For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్షయ తృతీయ యొక్క ప్రాముఖ్యత & ఆవశ్యకము

|

"ఇచ్చే చేతికే తీసుకోవడం సాధ్యం అవుతుంది" అనేది చాలా పురాతన సత్యం. ఈ విశ్వం చాలా రహస్యమయం అయినది, దాని మార్మిక నియమాలు దానికి వున్నాయి. ప్రాపంచిక విజయాలను సొంతం చేసుకోవాలంటే ముందుగా స్వచ్చమైన హృదయంతో ఇవ్వాలి అనేది ముఖ్యమైన రహస్యాలలో ఒకటి. ఇశ్వర్యం సాధించిన వారికి ఇలా మనస్ఫూర్తిగా ఇవ్వడం అనేది చక్కగా అర్ధం అవుతుంది. మీరు ఆశించక పోయినా మీరు ఇచ్చిన డబ్బు మరింతగా మీకు వెనక్కి తిరిగి వస్తుంది. ఏదైనా పొందడం కోసం ఏదైనా ఇస్తూ వుండడం అనే పురాతన శాస్త్ర విధిని మీరు ఈ పవిత్రమైన "అక్షయ తృతీయ" లేదా "స్వర్ణ దినం" నాడు సాధన చేయవచ్చు. ఏప్రిల్ మధ్య నుంచి మే నెల మధ్య వరకు వుండే నెల రోజులలో తృతీయ నాడు వచ్చే ఈ రోజును దానాలు ఇవ్వడానికి చాలా ప్రభావం కల రోజుగా పరిగణిస్తారు. సూర్య చంద్రులు ఇద్దరూ శక్తివంతంగా వుండే ఈ రోజును దాన ధర్మాలకు, పుణ్య కార్యాలకు చాలా ముఖ్యమైన రోజుగా భావిస్తారు.

మీరు ఈ రోజు దానం చేసే డబ్బును లేదా వస్తువులను ఆశీర్వదించి ఇవ్వండి, అది మరిన్ని రెట్లుగా తిరిగి రావడాన్ని మీరు గమనిస్తారు. "ఆకలి గొన్న వారికి అన్నం పెట్టడం, పేద వారికి అవసరమైన వస్తువులు ఇవ్వడం ఐహిక ఆముష్మిక ప్రయోజనాలు సాధించడానికి చాలా కీలకమైనవి". అందువల్ల ఈ రోజు ఇవ్వడం నిజంగా (మీరు ప్రతిగా ఏమీ ఆశించక పోయినా) చాలా ప్రతిఫలాలు ఇస్తుంది. మీరేదైనా ఇవ్వాలని అనుకుంటూ వుంటే ఇది సరైన రోజు. భగవంతుడు ప్రపంచాన్ని సృష్టించేటప్పుడు ఆయన ఉచ్చరించిన మొదటి పదం అక్షయ - అంటే పరిమితులు లేనిది అని అర్ధం. సంపద సృష్టించడానికి ఇది చాలా ముఖ్యమైన రోజు. అదృష్టంగా భావించడం వల్లా, వచ్చే ఏడాదికి శుభ సూచకంగా వుండడం వల్లా చాలా మంది ఈ రోజు బంగారం కూడా కొంటారు.

పురాణాల ప్రకారం దేవతల కోశాధికారి కుబేరుడు ఈ రోజునే శివుడి నుంచి తన సంపదను పొందాడు. ఈ రోజుననే పరమ శివుడు లక్ష్మీ దేవిని సంపద ఇచ్చి ఆశీర్వదించాడు. నిజానికి శివుడు కుబెరుడిని సంపదకు దేవుడిను, లక్ష్మీ దేవిని సిరిసంపదల దేవత గాను అనుగ్రహించాడు. కుబేరుడు శివపురం లోని శివాలయంలో శివుడిని పూజించాడు. గుడి పరిసరాల్లోని భూమిలో వేలాదిగా శివలింగాలు పాతి వున్నాయి. కేవలం ఆ భూమి లో అడుగు పెట్టినా, అక్కడ పూజ చేసినా ఆర్ధిక చెడు కర్మ నశిస్తుందని అంటారు.

పేదవారికి అన్నం పెట్టడం అన్నిటికన్నా గొప్ప పుణ్యకార్యం. అలాగే పేద పిల్లలకు గొడుగులు, చెప్పులు ఇవ్వాలని కూడా కొందరు సూచిస్తారు. ఈ తృతీయ నాడు చేసే పూజలు, దాన ధర్మాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయి.

వేదాల్లో అయితే మాత్రం బంగారం, నగలు కొనుగోలు చేయాలని చెప్పబడ లేదు. ఇదంతా మత విశ్వాసాల పేరిట అమాయకులకు అమ్మకాలు చేసుకోవాలనే అత్యాశాపరుల ప్రచారం.
అక్షయ తృతీయ నాడు పూర్వీకులు చెప్పిన దాన ధర్మాలు చేస్తే వచ్చే ఫలితాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

అక్షయ తృతీయ

అక్షయ తృతీయ

మీరు దానం ఇస్తే మరణ భయాన్ని జయిస్తారు.

అక్షయ తృతీయ

అక్షయ తృతీయ

పేద వారికి, బడుగులకు సాయం చేస్తే, మీ వచ్చే జన్మలో బాగుంటారు.

పేద వారికి వస్త్ర దానం చేస్తే, రోగాలనుంచి విముక్తి లభిస్తుంది.

అక్షయ తృతీయ

అక్షయ తృతీయ

పళ్ళు దానం చేస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

అక్షయ తృతీయ

అక్షయ తృతీయ

మజ్జిగ దానం చేస్తే విద్యలో వృద్ది సాధిస్తారు.

ధాన్యాలు దానం చేస్తే అకాల మృత్యువు రాదు.

అక్షయ తృతీయ

అక్షయ తృతీయ

"దేవ తర్పణం" చేస్తే పేదరికం నుంచి బయట పడతారు.

అక్షయ తృతీయ

అక్షయ తృతీయ

పెరుగన్నం దానం చేస్తే పాప కర్మ విముక్తులై మీరు జీవితంలో ముందడుగు వేయగలుగుతారు.

English summary

The Significance & Importance of Akshaya Tritiya

"The hand that gives is the hand that gathers" is a timeless truth. Universe is a mysterious place and has its own secret laws. One of the important secrets to manifesting material success is first to give with a clean heart.