For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

How To Eat Sprouts: మొలకెత్తిన విత్తనాలను ఇలా తింటేనే బరువు తగ్గుతారు

శరీరానికి మంచి పోషకాలు అందించడంలో మొలకెత్తిన విత్తనాలకు మించిన ఆహారం మరొకటి లేదని అంటారు న్యూట్రిషనిస్టులు.

|

How To Eat Sprouts: శరీరానికి పోషకాలు చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉండటానికి పోషకాలు తీసుకోవాల్సిందే. బరువు పెరగాలనుకున్నా, తగ్గాలనుకున్నా శరీరానికి సరైన మోతాదులో పోషకాలు అందేలా చూసుకోవాలి. ఇలా శరీరానికి మంచి పోషకాలు అందించడంలో మొలకెత్తిన విత్తనాలకు మించిన ఆహారం మరొకటి లేదని అంటారు న్యూట్రిషనిస్టులు.

How to eat sprouts in the right way to lose weight in Telugu

గుడ్లు(Eggs), చికెన్(Chicken), ఇతర జంతు ఆధారిత వనరులు ప్రోటీన్ యొక్క సాధారణ వనరులు. చాలా మంది తమ ఆహారంలో చేర్చుకునే శాఖాహార ప్రోటీన్(Veg Protein) మూలాలలో మొలకలు ఒకటి. అయితే చాలా మంది మొలకలు తినడాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. మరికొందరికేమో అసలు మొలకలు పచ్చిగా తినాలా, లేదా ఉడికించి తినాలా అన్న అనుమానం ఉంటుంది. అసలు మొలకలు ఎలా తినాలి.. ఎలా తింటే ఎక్కువ పోషకాలు అందుతాయి.. మొలకెత్తిన విత్తనాల ద్వారా ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మొలకలు తినడానికి సరైన పద్ధతి

మొలకలు తినడానికి సరైన పద్ధతి

చాలా మంది అధిక ప్రోటీన్‌లను వీలైనంత ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. మొలకలు అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపికలలో ఒకటిగా మారాయి. అయితే మొలకెత్తిన విత్తనాలు జీర్ణం కావడానికి కొద్దిగా సమయం తీసుకుంటాయి. అందుకే వీటిని ఉడికించి తినడం వల్ల త్వరగా జీర్ణం అవుతాయని అంటున్నారు న్యూట్రిషనిస్టులు. అయితే పచ్చి మొలకెత్తిన విత్తనాలు తిన్నా, ఉడికించిన మొలకెత్తిన విత్తనాలు తిన్నా ప్రయోజనంలో ఎలాంటి మార్పు ఉండదు. అయితే మొలకెత్తిన విత్తనాలను నీటిలో ఉడికించకుండా ఆవిరిపై ఉడికిస్తే అందులోని పోషకాలు తొలగిపోకుండా ఉంటాయని సూచిస్తున్నారు.

రాత్రి పూట మొలకలు తినవచ్చా?

రాత్రి పూట మొలకలు తినవచ్చా?

రాత్రి పూట భోజనాన్ని మితంగా మాత్రమే చేయాలని ప్రతి ఒక్కరూ చెప్పే మాట. రాత్రి పూట భోజనం నిద్రపోవడానికి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. జీర్ణించుకోవడానికి కష్టంగా ఉండే నిద్రపోతున్నప్పుడు ఇబ్బంది కలిగించే వాటిని రాత్రి వేళ తినడం మానుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్న చిక్కుళ్ళు, మొలకలు సులభంగా జీర్ణమవుతాయి. కానీ మీరు రాత్రి భోజనంలో మొలకలు తింటుంటే, వాటిని రోటీ లేదా అన్నంతో తినండి. చిక్‌పీ లేదా రాజ్మా వంటి పెద్దవి రాత్రి భోజనంలో మానేయాలి.

బరువు తగ్గడం(Weight Loss)లో మొలకల(Sprouts) పాత్ర ఏమిటి?

బరువు తగ్గడం(Weight Loss)లో మొలకల(Sprouts) పాత్ర ఏమిటి?

బరువు తగ్గడం ఒక్క రాత్రిలో జరిగే పని కాదు. ఆహారంలో మార్పులు చేయాలి. క్రమం తప్పకుండా చేసే వ్యాయామం చేయాలి. ఇలాంటి వారాలు లేదా నెలలు పాటు చేస్తుంటే క్రమంగా బరువు తగ్గుతారు. మొలకలు బరువు తగ్గడంతో పాటు బహుళ ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన సూపర్‌ఫుడ్‌గా ఇటీవల ప్రజాదరణ పొందాయి. మొలకలు చాలా పోషకమైనవి. మీ జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. ఇది మీ శరీరం మరింత కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

మొలకెత్తిన విత్తనాల్లో ప్రోటీన్(Protein), ఫైబర్(Fiber) పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ బరువు తగ్గడానికి అవసరం. ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గడం వేగవంతం అవుతుంది. వీటిని తినడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా ఉన్న భావన కలిగిస్తుంది. దీని వల్ల ఆకలి వేయదు. ఏదైనా తినాలి అన్న కోరిక రాదు.

బరువు తగ్గడానికి మొలకలు ఎలా తినాలి?

బరువు తగ్గడానికి మొలకలు ఎలా తినాలి?

మొలకలను పచ్చిగా లేదా ఉడికించి తినవచ్చు. మీ రోజువారీ ఆహారంలో మొలకలను జోడించడం వలన మీ ఆహారం యొక్క పోషక విలువలను పెంచడంలో సహాయపడుతుంది. వాటిని సూప్‌లు, సలాడ్‌లలో చేర్చవచ్చు. సైడ్ డిష్‌గా తీసుకోవచ్చు. భోజనాల మధ్య చిరుతిండిగా కూడా మొలకలు తీసుకోవచ్చు.

మొలకెత్తిన గింజల రకాలు :

మొలకెత్తిన గింజల రకాలు :

* చిక్కుడు, బఠాణీ మొలకలు -

వీటిలో కాయ ధాన్యాలు, సోయాబీన్స్, ముడి పెసలు, కిడ్నీ బీన్స్, బఠాణీ, గార్బాంజో బీన్స్, అడ్జుకీ బీన్స్ మరియు బ్లాక్ బీన్స్ ప్రధానంగా ఉంటాయి.

* గింజలు, విత్తనాల ద్వారా మొలకలు -

వీటిలో బాదం, గుమ్మడికాయ విత్తనాలు, నువ్వులు, పొద్దుతిరుగుడు విత్తనాలు, ముల్లంగి విత్తనాలు మరియు అల్ఫాల్ఫా విత్తనాలు ఉంటాయి.

* పైరు గింజలు -

వీటిలో బక్వీట్, కాముత్ (గోధుమలలో ఒక రకం), క్వినోవా, బ్రౌన్ రైస్, అమరాంత్ మరియు ఓట్స్ మొదలైన మొలకలు ఉన్నాయి.

* కాయగూరలు లేదా ఆకుజాతికి చెందిన మొలకలు -

వీటిలో బ్రోకోలీ, ముల్లంగి, దుంప కూరలు, క్రెస్ మరియు మెంతులు మొదలైనవి ఉంటాయి.

మొలకెత్తిన విత్తనాలతో దుష్ప్రభావాలు :

మొలకెత్తిన విత్తనాలతో దుష్ప్రభావాలు :

మొలకెత్తిన గింజలతో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. దీనికి కారణం వీటిని పచ్చిగా వినియోగించడమే. ఇవి సాల్మొనెల్లా, ఇకొలి బాక్టీరియా వంటి హానికరమైన బాక్టీరియాలను కలిగి ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ బ్యాక్టీరియా వెచ్చని, తడి వాతావరణంలో ఎక్కువగా పెరుగుతుంది. ఇది చాలావరకు మొలకెత్తుతున్న దశలోనే సంభవిస్తుంది.

ఒకవేళ మీరు ఆ బాక్టీరియా బారిన పడినట్లయితే, మొలకెత్తిన గింజలు తిన్న 12 నుంచి 72 గంటలలోపు ఫుడ్ పాయిజన్ లక్షణాలు కనిపిస్తాయి. డయేరియా, వాంతులు, కడుపు ఉబ్బరం మొదలైనవి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.

మొలకెత్తిన విత్తనాలు వాసన వస్తుంటే వాటిని తినకపోవడం మంచిది. లేదంటే వాటిని శుభ్రంగా కడిగి ఆవిరిపై కొద్దిసేపు ఉడికించాలి. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా చనిపోతుంది. ఇలా ఉడికించడం వల్ల మొలకలు సులభంగా జీర్ణం అవుతాయి. వాటిలోని పోషకాలు కూడా తొలగిపోవు.

English summary

How to eat sprouts in the right way to lose weight in Telugu

read on to know How to eat sprouts in the right way to lose weight in Telugu
Story first published:Wednesday, November 16, 2022, 16:00 [IST]
Desktop Bottom Promotion