For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mamta Mohandas: మమతా మోహన్‌దాస్‌కు బొల్లి వ్యాధి, ఎందుకొస్తుంది, లక్షణాలు ఏంటంటే..

అసలు విటిలిగో(బొల్లి) అంటే ఏంటి, ఈ సమస్య ఎందుకు వస్తుంది, ఎలాంటి చర్మరకం ఉన్నవారికి ఈ సమస్య వస్తుంది, బొల్లి వస్తే తగ్గుతుందా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

|

కొన్ని రోజుల క్రితం మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత వెల్లడించిన సంగతి తెలిసిందే. అప్పుడు అలాంటి ఒకరకమైన ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు హీరోయిన్ మమతా మోహన్ దాస్ వెల్లడించింది. తాను విటిలిగో(బొల్లి) వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా చెప్పింది. మమతా మోహన్‌దాస్‌ ఇటీవలే హాడ్జికిన్స్ లింఫోమాతో పోరాడి గెలిచింది. ఆ వెంటనే ఇప్పుడు తనకు ఆటోఇమ్యూన్ వ్యాధి ఉన్నట్లు వెల్లడించింది.

Actress Mamta Mohandas diagnosed with autoimmune disease vitiligo; Know Causes, Symptoms and Treatment of this disease

అసలు విటిలిగో(బొల్లి) అంటే ఏంటి, ఈ సమస్య ఎందుకు వస్తుంది, ఎలాంటి చర్మరకం ఉన్నవారికి ఈ సమస్య వస్తుంది, బొల్లి వస్తే తగ్గుతుందా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

విటిలిగో(బొల్లి) అంటే ఏంటి?

విటిలిగో(బొల్లి) అంటే ఏంటి?

విటిలిగోను బొల్లి అని కూడా పిలుస్తారు. జుట్టు రంగును, చర్మ రంగుకు మెలనిన్ చాలా ముఖ్యం. దీని వల్లే చర్మ రంగు, జుట్టు రంగు అలా ఉంటుంది. బొల్లి వ్యాధి మెలనిన్‌ను ఉత్పత్తి చేసే కణాలు చంపేస్తుంది లేదా పని చేయకుండా చేస్తుంది. రంగుకు కారణమయ్యే మెలనిన్ లేకపోవడం వల్ల చర్మంపై అక్కడక్కడ తెలుపు రంగులో ప్యాచెస్ ఏర్పడతాయి.

చర్మంపై అక్కడక్కడ చర్మ కణాలు రంగు కోల్పోయి తెల్లగా మారతాయి. రోజులు గడుస్తున్నా కొద్దీ ఈ తెలుపు రంగు ప్యాచెస్ పెద్దగా మారుతుంటాయి. శరీరంపై ఎక్కడైనా ఇలా చర్మం తెలుపు రంగులోకి మారుతుంది.

నలుపు రంగులో ఉన్నవారికి, చామనఛాయలో ఉన్న వారికి బొల్లి వ్యాధి వస్తే తెలుపు రంగు ప్యాచెస్ స్పష్టంగా కనిపిస్తాయి. అదే తెల్లగా ఉన్న వారికి బొల్లి వస్తే అంతగా ఫోకస్డ్‌గా కనిపించవు. బొల్లి సోకిన వారు ఇలా చర్మంపై తెల్లని ప్యాచెస్ రావడం వల్ల బయటకు రావడానికి ఆత్మన్యూనత భావంతో బాధపడుతుంటారు.

కొంత మందిలో బొల్లి మానసిక ఒత్తిడికి కూడా దారితీస్తుంది. ఇలాంటి వారికి డాక్టర్ కౌన్సెలింగ్ అవసరం ఉంటుంది.

బొల్లి ఎవరికి వస్తుంది?

బొల్లి ఎవరికి వస్తుంది?

బొల్లి వ్యాధి ఎవరికైనా రావొచ్చు. ఎలాంటి చర్మ రంగు ఉన్న వారికైనా బొల్లి వ్యాధి వస్తుంది. ముఖ్యంగా ఇమ్యూనిటీ డిసార్డర్ కుటుంబ చరిత్ర ఉన్నవారిలో, కుటుంబంలో ఎవరికైనా బొల్లి వ్యాధి వచ్చి ఉంటే కూడా బొల్లి వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్న వారిలోనూ బొల్లి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

* అడిసన్ వ్యాధి

* రక్తహీనత

* సొరియాసిస్

* కీళ్ల వాతం

* సిస్టమిక్ ల్యూపస్ ఎరిథెమాటసస్

* థైరాయిడ్ వ్యాధి

* టైప్-1 డయాబెటిస్

బొల్లి వ్యాధి ప్రాణాపాయమా?

బొల్లి వ్యాధి ప్రాణాపాయమా?

బొల్లి వ్యాధి ప్రాణాపాయం కాు. దీని వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకవు. బొల్లి వ్యాధి ఒకరి నుండి ఒకరికి వ్యాపించే అంటువ్యాధి కూడా కాదు. కానీ బొల్లి వ్యాధితో వచ్చే ప్యాచెస్ వల్ల కొంతమంది ఒత్తిడికి, ఆందోళనకు, ఆత్మన్యూనతకు గురవుతుంటారు. వారికి కౌన్సెలింగ్ ఇస్తే సరిపోతుంది.

బొల్లి వ్యాధి లక్షణాలు ఏమిటి?

బొల్లి వ్యాధి లక్షణాలు ఏమిటి?

* బొల్లి వ్యాధి వచ్చిన వారిలో చర్మం రంగు కోల్పోతుంది.

* ఒంటిపై అక్కడక్కడ చర్మంపై తెలుపు రంగులో ప్యాచెస్ ఏర్పడతాయి.

* ముఖం, చేతులు, కాళ్లు, మెడ, జననేంద్రియాల చుట్టూ చర్మం రంగు కోల్పోతుంది.

* తలపై, గడ్డం, మీసం, ఒంటిపై ఉన్న జుట్టు కూడా రంగుమారుతుంది.

* ముక్కు, నోటి అంతర్‌భాగాల్లో కూడా రంగు మారుతుంది.

* కంటిలో మంట

* చెవిలో వాపు

బొల్లి ఎందుకు వస్తుంది?

బొల్లి ఎందుకు వస్తుంది?

బొల్లి అనేది ఆటోఇమ్యూన్ వ్యాధి. ఈ వ్యాధి శరీర రోగనిరోధక వ్యవస్థ మెలనోసైట్‌లపై దాడి చేసి వాటిని నాశనం చేస్తుంది. కుటుంబ చరిత్ర కూడా బొల్లి వ్యాధి కారణం అవుతుంది. కొన్ని సార్లు వడదెబ్బ, మానసిక క్షోభ, రసాయనాలకు గురికావడం వల్ల కూడా బొల్లి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

బొల్లి చికిత్స:

బొల్లి చికిత్స:

బొల్లి వ్యాధిని మందగించడం, రంగు మళ్లీ పెరిగేలా చేసే చర్మ కణాలకు సహాయం చేయడం, చర్మంలోని తెల్లటి ప్యాచెస్‌కు రంగును తిరిగి తీసుకురావడం లాంటి వివిధ చికిత్సలు ఉంటాయి. అయితే ఈ చికిత్సలు పని చేస్తాయన్న గ్యారెంటీ మాత్రం లేదు.బొల్లి వల్ల వచ్చే ఆత్మన్యూనత, ఒత్తిడిని తగ్గించుకోవడానికి వైద్యులు, కౌన్సెలర్లు, నిపుణులు సాయం తీసుకోవాలి.

English summary

Actress Mamta Mohandas diagnosed with autoimmune disease vitiligo; Know Causes, Symptoms and Treatment of this disease

read this to know Actress Mamta Mohandas diagnosed with autoimmune disease vitiligo; Know Causes, Symptoms and Treatment of this disease
Desktop Bottom Promotion