Latest Updates
-
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు
ఈ దీపావళికి 10 ముఖ్యమైన వాస్తు చిట్కాలు
రాబోయే పండుగలలో మనము ఆత్రంగా ఎదురుచూస్తున్న వాటిలో దీపావళి పండుగ ఒకటి. మనము ఈ పండుగను చాలా ఆనందోత్సాహలతో జరుపుకుంటాము. దీపావళికి ముందు మీ ఇల్లును
శుద్ధిచేసి అలంకరించడం అనేది ఎల్లప్పుడూ ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. దానిని ఎల్లప్పుడూ సరైన పద్ధతిలో చేయాలి. తద్వారా మీకు అనుకూలత చేకూరి, మీరు చాలా సంపదను మరియు శ్రేయస్సు పొందడం ద్వారా లబ్ధిని పొందుతారు. ఈ వ్యాస చిట్కాలు మీరు ఉన్న స్థలాన్ని పరిపూర్ణత చెయ్యడానికి మీకు సహాయ పడతాయి. తద్వారా మీకు మరియు మీ కుటుంబానికి ఈ దీపావళి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టింస్తుంది.

మీ ఇంటిని శుభ్రపరచుకోండి :
మీ ఇల్లును శుభ్రం చేయడానికి చాలా ముఖ్యమైన విషయం. రాబోయే సానుకూల శక్తులను కల్పించడానికి అన్ని సాలెగూడులను మరియు అన్ని అయోమయాలను తొలగించండి. బాల్కనీలు, వాకిలి, మెట్లు, బేస్మెంట్ మొదలైనవి మీ చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

అవసరంలేని వాటిని తీసివేసెందుకు ప్రయత్నించండి :
ఇకపై మీకు అవసరం లేని విషయాలు మిమ్మల్ని చుట్టుముట్టితే, అవి మీ ఖాళీ ప్రదేశాన్ని కప్పివేస్తాయి, అలాంటివాటిని మీరు వెంటనే త్రోసిపుచ్చండి. విరిగిన టపాకాయలు, ఉపయోగించని మ్యాగజైన్లు, వార్తాపత్రికలు, బూట్ల బాక్సులను, ఖాళీ డబ్బాలను మరియు మీరు అంతకుముందు ఉపయోగించని అన్ని ఇతర వ్యర్థాల వంటివి మీ ఇంటి లోపలికి వచ్చే సానుకూల శక్తిని నిరోధించాయి. కాబట్టి వాటిని దూరంగా త్రోసిపుచ్చండి మంచిది.

ప్రవేశ ద్వారమును శుభ్రంగా ఉంచండి :
ప్రవేశద్వారమును శుభ్రంగా ఉంచండం ద్వారా మీ ఇంటిలోనికి ఆనందం మరియు శ్రేయస్సు ప్రవేశించేందిగా ఉంటుంది. కనుక ఇది ఎల్లప్పుడూ చక్కగా మరియు శుభ్రంగా ఉండాలి. ప్రవేశద్వారమును గందరగోళాన్ని నుండి పూర్తి స్వేచ్ఛగా మరియు శుభ్రంగా ఉంచండి. మీ ఇంటి ప్రవేశద్వారం ప్రకాశవంతంగా ఉండేటట్లు అలంకరించబడి ఉండాలి.

మామిడి ఆకలతో, బంతిపులతో మీ ఇంటిని అలంకరించండి :
మామిడి ఆకులు మరియు బంతిపువ్వులు చాలా పవిత్రంగా భావించబడతాయి మరియు కుటుంబ సభ్యుల జీవితాలలో మంచి అదృష్టాన్ని కలుగజేస్తాయి. మామిడి ఆకులు (లేదా) బంతిపువ్వులతో తోరణాలను అలంకరించడం వల్ల ఆ దేవుని ఆశీస్సులు ఆకర్షించేదిగా ఉంటుంది.

పాదముద్రలు గీయండి :
కొన్ని ఇళ్ళు ముందు పాదముద్రలను మీరు చూసి ఉండవచ్చు. వారు అలా చెయ్యడానికి గల కారణం అధిక ప్రాముఖ్యతను కలిగి ఉండటమే. వారు బియ్యం పిండితో మరియు వెరిమిలియన్ రంగు
మిశ్రమంతో ఇంటిలోనికి దేవుడు ప్రవేశిస్తున్నట్లుగా ఉండే చిన్న పాదముద్రలను గీస్తారు. మీ ఇంటి తలుపు ప్రవేశ ద్వారం వద్ద అందమైన రంగోలి నమూనాలను సాంప్రదాయ పద్ధతిలో అందంగా అలంకరించి స్వాగతించేలా చెయ్యగలరు.

విద్యుత్ లైట్స్ కి బదులుగా కుందులను ఉపయోగించండి :
విద్యుత్ లైట్ల బదులుగా డైయాలను వాడండి. మీ దీపావళి అలంకరణలో విద్యుత్ దీపాలు ఉపయోగించకూడదని ప్రయత్నించండి మరియు వాటి స్థానంలో దియాస్ (మట్టి కుండలు) ను మరియు కొవ్వొత్తులతో భర్తీ చేయండి. దియాస్‌ను వెలిగించడం కోసం స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగించవచ్చు. శుద్ధమైన నెయ్యి లేకపోతే లిన్సీడ్ ఆయిల్‌ను (అవిసె నూనె) మరియు ఆవ నూనెల కోసం వెళ్ళండి. ఇవి ఎందుకంటే, వారు ప్రయోజనకరమైన, మంచి ఆరోగ్య ప్రభావాలను కలిగి ఉంటారు మరియు హానికరమైన జెర్మ్స్ మరియు కీటకాలను చంపేదిగా ఉంటుంది. ఇంటికి నాలుగు సరిహద్దుల వైపు గోడల మీద ఎల్లప్పుడూ నలుగురు దీపపు కుందులను ఉంచండి, వాటిలో ప్రతి ఒక్కటీ - లక్ష్మి, గణేశుడుని, కుబేరుడిని మరియు ఇంద్రుని వంటి దేవతలను సూచిస్తుంది.

చీకటి ప్రదేశంను దీపపు కాంతులతో నింపండి :
ప్రతి చీకటి మూలలను దీపపు కాంతులతో తేలికగా నింపడమును ఎప్పటికీ మరచిపోకూడదు. బాత్రూం, వంటగది, మెట్ల మార్గంలో మరియు మీ ఇంటిలోని ఇతర చీకటిగా ఉన్నటువంటి స్థలాలను సానుకూల శక్తులను ఆకర్షించడానికి దీపాలతో కాంతివంతం చేయాలి.

స్వస్తిక్ లేదా ఓం గుర్తులను నేలపై వెయ్యకూడదు :
ఉత్తరం, తూర్పు గోడలపై స్వస్తిక్ లేదా ఓం వంటి గుర్తులను సుందరమైన రీతిలో ఉంచడం వల్ల సంపదను మరియు అదృష్టంమును తెచ్చేదిగా ఉంచుతోంది. నేల మీద రంగోలిలో స్వస్తిక లేదా ఓమ్ చిహ్నాలను మాత్రం తయారు చెయ్యవద్దు.

లక్ష్మి పూజ :
దీపావళి రోజున సంపదతో అనుసంధానమై ఉన్న లక్ష్మీ పూజను ఇంటి ఉత్తర భాగంలో నిర్వహించాలి. భక్తులు ప్రార్ధించే సమయంలో, ఈశాన్యం (లేదా) ఉత్తరం (లేదా) తూర్పు ముఖంగా ఉండేలా లక్ష్మీ దేవి, గణేశుని, కుబేరుని మరియు ఇంద్రుని వంటి దేవత మూర్తి విగ్రహాలను ఉంచండి. లక్ష్మీ దేవి, కుబేరుని మరియు ఇంద్రుని విగ్రహాలకు ఎడమ వైపుగా గణేశుడిని ఉంచాలి. ఆ దేవతలను ఉంచే ప్రదేశాన్ని శుభ్రంగా మరియు అస్తవ్యస్తంగా లేకుండా ఉంచండి మరియు ఆ దేవతామూర్తుల ఫోటోలను, విగ్రహాలను శుభ్రం చేయడానికి కొత్త వస్త్రాలను ఉపయోగించండి.

ప్రకాశవంతమైన వస్త్రాలు ధరించండి :
దేవతలను పూజించేటప్పుడు నలుపు రంగును ధరించడం మానుకోండి. అలాగే దేవతలను పూజతో ఆహ్వానించిన తరువాత మీ ఇంటిని అలానే వదిలేయడం మంచిది కాదు కాబట్టి పూజ చేసిన తర్వాత మీ ఇంటిని వదిలివేయవద్దు. ఎందుకంటే అవకాశాలు ఒకసారి మాత్రమే తలుపు తడుతుంది.



Click it and Unblock the Notifications
