ప్రయోజనాలను కలిగి ఉంటాయి.

ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు ప్రోటీన్లను కలిగి, పూర్తి పోషకభరితమైనవిగా ఉంటాయి. జనపనార విత్తనాల ఆరోగ్య ప్రయోజనాల గురించి మరిన్ని వివరాల కొరకు వ్యాసంలో ముందుకు సాగండి.

జనపనార విత్తనాల వలన చేకూరే 10 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు :

 1. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

1. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను సమీకరించి, జనపనార విత్తనాలను తీసుకోవలసి ఉంటుంది. ఇది శరీరం యొక్క సాధారణ పనితీరులో సహాయపడుతూ, అథెరోస్క్లెరోసిస్, గుండెపోటు మరియు స్ట్రోక్స్ వంటి వివిధ ఆరోగ్య పరిస్థితులను నిరోధించడంలో సహాయం చేస్తుంది.

2. జీర్ణ ఆరోగ్యాన్ని పెంచుతుంది :

2. జీర్ణ ఆరోగ్యాన్ని పెంచుతుంది :

జనపనార విత్తనాలలో కరిగే (డైల్యూటెడ్) మరియు కరగని (ఇన్సాల్వబుల్) ఫైబర్ నిక్షేపాలు రెండూ ఉంటాయి. కరిగే ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది మరియు కరగని ఫైబర్ అతిసారం మరియు మలబద్ధక సమస్యలను తగ్గిస్తుంది. జనపనార విత్తనాలు క్రమంతప్పకుండా తీసుకోవడం ద్వారా, పెద్దప్రేగు కాన్సర్ ప్రమాదాన్ని కూడా తప్పించవచ్చునని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

3. నిద్రలేమి సమస్య నుండి ఉపశమనం :

3. నిద్రలేమి సమస్య నుండి ఉపశమనం :

జనపనార విత్తనాలలో మెగ్నీషియం ఎక్కువ స్థాయిలో ఉంటుంది. మెగ్నీషియం సెరోటోనిన్ హార్మోన్ విడుదల చేయడంలో కీలకపాత్రను పోషిస్తుంది. ఈ సెరటోనిన్ తలనొప్పి, పార్శ్వపు తలనొప్పి (మైగ్రేన్) సమస్యలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. క్రమంగా మెరుగైన నిద్రను ప్రేరేపించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది, ఇది నిద్రకు సహకారం చేసే "మెలటోనిన్ హార్మోన్" రూపానికి మారగలిగే సెరటోనిన్ హార్మోన్ విడుదల చేయడం ద్వారా, నిద్రలేమి (ఇన్సోమ్నియా) తో బాధపడుతున్న వారికి మంచి ఉపశమనంగా ఉంటుంది.

4. బోలు ఎముకల వ్యాధి (ఆస్టియో పొరాసిస్) నిరోధిస్తుంది :

4. బోలు ఎముకల వ్యాధి (ఆస్టియో పొరాసిస్) నిరోధిస్తుంది :

జనపనార విత్తనాలు కాల్షియం స్థాయిలను ఎక్కువ మోతాదులో కలిగి ఉంటాయి, ఇది ఎముకలను పటిష్ఠం చేయడానికి ఉపయోగపడే, ముఖ్యమైన ఖనిజంగా చెప్పవచ్చు. ఇది బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది మరియు దెబ్బతిన్న ఎముక పదార్థాన్ని మరమత్తు చేస్తుంది. బోలు ఎముకల వ్యాధి అవకాశాలను తగ్గించడానికి మీ ఆహారంలో జనపనార విత్తనాలను తరచుగా చేర్చండి.

5. రక్తహీనతని తగ్గిస్తుంది :

5. రక్తహీనతని తగ్గిస్తుంది :

జనపనార విత్తనాలు మానవ శరీరంలో ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఐరన్ ఖనిజ నిక్షేపాలను కలిగి ఉంటాయి. రక్తహీనత ఐరన్ లోపం ఫలితంగా ఎదురయ్యే సమస్యగా ఉంటుంది. క్రమంగా జనపనార విత్తనాలను తరచుగా తీసుకుంటున్న ఎడల రక్తహీనత సమస్యను నిరోధించడంలో సహాయపడగలదు.

6. ఊబకాయం తగ్గించడంలో :

6. ఊబకాయం తగ్గించడంలో :

జనపనార విత్తనాలు సోడియం మరియు కేలరీలలో తక్కువగా ఉంటాయి. క్రమంగా బరువు పెరగడం గురించి ఎటువంటి ఆందోళనా లేకుండా పెద్దపరిమాణాల్లోనే తినవచ్చు. ఇది మీ కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచడానికి సహాయపడే ప్రోటీన్లు మరియు ఫైబర్లను కలిగి ఉంటుంది. తద్వారా ఆకలిని తగ్గించి, ఆహారం మీదకు మనసు వెళ్ళకుండా చేస్తూ బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

7. క్యాన్సర్ను నిరోధిస్తుంది :

7. క్యాన్సర్ను నిరోధిస్తుంది :

జనపనార విత్తనాలలో వివిధ రకాల క్యాన్సర్లను నివారించగల శక్తివంతమైన అనామ్లజనకాలు ఫెనాలిక్ సమ్మేళనాల రూపంలో ఉన్నాయి. జనపనార విత్తనాలు శరీరంలోని క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. మరియు ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలిగించే ఫ్రీ రాడికల్స్ తొలగించగల శక్తిని కలిగి ఉంటాయి.

8. హార్మోన్ల అసమతుల్యతను నియంత్రిస్తుంది :

8. హార్మోన్ల అసమతుల్యతను నియంత్రిస్తుంది :

జనపనార విత్తనాలు ఒక హార్మోన్ రెగ్యులేటర్ వలె పనిచేస్తాయి. క్రమంగా థైరాయిడ్ గ్రంథులు మరియు క్లోమ గ్రంధుల నుండి స్రవించే హార్మోన్లను క్రమబద్దీకరించేందుకు సహాయం చేస్తాయి. జనపనార విత్తనాలకు అలవాటు పడటం ద్వారా మెనోపాజ్ లక్షణాలైన, మానసిక కల్లోలం, ఆందోళన మరియు డిప్రెషన్ వంటి సమస్యలను నివారించడంలో సహాయపడగలదు. మరియు బరువు పెరుగుటపై ప్రభావం చూపుతున్న హార్మోన్లను కూడా నియంత్రించవచ్చు.

9. కండరాల ద్రవ్యరాశిని పెంచుతుంది :

9. కండరాల ద్రవ్యరాశిని పెంచుతుంది :

జనపనార విత్తనాలు ప్రధానంగా 21 ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. కాబట్టి, ఈ విత్తనాలు పూర్తిస్థాయిలో ప్రోటీన్ నిక్షేపాలను కలిగి ఉండి, శరీరంలో కొత్త కణజాలాలను సృష్టించడం, కండర ద్రవ్యరాశిని పెంచడం మరియు ఎముక సాంద్రతను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

10. రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది :

10. రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది :

జనపనార విత్తనాలలో అనేక ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ప్రయోజనకరమైన నూనెలు మరియు ఫినాలిక్ నిక్షేపాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పెంచడంలో ఎంతగానో సహాయం చేస్తాయి. క్రమంగా వివిధ వ్యాధులకు వ్యతిరేకంగా శరీరాన్ని రక్షించడంలో దోహదపడే రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతుంది.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

10 Surprising Health Benefits Of Hemp Seeds

Hemp seeds contain natural fibres which are considered the most durable of all natural fibres. Hemp seeds contain many vitamins and minerals which include high levels of zinc, phosphorous, calcium, magnesium, iron and 21 amino acids. Hemp seeds have the ability to improve heart health, build muscle mass, treat anaemia, aid in weight loss, etc.
Desktop Bottom Promotion