For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉత్తరం...!

|

The Letter...!
ఓ సారి బాస్సుయి మరణావస్థ లో వున్నతన శిష్యుడు ఒకతనికి ఉత్తరం రాశాడు. అందులో ఇలా వుంది : "నీ మనసు సారం అసలు పుట్టనే లేదు, కనుక అది ఎప్పటికీ చావదు. నశి౦చిపొయే దానికి మనుగడ లేనట్లే. ముందే శూన్యంగా వున్న దాంట్లో ఖాళీ అయ్యేదేముంది? దానికి రంగు, రూపం వుండవు. దానికి సుఖ దుఖాలు రెండూ తెలియవు.

ఇంకా ఇలా రాశాడు. "నువ్వు చాల అనారోగ్యంతో వున్నావని తెలిసింది. ఓ మంచి జెన్ శిష్యుడివి నువ్వు అనారోగ్యంతో పోరాడుతున్నావు. నిజానికి బాధ పడుతున్నది ఏమిటో నీకు సరిగ్గా తెలియకపోవచ్చు. నిన్ను నువ్వే ఇలా ప్రశ్నించుకో: "నా మనసు యొక్క సారం ఏమిటి?" ఇదొక్క దాని గురించే ఆలోచించు - ఇక వేరేది ఏమీ చేయనక్కరలేదు. వేరేదేదీ కోరుకోకు. నీ అంతం నిజానికి అంతులేనిది, గాల్లో కలిసిపోయే మంచు ముక్క లాంటిది."

English summary

The Letter...! | ఉత్తరం...!

Once Bassui wrote a letter to one of his disciples who was dying. The letter read thus : 'The essence of your mind is not born, and hence will never die. It is not an existence which is perishable. It is not an emptiness which is just a void. It does not have colour or form. It neither enjoys pleasures nor suffers pains".
Story first published:Saturday, August 25, 2012, 16:50 [IST]
Desktop Bottom Promotion