For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఈ చలికాలంలో నిద్రించడానికి ఇబ్బంది పడుతున్నారా? ఐతే ఇది తాగండి...ప్రశాంతంగా పడుకోండి..!

చలికాలంలో నిద్రించడానికి ఇబ్బంది పడుతున్నారా? ఐతే ఇది తాగండి...ప్రశాంతంగా పడుకోండి..!

|

శీతాకాలంలో మనం వివిధ రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటాం. అందులో నిద్రలేమి ఒకటి. ఒత్తిడి, చల్లని వాతావరణం లేదా ఎక్కువ సేపు స్క్రీన్ లేదా గాడ్జెట్స్ చూడటం. రోజులో మీకు సరిపడా నిద్ర లేకపోతే మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది మరియు మెదడు కణాలను బలహీనపరుస్తుంది. సాధారణంగా చలికాలం వస్తే చలి వల్ల ఉత్సాహంగా ఉండలేము. ఎప్పుడు చూసినా బద్దకం అనిపిస్తుంది. చల్లని వాతావరణం మన శరీరాన్ని అలసిపోయేలా చేస్తుందిది. దీని వల్ల చలికాలంలో మన శారీరక శ్రమ తగ్గిపోతుంది. ఫలితంగా సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ , ట్యాబ్స్ మరియు టీవీలపైనే ఎక్కువ సమయం గడుపుతున్నాం. ఇది మీ నిద్ర సమయాన్ని పట్టి ఉంచుతుంది. దాంతో నిద్రలేమి సమస్యను కలిగిస్తుంది.

winter special : warm drinks to deal with insomnia and sleepless nights in telugu

నిద్రలేమి సమస్య ఎన్ని అనారోగ్యలకు కారణం అవుతుంది. కాబట్టి, మీరు నిద్రలేమితో బాధపడుతున్నట్లైతే కొన్ని ప్రారంభ లక్షణాలున్నాయి. ఆ లక్షణాలు గురించిన వెంటనే ఆరోగ్యకరమైన ఆహారం మరియు మెరుగైన జీవనశైలికి మారడానికి ఈ సమస్యను తిప్పికొట్టడానికి మీకు ఇంకా సమయం ఉంది. కాబట్టి ఆలస్యం చేయకుండా చలికాలంలో మీకు వెచ్చగా నిద్ర పట్టించే కొన్ని వెచ్చని పానీయాలు ఉన్నాయి. వీటిని ఇంట్లోనే సులభంగా తయారుచేసుకుని తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది . నరాలను రిలాక్స్ చేసి, నిద్రపట్టేలా చేస్తాయి. మరి ఆ పానీయాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం. నిద్రలేమికి చెక్ పెడదాం.

కుంకుమపువ్వు పాలు లేదా టీ

కుంకుమపువ్వు పాలు లేదా టీ

నిద్రకు ముందు కుంకుమపువ్వు టీ వంటి హెర్బల్ టీలు తాగడం వల్ల మొదడులో నరాలు రిలాక్స్ అవుతాయి, దాంతో ఒత్తిడి తగ్గించి నిద్ర బాగా పడుతుంది. కుంకుమపువ్వులో ఉండే శక్తివంతమైన ఔషధ గుణాల వల్ల దీన్ని ఆయుర్వేదంలో యుగాల నుండి ఉపయోగించబడుతోంది. ఇది మానసిక స్థితిని పెంచుతుంది, ఆందోళన మరియు నిరాశ యొక్క ప్రారంభ లక్షణాలను తగ్గిస్తుంది మరియు నిద్రను ప్రేరేపిస్తుంది. కుంకుమపువ్వులో ట్రిప్టోఫాన్ అనే సమ్మేళనం ఉన్నందున, దానిని పాలతో కలపడం వల్ల ఈ పానీయం ప్రభావాన్ని మరింత పెంచుతుంది.

ఫెన్నెల్ బాదం పాలు

ఫెన్నెల్ బాదం పాలు

సోపు గింజలు మరియు బాదంపప్పులను కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 1 టీస్పూన్ పొడిని గోరువెచ్చని పాలలో కలుపుకుని నిద్రపోయే ముందు తాగడం వల్ల నిద్రలేమి సమస్యలు తగ్గడమే కాకుండా జీవక్రియ పెరగడానికి కూడా సహాయపడుతుంది. అంతే కాకుండా, సోంపు మరియు ఒమేగా-3 సమృద్ధిగా ఉండే బాదంపప్పుల జోడింపు దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఇంకా స్క్రీన్‌లను ఎక్కువసేపు చూడటం వల్ల కళ్ళ క్రింద వచ్చే నల్లటి వలయాలను నివారించే గుణాలు ఉన్నాయి.

చమోమిలే టీ

చమోమిలే టీ

ఇది ఒక హేర్బల్ టీ, పడుకునే ముందు ఒక కప్పు చమోమిలే టీ తాగడం వల్ల నరాలు రిలాక్స్ అవుతాయి, ఆందోళన తగ్గుతుంది మరియు నిద్ర పడుతుంది. అంతే కాకుండా, ఈ టీని రోజూ తాగడం వల్ల క్రమరహిత నిద్ర విధానాలను సరిచేయడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు ఆరోగ్యకరమైన జీవక్రియకు సహాయపడుతుంది. ఈ టీని తయారు చేయడానికి, 2 కప్పుల నీటిని తీసుకుని బాగా మరిగించాలి. అందులో చామంతి పువ్వులను వేసి బాగా మరిగించాలి. దీన్ని వడకట్టి తేనె కలిపి గోరువెచ్చగా తాగాలి..

లావెండర్ టీ

లావెండర్ టీ

లావెండర్ టీ చేయడానికి, ఒక చిన్న గిన్నె తీసుకొని నీటిని మరిగించండి. అందులో లావెండర్ పువ్వులు లేదా టీ బ్యాగ్ ఉంచండి. బాగా మరిగిన తర్వాత టీని వడకట్టి అందులో తేనె కలుపుకుని తాగాలి. ఈ టీ తాగడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది, అలాగే త్వరగా నిద్రపట్టడానికి సహాయపడుతుంది. ఇంకా ఈ టీని రెగ్యులర్ గా తాగడం వల్ల ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే సెల్ డ్యామేజ్‌ను తగ్గిస్తుంది. లావెండర్‌లో పోషకాలు మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మెరుగైన కణాల పునరుత్పత్తి మరియు జీవక్రియ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి.

అశ్వగంధ టీ

అశ్వగంధ టీ

ఈ పురాతన హెర్బ్ చాలా ఆయుర్వేద ఔషధాలలో చాలా ముఖ్యమైన పదార్ధంగా ఉపయోగించబడుతుంది. ఈ టీలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నందున, ఇది నరాలను విశ్రాంతి తీసుకోవడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, నిరాశ లక్షణాలను తగ్గించడానికి మరియు నిద్రలేమికి చికిత్స చేయడానికి సహాయపడుతుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ½ టీస్పూన్ అశ్వగంధ పొడి లేదా అశ్వగంధ వేరును నీటిలో మరిగించి, తేనెతో కలిపి త్రాగాలి. దాని ప్రభావాన్ని పెంచడానికి ఈ టీలో పాలను కూడా ఉపయోగించవచ్చు.

English summary

winter special : warm drinks to deal with insomnia and sleepless nights in telugu

Here we are talking about the Winter Special: Warm Drinks To Fix Insomnia And Sleepless Nights in telugu.
Story first published:Thursday, January 19, 2023, 20:34 [IST]
Desktop Bottom Promotion